పుష్ప 2: శ్రీలీల ఐటం సాంగ్‌ వచ్చేది ఆ రోజే.. | Pushpa 2: Sreeleela Kissik Song Release Date and Time Details | Sakshi
Sakshi News home page

Pushpa 2: శ్రీలీల ఐటం సాంగ్‌ 'కిస్సిక్‌' రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Thu, Nov 21 2024 7:11 PM | Last Updated on Thu, Nov 21 2024 7:28 PM

Pushpa 2: Sreeleela Kissik Song Release Date and Time Details

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమాలో 'ఊ అంటావా మావా..' సాంగ్‌ ఓ రేంజ్‌లో హిట్టయింది. ఈ ఐటం సాంగ్‌లో సమంత తన స్టెప్పులతో, హావభావాలతో అదరగొట్టేసింది. ఈసారి ఆ జోష్‌ ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2లో మరో ఐటం సాంగ్‌ ప్లాన్‌ చేశారు. సమంత స్థానంలో డ్యాన్స్‌ క్వీన్‌ శ్రీలీలను తీసుకున్నారు.

తాజాగా ఈ సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. కిస్సిక్‌ పేరుతో రానున్న ఈ పాట నవంబర్‌ 24న రాత్రి 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. అందులో బన్నీ నడుముపై శ్రీలీల వయ్యారంగా వాలింది. 

పోస్టరే ఇలా ఉంటే పాట ఇంకెంత బాగుంటుందో అని ఫ్యాన్స్‌ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సాంగ్‌ కోసం శ్రీలీల రూ.2 కోట్ల పారితోషికం తీసుకుందని ఫిల్మీదునియాలో టాక్‌! ఇకపోతే సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2: ద రూల్‌ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement