ఇథనాల్ నుంచి స్థిరమైన విమానయాన ఇంధనం (SAF), వివిధ కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గార వనరుల నుంచి గ్రీన్ మిథనాల్ & గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంలో సాంకేతిక - ఆర్థిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి హనీవెల్.. ఏఎం గ్రీన్ 'ఇండియా ఎనర్జీ వీక్ 2025' సందర్భంగా ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి.
భారతదేశంలో ఇంధన భద్రతను పెంచడానికి మాత్రమే కాకుండా.. అవకాశాలను గుర్తించడానికి ఇరు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. ఇందులో భాగంగానే ముడిచమురు దిగుమతులను తగ్గించడం, తక్కువ ఉద్గారాలను ఉత్పత్తిచేసే ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం, షిప్పింగ్ కంపెనీలకు సహాయం చేయడానికి, గ్రీన్ మిథనాల్ ఎగుమతులు వంటివి ఉన్నాయి.
విమానయాన, షిప్పింగ్ రంగాలను డీకార్బనైజ్ చేయడానికి సమర్థవంతమైన మార్గాలను అన్వేషించే ఏఎం గ్రీన్ సహకారం ఉపయోగపడుతుంది. అంతే కాకుండా.. ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడానికి సహాయపడుతుందని హనీవెల్ ఇండియా అధ్యక్షుడు ఆశిష్ మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment