Araku Coffee Market
-
కాఫీ రైతు హ్యాపీ.. అల్లూరి జిల్లాలో విరగ్గాసిన పండ్లు
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది కాఫీ విరగ్గాసింది. ఎక్కడ చూసినా ఎర్రటి పండ్లతో తోటలు కళకళలాడుతున్నాయి. తోటలు మంచి కాపుకాయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా పండ్ల దశలోనే కొనుగోలు చేస్తుండడంతో వాటి సేకరణను రైతులు ప్రారంభించారు. తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలు అనుకూలంగా ఉండడంతో కాఫీ పంట విరగ్గాసిందని కాఫీ విభాగం అధికారులు అంటున్నారు.సాక్షి,పాడేరు: అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన అల్లూరి జిల్లాలో కాఫీకి ఈఏడాది కూడా మహర్దశ పట్టింది. కాయలు పక్వానికి వచ్చాయి. తోటల్లో విరగ్గాసిన ఎర్రని కాఫీ పండ్ల సేకరణను గిరిజన రైతులు ప్రారంభించారు. కాఫీ పంటను పండ్ల దశలోనే పాడేరు ఐటీడీఏతో పాటు గిరిజన రైతు ఉత్పత్తి సంఘాలు,పలు ఎన్జీవో సంస్థలు కొనుగోలు ప్రారంభించాయి. చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా పాడేరు ఐటీడీఏ రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. కాఫీ పండ్ల సేకరణలో కాఫీ రైతులు వారం రోజుల నుంచి బిజీగా ఉన్నారు. సేకరించిన పండ్లను ఐటీడీఏతో పాటు పలు సంస్థలు వెంటనే కొనుగోలు చేస్తూ పల్పింగ్ యూనిట్లకు తరలిస్తున్నాయి. జీసీసీ సిబ్బంది కూడా కాఫీ గింజలు కొనుగోలు చేస్తున్నారు.1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం పాడేరు డివిజన్లోని 11 మండలాల్లో 2.42 లక్షల ఎకరాల్లో కాఫీతోటలను గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటిలో 1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం ఇచ్చే కాఫీతోటలు ఉన్నాయి. ఆయా తోటల్లో కాఫీ పండ్లు విరగ్గాయడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది 17వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను రైతులు విక్రయించారు. ఈ ఏడాది కూడా కాపు ఆశాజనకంగా ఉండడంతో 18వేల మెట్రిక్ టన్నుల వరకు కాఫీ గింజల ఉత్పత్తి ఉంటుందని కేంద్ర కాఫీబోర్డు,పాడేరు ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జీసీసీ,ఐటీడీఏలు గిట్టుబాటు ధరలు ప్రకటన ఈఏడాది కూడా గిరిజన రైతులు ఉత్పత్తి చేసే కాఫీ పంటకు ఎఫెక్స్ కమిటీ సిఫారసు మేరకు జీసీసీ,పాడేరు ఐటీడీఏలు గిట్టుబాటు ధరలను ప్రకటించాయి. చింతపల్లి మాక్స్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసే కాఫీ పండ్లకు కిలో రూ.44ధర చెల్లించేందుకు పాడేరు ఐటీడీఏ నిర్ణయించింది. పార్చ్మెంట్ కాఫీ గింజలను కిలో రూ.285 ధరతో, అరబికా చెర్రీ రకాన్ని కిలో రూ.150,రోబస్ట చెర్రీ రకాన్ని కిలో రూ.80కు కొనుగోలు చేయనున్నారు.డ్రైకాఫీ దిగుబడి ఎకరాకు 150 కిలోల వరకు ఉంటుంది. ఐటీడీఏ ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి 45 వేల వరకు రైతుకు ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ. 8 కోట్లతో పండ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఐటీడీఏ నిర్ణయించుకోగా, రూ. 57 కోట్ల లావాదేవీలు నిర్వహించాలని జీసీసీ భావిస్తోంది. జిల్లా మొత్తం ఈ ఏడాది రూ.400 కోట్ల వరకూ కాఫీ లావాదేవీలు జరగవచ్చని భావిస్తున్నారు. పండ్ల సేకరణ ప్రారంభించాం నాకు ఉన్న రెండు ఎకరాల్లో కాఫీ తోటలు విరగ్గాసాయి. కాపు ఆశాజనకంగా ఉంది. రెండు రోజుల నుంచి పండ్ల సేకరణ జరుపుతున్నాం. గత ఏడాది కాఫీ పంట విక్రయం ద్వారా రూ.70వేల ఆదాయం వచ్చింది. ఈ సారి కాపు అధికంగా ఉండడంతో దిగుబడి పెరుగుతుందని ఆశిస్తున్నాను. సొంతంగా పల్పింగ్ చేసి పార్చ్మెంట్ కాఫీని తయారు చేసి జీసీసీకే విక్రయిస్తాను. – సుర్ర చిట్టిబాబు, కాఫీ రైతు, కరకపుట్టు,పాడేరు మండలంకాఫీ పంటకు గిట్టుబాటు ధర గిరిజన రైతులు సాగు చేస్తున్న కాఫీ పంట నాణ్యతలో నంబర్–1గా నిలుస్తుంది. కాఫీ ఉత్ప త్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ఐటీడీఏ,జీసీసీ యంత్రాంగం ద్వారా కాఫీ రైతులకు మేలు చేసేలా గిట్టుబాటు ధరలను ప్రకటించాం. గిరిజనులు ఎలాంటి అపోహలకు గురికాకుండా కాఫీ పండ్లను ఐటీడీఏకు, పార్చ్మెంట్, అరబికా, రొబస్ట కాఫీ గింజలను జీసీసీకి విక్రయించి లాభాలు పొందాలి. దళారీలను ఆశ్రయించి మోసపోవద్దు. –ఎ.ఎస్.దినేష్ కుమార్, కలెక్టర్. -
యంగ్ హీరోయిన్ సింప్లీసిటీ.. రోడ్డు పక్కన టీ తాగిన ముద్దుగుమ్మ!
తెలుగులో వరుస సినిమాలతో మెప్పించిన కన్నడ బ్యూటీ శ్రీలీల. గతేడాది భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది గుంటూరు కారంతో అలరించిన ముద్దుగుమ్మ.. నితిన్ సరసన రాబిన్‌హుడ్ చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్లోనూ నటిస్తోంది. వీటితో పాటు ఓ బాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పినా భామ.. ఇటీవల ఆ మూవీ నుంచి తప్పుకుంది.ప్రస్తుతం శ్రీలీల తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడులో అరకులో ఫ్యామిలీతో కలిసి కనిపించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్లో కనిపించింది. సామాన్యురాలిగా టీ తాగుతూ సందడి చేసింది. ఆమెను గమనించిన స్థానికులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు శ్రీలీల క్రేజీ హీరోయిన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. #TFNExclusive: The charming beauty @sreeleela14 snapped along with her family as she enjoys a tea break at Araku!!☕😍#Sreeleela #UstaadBhagatSingh #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/zNFABqBY3P— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2024 -
మీకు తెలుసా! ఇదీ.. వందేళ్ల వండర్ఫుల్ అరకు కాఫీ!
నురగలు కక్కుతూ నిద్ర మత్తును వదలగొట్టే పానీయం.. మదిని ఉత్తేజపరచే ఔషధం.. అవనిలో దొరికే ఆ అమృతం.. చిక్కటి.. చక్కటి రుచిగల ఉదయాలకు ప్రారంభం! ఈ కాంప్లిమెంట్‌కి కాఫీనే ఎలిజిబుల్!‘అనుదినమ్మును కాఫీయే అసలు కిక్కు.. కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు.. కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు.. అమృతమన్నది హంబక్కు అయ్యలార.. జై కాఫీ’ అంటూ ‘మిథునం’ సినిమా కోసం జొన్నవిత్తుల కూడా కాఫీ మహిమను కీర్తించారు. ఇలా జనుల జిహ్వన నానుతున్న కాఫీ మన అరకు లోయలోనూ సాగవుతోంది. నిజమే కానీ ఈ ఘుమఘుమల ప్రస్తావన ఇప్పుడెందుకు? జూన్ 30న ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’లో ‘అరకు వ్యాలీ కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన కృషి అభినందనీయం .. అరకు కాఫీని ఆస్వాదించండి’ అని ప్రత్యేకంగా ప్రశంసించినందుకు!టేస్ట్పుల్ ఇమేజ్‌తో అనేక దేశాలు గ్రోలుతున్న ఈ వండర్ఫుల్ అరకు కాఫీకి వందేళ్లకుపైగా ఘన చరిత్ర ఉంది. 1898లో.. ఓ ఆంగ్లేయ అ«ధికారి.. తూర్పుగోదావరి జిల్లా, పాములేరు లోయలో కాఫీ పంటను వేశారు. 1920 నాటికి విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, జీకే వీథి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీ నగర్, మినుమలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లోనూ కాఫీ తోటల పెంపకాన్ని మొదలుపెట్టారు.స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లా రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను వేసింది. ఆ తోటలను 1985లో అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఆపై గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా ప్రత్యేకంగా కాఫీ తోటల అభివృద్ధి విభాగమొకటి ఏర్పాటైంది. కాఫీ బోర్డు సహకారంతో గిరిజన ప్రాంతాల్లో సుమారు పదివేల ఎకరాల్లో సేంద్రియ (ఆర్గానిక్) పద్ధతిలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించారు. దీనివల్ల పెద్ద ఎత్తున గిరిజనులు పోడు వ్యవసాయం నుంచి కాఫీ సాగు వైపు మళ్లి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.అరకులో కాఫీ తోటలు సరే.. కాఫీ చరిత్రను చాటే కాఫీ మ్యూజియం కూడా ఉంది. 16వ శతాబ్దంలో సూఫీ సన్యాసి బాబా బుడాన్ .. కర్ణాటకలోని చిక్ మగళూరు నుంచి ఏడు కాఫీ గింజలను తెచ్చి తన ఆశ్రమంలో నాటారని కాఫీ బోర్డు వెబ్సైట్లో పేర్కొన్నారు.వాతావరణం అనుకూలం..సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ.. కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. అందుకే పదివేల ఎకరాల్లో మొదలైన కాఫీ సాగు ఇప్పుడు లక్షన్నర ఎకరాలకు పైగా విస్తరించింది. ఇక్కడ పొడవైన సిల్వర్ ఓక్ చెట్లు, టేకు చెట్ల నీడలో.. ఏటవాలు ప్రాంతాల్లో కాఫీ తోటలను పెంచుతున్నారు. ఆ నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం వల్ల ఆ కాఫీకి ప్రత్యేక రుచి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆ తోటలకు నీడ కోసం.. ఓక్ చెట్ల మొదళ్లలో మిరియాలు వేసి.. అవి ఓక్ చెట్ల మీదుగా పాకేలా చేస్తున్నారు. దీనివల్ల మిరియాలు అదనపు పంటగా మారి.. అదనపు ఆదాయాన్నీ వాళ్లు పొందుతున్నారు.అంతర్జాతీయ ఖ్యాతి..ప్రపంచంలో అధికంగా కాఫీ పండించే దేశాల్లో .. మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో మనం ఏడవ స్థానంలో ఉన్నాం. 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. మన దేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుండగా.. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచే ఎక్కువ ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో అరబికా రకం కాఫీని సాగు చేస్తున్నారు. ఈ కాఫీని బెంగళూరులో ప్రాసెస్ చేసి జర్మనీ, వియత్నాం, బ్రెజిల్, ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.2007లో ఆదివాసీ రైతులు ఉత్పత్తి చేసిన అరకు కాఫీ.. దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ప్యారిస్‌లో ‘అరకు కాఫీ బ్రాండ్’ పేరుతో ఓ కాఫీ షాప్ తెరిచారు. దీని టేస్ట్ జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లండ్ దేశాలకూ పాకింది. బెస్ట్ కాఫీ బ్రాండ్లకు పేరొందిన బ్రెజిల్, సుమత్రా, కొలంబోలు.. అరకు స్ట్రాంగ్ కాఫీ ముందు లైట్ అయిపోతున్నాయి. తద్వారా అరకు కాఫీకి అంతర్జాతీయ డిమాండ్‌నే కాదు ఫేమ్నీ పెంచుతున్నాయి. అరకు కాఫీ బేవరేజ్గానే మిగిలిపోలేదు. పలు రకాల పండ్లు, ఫ్లేవర్స్‌తో కలసి చాకోలెట్స్గానూ చవులూరిస్తోంది.జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అటవీ ఫలసాయం, వ్యవసాయోత్పత్తుల కొనుగోలులో రికార్డు స్థాయిలో గిరిజనులకు మేలు జరిగింది. గిరిజన రైతులకు పెట్టుబడి సాయం, యంత్ర పరికరాలను అందించింది. దీనికితోడు జీసీసీ సైతం గిరిజన రైతుల వ్యవసాయానికి, కాఫీ సాగుకు రుణాలు మంజూరు చేసి, అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా మద్దతు ధరను చెల్లించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంతోపాటు ఆర్గానిక్ సిర్టిఫికేషన్ కోసం ప్రత్యేక చర్యలూ చేపట్టి గిరిజన రైతులను ప్రోత్సహించింది.