అల్లు అర్జున్‌ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది | Allu Arjun Pushpa 2 The Rule Movie Item Song Kissik Out Now, Watch Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Pushpa 2 Kissik Song: అల్లు అర్జున్‌ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్‌ సాంగ్ వచ్చేసింది

Published Sun, Nov 24 2024 7:10 PM | Last Updated on Mon, Nov 25 2024 4:03 PM

Allu Arjun Pushpa 2 The Rule Item Song Kissik Out Now

ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప పేరే వినిపిస్తోంది. ఇటీవల పుష్ప-2 ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. మూవీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ రోజులు లెక్క పెడుతున్నారు ఫ్యాన్స్‌. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇదిలా ఉండగా పుష్ప-2 రిలీజ్‌కు కేవలం పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో పుష్ప-2 లోని కిస్సిక్ ఐటమ్‌ సాంగ్‌ విడుదల చేశారు. కిస్సిక్‌ పేరుతో తెరకెక్కించిన ఈ పాటకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ శ్రీలీల.. బన్నీతో కలిసి స్టెప్పులేసింది. చెన్నైలోని  లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్‌లో లిరికల్ ఐటమ్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

కాగా.. పార్ట్-1లో ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అనే ఐటమ్ సాంగ్ సినీ ప్రియులను ఓ ఊపు ఊపేసింది. పుష్పలో ఈ పాటకు సమంత తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. పుష్ప-2లో కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల తన స్టెప్పులతో ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా మరోసారి రష్మిక మందన్నా ఫ్యాన్స్‌ను అలరించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement