Sherpa
-
శభాష్ షెర్పా
అవమానాలే అవకాశాలుగా మలచుకుని, తండ్రి స్ఫూర్తితో ‘పర్వతా’లంత కీర్తి సాధించాడు నేపాల్‌కు చెందిన పర్వతారోహకుడు నిమా రింజి షెర్పా. తాము కేవలం సహాయకులమే కాదనీ, పర్వతాలనూ అధిరోహించగలమని నిరూపిస్తూ ప్రపంచంలో 8వేల మీటర్ల పైచిలుకు ఉన్న పర్వతాలను ఎక్కి ‘షెర్పా’ కీర్తి పతాకను రెపరెపలాడించాడు. తాజాగా చైనాలోని శిషాపంగ్మా శిఖరాగ్రానికి చేరుకున్న అతి పిన్నవయస్కుడిగా రికార్డ్ సాధించాడు. నేపాల్‌లోని హిమాలయ పర్వత సాణువుల్లో ‘షెర్పా’ సామాజిక వర్గం పర్వతారోహకులకు సహాయకులుగా ఉంటారు. తరచూ వారి నుంచి ‘షెర్పా’ సామాజిక వర్గానికి చీత్కారాలు ఎదురయ్యేవి. చిన్నప్పటి నుంచి వీటిని కళ్లారా చూసిన రింజి, ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. పర్వతారోహకుల నుంచి మెలకువలు నేర్చుకున్నాడు. ఆక్రమంలోనే 2022లో తన 16 ఏట మౌంట్ మనస్లు (8163మీ) శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు . – ఏపీ సెంట్రల్ డెస్క్‌మరిన్ని పర్వతాల అధిరోహణ..2022లో మౌంట్ మనస్లు (8163మీ) శిఖరాన్ని అధిరోహించడం ద్వారా అతి పిన్న వయసులో ఈ పర్వతాన్ని ఎక్కిన యువకుడిగా రికార్డు సాధించాడు. అనంతరం మే 2023లో 17 సంవత్సరాల వయసులో కేవలం 10 గంటల వ్యవధిలో మౌంట్ ఎవరెస్ట్ (8848.86మీ), మౌంట్ లోట్సే (8516మీ) పర్వతాలను అధిరోహించడంతో అతని కెరీర్లో అతి పెద్ద విజయాన్ని సాధించినట్లయింది.స్ఫూర్తినిచ్చిన విజయం..తాను సాధించిన విజయాలను బాటలుగా ఎంచుకుని 2023 జూలైలో మౌంట్ గాషెర్బ్రీమ్–1 (8068మీ), మౌంట్ గషెర్బ్రీమ్–2 (8035మీ), మౌంట్ బ్రాడ్‌పీక్ (8047మీ), మౌంట్ కె–2 (8611మీ), సెప్టెంబర్‌లో మౌంట్ ధౌలగిరి (8167మీ), అక్టోబర్‌లో చో–ఓయు పర్వతం (8188మీ)లను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. కలతచెందిన మనసుఅయితే శిషాపంగ్మా పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో హిమపాతం కారణంగా నలుగురు అధిరోహకులు మరణించడంతో తాత్కాలికంగా విరామం తీసుకున్నాడు. దీనిపై స్పందిస్తూ మరణించిన నలుగురిలో తనకు ఒకరు స్నేహితుడని, అతడితో కలిసి పాకిస్తాన్లో ఐదు పర్వతాలను అధిరోహించినట్లు తెలిపాడు. తనకు మార్గదర్శిలాంటివాడని, కానీ హిమపాతంలో చిక్కుకుని మరణించడం మనసును కలచివేసిందని రింజి షెర్పా చెప్పాడు. ఇక 2024 ఆరంభంలో మళ్లీ పర్వతారోహణకు అవకాశం రాగా, ఏప్రిల్‌లో మౌంట్ అన్నపూర్ణ (8091), మే 4లో మకాలు (8485మీ) పర్వతాలను అధిరోహించగా, తాజాగా శిషాపంగ్మాను అధిరోహించడం ద్వారా రికార్డు నెలకొల్పాడు. -
ఏఐ విప్లవంలో పాల్గొనడం కాదు.. నేతృత్వం వహించాలి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) విప్లవంలో భారత్ కేవలం పాల్గొనడం మాత్రమే కాదని, దీనికి నేతృత్వం వహించాలని దేశ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో దేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడానికి తన సాంకేతిక శక్తి సామర్థ్యాలను సమీకరించాలని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఇండియాఏఐ సదస్సులో ఆయన అన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– నాస్కామ్‌ను ఉటంకిస్తూ, 70 శాతం భారతీయ స్టార్టప్‌లు తమ వృద్ధిని పెంచుకోవడానికి ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కాంత్ ప్రస్తావిస్తూ, తద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రాజెక్ట్‌లలో 19 శాతం వాటాతో అత్యధిక సంఖ్యలో గిట్‌హబ్‌ఏఐ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్న రెండవ దేశంగా భారత్ ఉండడం గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ అభివృద్ధికి సంబంధించి భారత్ శక్తిసామర్థ్యాలను ఈ విషయం స్పష్టంచేస్తోందన్నారు. ఈ స్ఫూర్తితో ఈ రంగంలో భారత్ మరింత పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ విశ్వసనీయంగా, నైతికంగా ఉండే భవిష్యత్తును రూపొందించడానికి చురుకైన విధానం అవసరమని కూడా కాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
