Rs 100 core
-
7 ఏళ్లకే కోడింగ్.. 16 ఏళ్లకే రూ.100 కోట్ల సామ్రాజ్యం!
పాతికేళ్ళు దాటినా.. ఇప్పటికీ జీవితంలో ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోవాలో చాలామందికి తెలియదు. కానీ 16ఏళ్ల అమ్మాయి ఏకంగా రూ. 100 కోట్లు సామ్రాజ్యాన్ని స్థాపించి అందరి చేత ఔరా అనిపించుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) అనే 16 ఏళ్ల భారతీయ అమ్మాయి Delv.AI అనే స్టార్టప్ ప్రారంభించి ఏఐ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ఈమెకు ఇప్పటికే 10 మందితో కూడిన ఒక టీమ్ కూడా ఉండటం గమనార్హం. ప్రాంజలి వ్యాపారం అభివృద్ధి కావడానికి ఆమె తండ్రి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడు సంవత్సరాల వయసులోనే కోడింగ్ ప్రారంభించింది. అయితే ప్రాంజలి 11ఏళ్ల వయసులోనే వారి కుటుంబం ఇండియా నుంచి ఫ్లోరిడాకు మారింది. ఆ తరువాత 13ఏళ్ల వయసులో ఇంటర్న్‌షిప్ ప్రారంభించింది. చాట్‌జీపీటీ ప్రారంభమైన మొదట్లోనే డెల్వ్.ఏఐ స్టార్ట్ చేసింది. ఆ తరువాత తన వ్యాపార ప్రయాణం ప్రారంభించింది. ఇదీ చదవండి: రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు! ప్రాంజలి అవస్థి వ్యాపారానికి మద్దతుగా ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈమె కంపెనీ 450000 డాలర్ల నిధులను (రూ.3.7 కోట్లు) సేకరించగలిగింది. కాగా మొత్తం కంపెనీ విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం. -
భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం అభివృద్ధికి రూ. 100 కోట్లు నిధులు మంజూరు చేయించినట్లు కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ తెలిపారు. శనివారం రాత్రి స్థానిక బీఎస్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులను అన్ని రకాలుగా అభివృద్ది చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తామని అన్నారు. గోదావరిపై రెండో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ.350 కోట్లు మంజూరు చేసిందని, ఈ వివరాలు త్వరలో తెలుపుతామని అన్నారు. పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్ పొడగించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని అన్నారు. భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచేలా పోరాడి గెలిచామని అన్నారు. అనంతరం భద్రాచలంను తెలంగాణలో కొనసాగించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షలు చేసిన పాత్రికేయులను ఆయన సన్మానించారు. తొలుత భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు జ్ఞాపికను, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఓ వీరపాండియన్, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, పీఆర్వో సాయిబాబా, గాంధీపథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, పట్ణణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, భోగాల శ్రీనివాసరెడ్డి, తాండ్ర నర్సింహారావు పాల్గొన్నారు.