పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. బలమైన కారణం ఉందన్న శ్రీలీల! | Heroine Sreeleela Comments About Pushpa 2 Movie Kissik Song | Sakshi
Sakshi News home page

Sreeleela: పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. బలమైన కారణం ఉందన్న శ్రీలీల!

Published Wed, Nov 27 2024 1:18 PM | Last Updated on Wed, Nov 27 2024 3:14 PM

Heroine Sreeleela Comments About Pushpa 2 Movie Kissik Song

ప్రస్తుతం అందరిచూపు పుష్ప-2 ది రూల్‌పైనే ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. అయితే సినిమా రిలీజ్‌కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌ జోరు పెంచారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో కిస్సిక్‌ సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాటకు శ్రీలీల తన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే ‍అత్యధిక వ్యూస్‌తో రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

అయితే ఈ సాంగ్ చేయడం వెనక బలమైన కారణం ఉందని హీరోయిన్ శ్రీలీల అన్నారు. రాబిన్‌హుడ్‌ మూవీ ప్రెస్‌మీట్‌లో కిస్సిక్ సాంగ్‌ చేయడం గురించి మాట్లాడారు. ఇది యావరేజ్ ఐటమ్ సాంగ్ కాదన్నారు. గతంలో ఎన్నో సినిమాలకు ఐటమ్ సాంగ్‌ చేయమని అడిగారు. కానీ ఇ‍ప్పటివరకు నేను చేయలేదు..ఈ సాంగ్ చేయడానికి స్ట్రాంగ్ రీజన్ ఉందని శ్రీలీల అన్నారు. పుష్ప-2 రిలీజైనప్పుడు అదేంటో మీకే తెలుస్తుందని శ్రీలీల పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలీల.. నితిన్ సరసన రాబిన్‌ హుడ్‌ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా.. అల్లు అ‍ర్జున్‌- సుకుమార్‌ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్‌ 4న విడుదల కానుంది. ఈ మూవీ రష్మిక మందన్నా శ్రీవల్లిగా అలరించనుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి టాలీవుడ్ ప్రియులను మెప్పించనున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement