సాక్షి, అమరావతి: అరకు కాఫీ ఘుమఘుమలు మరోసారి అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కింది. ప్రపంచంలోనే తొలి గిరిజన సంప్రదాయ కాఫీ అయిన అరకు కాఫీ ఇండియన్ గ్రేట్ బ్రాండ్లలో ఒకటి అంటూ నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్ చేయగా.. దానిని స్వాగతిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు.
దీంతో, మరోసారి అంతర్జాతీయంగా అరకు కాఫీపై ట్విట్టర్ వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇండియాలో జరుగుతున్న జీ–20 సమావేశాల్లో విదేశీ ప్రతినిధులకు అందంగా ప్యాక్ చేసిన అరకు కాఫీని అందిస్తున్నామని, ఇది ప్రపంచంలోనే తొలి గిరిజన కాఫీగా గుర్తింపు పొందిందంటూ అమితాబ్ కాంత్ కీర్తించారు. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న కాఫీ సాగు ప్రాంతంగా అరకుకు గుర్తింపు లభించందన్నారు. ప్రతిసారి సేంద్రియ సాగు పరీక్షలో స్థిరంగా 90 కంటే ఎక్కువ మార్కులు సాధిస్తూ తొలి ఇండియన్ కాఫీగా నిలవడమే కాకుండా.. గ్రేట్ ఇండియన్ బ్రాండ్‌గా ఎదిగిందన్నారు. ఈ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. దేశ విజయాన్ని అద్దంపట్టే విధంగా అరకు కాఫీని ఎంచుకోవడం అద్భుతమైన నిర్ణయమంటూ పొగిడారు.
A perfect epicurean choice, @amitabhk87 whixh showcases an incredible Indian success story. The creation of a global brand while simultaneously transforming the lives of the tribal population of Araku. https://t.co/oFHWz0EIzy
— anand mahindra (@anandmahindra) July 16, 2023
ఇది కూడా చదవండి: కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం
Comments
Please login to add a commentAdd a comment