చైనాను అందుకోవాలంటే.. 10% వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం భారతదేశం కంటే ఐదు రెట్లు ఉందని, చైనా స్థాయి ని మన దేశం చేరుకోవాలంటే 10 శాతం వృద్ధి సాధన అవసరమని భారత్ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, రాబోయే మూడు దశా బ్దాల్లో 8–9 శాతం వృద్ధిరేటు సాధన దేశానికి సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోర మ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఇక్కడ ఏర్పా టు చేసిన ఒక కార్యక్రమంలో కాంత్ మాట్లాడుతూ, ప్రైవేట్ రంగం మద్దతు లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అధిక రేటు వృద్ధి సాధన అసాధ్యమని అన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తు తం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకాన మీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. 2030 నాటికి జపా న్ ఎకానమీని సైతం భారత్ అధిగమించగలదని ఎస్అండ్పీ గ్లోబల్ వంటి సంస్థలు కొన్ని విశ్లేషిస్తున్నాయి. విమానయానంలో యూరప్‌ను మించి... మౌలిక రంగానికి ప్రభుత్వం పటిష్ట మద్దతునిస్తోందన్నారు. యూరప్‌లోని విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాల నాణ్యత మెరుగ్గా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థల కంటే మన దేశీయ విమానయాన సంస్థలు కూడా మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు. ఏఐ కీలక పాత్ర భారతదేశ వృద్ధి పటిష్టత చెక్కుచెదర కుండా ఉంటుందని భరోసా ఇచి్చన అమితాబ్ కాంత్, స్థిరమైన వృద్ధిని తీసుకురావడానికి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించకుండా, సాంకేతిక రంగలో పురోగతి అసాధ్యమని సైతం ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
G20 Summit: జీ20 సదస్సు విజయం వారి కృషే..
న్యూఢిల్లీ: దేశరాజధానిలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమావేశాలు విజయవంతమైన నేపథ్యంలో సమావేశాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన జీ20 నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ అతని బృందంపైనా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ అమితాబ్ కాంత్ నేతృత్వంలోని జీ20 షెర్పాల కృషిని కొనియాడారు. కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్‌పై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. థరూర్ తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా రాస్తూ.. శభాష్ అమితాబ్.. మీరు ఐఏఎస్ ఎంచుకోవడం వలన ఐఎఫ్ఎస్ ఓ గొప్ప అధికారిని కోల్పోయిందని మాత్రం చెప్పగలను. ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో మీ పాత్ర అనిర్వచనీయం. ఢిల్లీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ పూర్తి చేయడానికి ఒక్కరోజు ముందే రష్యా చైనాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించడం సాధారణ విషయం కాదని.. ఇది భారత దేశానికే గర్వకారణమని అన్నారు. Well done @amitabhk87! Looks lile the IFS lost an ace diplomat when you opted for the IAS! "Negotiated with Russia, China, only last night got final draft," says India's G20 Sherpa on 'Delhi Declaration' consensus. A proud moment for India at G20! https://t.co/9M0ki7appY — Shashi Tharoor (@ShashiTharoor) September 9, 2023 ఢిల్లీ డిక్లరేషన్‌లో అత్యంత కీలక ఘట్టమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని చాలా నేర్పుగా పొందుపరచిన జీ20 షెర్పాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణలో ప్రధానాధికారి అమితాబ్ కాంత్ కూడా షెర్పాల బృందాన్ని అభినందించారు. అమితాబ్ కాంత్ రాస్తూ.. జీ20 సదస్సు మొత్తంలో అత్యంత కఠినమైన అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై ఏకాభిప్రాయం సాధించడమే. దీనికోసం కనీసం 200 గంటల పాటు చర్చలు నిర్వహించాం, 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించాము. మొత్తంగా 15 డ్రాఫ్టులను తయారుచేశాము. ఈ విషయంలో ఎంతగానో సహాయపడిన ఈనమ్ గంభీర్, నాగరాజ్ నాయుడు కాకనూర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని రాశారు. The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37 — Amitabh Kant (@amitabhk87) September 10, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై గతంలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనా కూడా దానిపై కర సాధన చేసి షెర్పాలు సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించారు. ఏ ప్రకటన చేసినప్పుడే భారత్ ప్రధాని కూడా షెర్పాల బృందాన్ని అభినందించిన విషయం తెలిసిందే. #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9 — ANI (@ANI) September 9, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: జీ20 సమావేశాలు విజయవంతం -
ఢిల్లీ డిక్లరేషన్ వెనక కఠోర శ్రమ వీరిదే..
ఢిల్లీ: ఢిల్లీ డిక్లరేషన్‌పై ప్రపంచ దేశాలు ఏకాభిప్రాయం సాధించడం వెనుక జీ20 షేర్పాల నిరంతరం కష్టం దాగి ఉంది. ఉక్రెయిన్ అంశంపై ఏకాభిప్రాయానికి రావడానికి 200 గంటలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్ట్‌లు అవసరమయ్యాయి. నిరంతరాయంగా పనిచేసిన తన బృంద సభ్యులను జీ20 షేర్పా అమితాబ్ కాంత్ ప్రశంసించారు. 'ఢిల్లీ డిక్లరేషన్‌లో క్లిష్టమైన అంశం ఉక్రెయిన-రష్యా యుద్ధం. ఈ భౌగోళిక అంశంపై ఏకాభిప్రాయానికి రావడానికి 200 గంటలు 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్టులు అవసరమయ్యాయి. ఈ పనంతా ఇద్దరు అధికారులు చేశారు' అని అమితాబ్ కాంత్ తన బృంద సభ్యులను మెచ్చుకున్నారు. The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37 — Amitabh Kant (@amitabhk87) September 10, 2023 ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరంగా దేశాధినేతల మధ్య భిన్నాభిప్రాయాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంశాలు వివాదాస్పదంగా ఉన్న సమయంలో జీ20ని నిర్వహించి, తీర్మాణాలపై ఏకాభిప్రాయం కుదర్చడం గొప్ప విజయంగా భావించవచ్చు. ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందగానే ప్రధాని మోదీ ప్రశంసనీయంగా ప్రకటించారు. షేర్పాలు, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 'భారత్ జీ20కి అధ్యక్షత వహించేప్పుడే డిక్లరేషన్ అందరినీ కలుపుకుని, నిర్ణయాత్మకంగా, ఆచరణాత్మక దిశలో ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. డిక్లరేషన్‌లో మొత్తం 83 పేరాలు ఉన్నాయి. అందులో ఎనిమిది పేరాలు భౌగోళిక అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం విశేషం' అని అమితాబ్ కాంత్ అన్నారు. ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయం కుదరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కోసం నిరంతరం పనిచేసిన షేర్పాలను ఆయన ప్రశంసించారు. ఇదీ చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే.. -
G20 Summit: డిక్లరేషన్‌పై తొలగని ప్రతిష్టంభన
జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమై అగ్రరా జ్యాధినేతలు విచ్చేసి భేటీకి సిద్ధమవుతున్న వేళ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఇంకా ప్రతిష్టంభన తొలగలేదు. శిఖరాగ్ర సదస్సులో దేశాధినేతల మధ్య విస్తృత స్థాయి చర్చలు పూర్తయ్యాక చివరి రోజున ఉమ్మడి తీర్మానం(ఢిల్లీ డిక్లరేషన్) విడుదల చేస్తారు. ఆ తీర్మానంలో ఏఏ అంశాలపై ఉమ్మడి నిర్ణయాలు ప్రకటించాలనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఇప్పటికే ఆయా దేశాధినేతల తరఫున అధికారిక ప్రతినిధు(షెర్పా) లు పలుమార్లు కలిసికట్టుగా అంతర్గత చర్చలు జరిపారు. ఈ మంతనాల్లో ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి ఉమ్మడి నిర్ణయాలు తీసుకో లేదు. శిఖరాగ్ర సదస్సులో అధినేతలు ఏమేం అంశాలు చర్చించాలనేది ముందే నిర్ణయం అయిపో తుంది. సదస్సు అత్యంత సాఫీగా సాగేందుకు వీలుగా ఆయా అంశాలపై అధినేతల నుంచి ఉమ్మ డి నిర్ణయాలు వెలువడేందుకుగాను ముందే షెర్పా లు భారీ కసరత్తు చేస్తారు. సభ్య దేశాల అధినేతల అధికారిక ప్రతినిధులైన ఈ షెర్పాలు దౌత్యమార్గంలో అంతర్గతంగా ముందే అందరూ చర్చించుకుంటారు. దీంతో శిఖరాగ్ర సదస్సులో అధినేతలు నేరుగా కలిసి మాట్లాడేటపుడు ఆయా అంశాల లోతుల్లోకి వెళ్లరు. సూత్రప్రాయ అంగీకారం మాత్రమే తెలుపుతారు. మిగిలిన పని అంతా ముందే ఏర్పాటు చేసిపెడతారు కాబట్టి ఆతర్వాతి ప్రక్రియ సులువు అవుతుంది. అయితే, తాజాగా షెర్పాల మధ్య జరిగిన చివరి రౌండ్ చర్చల్లోనూ కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరనే లేదు. వాటిల్లో పర్యావరణ మార్పు, ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని పేర్కొంటూ ఒక పేరాగ్రాఫ్‌లో భారత్ చేసిన ప్రతిపాదనలపై షెర్పాల చిక్కుముడి పడింది. ఉక్రెయిన్‌లో రష్యా ఆగడాలను అడ్డుకునేలా చర్యలు ఆ పేరాగ్రాఫ్‌లో లేవని అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్లు వేలెత్తిచూపాయి. ఢిల్లీ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై ఏకాభిప్రాయం తెలపాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు పట్టుబడుతున్నాయి. దీంతో ఈ అంశంపై సమ్మతి సాధ్యపడలేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ముందుగానే జకార్తాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లు చర్చలు జరిపి డిక్లరేషన్ సంబంధ అంశాలపై చర్చించినా ఫలితం లేకపోయింది. భారత నాయకత్వ ప్రతిష్టకు సవాల్ తొలిసారిగా జీ20 కూటమి సారథ్య బాధ్యతలు తీసుకున్న భారత్ ఈ సదస్సు తర్వాత ఎలాగైనా సరే ఉమ్మడి తీర్మానం ప్రకటించాలని చూస్తోంది. అయితే అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు ఎవరి మంకుపట్టు వారు పట్టడంతో ఉ మ్మడి తీర్మానం సాధ్యమయ్యేలా లేదు. అదే జరిగి తే అంతర్జాతీయంగా భారత ప్రతిష్టకు భంగం వా టిల్లే ప్రమాదం ఉంది. సంయుక్త ప్రకటన సాధ్యంకాని పక్షంలో జీ20 అధ్యక్ష హోదాలో మోదీ కేవలం సారాంశ ప్రకటన విడుదల చేస్తారు. వాతావరణ మార్పు: ఇదే అసలైన అవరోధం చర్చల్లో ఏకాభిప్రాయానికి ప్రధాన అవరోధంగా వాతావరణ మార్పు విధానం నిలుస్తోంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంథనాల వైపు మళ్లడం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవడం వంటి అంశాల్లో జీ20 సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది షెర్పాల భేటీలో స్పష్టంగా కనిపించింది. 2030 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను క్రమంగా పెంచుకోవాలని, 2035 ఏడాదికల్లా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాల స్థాయిని తగ్గించుకోవాలని పశ్చిమ దేశాలు చేసిన ప్రతిపాదనలను భారత్, రష్యా, చైనా, సౌదీ అరేబియాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శిలాజ ఇంధన ఆధారిత ఆర్థికవ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా అయితే ఈ ప్రతిపాదలను ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది. జ్ఞానాధారిత రంగాలు, ఇతర సెక్టార్ల వైపు మళ్లేందుకు తమకు దశాబ్దాల కాలం పడుతుందని వాదిస్తోంది. వెలువడుతున్న కర్భన ఉద్గారాలు, ప్రకృతిలోకి శోషించబడుతున్న కర్భన ఉద్గారాల నిష్పత్తి సమంగా ఉండేలా అంటే కార్బన్ నెట్ జీరో(కర్భన స్థిరత్వం) సాధించేందుకు జీ7 దేశాలు తొందర పెడుతున్నాయి. శిలాజ ఇంధనాల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాటి ద్వారా వచ్చే విద్యుత్ సాయంతోనే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధిస్తామని ధీమాగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఈ జీ7 దేశాల ప్రతిపా దనలను తప్పుబడుతున్నాయి. ‘దశాబ్దాలుగా శిలా జ ఇంధనాలను విపరీతంగా వాడేసి పారిశ్రా మిక విప్లవంతో పశ్చిమ దేశాలు సంపన్న దేశాలుగా అవ తరించాయి. ఇప్పుడు మాకు ఆ అవకాశం ఇవ్వండి. వాతావరణ మార్పుల మాటున అభివృద్ధిని అడ్డుకో కండి’ అని భారత్‌సహా దేశాలు వాదిస్తు న్నాయి. 2020కల్లా వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పేద దేశాలకు ఏటా 100 బిలి యన్ డాలర్ల నిధులను ఇస్తామన్న సంపన్న దేశాలు ఆ వాగ్దానాన్ని నెరవేర్చనేలేదు. ఎప్ప టికల్లా సాయం చేస్తాయనేదీ స్పష్టంచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్లైమేట్ పాలసీపై ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టమే. ఇలాంటి తరుణంలో మొదలవు తున్న జీ20 సదస్సు క్లిష్టమైన కూడలిలో నిల్చుంద నే చెప్పాలి. దేశ ప్రయోజనా లను పక్కనబెట్టి మానవాళి శ్రేయస్సు కోసం అగ్రనేతలు ఏ మేరకు ఉమ్మడి వాగ్దానాలు చేస్తారనేది బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. జీ20లో ఏకాభిప్రాయం కుదరక పోతే త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిరే ట్స్‌లో జరగ బోయే కాప్28 సదస్సులోనూ మేలైన ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుంది. –సాక్షి నేషనల్‌డెస్క్ -
విక్రయాల కోసం ప్రభుత్వంపై ఆధారపడకండి
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్ల)పై ఆధారపడొద్దని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ సూచించారు. దానికి బదులుగా దేశీ మార్కెట్, ఎగుమతులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొనుగోళ్ల ద్వారా స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు సానుకూలంగా కృషి చేస్తున్నాయని, అనేక సందర్భాల్లో పలు మినహాయింపులు కూడా ఇస్తున్నాయని ఆయన చెప్పారు. అంకుర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ చక్కని రన్‌వేలాంటిదని కాంత్ వివరించారు. ‘అయితే, అంకుర సంస్థల విషయంలో ప్రభుత్వాలు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. చురుకైన స్టార్టప్‌లు మార్కెట్‌ప్లేస్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ కొనుగోళ్లపై మరీ ఎక్కువగా ఆధారపడిపోకూడదు‘ అని ఆయన చెప్పారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి స్కీముల ద్వారా స్టార్టప్‌లకు పెట్టుబడులు లభించేలా తోడ్పాటు అందించడానికి మాత్రమే ప్రభుత్వ పాత్ర పరిమితం కావాలని కాంత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, లింగ అసమానతలను రూపుమాపేందుకు, మహిళల జీవన ప్రమా ణాలు మరింత మెరుగుపడేందుకు పురుషుల దృష్టికోణం మారాలని ఆయన చెప్పారు. సాధారణంగా భారత్, దక్షిణాసియాలో ఆస్తిని కుమార్తెలకు కాకుండా కుమారులకే మార్పిడి చేసే సంస్కృతి ఉందని.. అలా కాకుండా కుమార్తెల పేరిట బదిలీ చేసే సంస్కృతి వస్తే దశాబ్ద కాలంలోనే మహిళలు మరింతగా రాణించడాన్ని చూడగలమని కాంత్ చెప్పారు. -
జయహో ఎవరెస్ట్