అవార్డులు.. ప్రశంసలు!గతేడాది సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు బెంగళూరులో నిర్వహించిన ప్రపంచస్థాయి ‘ఫైన్ కప్’ పోటీలో ఏపీ ప్రభుత్వం తరఫున కాఫీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన అరకు కాఫీ ‘ఫైన్ కప్’ అవార్డును దక్కించుకుంది. పెదబయలు మండలం లక్ష్మీపురం పంచాయతీ కప్పల గ్రామానికి చెందిన కిల్లో అశ్విని ఈ ఘనతను సాధించడం విశేషం. ప్రపంచ కాఫీ పోటీల్లో 12 ఏళ్ల తర్వాత మన కాఫీకి అంతర్జాతీయ అవార్డు దక్కింది. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో సోషల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ 2022 ఆగస్టు 9 నుంచి 11 వరకు కోల్‌కతాలో నిర్వహించిన జాతీయ సదస్సులో 14 రాష్ట్రాలు పాల్గొనగా.. మన కాఫీ మొదటిస్థానంలో నిలవడంతో జాతీయ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో నిర్వహించిన జి–20 సదస్సులోనూ సర్వ్ అయిన అరకు కాఫీకి ప్రపంచ దేశాల ప్రతినిధులు హాట్ ఫేవరెట్స్ అయిపోయారు. గతంలో పారిస్‌లో ప్రి ఎపిక్యూర్స్ పోటీలో అరకు కాఫీ గోల్డ్ మోడల్ గెల్చుకుంది. – యిర్రింకి ఉమమహేశ్వరరావు, సాక్షి, అమరావతి -
అరకు కాఫీ ఘుమఘుమలు.. ఐరాస ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: అరకు కాఫీ ఘుమఘుమలు మరోసారి అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కింది. ఐక్యరాజ్యసమితిలో ప్రశంసలు అందుకుంది. ఏపీలోనీ అరకు లోయలో మహిళలు పండిస్తున్న కాఫీలో చక్కటి పరిమళం ఉందని ఐరాస ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. కాఫీ సాగు ద్వారా ఆర్థిక సామాజిక విప్లవాన్ని తీసుకురావడంలో అరకు మహిళల కీలక పాత్ర ఉందని, అరకు మహిళలు భారత నారీశక్తికి చిహ్నాలని ఐకాస ప్రతినిధులు అన్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత మిషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మహిళల సారథ్యంలో ప్రగతి సాధనపై భారత నిబద్ధత ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని ఐరాస జనరల్ అసెంబ్లీ 78వ సభ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అన్నారు. ఈ ఏడాది జనవరిలో తాను భారత్‌లో పర్యటించినపుడు అక్కడి ‘నారీశక్తి’ పరివర్తన ఫలాలను ప్రత్యక్షంగా చూసినట్లు వివరించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను భారత మహిళలకు అనుసంధానం చేసిన విధానం గొప్పగా ఉందని ఐరాస డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్ అన్నారు. -
అరకు కాఫీకి ఇంటర్నేషనల్ బ్రాండింగ్.. ఓర్వలేని రామోజీ
-
అరకు కాఫీని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
-
జీ20 నేతలకు అరకు కాఫీ గిఫ్ట్.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్..
జీ20 సమ్మిట్‌కు హాజరైన విదేశీ నేతలకు అరకు కాఫీలను కేంద్రం గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనిపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగల భారతదేశ సామర్థ్యానికి ప్రధాన ఉదాహరణ అరకు కాఫీ అని ప్రశంసించారు. అరకు బోర్డు ఛైర్మన్‌గా ఈ ఘనత తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. 'అరకు బోర్డు ఛైర్మన్‌గా నాకు ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. అరకు కాఫీని గిఫ్ట్‌గా ఇవ్వడంపై నేను ఎక్కువ మాట్లాడలేను. ప్రపంచంలోనే అత్యంత కాఫీ ఉత్పత్తుల్లో ఇండియా అరకు కాఫీ కూడా ఒకటి. ఇది మనకు ఎంతో గర్వకారణం' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. జీ20 సమావేశం నుంచి వెనుదిరుగుతున్న విదేశీ నేతలకు కేంద్రం అరకు కాఫీలను గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియోను షేర్ చేశారు. As the Chairman of the Board of Araku Originals, I can’t argue with this choice of gift! It just makes me very, very proud. Araku Coffee is the perfect example of ‘The best in the World, Grown in India’… https://t.co/VxIaQT6nZL — anand mahindra (@anandmahindra) September 12, 2023 అరకు కాఫీ ఎంతో ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు కొండ ప్రాంతాల్లో సేంద్రీయ తోటల్లో దీనిని ఎక్కువగా పెంచుతారు. ప్రత్యేకమైన సుగంధ లక్షణాలు కలిగి రుచికి ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీని గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలోని తూర్పు కనుమలలో ఉన్న సుందరమైన అరకు లోయ పర్యాటకంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. 2008లో ఏర్పాటు చేసిన నంది ఫౌండేషన్ అరకు కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకుపోవడంలో తోడ్పాటునిచ్చింది. ఇదీ చదవండి: భారతదేశాన్ని సూర్యుడు మొదట ముద్దాడే ప్రదేశం.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్.. -
గ్రేట్ ఇండియన్ బ్రాండ్ అరకు కాఫీ..
సాక్షి, అమరావతి: అరకు కాఫీ ఘుమఘుమలు మరోసారి అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కింది. ప్రపంచంలోనే తొలి గిరిజన సంప్రదాయ కాఫీ అయిన అరకు కాఫీ ఇండియన్ గ్రేట్ బ్రాండ్లలో ఒకటి అంటూ నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్ చేయగా.. దానిని స్వాగతిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. దీంతో, మరోసారి అంతర్జాతీయంగా అరకు కాఫీపై ట్విట్టర్ వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇండియాలో జరుగుతున్న జీ–20 సమావేశాల్లో విదేశీ ప్రతినిధులకు అందంగా ప్యాక్ చేసిన అరకు కాఫీని అందిస్తున్నామని, ఇది ప్రపంచంలోనే తొలి గిరిజన కాఫీగా గుర్తింపు పొందిందంటూ అమితాబ్ కాంత్ కీర్తించారు. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న కాఫీ సాగు ప్రాంతంగా అరకుకు గుర్తింపు లభించందన్నారు. ప్రతిసారి సేంద్రియ సాగు పరీక్షలో స్థిరంగా 90 కంటే ఎక్కువ మార్కులు సాధిస్తూ తొలి ఇండియన్ కాఫీగా నిలవడమే కాకుండా.. గ్రేట్ ఇండియన్ బ్రాండ్‌గా ఎదిగిందన్నారు. ఈ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. దేశ విజయాన్ని అద్దంపట్టే విధంగా అరకు కాఫీని ఎంచుకోవడం అద్భుతమైన నిర్ణయమంటూ పొగిడారు. A perfect epicurean choice, @amitabhk87 whixh showcases an incredible Indian success story. The creation of a global brand while simultaneously transforming the lives of the tribal population of Araku. https://t.co/oFHWz0EIzy — anand mahindra (@anandmahindra) July 16, 2023 ఇది కూడా చదవండి: కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం -
మళ్ళీ అందుబాటులోకి అరకు కాఫీ
-
మళ్లీ అరకు ఇన్స్టెంట్ కాఫీ రెడీ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ కాఫీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న అరకు కాఫీ నుంచి ఇన్స్టెంట్ సాచెట్స్ మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్ల విరామం అనంతరం ఇన్స్టెంట్ కాఫీ సాచెట్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సర్వం సిద్ధంచేసింది. ఇప్పటికే 40 టన్నుల కాఫీ పండ్లు సేకరించి ప్రాసెసింగ్‌కు అప్పగించింది. సంక్రాంతి పండుగకు ఘుమఘుమలాడే అరకు ఇన్స్టెంట్ కాఫీ తాగేలా మార్కెట్లోకి తీసుకురానుంది. అరకు ఇన్స్టెంట్ కాఫీని 2018లో మార్కెట్లోకి తీసుకొచ్చిన జీసీసీ లాభాలబాటలో పయనించింది. మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల్లో బ్రాండ్‌గా దూసుకెళ్లిన అరకు కాఫీకి మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఇన్స్టెంట్ కాఫీ ప్రక్రియ చేపట్టే బెంగళూరుకు చెందిన వాహన్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు డబ్బులు చెల్లించకపోవడం, అధికారులతో విభేదాలు, కోవిడ్ కారణంగా 2019 మొదట్లోనే సరఫరాకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఇన్స్టెంట్ కాఫీ ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగా జీసీసీ ఎండీగా సురేష్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సదరు సంస్థతో పలుమార్లు చర్చలు జరిపారు. వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడంతో తిరిగి ఇన్స్టెంట్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. తొలివిడతగా 40 టన్నుల సేకరణ రెండు రోజుల్లో ఇన్స్టెంట్ కాఫీ ప్రక్రియ ప్రారంభించేందుకు జీసీసీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే గిరిజనుల నుంచి పదిశాతం కన్నా తక్కువ తేమ ఉన్న నాణ్యమైన 40 టన్నుల కాఫీ పండ్లను సేకరించింది. దీనివల్ల మంచి రుచితోపాటు సువాసన కూడా కాఫీకి తోడవుతుంది. ఈ పండ్లని రోస్టింగ్, ఇతర ప్రక్రియలతో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్‌గా మార్చనున్నారు. 2 గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లతోపాటు 50, 100 గ్రాముల టిన్స్ కూడా మార్కెట్లోకి తీసుకురావాలని జీసీసీ ఏర్పాట్లు చేసింది. రూ.3, రూ.12 చొప్పున సాచెట్స్ అమ్మకపు ధరలుగా నిర్ణయించింది. తొలివిడతగా గిరిజనుల నుంచి సేకరించిన 40 టన్నులతో ఇన్స్టెంట్ కాఫీ పొడిని మార్కెట్లోకి తీసుకురానుంది. ఎప్పటికప్పుడు తాజాగా అందిస్తాం ఎప్పటికప్పుడు నాణ్యమైన ఇన్స్టెంట్ కాఫీని వినియోగదారులకు అందించేందుకు సిద్ధమయ్యాం. రెండు రోజుల్లో ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. జనవరి 10 తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త ఇన్స్టెంట్ కాఫీ సాచెట్స్ వచ్చేలా తయారీ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించాం. మిగిలిన కంపెనీ బ్రాండ్ల సాచెట్స్‌లో చూపించే పరిమాణం కంటే తక్కువ కాఫీ పొడి ఉంటుంది. కానీ, అరకు ఇన్స్టెంట్ కాఫీ సాచెట్స్ మాత్రం ఎంత పరిమాణం చెప్పామో.. అంతే ఉండేలా కచ్చితత్వంతో అందిస్తాం. గిరిజనులకు లాభాలను అందించేలా జీసీసీ ప్రతి నిర్ణయం తీసుకుంటోంది. జి.సురేష్‌కుమార్, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ -
'నన్నారి'కి నల్లమల బ్రాండ్!
(నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి ఐ.ఉమామహేశ్వరరావు) అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆదివాసీ గిరిజనులు ఇప్పుడు నన్నారి (షర్బత్ తయారీకి ఉపయోగించేది)పై గురిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు దీనికి బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీశైలంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నేతృత్వంలో నన్నారి (సుగంధి) ఉత్పత్తికి ఊతమిస్తోంది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో 171 గూడెంలలో నివసించే 27,857 మంది చెంచుల జీవనోపాధికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజానికి అక్కడి చెంచులు నల్లమల అడవిపై ఆధారపడి సంచార జీవనం సాగిస్తుంటారు. వీరికి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంచడమే కాకుండా ఆ భూముల్లో సాగు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. చెంచులు వ్యవసాయ ఉత్పత్తులతోపాటు అటవీ ఫలసాయమైన నన్నారి, తేనె, ఉసిరి, కుంకుడు కాయలు, మాడపాకులు, ముష్టి గింజలు, చింతపండు వంటి వాటిని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కేంద్రాలకు మద్దతు ధరకు విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నన్నారి ఉత్పత్తికి ఊతం.. ఇక నన్నారి చెట్ల సాగు, ఉత్పత్తి, విక్రయాలకు శ్రీశైలం ఐటీడీఏ అనేక చర్యలు చేపడుతోంది. కర్నూలు జిల్లా డి.వనిపెంట చెంచుగూడెంలో 20 మంది చెంచు రైతులు 20 ఎకరాల్లో గత మూడేళ్లుగా నన్నారి సాగుచేస్తున్నారు. మరో 12 మంది 30 ఎకరాల మామిడి తోటల్లోను అంతర పంటగా నన్నారి సాగుచేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఐటీడీఏ ప్రోత్సాహంతో అనేక చెంచు కుటుంబాలు ఇళ్ల ముంగిటే ఈ మొక్కల సాగుచేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 2వేల కుటుంబాలు ఈ సాగుతో ఉపాధి పొందుతున్నాయి. మరో వంద ఎకరాల్లో సాగుకు ఐటీడీఏ అధికారులు కార్యాచరణ చేపట్టారు. నన్నారి గడ్డలు (ముడిసరుకు) కిలో రూ.450 నుంచి రూ.600 కొనుగోలు చేసి నన్నారి షర్బత్ తయారీకి వినియోగిస్తున్నారు. మూడు జిల్లాల్లో 13 వికాస కేంద్రాలు నిజానికి.. గిరిజనుల వద్ద వ్యాపారులు చౌకగా కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి గిరిజనులే మంచి ధరకు అమ్ముకునేలా అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే నల్లమల బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయించాలని సంకల్పించింది. మూడు జిల్లాల్లో 13 ప్రధానమంత్రి వన్‌ధన్ వికాస కేంద్రాలు (ప్రకాశం–5, నంద్యాల–6, పల్నాడు–2) కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఒక్కో కేంద్రంలో 15 గ్రూపులు (300 మంది సభ్యులు) చొప్పున మొత్తం 13 వికాస కేంద్రాల్లో 3,900 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. వీటి ద్వారా నన్నారితోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఫలసాయాన్ని గిరిజనులు విక్రయించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కేంద్రాలను అనుసంధానిస్తూ డోర్నాలలో ఐదు ఎకరాల్లో ట్రైబల్ పార్కు ఏర్పాటుచేసి గిరిజనుల ఉత్పత్తులను విక్రయించనున్నారు. నన్నారితో షర్బత్ తయారీ శిక్షణ వేసవిలో దాహార్తిని తీర్చడంతోపాటు శక్తినిచ్చే నన్నారి షర్బత్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్వంలో ప్రస్తుతం 10 కేంద్రాల్లో వెయ్యి మందికిపైగా చెంచులకు నన్నారి శుద్ధి, షర్బత్ తయారీపై శిక్షణనిచ్చారు. అడవి నుంచి సేకరించిన నన్నారి వేర్లను ప్రాసెసింగ్ చేస్తారు. శుద్ధిచేసిన ఒక కిలో నన్నారి గడ్డలతో నీరు, పంచదార, నిమ్మ ఉప్పు, ప్రిజర్వేటివ్, కొద్దిపాటి రంగుతో 25 లీటర్ల నన్నారి పానీయం తయారవుతుంది. లీటరు షర్బత్ తయారీకి రూ.వంద అయితే దాన్ని రూ.150కి విక్రయిస్తారు. నల్లమల బ్రాండ్‌తో విక్రయాలు చెంచులు సేకరించే నన్నారి, తేనె, వనమూలికలతోపాటు ఇతర అటవీ ఉత్పత్తులను బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయించేలా శ్రీశైలం ఐటీడీఏ పాలక మండలి ఇటీవల తీర్మానించింది. ఇప్పటికే నన్నారి షర్బత్ తయారీపై యువతకు శిక్షణనిచ్చాం. నన్నారి దుంపల (వేర్లు) శుద్ధికోసం రూ.3 లక్షల చొప్పున రెండు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నాం. నన్నారి సాగును ప్రోత్సహించడంతోపాటు ఉద్యానవన సాగుకు ఊతమిస్తున్నాం. ఐదువేల మామిడి మొక్కలను పంపిణీ చేశాం. తిరుపతిలోని చినీ, నిమ్మ పరిశోధన స్థానం నుంచి స్వీట్ ఆరంజ్ (రంగపురి రకం) 3వేల మొక్కలను పంపిణీ చేశాం. 750 ఎకరాల్లో చెంచులు మిరప పండిస్తుండటంతో చిల్లీపౌడర్ (కారం) తయారుచేసే కేంద్రాన్ని డోర్నాలలో ఏర్పాటుచేస్తున్నాం. యర్రగొండపాలెం, సున్నిపెంటలో వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) ద్వారా యువతకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌తోపాటు ఫుడ్, గూడ్స్ ప్యాకింగ్పైన శిక్షణనిచ్చాం. చెంచుల అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ చేసి విక్రయించేందుకు మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాం. – బి. రవీంద్రరెడ్డి, ప్రాజెక్టు అధికారి, శ్రీశైలం ఐటీడీఏ -
అరకు కాఫీ అంతర్జాతీయ రికార్డులు.. కప్పు రూ.637
సాక్షి, అమరావతి: అరకు కాఫీ అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తోంది. మన కాఫీ బ్రాండ్ ఇమేజ్ను విదేశీ మార్కెట్లో సుస్థిరం చేస్తోంది. ప్రస్తుతం జపాన్‌లో కప్పు అరకు కాఫీని ఏడు పౌండ్లకు విక్రయిస్తున్నారు. ఏడు పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.637. ఆదివారం జపాన్ పౌండ్ విలువ రూ.91.0267గా ఉంది. మొదటి నుంచి అంతర్జాతీయంగా అరకు కాఫీకి మంచి డిమాండ్ ఉంది. మరోవైపు అత్యధికంగా కాఫీ తోటలను సాగు చేసే బ్రెజిల్, మన దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అరకు కాఫీకి మరింత డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు కాఫీ ప్రాజెక్ట్ పరిధిలో ఏజెన్సీ ప్రాంతంలో అరబికా, రోబస్టా చెర్రీ కాఫీ రకాలను సాగు చేస్తున్నారు. ఇదే కాఫీ రకాలను సేంద్రీయ పద్ధతి(ఆర్గానిక్)లో కూడా సాగు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా మరింత డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న కాఫీ గింజల ధర గతేడాది అంతర్జాతీయంగా కాఫీ గింజల ఉత్పత్తి తగ్గడంతో అరకు కాఫీకి బయటి మార్కెట్లో మంచి ధర లభించింది. ఏడాది క్రితం వరకు అరకు కాఫీ గింజలు సాధారణంగా కిలో రూ.150 నుంచి రూ.180 ధర ఉండేది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో అరిబిక్ పార్చిమెంట్(తొక్క తీసిన కాఫీ గింజలు) కిలో రూ.350 నుంచి రూ.380కి పైగా ధర లభించింది. బెంగళూరులోని అనేక ప్రైవేటు సంస్థలు అరకు కాఫీ గింజలను సేకరిస్తాయి. ఆ గింజలను శుద్ధి చేసి ఇన్స్టెంట్ కాఫీ పొడిగా, వివిధ రకాల కాఫీ పొడులుగా మార్చి ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తాయి. అయితే, వ్యాపారులు అరకు కాఫీ పొడి పేరుతోనే బెంగళూరును కేంద్రంగా చేసుకుని బ్రెజిల్, జపాన్ తదితర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. -
జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్
సాక్షి, అమరావతి/పాడేరు : అరకు కాఫీ జాతీయ స్థాయి వేదికపై మరోసారి అదుర్స్ అనిపించింది. ప్రతిష్టాత్మక సదస్సులో ప్రథమ బహుమతిని సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చాటింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ గుర్తింపు పొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో–సోషల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కోల్‌కతాలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ‘పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జీవనోపాధి పెంపొందించడం–స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మహిళా సాధికారతకు ఊత మివ్వడం’ అనే అంశంపై నిర్వహించిన ఈ సద స్సులో 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ ప్రాంతాల్లో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, డైరెక్టర్లు పి.చిన్నప్పదొర, ఎం.రామకృష్ణ, ఎస్.ఈశ్వరమ్మ, జనరల్ మేనేజర్ సీఏ మణికుమార్ ఆంధ్రాలో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న కాఫీ ప్రాజెక్టుపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏజెన్సీ ఏరియాలోని 2,27,021 ఎకరాల్లో కాఫీ పంట సాగు చేస్తున్నారని, ఏటా గిరిజన రైతులకు కచ్చితమైన ఆదాయం లభిస్తోందని, బెంగళూరు మార్కెట్లో నాణ్యమైన కాఫీ గింజలుగా ప్రసిద్ధి చెందడం వంటి అంశాలను వివరించారు. దీంతో మన కాఫీ ప్రాజెక్ట్‌కు ప్రథమ స్థానం లభించింది. ఉన్నతాధికారుల అభినందనలు జాతీయ స్థాయి అవార్డును సాధించిన ఏపీ ట్రైకార్ బృందానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, సంచాలకులు ఎం.జాహ్నవి, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ అవార్డు పొందడం ద్వారా జాతీయ స్థాయిలో అరకు కాఫీ మరోసారి గొప్ప గుర్తింపు పొందిందని ట్రైకార్ జీఎం మణికుమార్ తెలిపారు. అనుకూల వాతావరణం... ప్రభుత్వ సహకారమే కారణం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం, వృక్ష సంపదతో ఏర్పడే సహజసిద్ధమైన నీడ, నేల స్వభావం కాఫీ సాగుకు అత్యంత అనుకూలం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ–పాడేరు) పరిధిలో 2024–25 నాటికి దశల వారీగా కాఫీ సాగు విస్తరణను పెంచుతూ రూ.526.160 కోట్లతో ప్రత్యేక కాఫీ ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. కాఫీ సాగుకు అవసరమైన విత్తనాలు, యంత్రాలు, బోర్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, మొయిన్ రోడ్డు నుంచి అంతర్గత అప్రోచ్ రోడ్ల నిర్మాణం, పల్పింగ్ యూనిట్ల ఏర్పాటు, కాఫీ గింజల సేకరణ, మార్కెటింగ్æ వంటి చర్యలను చేపట్టింది. ప్రభుత్వ తోడ్పా టు వల్ల అరకు కాఫీకి దేశ విదేశాల్లో గుర్తింపు లభిస్తోంది. యూరప్, పారిస్ సహా అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. -
కాఫీ తోటలకు ఉపాధిహామీ!
సాక్షి, అమరావతి: దేశంలోనే ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న అరకు కాఫీ సాగును ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. తాజాగా ఏజెన్సీ ప్రాంతంలో సాగవుతున్న కాఫీ తోటల పెంపకానికి ఉపాధిహామీని కొనసాగించడంతోపాటు పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని కోరింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశంలో సైతం కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండాకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర బృందం ప్రత్యేకంగా ప్రతిపాదనలను కూడా అందజేసింది. గతంలో కాఫీసాగుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని వర్తింపజేసింది. అటవీ హక్కుల పత్రం (ఆర్వోఎఫ్ఆర్ పట్టా) ఉన్న భూముల్లో ఏడాదికి 150 రోజులు, హక్కుల పత్రాలు లేని మామూలు భూముల్లో 100 రోజులు చొప్పున ఇచ్చేవారు. కాఫీతోటల పెంపకంలో గుంతల తవ్వకం, మొక్కలు నాటడం తదితర పనులకు ఉపాధిహామీ నిధులు కేటాయించేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గిరిజన సంక్షేమశాఖ, ఐటీడీఏ, కాఫీబోర్డు ఈ పనులను పర్యవేక్షించేవి. దీనివల్ల అటు కాఫీతోటల సాగును ప్రోత్సహించడంతోపాటు గిరిజనులకు ఏడాదిలో కొన్ని రోజులైనా పనిదినాలకు భరోసా ఉంటుంది. ఉపాధిహామీలో కాఫీ రైతులకు వేతనాలు చెల్లించడం కుదరదని 2020లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. కాఫీని వాణిజ్యపంటగా గుర్తించి ఉపాధిహామీ ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తోంది. దేశంలో కాఫీతోటలు విరివిగా ఉండే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీసాగు వాణిజ్యపంటగా ప్రత్యేకంగా ఎస్టేట్లలో సాగవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల జీవనోపాధిగా మాత్రమే సాగవుతున్నందున ప్రత్యేక కేసుగా పరిగణించి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూనే ఉంది. తాజాగా కేంద్రంపై మరోమారు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. కేరళ రబ్బరుతోటల మాదిరిగా ఏపీలో కాఫీతోటలను ప్రోత్సహించాలి కేరళకు ప్రత్యేకమైన రబ్బరుతోటల సాగుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని కొనసాగిస్తోంది. ఏపీలోని కాఫీతోటల సాగును కూడా ప్రత్యేకంగా పరిగణించి ఉపాధిహామీ వర్తింపజేసి ఏడాదికి 180 రోజుల పనిదినాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పలు రాష్ట్రాల్లో కాఫీని వాణిజ్యపంటగా ఎస్టేట్లలో పండిస్తున్నప్పటికీ ఏపీలోని ఏజెన్సీలో మాత్రం కాఫీసాగు గిరిజనులకు ప్రధాన ఉపాధిగా ఉందని తెలిపింది. కాఫీతోటల పెంపకం వలన అక్కడి గిరిజన కుటంబాల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయని పేర్కొంది. ఏపీకి గర్వకారణమైన అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ను కాపాడేందుకు కేంద్రం సహకరించాలని, ఉపాధిహామీని కొనసాగించడంతోపాటు పనిదినాలు పెంచాలని కోరింది. -
అరకు కాఫీ.. అంతర్జాతీయ ఖ్యాతి!
‘ఓ కప్పు అరకు కాఫీ తాగుదాం డియర్.. ఇండియా నుంచి వచ్చి మన మనసు దోచుకుందంటే నమ్ము.. అరకు కాఫీ లేకుండా రోజు గడవడం లేదోయ్..’ అంటున్నారు ప్రస్తుతం విదేశీయులు. సహజ సిద్ధంగా కుళ్లిన ఆకులు వేసి పెంచిన ఆర్గానిక్ అరకు కాఫీ విదేశాల్లోనూ దూసుకెళ్తోంది. విశాఖ మన్యంలో సాగవుతున్న అరబికా రకం కాఫీ పారిస్‌లో ఇప్పటికే పాగా వేసింది. జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ విక్రయాలు పెరిగి అక్కడి కాఫీ ప్రియులకూ మన కాఫీ నోరూరిస్తూ సత్తా చాటుతోంది. – సాక్షి, విశాఖపట్నం 2017లోనే పారిస్‌లో పాగా ఫ్యాషన్ ప్రపంచ రాజధాని పారిస్‌లోనూ అరకు కాఫీ బ్రాండ్‌తో 2017, ఫిబ్రవరిలోనే కాఫీ షాప్ వెలిసింది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ దీన్ని అక్కడ ఏర్పాటు చేసింది. కాఫీ సాగు విస్తరణలో మనదేశంలో తమిళనాడును వెనక్కినెట్టి కర్ణాటక తర్వాత రెండో స్థానం కోసం కేరళతో పోటీపడుతోంది. విశాఖ మన్యంలో పండించిన కాఫీ గింజలను గిరిజన రైతుల నుంచి వివిధ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇందులో ప్రధానమైంది. నాంది ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 20 వేల ఎకరాల్లో కాఫీ గింజలను పదేళ్లుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. విస్తరణే లక్ష్యంగా ప్రణాళిక కాఫీ తోటలు విస్తరించాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ప్రణాళిక అమలు చేస్తోంది. గత నాలుగేళ్లలో మొత్తం 42 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. వీటిని 2025–26 నాటికి మరో 58 వేల ఎకరాలకు విస్తరించాలనేది లక్ష్యం. ఇందుకోసం చింతపల్లి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. మూడేళ్లపాటు సిల్వర్ ఓక్ చెట్లు పెరిగిన తర్వాత వాటి మధ్య అంతర పంటగా కాఫీ మొక్కలు, మిరియాల పాదులు నాటుకోవడానికి ఐటీడీఏ సహకరిస్తోంది. దేశంలో మూడో స్థానం 2025–26 నాటికి మన్యంలో 2 లక్షల విస్తీర్ణంలో కాఫీ తోటలు విస్తరిస్తే దేశంలోనే 20 వేల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో కర్ణాటక తర్వాత ద్వితీయ స్థానానికి ఏపీ చేరుకుంటుంది. ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుతో తమిళనాడును వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరింది. ఒక మొక్క నుంచి క్లీన్ కాఫీ గింజలు ఏటా కిలో నుంచి 1.20 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఒక మెట్రిక్ టన్ను కాఫీ గింజల ధర ప్రస్తుతం రూ.1.50 లక్షల వరకు ఉంది. విదేశీ ఎగుమతులే కీలకం భారతదేశంలో పండుతున్న కాఫీలో 80 శాతం విదేశాలకే ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో కాఫీ సాగు చేస్తున్నా ఎగుమతుల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. కర్ణాటకలో కార్పొరేట్ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఎకరానికి 225 కిలోలు దిగుబడి వస్తుండగా, విశాఖ మన్యంలో 100 నుంచి 120 కిలోల వరకు వస్తోంది. కాఫీ, అంతరపంటగా మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారని, దీంతో మరో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించే అవకాశం ఉందని పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు రాధాకృష్ణ తెలిపారు. -
అదరహో..అరకు కాఫీ
సాక్షి, విశాఖపట్నం: అరకువ్యాలీ సేంద్రీయ కాఫీ ఘుమఘుమలు ఇక ఉత్తర, ఈశాన్య భారతానికి వ్యాపించనున్నాయి. ఆ దిశగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో అమ్మకాల విస్తరణపైనే జీసీసీ ఎక్కువ దృష్టి సారించింది. కార్పొరేట్ తరహాలో బహుముఖ వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేసింది. అవన్నీ ఓ కొలిక్కిరావడంతో ఇప్పుడు కాఫీ సాగులేని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల మార్కెట్‌పై కన్నేసింది. ఈ ప్రాంతాలకు ప్రస్తుతం కర్ణాటక నుంచే కాఫీ ఎగుమతి అవుతోంది. అక్కడి కాఫీ సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు విరివిగా వాడుతున్నారు. అందుకు భిన్నంగా అరకువ్యాలీ కాఫీ పూర్తిగా సేంద్రీయ విధానంలోనే సాగు అవుతోంది. దీనికి బాగా ఆదరణ లభిస్తోంది. దాంతో అక్కడి వారికి సేంద్రీయ కాఫీ రుచి చూపించడానికి జీసీసీ సన్నద్ధమవుతోంది. ఢిల్లీలో జీసీసీ విక్రయ కేంద్రం.. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద జీసీసీ ఇప్పటికే కాఫీ షాప్‌ను ఏర్పాటు చేసి కాఫీని విక్రయిస్తోంది. ఇకపై వివిధ రకాల సేంద్రీయ అటవీ ఉత్పత్తుల అమ్మకానికి కార్పొరేట్ స్థాయిలో విక్రయశాలను ఏపీ భవన్ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయనుంది. అలాగే జీసీసీ ఉత్పత్తులను మార్కెటింగ్‌కు వీలుగా న్యూఢిల్లీలోని పూసా వద్ద ఒక గోదాంను కేటాయించడానికి ట్రైబల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక విమానాశ్రయాల్లో, రైల్వేస్టేషన్లలో జీసీసీ ఉత్పత్తుల విక్రయశాలలు, కాఫీ షాప్‌ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ టి. బాబూరావునాయుడు గత నెలలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాకు వినతిపత్రం సమర్పించారు. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చిందని, త్వరలోనే జీసీసీ వ్యాపార విస్తరణ సాకారమవుతుందని బాబూరావునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మన్యం పంటలతో ప్రస్థానం.. విశాఖ జిల్లాలోని 11 మండలాల్లో విస్తరించిన మన్యం ఎన్నో ఆహార, ఔషధ పంటలకు పుట్టినిల్లు. పసుపు, శీకాకాయలు, కుంకుడుకాయలు, చింతపండు, ఉసిరికాయలు, కరక్కాయలు, రాజ్మా, బొబ్బర్లు, మిరప, జీడిమామిడి... ఇలా ఒకటి కాదు దాదాపు ఇరవైకి పైగా పంటలు విస్తారంగా పండుతాయి. కాఫీ సాగు ఏటా విస్తరిస్తోంది. అరకువ్యాలీ కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ అయింది. మన్యంలో ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నప్పటికీ 70 వేల ఎకరాల్లో ఏటా 8 వేల నుంచి పది వేల టన్నుల వరకూ కాఫీ గింజల దిగుబడి వస్తోంది. సముద్రమట్టానికి 1,500 నుంచి మూడు వేల మీటర్ల ఎత్తున ఉన్న మన్యంలో సారవంతమైన ఏటవాలు ప్రాంతమంతా కాఫీ సాగుకు అనుకూలంగా ఉంది. సిల్వర్ ఓక్ చెట్ల మధ్య కాఫీతో పాటు మిరియాల సాగును అంతరపంటగా వేస్తున్నారు. ఇది లాభసాటిగా ఉండటంతో దాదాపు 93 వేల మంది రైతులు కాఫీ సాగు చేస్తున్నారు. వారి నుంచి కాఫీ గింజలను సేకరిస్తున్న జీసీసీ ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ చేయిస్తోంది. ఈ రెండు ప్రక్రియలనూ విశాఖలోనే చేసేలా ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్ మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు జీసీసీ ఎండీ బాబూరావునాయుడు తెలిపారు. సహకార వ్యాపారం.. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలతో సహకార వ్యాపారానికి జీసీసీ తెరతీసింది. జార్ఖండ్‌లో కాఫీ సాగు లేదు. కానీ తేనె విరివిగా దొరుకుతోంది. ఆ రాష్ట్రంలో జీసీసీ కాఫీ వ్యాపారం చేస్తూ మరోవైపు తేనెను కొనుగోలు చేస్తుంది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో 40 శాతం అటవీ ప్రాంతమే. అక్కడ జీడిమామిడి సేంద్రీయ విధానంలో సాగవుతోంది. అక్కడ జీడిపప్పును జీసీసీ మార్కెటింగ్ చేయనుంది. -
ఓ మంచి ఆర్గానిక్ కాఫీ..!
సాక్షి, విశాఖపట్నం: ఫిల్టర్ కాఫీ... కోల్డ్ కాఫీ... గ్రీన్ కాఫీ... ఇలా పేరు ఏదైనా భిన్నమైన రుచుల్లో ఒక మంచి ఆర్గానిక్ కాఫీని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) రుచి చూపించనుంది. ఇప్పటివరకూ ఆర్గానిక్ కాఫీ పొడిని మాత్రమే వినియోగదారులకు అందించిన జీసీసీ... ఇప్పుడు చక్కని ఆర్గానిక్ కాఫీని అందించనుంది. ఇందుకోసం బీచ్రోడ్డులోనున్న కేంద్ర కార్యాలయం పక్కనే కాఫీ షాప్‌ను ఏర్పాటు చేశారు. ఇది కేవలం షాప్ మాత్రమే కాదు ట్రైనింగ్ సెంటర్గానూ, భిన్నమైన కాఫీ రుచులకు డెమో కేంద్రంగానూ పనిచేయనుంది. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లోనూ జీసీసీ ఏర్పాటు చేయనున్న కాఫీ షాపులను నిర్వహించడానికి అవసరమైన శిక్షణనూ యువతకు ఇక్కడ ఇవ్వనున్నారు. ఇక్కడికొచ్చే కాఫీ ప్రియుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇంకెలాంటి రుచులు కావాలి? ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? తదితర విషయాలన్నీ ఇక్కడ సిబ్బంది అడిగి తెలుసుకుంటున్నారు. ఇది క్వాలిటీ కంట్రోల్ సెంటర్గానూ పనిచేయనుంది. ఈ కాఫీ షాప్ ఏర్పాటు, నిర్వహణలో టెనేగర్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తోంది. అరకు వ్యాలీలోనూ మరొకటి... జీసీసీ కేంద్ర కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన కాఫీ షాప్ ఒక బ్రాండింగ్ మోడల్‌గా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే మాదిరిగా పర్యాటక కేంద్రమైన అరకువ్యాలీలోనూ మరో షాప్ ఏర్పాటు చేయనున్నాం. ఈ కాఫీని అందించే అరబికా మొక్క పేరునే ఈ షాప్‌కు పెట్టాం. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా హట్ పేరును, రాష్ట్ర పర్యాటక రంగానికే తలమానికంగానే గాక కాఫీ సాగుకు కేంద్రంగా ఉన్న అరకువ్యాలీ పేరును జోడించాం. జీసీసీ ప్రతిష్టను పెంచడంతో పాటు గిరిజన యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ షాప్‌ను నిర్వహించనున్నాం. – టి.బాబూరావునాయుడు, జీసీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ -
జీసీసీతో వాల్‌మార్ట్ ఎంవోయూ
అరకు కాఫీ కొనుగోలుకు ఒప్పందం * నెలాఖరుకు కుదిరే అవకాశం * ఏటా రూ.కోటి వ్యాపారం సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మరో ముందడుగు వేయబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత వాల్‌మార్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనుంది. రుచిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అరకు కాఫీ కొనుగోలుకు వాల్‌మార్ట్ ఆసక్తిగా ఉంది. గత డిసెంబర్ 13న అరకు కాఫీ మార్కెట్లోకి విడుదలైంది. ఆ తర్వాత జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లలో అరకు కాఫీకి ప్రాచుర్యం లభించింది. సీఐఐ అంతర్జాతీయ సదస్సులో జీసీసీ అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. సదస్సుకు వచ్చిన ముఖ్యమంత్రితో పాటు విదేశీ ప్రతినిధులు ఈ కాఫీ రుచి చూశారు. ఫిబ్రవరిలో జరిగిన ఐఎఫ్ఆర్కూ ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ఆర్ విలేజిలో జీసీసీకి స్టాల్ కేటాయించారు. అందులో అరకు కాఫీని సేవించిన ప్రధాని నరేంద్రమోదీ క్యా టేస్ట్హై అంటూ మెచ్చుకున్నారు. ఐఎఫ్ఆర్ జరిగిన నాలుగు రోజుల్లోనూ సుమారు పది వేల కాఫీలు అమ్ముడయ్యాయి. ఇలా సీఐఐ సదస్సు, ఐఎఫ్ఆర్ల్లో రూ.20 లక్షల విలువైన కాఫీ పొడి, రూ.5 లక్షల విలువైన లిక్విడ్ కాఫీ అమ్మకాలు విశాఖలోనే జరిగాయి. మరోవైపు ఆన్లైన్ మార్కెట్లోనూ అరకు కాఫీ అందుబాటులో ఉంది. గిఫ్ట్ ప్యాక్లుగా..: అరకు కాఫీ.. గిఫ్ట్ ప్యాక్‌ల రూపంలోనూ ప్రముఖులకు అందజేస్తున్నారు. ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో పాటు ఆయనతో వచ్చిన అమెరికా ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టక్కర్, బొబ్బిలి వీణతో కలిపి అరకు కాఫీని గిఫ్ట్ ప్యాకెట్లుగా ఇచ్చారు. నెలాఖరుకల్లా ఎంవోయూ ఇటీవల వాల్‌మార్ట్ వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్‌తో జీసీసీ చర్చలు జరిపింది. కొద్దిరోజుల క్రితం వాల్‌మార్ట్ సంస్థ క్వాలిటీ కంట్రోల్ బృందం వచ్చి కాఫీ నాణ్యతను పరిశీలించి వెళ్లింది. నెలాఖరు నాటికి వాల్‌మార్ట్‌తో ఎంవోయూ కుదరవచ్చని జీసీసీ ఎండీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. వాల్‌మార్ట్‌కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఔట్లెట్లు ఉన్నాయన్నారు. వాల్‌మార్ట్‌కు ఏటా రూ.కోటి రూపాయల విలువైన అరకు కాఫీని సరఫరా చేసే అవకాశం ఉందని, డిమాం డ్‌ను బట్టి మరింత పెంచుతామని తెలిపారు.