
తెలుగులో వరుస సినిమాలతో మెప్పించిన కన్నడ బ్యూటీ శ్రీలీల. గతేడాది భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది గుంటూరు కారంతో అలరించిన ముద్దుగుమ్మ.. నితిన్ సరసన రాబిన్‌హుడ్ చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్‌లోనూ నటిస్తోంది. వీటితో పాటు ఓ బాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పినా భామ.. ఇటీవల ఆ మూవీ నుంచి తప్పుకుంది.
ప్రస్తుతం శ్రీలీల తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడులో అరకులో ఫ్యామిలీతో కలిసి కనిపించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్‌లో కనిపించింది. సామాన్యురాలిగా టీ తాగుతూ సందడి చేసింది. ఆమెను గమనించిన స్థానికులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు శ్రీలీల క్రేజీ హీరోయిన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
#TFNExclusive: The charming beauty @sreeleela14 snapped along with her family as she enjoys a tea break at Araku!!☕😍#Sreeleela #UstaadBhagatSingh #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/zNFABqBY3P
— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2024
Comments
Please login to add a commentAdd a comment