మే 29, 2023 నాటికి ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గెలు ఎవరెస్ట్ అధిరోహించి 70 ఏళ్లు. ఆ సందర్భంగా నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో వాళ్లిద్దరి బంగారు విగ్రహాలు ప్రతిష్టించారు. అంతేనా? షెర్పాల ఘన ఆరోహణ సంప్రదాయాన్ని నిలబెడుతూ ‘ఎవరెస్ట్ మేన్’గా ఖ్యాతినెక్కిన ‘కమిరత్న షెర్పా’ మే 23న 28వసారి ఎవరెస్ట్ ఎక్కి ఆ మహా పర్వతం ఒడికి తాను ముద్దుబిడ్డని నిరూపించుకున్నాడు. ఎవరెస్ట్– ఒక ధవళ దేవత. ఈ ఆరాధన ఎప్పటికీ వైరలే. ఎంత బాగుందో ఆ సన్నివేశం మే 26న, నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో (దీని పేరు టెన్సింగ్–హిల్లరీ ఎయిర్పోర్ట్) ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గె బంగారు విగ్రహాలు ప్రతిష్టిస్తే ఆ కార్యక్రమంలో హిల్లరీ కుమారుడు పీటర్ హిల్లరీ, టెన్జింగ్ కుమారుడు జామ్లింగ్ నార్గె పాల్గొన్నారు. డెబ్బయి ఏళ్ల క్రితం తమ తండ్రులు సృష్టించిన ఘన చరిత్రను వాళ్లు గుర్తు చేసుకోవడం, పొంగిపోవడం అందరినీ ఉద్వేగభరితం చేసింది. ఎవరెస్ట్‌ను నేపాల్‌వైపు ఎక్కాలనుకునేవారు మొదట లుక్లా ఎయిర్‌పోర్ట్‌లోనే దిగుతారు కాబట్టి వారికి స్ఫూర్తినివ్వడానికి, 70 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా ఈ విగ్రహాలు ఆవిష్కరించారు. ఇప్పటికి 6 వేల మంది డెబ్బయి ఏళ్ల క్రితం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హిల్లరీ, నార్గెల జంట ఎవరెస్ట్‌ను అధిరోహించాక అప్పటి నుంచి ఇప్పటి వరకూ హిమాలయన్ డేటాబేస్ ప్రకారం ఆరు వేల మంది ఎవరెస్ట్ అధిరోహించారు. దానికి రెట్టింపు మంది ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ వెళ్లి వచ్చారు. పర్వతారోహకుల తొలి ఆరోహణ కలగా ఇప్పటికీ ఎవరెస్ట్ నిలిచి ఉంది. ఇప్పుడు నేపాల్‌వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించాలంటే 9 లక్షలు పర్మిట్ ఫీజు కట్టాలి. ఈ సీజన్లో 478 మందికి పర్మిట్ ఇచ్చారు. వీరిలో చాలామంది గైడ్‌ను తీసుకెళతారు కాబట్టి రికార్డు స్థాయిలో 900 మంది ఈ సీజన్లో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తారని భావిస్తున్నారు. మంచుపులి హిల్లరీకి దారి చూపేందుకు వచ్చి చరిత్రలో నిలిచిన షెర్పా టెన్జింగ్ నార్గెను ‘మంచు పులి’ అని పిలుస్తారు. ఆ షెర్పాల జాతికే చెందిన కమిరత్న షెర్పాను ‘ఎవరెస్ట్ మేన్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇతను ఎవరెస్ట్ గైడ్‌గా పని చేస్తూ ఇప్పటికి 27సార్లు ఆ శిఖరాగ్రాన్ని ఎక్కి దిగాడు. అందుకని అత్యధికసార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఘనత ఇతని పేరు మీద ఉంది. అయితే మొన్నటి మే 22న పసాంగ్ దవ రత్న అనే మరో షెర్పా 27వసారి ఎవరెస్ట్ అధిరోహించి కమిరత్న రికార్డును సమం చేశాడు. ఇది ఏమాత్రం రుచించని కమిరత్న ఆ మరుసటి రోజు ఉదయానికి ఎవరెస్ట్ ఎక్కి 28వసార్లు ఎక్కిన ఏకైక వ్యక్తిగా రికార్డు తన పేరు మీదే నిలుపుకున్నాడు. ఈ మే నెలలో కమిరత్న రెండుసార్లు ఎవరెస్ట్ ఎక్కాడు. హైదరాబాద్ బెజవాడల మధ్య తిరిగినంత సులభంగా ఎవరెస్ట్ అధిరోహిస్తున్న ఇతణ్ణి మరో మంచుపులి అనక ఇంకేం అనగలం. -
8జీ–20 షెర్పాగా అమితాబ్ కాంత్!
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ జీ–20కు భారత కొత్త షెర్పాగా సేవలు అందించనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూశారు. ‘‘జీ–20 అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాది భారత్‌కు రానున్నాయి. దీంతో షెర్పా బాధ్యతల్లో ఉన్న వారు దేశవ్యాప్తంగా వివిధ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. మరింత సమయం కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి గోయల్ నరేంద్ర మోదీ కేబినెట్లో ఎన్నో శాఖల బాధ్యతలు చూస్తున్నారు. వీటికే ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. పైగా రాజ్యసభ నేతగానూ గోయల్ పనిచేస్తున్నారు’’అని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అమితాబ్ కాంత్ గతంలో పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం సెక్రటరీగానూ పనిచేశారు. -
వేల అడుగుల ఎత్తున్న.. దిగమింగుకోలేని విషాదం
మంచు పర్వతాల్లో ఎవరెస్ట్ పర్వత శిఖరం అంచున.. విషాద ఘటన చోటుచేసుకుంది. ఎవరెస్ట్‌ను అవలీలగా అధిరోహిస్తూ వచ్చిన ఓ నేపాలీ పర్వతారోహకుడు అనూహ్యరీతిలో గురువారం కన్నుమూశాడు. కూర్చున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. అది చూసి తోటి పర్వతారోహకులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎంజిమి టెన్జీ షెర్పా(38) జీవితం వేల అడుగుల ఎత్తులో విషాదంగా ముగిసింది. ఎవరెస్ట్ పై కాస్తంత విశాలంగా ఉండే ఓ ప్రదేశాన్ని ఫుట్ బాల్ ఫీల్డ్ అని పిలుస్తారు. ఎవరెస్ట్ మొత్తమ్మీద పర్వాతారోహకులకు సురక్షితమైన ప్రదేశం అదే. అక్కడే అతను కూర్చున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. ఇది ఇతర పర్వతారోహకుల గుండెల్ని కరిగించి వేసింది. అతడు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని, ఎత్తయిన ప్రదేశానికి చేరిన సమయంలో తీవ్ర అస్వస్థత కలగడంతోనే ప్రాణాలు విడిచాడని ఇంటర్నేషనల్ మౌంటైన్ గైడ్స్ భాగస్వామ్య సంస్థ బేయుల్ అడ్వెంచర్స్ కు చెందిన త్సెరింగ్ షేర్పా వెల్లడించారు. బహుశా ఎంజిమి షెర్పా ఎవరెస్ట్ పై క్యాంప్-2కు వివిధ రకాల సామగ్రి తీసుకెళుతుండగా, ఈ విషాదం చోటుచేసుకుని ఉంటుందని త్సెరింగ్ అంటున్నారు. అతడిని తాము చనిపోయిన స్థితిలో ఉండగా గుర్తించామని, ఆ సమయంలో అతడి వీపునకు బ్యాక్ ప్యాక్ అలాగే ఉందని తెలిపారు. నేపాల్‌కు చెందిన షెర్పాలు ఎవరెస్ట్ పర్వతారోహణలో రాటుదేలినవారిగా గుర్తింపు పొందారు. అందుకే, ఇక్కడికి వచ్చే ఇతరదేశాల పర్వతారోహకులు ఎవరెస్ట్ ను అధిరోహించే క్రమంలో ఇక్కడి షెర్పాల సాయం తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇది మూడో మరణంగా అధికారులు చెప్తున్నారు. -
‘షెర్పా’లా తోడుంటాం
కఠ్మాండు: నేపాల్ విజయశిఖరాలు అధిరోహించేందుకు భారత్ షెర్పాలా సాయంచేసేందుకు సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీఇచ్చారు. యుద్ధం నుంచి బౌద్ధం వైపు ఆ దేశం సాగించిన ప్రయాణాన్ని కొనియాడారు. నేపాల్ పర్యటనలోభాగంగా రెండోరోజు శనివారం మోదీ చారిత్రక ముక్తినాథ్, పశుపతినాథ్ ఆలయాలను సందర్శించారు. మాజీప్రధానులు ప్రచండ, షేర్ బహదూర్ దేవ్బా, ప్రతిపక్షనాయకులతో సమావేశమయ్యారు. నేపాల్ అభివృద్ధిలో భారత్ తోడుగా ఉంటుందని పునరుద్ఘాటించారు. తన ఈచారిత్రక పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలకు కొత్తశక్తి వచ్చిందని వ్యాఖ్యానించారు. నేపాల్ ప్రధాని కేపీఓలితో చర్చలు ఫలప్రదమయ్యాయని అన్నారు. రెండ్రోజుల నేపాల్ పర్యటన ముగించుకుని మోదీ స్వదేశం చేరుకున్నారు. భారత్–నేపాల్ స్నేహం జిందాబాద్.. కఠ్మాండులో శనివారం మోదీ గౌరవార్థం ఘనంగా రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగామోదీ మాట్లాడుతూ.. ‘యుద్ధం నుంచి బౌద్ధం వైపు అడుగులేస్తూ నేపాల్ సుదీర్ఘ ప్రయాణం చేసింది. బ్యాలెట్ (ప్రజాస్వామ్యం)ను ఎంచుకోవడానికి బుల్లెట్(యుద్ధం)ను వదులుకున్నారు. అయితే ఇంకా గమ్యస్థానాన్ని చేరుకోలేదు. మౌంట్ ఎవరెస్ట్ బేస్‌క్యాంపు వరకు చేరుకున్నారు. ప్రధాన అధిరోహణ ఇంకా జరగాల్సిఉంది. పర్వతారోహకులకు సాయంచేసే షెర్పాల మాదిరిగానే నేపాల్‌కు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది’అని అన్నారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ మంత్రం భారత్‌కే పరిమితం కాలేదని, ప్రపంచహితం కోసం కూడా దోహదపడుతుందని అన్నారు. ‘భారత్–నేపాల్ స్నేహం జిందాబాద్’అని మోదీ తన ప్రసంగం చివరలోమూడుసార్లు నినదించారు. ఈ పర్యటన చరిత్రాత్మకం.. నేపాల్ పర్యటనను చారిత్రకమని మోదీ అభివర్ణించారు. ‘ఈ పర్యటన నేపాల్ ప్రజలకు చేరువయ్యేందుకు అవకాశం కల్పించింది. అభివృద్ధి ప్రయాణంలో నేపాల్‌కు భారత్ ఎప్పుడూ అండగాఉంటుంది’అని ట్వీట్‌చేశారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇదేజోరు కొనసాగించాలని మోదీ, ఓలి నిర్ణయించినట్లు ఉమ్మడి ప్రకటన వెల్లడించింది. విభిన్న రంగాల్లో సహకారం, భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుని ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు నేతలు అంగీకరించారు. భారత్‌లో పర్యటించాలన్న మోదీ ఆహ్వానాన్ని ఓలి అంగీకరించారు. -
దారి నిండా ‘మేలు’రాళ్లు
హితం ఇక్కడ మైలురాయిపై కనిపిస్తున్న రోడ్డుప్రమాద హెచ్చరికలు చదివితే డ్రైవింగ్ కంట్రోల్‌పై అవగాహన కలగడంతో పాటు కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు కూడా. హిమాలయ ప్రదేశ్ ప్రాంతం సమీపంలో లెహమానిలి హైవేకి ఎంత ప్రత్యేకత ఉందో ఆ రోడ్డుపక్కనున్న మైలురాళ్ల మీది కొటేషన్లకు కూడా అంతే పేరుంది. అది గమనించిన షెర్పా అనే ఫొటోగ్రాఫర్ ఏకంగా లడక్ రోడ్ సైన్స్ డాట్‌కామ్ పేరుతో ఒక వైబ్సైట్నే తయారుచేసేశాడు. అందులో కనిపించే మైలురాళ్ళ కొటేషన్లకు బోలెడు లైకులు వస్తున్నాయి. భారత సైనిక దళం ఆధ్వర్యంలో ‘బోర్డర్ రోడ్స్ సంస్థ’ వారు తయారుచేసిన ఈ కొటేషన్లు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. 298 మైళ్ల పొడవున్న ఈ రహదారిపై ప్రయాణించాలంటే కేవలం వేసవికాలంలోనే అనుమతి ఉంటుంది. మిగతారోజుల్లో మంచుకారణంగా ఆ రహదారిని మూసివేస్తారు. ‘‘నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినపుడు ‘ఆఫ్టర్ డ్రింకింగ్ విస్కీ డ్రైవింగ్ ఈస్ రిస్కీ’ అనే కొటేషన్ చదివాను. వెంటనే నా ఫేస్బుక్లో పెడితే మొదటి గంటలోనే ఇరవైమంది స్నేహితుల లైకులు వచ్చాయి. ఇక అక్కడ్నుంచి ఏటా వేసవి వచ్చిందంటే లెహమానిలి రోడ్డుపై వాలిపోయేవాణ్ణి. గత ఆరేళ్ల నుంచి ఇక్కడ 130 మైలురాయిల ఫోటోలు తీసాను. అన్నింటినీ నా ఫేస్బుక్లో పెట్టడం దేనికి... వీటికోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ తయారుచేస్తే పోతుంది కదా! అనుకుని ‘లడక్ రోడ్ సైన్స్ డాట్‌కామ్’ అనే వెబ్సైట్ రూపొందించాను’’ అని చెప్పాడు షెర్పా. ఇంతకీ ఆ రోడ్డుపై వందలసంఖ్యలో ఇలాంటి కొటేషన్లు పెట్టడం వెనక విషయం ఏంటంటే...మెలికలు తిరుగుతూ ఉండే ఆ రోడ్డుపై చాలా ప్రమాదాలు జరిగాయి. వాహనం వేగం పెరిగిందంటే....మలుపు దగ్గర ప్రమాదం గ్యారెంటీ. దాంతో సరిహద్దు సైనికులు ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ ఇలాంటి మైలురాళ్లను ఏర్పాటు చేశారు. కారణం ఏదైనా... ‘‘ఇఫ్ యు స్లీప్ యువర్ ఫ్యామిలీ విల్ వీప్’, ‘దిస్ ఈజ్ హైవే, నాట్ రన్‌వే’ వంటి కొటేషన్లు వాహన చోదకులకు హితబోధతోపాటు చక్కటి హాస్యస్ఫోరకమైన వాతావరణం కూడా కల్పిస్తున్నాయంటున్నారు అక్కడికి వచ్చే పర్యాటకులు.