'పుష్ప2'లో డ్యాన్సింగ్‌ క్వీన్‌.. పోస్టర్‌తో అధికారిక ప్రకటన | Sreeleela Dance With Allu Arjun In Pushpa 2 Movie | Sakshi
Sakshi News home page

'పుష్ప2'లో డ్యాన్సింగ్‌ క్వీన్‌.. పోస్టర్‌తో అధికారిక ప్రకటన

Published Sun, Nov 10 2024 4:33 PM | Last Updated on Sun, Nov 10 2024 4:58 PM

Sreeleela Dance With Allu Arjun In Pushpa 2 Movie

అల్లు అర్జున్‌-  సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప ది రూల్‌'. భారీ అంచనాలతో డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.  2021లో విడుదలైన 'పుష్ప ది రైజ్‌' సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న  ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ను తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. 'పుష్ప 2' ‍ప్రాజెక్ట్‌లో శ్రీలీల భాగం కానున్నారని అధికారికంగా సోషల్‌మీడియాలో ప్రకటించారు.

డ్యాన్స్‌ అంటే శ్రీలీల, శ్రీలీల అంటే డ్యాన్స్‌ అన్నట్టుగా హీరోలకి దీటుగా స్టెప్పులేస్తుంది శ్రీలీల.. ఇప్పుడు తన సత్తా  ఎంటో మరోసారి ప్రేక్షకులకు చూపించే సమయం వచ్చేసింది. పుష్ప2  సినిమా కోసం ఒక ప్రత్యేకమైన సాంగ్‌కు అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల స్టెప్పులేయనుంది. ఈ క్రమంలో డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల అంటూ పోస్టర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు. మూడేళ్ల క్రితం 'ఊ అంటావా మావ' పాటకు స్టెప్పులేసిన సమంత ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పుడా ఛాన్స్‌ శ్రీలీలకు దక్కింది.

 శ్రీలీలతో డ్యాన్స్‌ అంటే తాట తెగిపోతుంది: ప్రముఖ హీరో
శ్రీలీల గ్లామర్‌తో పాటు తన డ్యాన్స్‌కు కూడా భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆమె పక్కన హీరోలు డ్యాన్స్‌ చేయడం అంటే అంత తేలిక కాదని చెప్పవచ్చు. అయితే, ఆమెకు డ్యాన్స్‌ పార్ట్నర్‌గా సరైనోడు దొరికితే థియేటర్లు బద్దలుకావాల్సిందే. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. వెండితెరపై బన్నీ డ్యాన్స్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వినూత్నంగా కొత్త స్టెప్పులు వేసేందుకు ఆయన చాలా కష్టపడుతారనే పేరుంది. 

ఇప్పుడు వీరిద్దరూ కలిసి పుష్ప కోసం ఒక పాటలో కనిపించనున్నారు. దీంతో థియేటర్స్‌లో రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమని చెప్పవచ్చు. ఓ ఇంటర్వ్యూలో మహేశ్‌ బాబు మాట్లాడుతూ.. శ్రీలీలతో డ్యాన్స్‌ చేయడం అంటే అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. 'శ్రీలీల పక్కన డ్యాన్స్‌ చేయడం అంటే తాట తెగిపోతుంది' అని ఆయన కామెంట్‌ చేశారు.  ఇప్పుడు బన్నీ-శ్రీలీల డ్యాన్స్‌ చూస్తే.. కళ్లు చెదిరిపోయాయి వర్మ అని ప్రేక్షకులు అంటారేమో చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement