G20 Summit: జీ20 సదస్సు విజయం వారి కృషే.. | G20 Sherpa Lists Hard Work Behind Delhi Consensus | Sakshi
Sakshi News home page

G20 Summit: జీ20 సదస్సు విజయవంతం కావడంలో మాస్టర్ బ్రెయిన్స్ కృషి..

Published Sun, Sep 10 2023 5:59 PM | Last Updated on Sun, Sep 10 2023 6:22 PM

G20 Sherpa Lists Hard Work Behind Delhi Consensus - Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధానిలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమావేశాలు విజయవంతమైన నేపథ్యంలో సమావేశాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన జీ20 నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ అతని బృందంపైనా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ అమితాబ్ కాంత్ నేతృత్వంలోని జీ20 షెర్పాల కృషిని కొనియాడారు. 

కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్‌పై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. థరూర్ తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా రాస్తూ.. శభాష్ అమితాబ్.. మీరు ఐఏఎస్ ఎంచుకోవడం వలన ఐఎఫ్ఎస్ ఓ గొప్ప అధికారిని కోల్పోయిందని మాత్రం చెప్పగలను. ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో మీ పాత్ర అనిర్వచనీయం. ఢిల్లీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ పూర్తి చేయడానికి ఒక్కరోజు ముందే రష్యా చైనాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించడం సాధారణ విషయం కాదని.. ఇది భారత దేశానికే గర్వకారణమని అన్నారు. 

ఢిల్లీ డిక్లరేషన్‌లో అత్యంత కీలక ఘట్టమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని చాలా నేర్పుగా పొందుపరచిన జీ20 షెర్పాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణలో ప్రధానాధికారి అమితాబ్ కాంత్ కూడా షెర్పాల బృందాన్ని అభినందించారు. 

అమితాబ్ కాంత్ రాస్తూ.. జీ20 సదస్సు మొత్తంలో అత్యంత కఠినమైన అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై ఏకాభిప్రాయం సాధించడమే. దీనికోసం కనీసం 200 గంటల పాటు చర్చలు నిర్వహించాం, 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించాము. మొత్తంగా 15 డ్రాఫ్టులను తయారుచేశాము. ఈ విషయంలో ఎంతగానో సహాయపడిన ఈనమ్ గంభీర్, నాగరాజ్ నాయుడు కాకనూర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని రాశారు.  

రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై గతంలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనా కూడా దానిపై కర సాధన చేసి షెర్పాలు సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించారు. ఏ ప్రకటన చేసినప్పుడే భారత్ ప్రధాని కూడా షెర్పాల బృందాన్ని అభినందించిన విషయం తెలిసిందే.  

ఇది కూడా చదవండి: G20 Summit: జీ20 సమావేశాలు విజయవంతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement