కిస్సిక్‌ సాంగ్‌పై సమంత రివ్యూ | Samantha Reviews Kissik Song Performance by Sreeleela | Sakshi
Sakshi News home page

కిస్సిక్‌ సాంగ్‌.. రివ్యూ ఇచ్చిన సమంత

Published Mon, Nov 25 2024 8:38 PM | Last Updated on Wed, Nov 27 2024 3:06 PM

Samantha Reviews Kissik Song Performance by Sreeleela

ఊ అంటావా మామ.. కిస్సిక్‌ అంటావా మావా.. సోషల్‌ మీడియా అంతటా ఇదే చర్చ! పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావ ఐటం సాంగ్‌ ఏ రేంజ్‌లో హిట్టయిందో తెలిసిందే! ఆమె అందం, స్టెప్పులు చూసి యూత్‌ ఫిదా అయ్యారు. ఏ ఫంక్షన్‌లో అయినా ఆ పాట మార్మోగుతూనే ఉంది. 

అప్పుడు సమంత.. ఇప్పుడు శ్రీలీల
ఇక పుష్ప 2లో కూడా ఐటం సాంగ్‌ ఉందని, కాకపోతే ఈసారి సమంతకు బదులుగా శ్రీలీల రంగంలోకి దిగిందని ప్రచారం మొదలైనప్పటినుంచి అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. అసలే యంగ్‌ సెన్సేషన్‌, అందులోనూ డ్యాన్సింగ్‌ క్వీన్‌.. ఇంకేముంది.. బన్నీ ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌కు శ్రీలీల కరెక్ట్‌ మ్యాచ్‌ అనుకున్నారంతా! కిస్సిక్‌ పాట రిలీజ్‌ కాగానే ఎగబడి చూశారు. 

కిస్సిక్‌ అదిరిందన్న సామ్‌
ఈ క్రమంలోనే పలువురూ పుష్ప 1 ఐటం సాంగే బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ఫుల్‌ వీడియో వస్తే కానీ శ్రీలీల పర్ఫామెన్స్‌కు ఇప్పుడప్పుడే మార్కులు ఇవ్వలేమంటున్నారు. ఈ కిస్సిక్‌ లిరికల్‌ సాంగ్‌ వీక్షించిన సామ్‌ సోషల్‌ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చింది. శ్రీలీల చంపేసిందంటూ ఫైర్‌ ఎమోజీలను షేర్‌ చేసింది. పుష్ప 2 ఆగమనం కోసం ఎదురుచూడండి అని రాసుకొచ్చింది. ఇకపోతే అల్లు అర్జున్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement