stall
-
కేటీఆర్ వర్సెస్ కలెక్టర్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యహరించే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కొన్నిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. భూకబ్జాలు, అనుమతిలేని వాణిజ్య సముదాయాలు, వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో వింతేమీలేదు. అయితే.. బాధితులంతా తాము కేటీఆర్ అనుచరులం, బీఆర్ఎస్ నాయకులం కాబట్టే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల కేటీఆర్ సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా కలెక్టర్‌ను సన్నాసి.. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి తమపై కలెక్టర్ దాడులు చేయిస్తున్నాడని కేటీఆర్ అనుచరులు ఆరోపిస్తుండగా..తనపని తానుచేసుకుంటున్నానే తప్ప.. ఎలాంటి ప్రతీకారాలకు వెళ్లాల్సిన అవసరం లేదని కలెక్టర్ సమాధానమిస్తున్నారు. అయితే ఈ వ్యవహారమంతా ఇప్పుడు రాజ కీయరంగు పులుముకుంటోంది. కలెక్టర్ సందీప్కుమార్ఝాపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా బీఆర్ఎస్ నాయకులు సీఎస్ శాంతికుమారిని కలవడంతో వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది.కేటీఆర్ అనుచరులు ఏమంటున్నారు? టీస్టాల్ వద్ద కేటీఆర్ బొమ్మ ఉన్న కారణంగా ఈనెల 19న దాన్ని తరలించారు. టీస్టాల్ యజమానికి బత్తుల శ్రీనివాస్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారు. కేవలం తమనాయకుడి బొమ్మ పెట్టుకున్నాడన్న అక్కసుతో బీదవాడిపై ప్రతాపం చూపించారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని ఇటీవల కలెక్టర్ సీజ్ చేయించారు. విషయం తెలుసుకున్న పాడిరైతులు ఆందోళనకు దిగారు. డెయిరీ నిర్వాహకులు బీఆర్ఎస్, కేటీఆర్‌కు మద్దతుదారులన్న కారణంతోనే సీజ్‌చేశారని ఆరోపించారు. కలెక్టర్ తీరుపై తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన అనిల్‌రెడ్డి (గతంలో కేఏపాల్ మీద దాడిచేసిన వ్యక్తి) సందీప్‌కుమార్ ఝా మీద కేసులున్నాయని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. అతను పోలీసులకు చిక్కకపోవడంతో అతని చిన్నాన్న అబ్బాడి రాజిరెడ్డి 30 గుంటల స్థలం కబ్జాచేశాడని పోలీసులు అరెస్టు చేశారు. రాజిరెడ్డి మూగవాడన్న కనికరం లేకుండా పట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాల్లో నిబంధనలకు తూట్లు పొడిచారు. కౌన్సెలింగ్ లేకుండానే కలెక్టర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. నిబంధలనకు విరుద్ధమని చెప్పిన డీఈవోను కలెక్టర్ బెదిరించారు. ఉంటే ఉండు లేకుంటే లీవులో వెళ్లంటూ హెచ్చరించారు.ఆరోపణలపై కలెక్టర్ ఏమన్నారంటే.. సిరిసిల్లలో పబ్లిక్ ప్రాంతాన్ని టీస్టాల్ యజమాని ఆక్రమించి నడుపుతున్నాడు. పైగాఅతనికి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేదు. అతను ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా ఉన్న అగ్రహారం డెయిరీ లైసెన్స్ లేకుండా నడుస్తోంది. దా నికి ఫైర్ సేఫ్టీ లైసెన్స్, ల్యాండ్ కన్వర్షన్, బిల్డింగ్ పర్మిషన్, పర్యావరణ అనుమతులు లేవు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో సర్వే నెంబరు 1,183లోని స్థలాన్ని రాజిరెడ్డికి ప్రభుత్వం అసైన్ చేయలేదు. 2018లో ప్రభుత్వ రికార్డులను ట్యాంపరింగ్ చేసి తనపేరిట మార్చుకున్నాడు. ఇది అవినీతి వ్యవహారం. వాస్తవానికి జగన్మోహన్రెడ్డి విధులపై అంకితభావం లేదు. నాకు తెలియకుండా డీఈవో ఆర్డర్స్ ఇచ్చారు. అదేంటని అడిగితే.. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని సమాధానమిచ్చాడు. జిల్లా సర్వశిక్షాభియాన్ చైర్మన్‌గా నేను ఉండగా.. వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడం, పైగా ఆ ఆదేశాలు నేను ఇచ్చానని ప్రచారం చేయడం ఎంతమేరకు సమంజసం?నిజాయితీకి దక్కిన బహుమానంనేను ఎవరినీ టార్గెట్ చేయలేదు. నాకెలాంటి రాజకీయ కక్షలేదు. అందరూ సమానమే. నాపని నేను చేసుకుంటూ పోతున్న. అవినీతి, అక్రమార్కుల విషయంలో అధికారులు కూడా వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు. ఇంతకాలం వారికి ఎలాంటి ఆటంకాలు కలగలేదు. కానీ.. మేము అక్రమాలపై చర్యలు తీసుకుంటుంటే కొందరు దుబాయ్ వేదికగా సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇది నా నిజాయతీకి దక్కిన బహుమానం.– సందీప్‌కుమార్ ఝా,కలెక్టర్, రాజన్న సిరిసిల్ల -
యంగ్ హీరోయిన్ సింప్లీసిటీ.. రోడ్డు పక్కన టీ తాగిన ముద్దుగుమ్మ!
తెలుగులో వరుస సినిమాలతో మెప్పించిన కన్నడ బ్యూటీ శ్రీలీల. గతేడాది భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది గుంటూరు కారంతో అలరించిన ముద్దుగుమ్మ.. నితిన్ సరసన రాబిన్‌హుడ్ చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్లోనూ నటిస్తోంది. వీటితో పాటు ఓ బాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పినా భామ.. ఇటీవల ఆ మూవీ నుంచి తప్పుకుంది.ప్రస్తుతం శ్రీలీల తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడులో అరకులో ఫ్యామిలీతో కలిసి కనిపించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్లో కనిపించింది. సామాన్యురాలిగా టీ తాగుతూ సందడి చేసింది. ఆమెను గమనించిన స్థానికులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు శ్రీలీల క్రేజీ హీరోయిన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. #TFNExclusive: The charming beauty @sreeleela14 snapped along with her family as she enjoys a tea break at Araku!!☕😍#Sreeleela #UstaadBhagatSingh #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/zNFABqBY3P— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2024 -
మేడం వచ్చాకే రిబ్బన్ కటింగ్
సాక్షి టాస్క్‌పోర్స్: టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి గారి భార్య మొన్న కారులో కూర్చొని పోలీసు అధికారులను హడలెత్తించిన దృశ్యం చూశాం. ఇప్పుడు అదే కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే గారి భర్త రైతు బజారులో ఓ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించారు. మేడం వస్తే కానీ రిబ్బన్ కటింగ్ జరగకూడదంటూ స్వయంగా కలెక్టర్‌కే హుకుం జారీ చేసి కూటమి నేతల విపరీత ధోరణిని మరోసారి బయట పెట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..తక్కువ ధరలతో కందిపప్పు, బియ్యాన్ని వినియోగదారులకు అందించేందుకు పౌర సరఫరాల శాఖ కడప రైతు బజార్లో ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ఉదయం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ స్టాల్ ఓపెనింగ్‌కు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జేసీ గణేష్‌కుమార్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కడప ఆర్డీవో, డీఎస్వోలతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులంతా ఉదయం 9.30 గంటలకే కడప రైతు బజార్‌కు చేరుకున్నారు. మరో 10 నిమిషాల్లో కలెక్టర్, జేసీ వచ్చి స్టాల్‌ను ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. ఇంతలోనే కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి రంగప్రవేశం చేశారు. ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతు బజార్లో స్టాల్‌ను ఓపెనింగ్ చేయవద్దని హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే మేడం హైదరాబాదులో ఉన్నారని, ఆవిడ శుక్రవారం వచ్చి ప్రారంభిస్తారని చెప్పారు. దీంతో కలెక్టర్ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు. ఆ వెంటనే రైతు బజార్ సిబ్బంది ప్రారంభోత్సవం బ్యానర్లు, రిబ్బన్లు తొలగించారు. శుక్రవారంనాటి ప్రారంభోత్సవానికి మళ్లీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ స్టాల్ గురించి అధికారులు ముందుగానే ఎమ్మెల్యే మాధవీరెడ్డికి తెలిపి, ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే తనకు వీలు కాదని, కలెక్టర్‌తో ఓపెనింగ్ చేయించుకోండని ఆమె చెప్పారని తెలిసింది. తీరా అన్ని ఏర్పాట్లు చేశాక చివరి నిమిషంలో ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించడంతో ఇదేమి ధోరణి అని అధికారులు, వినియోగదారులు ముక్కున వేలేసుకున్నారు. -
కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!
మన భారతీయ ఫుడ్ స్టాల్ దాయాది దేశమైన పాక్‌లో ఉంటే ఎవ్వరికైనా గర్వంగా ఉంటుంది. మాటిమాటికీ ఏదో ఒక విషయమైన మనతో కాలుదువ్వే దేశంలో సగర్వంగా ఓ భారతీయురాలు ఫుడ్ స్టాల్ నడుపుతూ..అక్కడ పాకిస్తానీయులకు మన భారతీయ వంటకాలను రుచి చూపుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భారత్‌కు చెందిన కవితా దీదీ ఈ ఫుడ్ స్టాల్‌ని నడుపుతున్నట్లు కనిపించిది. ఈ స్టాల్ శాకాహారం, మాంసాహారం రెండింటిని అందిస్తుంది. ఓ పాకిస్తానీ బ్లాగార్ ఆమె ఫుడ్ స్టాల్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఆమె ఫుడ్ స్టాల్ గురించి వివరించాడు. ఆ వీడియోలో అతడు కవిత ఆమె కుటుంబం అందిస్తున్న రుచికరమైన ఆహారాన్ని హైలెట్ చేశారు. ముంబైలో వడపావ్ ఫేమస్. ఇప్పుడూ కరాచీ వాసులు కూడా ఈ భారతీయ వంటకాన్ని ఇష్టపడుతున్నారని కవిత చెబుతున్నారు. ఇక ఈ పాకిస్తాన్ బ్లాగర్ కూడా ఆ వంటకాన్ని రుచి చూసి మెచ్చుకున్నారు. ఇక్కడ కరాచీ ఆహార ప్రియులు తనను కవితా దీదీ అని అప్యాయంగా పిలుస్తారని కవితా ఆ వీడియో పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో తమ స్టాల్‌ని నడపమని చెప్పడంతో ఖాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇతర దేశాల్లోని మతాల పట్ల కనబర్చిన గౌరవం అంకితభావానికి బ్లాగర్ ఖాన్ చాలా ఫిదా అయ్యారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం మా సోదరికి పాకిస్తానీయులందరూ మద్దతు ఇవ్వాలి అని రాశారు. మరొకరు పాక్‌లో భారతీయ వంటకానికి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karamat Khan (@karamatkhan_05) (చదవండి: వందేళ్లకు పైగా జీవించిన వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్‌తో యూస్ ఉండదట!) -
రజనీ చాయ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక్కోసారి విసుగుపుట్టి హిమాలయాలకు వెళుతుంటారు. ఈసారి కొచ్చిన్‌లో టీ అమ్ముకుంటున్నారా? అవుననే కొంతమంది కంగారు పడ్డారు. తీరా చూస్తే ‘దక్కేది దక్కకుండా పోదు... దక్కనిది ఎప్పటికీ దక్కదు’ అని డైలాగ్ కొడుతూ తనకు దక్కిన టీ స్టాల్‌ను నడుపుకుంటున్న ఓ వ్యక్తి... ఇంకేముంది... నెట్లో హల్చల్. కొచ్చిన్‌లో ఏదో షూటింగ్ కోసం వెళ్లిన సినిమా యూనిట్ వారు అతణ్ణి చూసి ఆగిపోయారు. రజనీకాంత్! టీ అమ్ముతూ. రజనీకాంత్ సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడని అందరికీ తెలుసు. కొంపదీసి టీ అమ్ముతున్నాడా? పరిశీలించి చూశారు. కాదు. రజనీకాంత్లానే ఉన్నాడు. పలకరిస్తే అచ్చు రజనీకాంత్లానే నవ్వుతున్నాడు. పేరు సుధాకర్ ప్రభు. ఫోర్ట్ కొచ్చిన్ పట్టాలం రోడ్డులో ‘వెంకటేశ్వర హోటల్’ అనే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ నడుపుతున్నాడు. లెమన్ టీ చేయడంలో దిట్ట. మొన్న మొన్నటి వరకూ ఎవరూ అతణ్ణి రజనీకాంత్‌తో పోల్చలేదు కాని ఈ మధ్య గెడ్డానికి రంగేయడం మాని, కళ్లద్దాలు మార్చేసరికి అచ్చు రజనీ గెటప్‌లోకి వచ్చేశాడు. నాదిర్షా అనే మలయాళం డైరెక్టర్ ఇతణ్ణి ఫేస్బుక్లో పెట్టేసరికి వైరల్ అయ్యాడు. అప్పటినుంచి ఇతని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేరళలో ఇతణ్ణి ఫంక్షన్స్‌కు కూడా ఆహ్వానిస్తున్నారు. ‘మా పిల్లలు పెద్దగా పట్టించుకోరుగాని నేను రజనీ అన్ని సినిమాలు చూస్తుంటా’ అంటాడు. ఈ పాపులారిటీ పెరిగి అతని హోటల్‌కు కస్టమర్లు పెరిగితే అదే పది ప్లేట్లు. -
జెనీవా ఇంటర్నేషనల్ వేదికపై ఏపీ విద్యా విధానం స్టాల్
-
వైరల్ చాయ్వాలీ ప్రియాంక.. దుకాణం బంద్!
పాట్నా: నిరుద్యోగంపై ఎదురు తిరిగి.. చివరకు సొంతంగా చాయ్ దుకాణం పెట్టిన ప్రియాంక కథ.. ఇంటర్నెట్లో ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. రెండేళ్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంతంగా ఆమె టీ స్టాల్ పెట్టుకుని.. గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇప్పుడామె ఆ స్టాల్‌ను మూసేసింది. ఆగండి.. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. బీహార్ పాట్నాలో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్ నడిపిస్తోంది ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. ఎప్పుడూ చాయ్‌వాలా కథనాలేనా? అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్ ఓపెన్ చేసింది. ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. అయితే ఈ గ్రాడ్యుయేట్ చాయ్వాలీ కథనం.. ఓ వ్యక్తిని కదిలించిందట. అందుకే ప్రియాంక తన బిజినెస్‌ను విస్తరించుకునేందుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రియాంకకు ఫుడ్ ట్రక్‌ను అందించారు. దీంతో టీ స్టాల్‌ను ఎత్తేసిన ప్రియాంక.. ఫుడ్ ట్రక్‌ను కొందరు స్టాఫ్‌తో కలిసి నడిపిస్తోంది. తక్కువ టైంలో ఎదిగిన ఆమె కథతో సోషల్ మీడియా పవరేంటో మరోసారి నిరూపితమైంది. Bihar: Priyanka Gupta, an economics graduate sets up a tea stall near Women's College in Patna I did my UG in 2019 but was unable to get a job in the last 2 yrs. I took inspiration from Prafull Billore. There are many chaiwallas, why can't there be a chaiwali?, she says pic.twitter.com/8jfgwX4vSK — ANI (@ANI) April 19, 2022 -
చాయ్వాలీ ప్రియాంక: రెండేళ్ల ప్రయత్నాల తర్వాత..
ఎంతసేపు.. ప్రభుత్వాలు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని విమర్శించే బదులు.. స్వతహాగా ఏదో ఒక పనిలో దిగిపోవడం ఉత్తమమని సలహా ఇస్తోంది ప్రియాంక. రెండేళ్లపాటు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆమె అది ఫలించకపోవడంతో టీ దుకాణం తెరిచింది. బీహార్ పాట్నాలో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్ నడిపిస్తోంది ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. ఎప్పుడూ చాయ్‌వాలా కథనాలేనా? అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్ ఓపెన్ చేసింది. ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. రెగ్యులర్ టీతో పాటు పాన్, మసాలా, చాక్లెట్ టీ, బిస్కెట్లు అమ్ముతోందామె. అంతేకాదు అక్కడ బ్యానర్ల మీద స్ఫూర్తినిచ్చే ఎన్నో కొటేషన్లు సైతం ఉంచింది. -
Tuktuki Das: ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ
ఎం.ఏ ఇంగ్లిష్ చదివిన అమ్మాయిలు టీచర్ అవుతారు. లెక్చరర్లు కావాలని ప్రయత్నిస్తారు. ప్రయివేటు ఉద్యోగాలు అన్వేషిస్తారు. కాని టుక్టుకీ దాస్ అలా కాదు. ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ పేరుతో టీకొట్టు తెరిచింది. నేను ఉపాధి వెతుక్కోవడం కాదు. వ్యాపార రంగంలో ఎదిగి నలుగురికీ ఉపాధి ఇస్తాను అంటోంది. కుతూహలం రేపుతున్న ఈ పోస్ట్‌గ్రాడ్యుయేట్ కథ ఏంటి? ‘ఐయామ్ హ్యాపిలీ సేయింగ్ దట్ ఐయామ్ బిజీ’ అంటుంది 26 ఏళ్ల టుక్టుకీదాస్. ఎంత బిజీ ఆ అమ్మాయి? ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ మీద తన ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళుతుంది. అప్పటికే ఆమె టీ కోసం కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు. అప్పటి నుంచి రాత్రి 10 వరకూ తన టీకొట్టులోనే ఉంటుంది. వచ్చిన వారందరికీ టీ ఇస్తుంది. వారితో కబుర్లు చెబుతుంది. టీ అన్నీ చోట్లా ఉంటుంది. మరి ఎందుకు ఆమె దగ్గరికే వచ్చి కొంటారు అనంటే ఆమె టీకొట్టు పేరు ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’. ఎం.ఏ ఇంగ్లిష్ చేసిన ఒక అమ్మాయి తయారు చేసి అమ్ముతున్న టీ కనుక ఇప్పుడు ఈ క్రేజ్. బెంగాల్ అమ్మాయి టుక్టుకీదాస్ది పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణ జిల్లాలోని హాబ్రా. ముగ్గురు పిల్లల్లో తను పెద్దది. తండ్రి వ్యాన్ డ్రైవర్. తల్లికి చిన్న కిరాణాషాపు ఉంది. ‘అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా రెండు విషయాలు వింటూ పెరిగి పెద్దదాన్నయ్యా. ఒకటి:గవర్నమెంట్ ఉద్యోగం, రెండు: పెళ్లి’ అంటుంది టుక్టుకీ దాస్. 2020లో రవీంద్రభారతి యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాక కొన్నాళ్లు ట్యూషన్ చెప్పింది. ‘నాకు టీచింగ్ అంటే ఇష్టమే కాని అది ఒకేచోట ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇంకా ఏదో సాధించాలి. నా కాళ్ల మీద నేను నిలబడాలి’ అంటుంది టుక్టుకీ దాస్. ఎం.బి.ఏ చాయ్‌వాలా స్ఫూర్తి ఎం.బి.ఏ చాయ్‌వాలా పేరుతో ప్రఫుల్ బిల్లోర్ అనే ఎంబిఏ కేండిడేట్ తెరిచిన వరుస టీకొట్లు హిట్ అయ్యాయి. అలాగే ఆస్ట్రేలియాలో ఉప్మా విర్ది అనే ఆమె చాయ్వాలీ పేరుతో టీ అమ్ముతూ ఫేమస్ అయ్యింది. ‘నేను కూడా వారిలాగే చాయ్ దుకాణం తెరుద్దామని అనుకున్నాను. నేను ఎం.ఏ ఇంగ్లిష్ చదివాను కనుక ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ పేరుతో టీకొట్టు తెరిచాను. దీనికి ముందు ఎక్కడ టీకొట్టు పెట్టాలా అని ఆలోచిస్తే కాలేజీల వద్ద, హాస్పిటల్స్ వల్ల లేదా రైల్వే స్టేషన్లో అనే ఆప్షన్స్ కనిపించాయి. కాలేజీలు కరోనా వల్ల సరిగ్గా నడవడం లేదు. హాస్పిటల్స్ దగ్గర మనుషులు తాగడం లేదు. అందుకని రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నాను’ అంటుంది టుక్టుకీ దాస్. ఆ షాపు తెరవడానికి గత సంవత్సరం ట్యూషన్ చెప్పి దాచుకున్న 10 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. ‘అమ్మా నాన్నలకు నేను చాయ్ దుకాణం పెడతానని చెప్తే వద్దనలేదు కాని ఆశ్చర్యపోయారు. పైగా రైల్వేస్టేషన్ అనేసరికి ఎలా ఉంటుందో అనుకున్నారు. కాని వారి మద్దతుతో ముందుకే వెళ్లాను’ అంటుందామె. మొదటిరోజే ఉచితంగా నవంబర్ 1, 2021న హాబ్రా రైల్వేస్టేషన్లో కొంతమంది మిత్రుల మధ్య, మైక్‌లో వినిపిస్తున్న అనౌన్స్మెంట్ల మధ్య ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ దుకాణాన్ని తెరిచింది టుక్టుకీదాస్. దానికి ముందు నుంచే ఆమె బ్లాగింగ్ కూడా చేస్తుండటం వల్ల తన రోజువారీ అనుభవాలను కూడా వీడియో తీసి బ్లాగ్‌లో ఉంచడం మొదలెట్టింది. ఈ పేరు కొత్తగా ఉండటం, ఫేస్బుక్లో ఆమె రోజూ వీడియోలు పెడుతుండటంతో వెంటనే గుర్తింపు వచ్చేసింది. జనం కుతూహలంతో ఆమె షాపుకు వచ్చి టీ తాగడం మొదలెట్టారు. ‘అక్కా.. టీ ఇవ్వు. అలాగే ఒక సెల్ఫీ కూడా’ అని కాలేజీ పిల్లలు అడగడం మొదలైంది. మొదటి రోజు రెండు గంటల పాటు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా టీ ఇచ్చింది టుక్టుకీ దాస్. ఆ తర్వాత డబ్బులు అవే గల్లాపెట్టెలో పడటం మొదలయ్యాయి. ఏదీ తక్కువ కాదు రైల్వే స్టేషన్లో టీ అమ్మే అమ్మాయిని చూసి అక్కడి పోర్టర్లే మొదట చులకనగా చూశారు టుక్టుకీ దాస్‌ని. ‘ఏ పనైనా గౌరవప్రదమైనదే అని మన దేశంలో గ్రహించరు. అమ్మాయిలు శ్రమ చేసి తమ కాళ్ల మీద తాము నిలబడటాన్ని చూసి హర్షించాలి’ అంటుంది టుక్టుకీ దాస్. అయితే ఇప్పుడు అందరూ ఆమెను ప్రశంసాపూర్వకంగా చూస్తున్నారు. సాయం వద్దు టుక్టుకీ దాస్ చాయ్ దుకాణం పాపులర్ అయ్యేసరికి కొంతమంది పెద్దలు వచ్చి సాయం చేస్తామన్నారు. ‘నేను సున్నితంగా వారించాను. నేను పైకి వస్తే నా వల్లే రావాలి తప్ప వేరొకరి సాయంతో కాదు. నేను ఇప్పుడు నా చాయ్ దుకాణంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా నేను ఈ బ్రాండ్‌తో కోల్కటాలో దుకాణాలు తెరవాలి. కాని ఈ దుకాణం మాత్రం మూసేయను. ఇది మొదటిది. నా సెంటిమెంట్‘ అంటుంది టుక్టుకీ దాస్. టుక్టుకీ దాస్ రోజూ చాలా బిజీగా ఉంటోంది. చాలామంది ఫుడ్బ్లాగర్స్ ఆమెతో వీడియోలు చేస్తున్నారు. ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో టీ అమ్ముతూ ఉండటం సంతోషంగా ఉండటం అందరికీ ఎందుకు నచ్చదు. భిన్నంగా ఆలోచిస్తే మామూలు టీ కూడా ఇలా బ్రాండ్ అయి కూచుంటుంది. -
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వద్ద ఆందోళనలు
సాక్షి, నాంపల్లి(హైదరాబాద్): హైదరాబాద్‌లోని నాంపల్లిలో ప్రతిఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) బుధవారం రాత్రికి అగ్నికి ఆహుతైంది. క్షణాల్లోనే అక్కడున్న వందల స్టాళ్లు బూడిద అయ్యాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ నష్టపోయిన స్టాల్ నిర్వాహకులు గురువారం సొసైటీ ముందు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో వ్యాపరస్తులు సొసైటీ ముట్టడికి యత్నించారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. మేమేంటో చూపిస్తాం: స్టాల్ నిర్వాహకులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చెలరేగిన మంటలతో లక్షల రూపాయలు నష్టపోయామని వ్యాపరస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ సొసైటీ సభ్యులను డిమాండ్ చేస్తున్నారు. 30 నిమిషాల్లో అధికారులు వచ్చి మాట్లాడకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. తమకు న్యాయం చేస్తామని సోసైటీ సభ్యులు హామీ ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే తమ స్టాళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. -
అతడు - ఆమె... ఇతడు - ఈమె
కథ ఎనిమిది గంటలప్పుడు ఎవడో ఎదురుగా వున్న స్టాల్లో న్యూస్‌పేపర్ కొంటున్నాడు. ఇంటికెళ్ళేవరకూ ఆగలేను అన్నట్టు అక్కడే పేపర్ విప్పి చదివేస్తున్నాడు. నిన్నటికీ ఇవాళ్టికీ మధ్య దేశమేమైపోయిందా అన్న ఆతృత కాబోలు. ఎదురుగా వస్తున్నవాడు సెల్ఫోన్లో మాట్లాడుతూ పెద్దగా నవ్వుతున్నాడు. అంతగా నవ్వే విషయం ఏవుందో మరి..!? ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి వున్నారు. చూడబోతే నేను తప్ప అందరూ ఆనందంగానే వున్నట్టున్నారు. ఛీ.. వెధవ జీవితం..! నేనే ఎందుకిలా ఉసూరంటూ ఏడుస్తున్నానో అర్థంకావడం లేదు. అజంతా హోటల్లోకి దారితీశాను. ఆహా..! ఇక్కడ ఇడ్లీ తినేసింతర్వాత చచ్చిపోయినా ఫర్లేదనిపించింది. టిఫిన్ ముగించి బైటికొచ్చాను. ఇప్పుడేం చేద్దాం..? ఆలోచించాను. కాసేపు ఒంటరిగా వుండాలి. ఒంటరిగా.. ప్రశాంతంగా.. ఏ వెధవా పలకరించకుండా వుండాలి. ఆటో ఎక్కి పార్క్‌కి చేరుకున్నాను. ఉదయం ఫూట గాబట్టి నేననుకున్నట్టే పార్క్‌లో జనం లేరు. ఏవేవో గుర్తుకొస్తున్నాయి. శరత్గాడు వాడి భార్య అంజలి.. ఆ జంటని తల్చుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. ఎలాంటి అరమరికలు, భేదాభిప్రాయాలు లేకుండా అంత అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఎలా వుండగలుగుతున్నారో..?! నాకెందుకు ఇలా అయింది? లోపం ఎక్కడుంది..? ఇంకెక్కడ.. కచ్చితంగా నాలోనే! నేనే అంతటికీ కారణం. ఎవరో సైకాలజిస్టు చెప్పాడట. భార్య కాఫీ ఇచ్చినప్పుడు ‘థాంక్స్’ అనే చిన్నమాట ఉపయోగిస్తే చాలు.. ఆమె ఎంతో సంతోషిస్తుందట. మంచి భోజనం పెట్టినప్పుడు ‘ఈరోజు నీ చేతి వంట అద్భుతం’ అంటే ఆమె పడిన కష్టాన్నంతా మర్చిపోయి ఉప్పొంగిపోతుందట. భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న విషయాలే వారి బంధం గట్టిపడ్డానికి ఎంతో సహకరిస్తాయట. మరి నేనెప్పుైడనా మా ఆవిడకి థాంక్స్ చెప్పానా..? చెప్పినట్టు గుర్తులేదు. అదలా వుంచితే ఒకరి పుట్టినరోజుకి మరొకరు హేపీ బర్త్ డే చెప్పుకోవడం, చిన్న చిన్న గిఫ్టులు ఇచ్చుకోవడం లాంటివి చెయ్యాలట. ఇవన్నీ శరత్ గాడే చెప్పాడు. మరి నేనేం చేశాను..? పెళ్ళయిన తర్వాత మొదటి పుట్టినరోజుకు శ్రావణికి హేపీ బర్త్ డే అయితే చెప్పాను గానీ తనకేదో బహుమతి ఇవ్వాలన్న ఆలోచనే రాలేదు. ఇక రెండో సంవత్సరం మరీ ఘోరం.. పని ఒత్తిడిలో పడి ఆరోజు ఆమె పుట్టినరోజన్న సంగతే మర్చిపోయాను. అవన్నీ అలా వుంచితే ఆరోజు జరిగిన విషయం.. అది గుర్తుకొస్తే గుండెల్లో ముల్లు గుచ్చుకుంటున్నట్టే వుంటుంది. శ్రావణి నన్ను విడిచి వెళ్ళిపోతుందని నేను ఊహించలేదు. ఏదో కోపంలో వెళ్ళిపోయినా తిరిగి వచ్చేస్తుందిలే అనుకున్నాను. కానీ నిన్న తెలిసిన వార్త.. మనిషిని మనిషిలా వుంచడం లేదు.. గుండెల్లో మంట రేపుతోంది. శ్రావణి నామీద గృహ హింస కేసు పెట్టబోతోందిట. మా అత్తగారి వూళ్ళో వున్న ఓ చుట్టం ద్వారా విషయం తెలిసింది. అప్పట్నుంచి ఒకటే ఆలోచన.. ఏం కాదులే అని సర్దిచెప్పుకొని మనసు మళ్ళించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళీ ఆలోచనలు అటే వెళ్తున్నాయి. లోపలెక్కడో వున్న ఆశ మళ్ళీ బైటికొచ్చింది. పోనీ శ్రావణికి ఒకసారి ఫోన్ చేస్తే..? ఆత్మాభిమానం వున్న ఏ ఆడదీ మీ దగ్గిర వుండలేదు.. మళ్ళీ నాకు ఫోన్ చెయ్యడానికి గానీ, నన్ను కలవడానికి గానీ ప్రయత్నించకండి.. శ్రావణి వెళ్ళిపోతూ నిప్పులు కురిపిస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఛ.. ఛ.. ఫోన్ చెయ్యడానికి నాకైనా సిగ్గుండాలి. ఫోన్ చేసి ప్రాధేయపడి.. తప్పైపోయిందని ఒప్పుకొని... ఆమెని రమ్మని బ్రతిమాలుకొని.. వద్దు.. వద్దు.. ఇక జీవితాంతం ఆమె ముందు వెధైవపోతాడు. అదీ ఒక బతుకేనా..? ఏం చెయ్యాలిప్పుడు..? సమస్యల్ని తట్టుకోవడానికి ముందు మానసికంగా సిద్ధపడాలట. ఏం జరిగిపోదు అని మనకి మనవే ధైర్యం చెప్పుకోవాలట. ఒకరకంగా సెల్ఫ్ హిప్నాసిస్ లాంటిదన్నమాట. తర్వాత అసలు సమస్య మూలం ఏమిటి? దాన్ని పరిష్కరించుకోవడానికి ఏయే మార్గాలున్నాయి.. అని అన్వేషించాలట. అప్పటికి ఆ సమస్య కొంత తేలికైపోతుందట. ఇవన్నీ మొన్న ఓ వ్యాసంలో చదివాను. నేననుకునేదేమిటంటే ఒడ్డున నిలబడి ఇలాంటి ప్రవచనాలు ఎన్నయినా చెప్పొచ్చు.. సమస్యలో మునిగినోడికే దాని తీవ్రత తెలుస్తుంది. అయినా ఆ రోజెందుకు అలా జరిగిందో అర్థంకావడం లేదు.. ఇప్పుడు తల్చుకుంటే విధి లిఖితం అలా వుందేమో అన్పిస్తోంది. లేకపోతే నేనెందుకంత కోపం తెచ్చుకోవాలి..? జరిగింది మరోసారి నా కళ్ళముందు మెదిలింది. ఆరోజు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆనంద్గాడు పార్టీ ఇచ్చాడు. నిజానికి మందుకొట్టడం అనేది నాకేమాత్రం ఆసక్తి లేని విషయం. కానీ ఎప్పుడో ఇలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సరిగ్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ మధ్య కూర్చున్నప్పుడు కాదంటే వాళ్ళెలాగూ విడిచిపెట్టరు కాబట్టి ఏదో కొంచెం అలా సిప్ చేస్తానంతే..! అయితే ఆరోజు మాటల్లో సిప్‌లు కొంచెం ఎక్కువయ్యాయి. ఇంటికొచ్చేసరికే శ్రావణి కోపంగా వుంది. అప్పటికే చాలాసార్లు నా సెల్‌కు ఫోన్ చేసిందట. కానీ నా సెల్ ఛార్జింగ్ అయిపోవడం నేను గమనించనే లేదు. మాటల్లోనూ మత్తులోనూ పడి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని కూడా శ్రావణికి చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడో ఒకసారి తాగే నాలాంటి వాడికి మేనేజ్ చెయ్యడం చేతకాదు.. శ్రావణి వెంటనే పసిగట్టేసింది. తాగొచ్చారా..? అడిగింది. అసలు ఆ విషయం నేనే తనకి నెమ్మదిగా చెప్దామనుకున్నాను. పరిస్థితి చెప్తే ఆమె అర్థం చేసుకుంటుందనే నా నమ్మకం. అర్థం చేసుకునేదేమో కూడా.. కానీ శ్రావణి అలా ఫోర్స్‌గా ఒకేసారి అడిగేసరికి నా ఇగో దెబ్బతింది. అవును.. తాగే వచ్చాను. ఇప్పుడేంటి..? అసహనంగా అన్నాను. సాయంత్రం నుంచి ఫోన్లు చేస్తున్నాను. కనెక్ట్ కావడం లేదు.. కనీసం ఆలస్యమౌతుందని చెప్పాలని కూడా అనిపించలేదా..? అనిపించలేదు.. ఓహొ.. ఇంటికెందుకు వచ్చారయితే..? తెల్లార్లూ అక్కడే వుండాల్సింది.. తీవ్రంగా అంది. సరే.. ఈసారి అలాగే చేస్తాన్లే.. వాదన పెరిగిపోయింది. ఒక స్థాయిలో నేనేం చేస్తున్నానో నాకే తెలీలేదు. ఫలితం.. నా చేయి విసురుగా ఆమె చెంపను తాకింది. శ్రావణి నిర్ఘాంతపడి చూస్తుండిపోయింది. అప్పుడు చూశాను వెనక్కి.. శ్రావణి మేనత్త, మావయ్య! వెనక గది ద్వారం దగ్గర నిలబడి వున్నారు..! వాళ్ళొచ్చారన్న సంగతి నాకప్పటివరకూ తెలీదు. శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇల్లు కూడా దగ్గరే కాబట్టి చూసి పోదామని ఇక్కడికి వచ్చారట. తర్వాత్తెలిసింది నాకు. మా గలాటాకు నిద్రాభంగమై లేచినట్టున్నారు. ఒక్కసారిగా నా మత్తు దిగిపోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది..! శ్రావణి మనసు ముక్కలైంది. తర్వాత ఏం జరగాలో అదే జరిగింది.. నేను ఒంటరిగా మిగిలిపోయాను. పిచ్చెక్కేటట్టు వుంది.. ఏదయితే అదవుతుందని శ్రావణికి ఫోన్ చేశాను. ఆమె కోపంగా ఏమైనా అన్నా సహనంగా వుండాలి అనుకున్నాను. అట్నుంచి హలో.. ఎవరూ..? అని వినిపించింది. అది శ్రావణి గొంతు కాదు. నేను.. సురేష్‌ను మాట్లాడుతున్నాను.. శ్రావణి లేదా..? అడిగాను. నువ్వా బాబూ.. శ్రావణిని రమ్మని చెప్పడానికి చేశావా..? ఎందుకూ..? కొట్టి చంపెయ్యడానికా..? అది రాదులే బాబూ.. కోర్టు నుంచి నోటీసొస్తుంది.. అందుకో.. ఫోన్ కట్టయింది. ఆ గొంతు శ్రావణి మేనత్తది..! శ్రావణికి నా మీద కోపం తగ్గలేదన్న మాట.. కేసు పెట్టడానికే సిద్ధమైందన్న మాట..! అయిపోయింది.. అంతా అయిపోయింది.. సర్వనాశనం..! పరువు పోయినట్టే..! ‘వీడి మీదేరా.. పెళ్ళాం గృహహింస కేసు పెట్టింది.. స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు’ నాకు వినిపించేలా ఎవరూ అనరు.. నేను వెళ్తుంటే వెనక మాట్లాడుకుంటారంతే..! విరిగిన మనసులు అతకవన్నట్టు శ్రావణితో కలిసుండడం కూడా ఇక అసాధ్యమే అవుతుంది. ఇప్పుడేం చెయ్యాలి..? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? మధ్యాహ్నం రెండు గంటలు.. గది తలుపులు దగ్గరికి వేశాను. మనసంతా బరువుగా అయిపోయింది. ఎన్ని రకాలుగా ఆలోచించినా నేను చేస్తున్న పని కరక్టే అనిపించింది. వేరే దారి లేదు. నేనంటే వీధిలో.. ఆఫీసులో.. మా ఏరియాలో.. ఓ గుర్తింపు వుంది. మంచివాడు.. ఎవరి జోలికీ వెళ్ళడు.. అని. ఈరోజు.. ఇలాంటి మచ్చతో కాలనీలో నలుగురిలో తిరగడం అంటే.. లేదు.. లేదు.. అంతకంటే చావడం మంచిది. నా సమస్యా సమసిపోతుంది.. శ్రావణి మీద రివెంజ్ తీర్చుకున్నట్టు కూడా వుంటుంది.. అవును.. అదే కరెక్ట్..! జేబులో నుంచి బైటికి తీశాను.. విషం..! పంటలకు వాడేది.. పెస్టిైసడ్..! గేరంటీగా ఛస్తాను.. ఎంతసేపట్లో చస్తానో..? కడుపులో నొప్పేమైనా వస్తుందా..? సెల్ మోగింది. ఇప్పుడెవడు..? విసుగ్గా తీసి చూశాను. శరత్ గాడు.. ఇప్పుడెందుకు చేస్తున్నట్టో..? కట్టెయ్యబోయి మళ్ళీ మనసు మార్చుకుని పచ్చ బటన్ నొక్కాను. ఎక్కడున్నావ్ రా..? అర్జెంటుగా ఇంటికొచ్చేయ్.. పార్టీ చేసుకుందాం.. అన్నాడు. పార్టీయా..? అవును.. నీలాంటి ఆదర్శదాంపత్యం వున్నవాడికి ప్రతిరోజూ పండగే.. నాలాంటోడి బాధెవడికి చెప్పుకోను..? ఏం పార్టీ..? ఇప్పుడేంటి..? చెల్లెమ్మ ఇంట్లో లేదా..? అయినా నేనిప్పుడు రాలేను.. సహనంగా చెప్పాను. ఏం..? సెలవేగా ఈరోజు..? ఇంకేం చెప్పకు.. నువ్వు రావాల్సిందే.. లేదంటే నేనే మీ ఇంటికొచ్చేస్తాను. వాడి సంగతి నాకు తెలుసు. పట్టుపడితే వదిలే రకం కాదు.. వాడింటి నుంచి మా ఇంటికి రావడానికి ఐదు నిముషాలు కూడా పట్టదు. వస్తున్నాను.. ఇంకేమనాలో తోచక చెప్పాను. ఎందుకిలా జరుగుతోంది..? ఇది కూడా విధి లిఖితమేనా..? సరే.. కానీ.. ఒకసారి నిర్ణయించుకున్నాక నన్నెవడు ఆపగలడు..? కాకపోతే ఓ రెండు మూడుగంటల ఆలస్యం...బాటిల్‌ని కప్ బోర్డ్ లో పెట్టేసి శరత్ దగ్గరికి బెల్దైరాను. ఆలోచించకు.. కాస్ట్లీ సరుకు.. వేసేయ్.. గ్లాసులో మందు నింపి నావైపు తోసి అన్నాడు. అప్పటికే వాడు గుర్రం ఎక్కి వున్నాడు. మందా..? ఇప్పుడా..? నా గొంతు ఏదోలా ధ్వనించింది. మందేన్రా.. ఏదో విషమన్నట్టు మాట్లాడతావేంటి..? విషం అన్న మాట వినగానే ఉలిక్కిపడ్డాను. ఇప్పుడెందుకీ పార్టీ ఇస్తున్నావో చెప్పనే లేదు.. కంగారును కప్పి పుచ్చుకుంటూ అన్నాను. ఓహో... చెప్తేగానీ తాగవా..? సరే.. అంజలి వూరికెళ్ళింది. మీ ఆవిడ వూరికెళ్ళినప్పుడెప్పుడూ నువ్వు పార్టీ ఇచ్చిన గుర్తు లేదే..?! కరెక్ట్.. ఇప్పుడు కూడా అందుకివ్వడం లేదు.. ఇదసలు పార్టీ కూడా కాదు.. నీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఏం చెప్పాలి..? ముందు తాగు.. గద్దించినట్టు అన్నాడు. గ్లాస్ తీసుకొని గడగడా గొంతులో వొంపేసుకున్నాను. ఇప్పుడు చెప్పు.. అయినా భార్య వూరికెళితే విరహంలో మునిగి గంటకోసారి ఆమెకు ఫోన్ చేస్తూ నీ ప్రేమను గుర్తు చెయ్యాల్సినోడివి.. అదే గదా నీ ఫిలాసఫీ.. ఇప్పుడీ దుకాణం ఎందుకు పెట్టావో అర్థం కావడం లేదు.. విసుగ్గా అన్నాను. ట్రాష్.. అదే..నే చెప్పాలనుకుంటున్నది.. ప్రతీ చిన్న విషయంలో భార్యకు థాంక్స్ చెప్పడం, ఎప్పటికప్పుడు ఏదో రకంగా మన ప్రేమను వ్యక్తపరచడం.. అన్నీ ట్రాష్.. అరిచాడు వాడు. ఏమైంది వీడికి..? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావ్..? కాస్త భయంగా అన్నాను. నరకం.. నరకం చూస్తున్నాన్రా.. ప్రతీ విషయంలో ఆవిడ చెప్పినట్టే వినాలి. నాకంటే పెద్ద జాబ్‌లో వుంది. ఎందుకులే అని ఎంతగానో కంట్రోల్ చేసుకుంటూనే వున్నాను.. అదేంట్రా.. భార్యాభర్తలు ఎలా వుంటే వారి బంధం బలపడుతుందని సైకాలజిస్టులు చెప్పారో అదే పాటిస్తుంటావ్.. నాక్కూడా పదే పదే చెప్తుంటావ్.. ఈరోజు నువ్వేమిటి ఇలా..?! నా గొంతులో ఎడతెగని ఆశ్చర్యం! నీ మొహం సైకాలజీ.. అవన్నీ నా పద్ధతులు కావు.. తనవి.. ఎమ్మే సైకాలజీ చదివింది నేను కాదు తను..! అక్కడికీ తను చెప్పినట్టు నడుచుకుంటూనే వున్నాను. కానీ నా సహనానికి కూడా ఓ హద్దుంటుంది కదా..! అయినా నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ వున్నవాళ్ళు దాన్ని ప్రతిసారీ ఏవో పదాల్లోనో లేక మరో రకంగానో వ్యక్తం చేసుకోవాలా..? అలా చేసుకుంటే అది రాన్రాను కృత్రిమంగా తయారౌతుంది. ఏం.. మీ ఆవిడ కాఫీ ఇచ్చినప్పుడల్లా నువ్వు థాంక్స్ చెబుతావా..? చెప్పకపోతే నీ ప్రేమ మీ ఆవిడకి అర్థం కాదా..? నీ కళ్ళు, నీ మాట తీరు, నీ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ.. అసలివి కూడా అక్కర్లేదురా.. వైబ్రేషన్.. అవును.. ఇద్దరి మధ్య కనిపించని ఒక వైబ్రేషన్.. అది చాలు.. భార్యాభర్తల మధ్య అనురాగం నిలిచి వుండడానికి. అసలేమైందిరా..? గొంతు తగ్గించి నెమ్మదిగానే అడిగాను. నటన.. ముసుగు తగిలించుకొని నటించడం నా వల్ల కావట్లేదురా.. మొన్న.. తన పుట్టినరోజు నాడు అలిగింది.. ఉదయాన్నే హేపీ బర్త్ డే చెప్పాన్రా.. మంచి చీర కూడా ముందే కొనేసి వుంచాను. ‘ఎప్పుడూ అర్ధరాత్రి పన్నెండు దాటాక లేపి మరీ చెప్పేవాడివి.. ఈసారి తెల్లారాక తీరిగ్గా చెబుతున్నావ్.. నా మీద ప్రేమ అంతకంతకూ తగ్గిపోతోంది..’ అంది. ఓ వెర్రినవ్వు నవ్వేసి వూరుకున్నాను. అక్కడితో ఆపలేదు.. ఆ సొద కంటిన్యూ అవుతూనే వుంది. నేను బరస్ట్ అయ్యాను. ఇలా వుంటే మరీ కృత్రిమంగా అన్పిస్తోందని చెప్పాను. నా బర్త్ డే రోజు కూడా అర్ధరాత్రి లేపి చెప్పకు... చిరాగ్గా వుంటోంది.. ఇంక ఈ పిచ్చి పనులు చాలు.. ఈసారి మళ్ళీ ఇలా సైకలాజికల్ విషయాలు చెప్తే దవడ పగుల్తుందన్నాను.. అంతే..! యుద్ధం జరిగింది. ఆమె వెళ్ళిపోయింది. నాకంతా ఆశ్చర్యంగా వుంది.. అయినా బాధపడకురా.. ఏదో కోపం మీద వెళ్ళిపోయుంటుంది.. మళ్ళీ వచ్చేస్తుందిలే.. నాకు చేతైననట్టు ఓదార్చాను. రాదు.. మళ్ళీ రాదు.. ఆవిడ సంగతి నీకు తెలీదు.. ఆత్మ.. ఆత్మా.. అదేమిటది..? నాలిక తడబడింది వాడికి. ఆత్మాభిమానం.. అందించాను. అవును అదే.. ఆవిడకి టన్నులకొద్దీ వుందది.. అంచేత ఆవిడ రాదు.. నేను మనసులో విషం పెట్టుకుని ఇంతకాలం నటించానట.. విడాకుల పత్రాలు పంపిస్తుందట.. జీవితాంతం ఒంటరిగా బతికే ధైర్యం తనకి వుందట. మళ్ళీ నాదగ్గరికొచ్చేంత నీచమైన పని చెయ్యదట.. పోయింది.. అంతా పోయింది.. పరువూ మర్యాదా అంతా పోయింది.. నేను పిరికివాణ్ణి.. చాలా పిరికివాణ్ణి.. ఎలాగోలా బతికెయ్యగల గట్టి గుండె నాకు లేదు.. పెళ్ళాం వదిలేసి పోయిందని నలుగురూ అనుకుంటుంటే ఆ అవమానం తట్టుకొని మామూలుగా తిరిగే ధైర్యం అసలే లేదు.. అందుకే తాగాను.. విషం తాగాను.. నువ్వు రాకముందే.. నేను.. విషం.. వాడు టేబుల్ మీద తల వాల్చేశాడు. నా గుండెలు అదిరిపోయాయి.. విషం.. విషం తాగాడా వీడు..?! ఇప్పుడేం చెయ్యాలి..? కాళ్ళు చేతులు ఆడ్డం లేదు.. అంబులెన్స్.. అవును.. అంబులెన్స్‌కి ఫోన్ చెయ్యాలి.. నెంబరెంత..? చేతులు వొణుకుతున్నాయి.. నెంబర్ నొక్కాను. ఎమర్జెన్సీ వార్డ్ బైట కూర్చున్నాను.. సమయం ముళ్ళ మీద వున్నట్టుగా గడుస్తోంది.. ఎట్టకేలకు కొన్ని యుగాల తర్వాత శరత్ వున్న ఆ గది తలుపు తెరుచుకుంది. నా గుండె శబ్దం నాకే వినిపిస్తోంది. నేనేమీ అడక్కమునుపే మీవాడు సేఫ్.. సరైన సమయంలో తీసుకొచ్చారు.. ఇంకాస్త లేటైతే కష్టమయ్యేది.. అన్నాడు లోపల్నుంచి వచ్చిన డాక్టర్. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్నాను. నేను మరో ఇద్దరు ఫ్రెండ్స్‌కు మాత్రమే ఫోన్ చేశాను. వార్త అలా అలా పాకిపోయింది. గంట గడిచేసరికి అక్కడకి చాలామంది చేరుకున్నారు. సెల్ మోగుతోంది.. చూశాను.. శ్రావణి చేస్తోంది.. నమ్మలేకపోయాను.. ఆన్సర్ చేశాను..ఉదయం మీరు ఫోన్ చేశారా..? అడుగుతోంది. అవును.. మీ మేనత్త మాట్లాడింది.. చెప్పాను. ఆవిడ నాకు చెప్పనే లేదు.. ఇప్పుడే కాల్ లిస్టులో చూశాను.. అడిగితే చెప్పింది. ఆవిడ కోర్టు నోటీసు అదీ ఇదీ అంటోందేమిటి..? ఎంత వొద్దనుకున్నా నా గొంతు కొంచెం వణికింది. అదా.. ఆవిడ కొంచెం ఫెమినిస్టు భావాలున్నావిడ.. మీకు తెలీదా ఏంటి..? అబ్బాయిని కొంచెం జడిపిస్తే గానీ దార్లోకి రాడంది. అక్కడికీ నేను వొద్దని చెప్తూనే వున్నాను.. మరి మీ పెదనాన్న కొడుక్కి నిన్న ఫోన్ చేస్తే అతను కూడా అలాగే అన్నాడు..?! వాడే కదా మీకు బాగా దోస్తు.. వాడికి మీరు చేస్తారని ఆవిడకి తెలుసు. అందుకే ఒకవేళ మీరు ఫోన్ చేస్తే అలాగే చెప్పమని గట్టిగా ఆర్డరేసింది.. నిజమా.. అంతేనా.. నామీద కోపం లేదా నీకు..? ఆశ్చర్యంగా అడిగాను. ఎందుకు లేదు..? మనింటి కెళ్ళాక చూసుకుందాం.. చెప్పింది శ్రావణి. ఆ గొంతులో కోపం లేదు. నా మనసు దూదిపింజలా తేలిైకపోయింది. సారీ శ్రావణి.. ఏదో మత్తులో.. కోపంలో చెయ్యి చేసుకున్నాను.. తప్పే..! ఇంటికెప్పుడొస్తున్నావ్..? ఇప్పుడు బయల్దేరుతున్నాను.. మీరు ఇంటి దగ్గరే వున్నారు కదా.. అడిగింది. నేనెక్కడున్నదీ చెప్పి.. శరత్ విషం తాగిన సంగతి చెప్పాను. అలా ఎలా జరిగింది..? ఆశ్చర్యంగా అడిగింది శ్రావణి. అదంతా నువ్వొచ్చాక చెప్తాన్లే.. అన్నాను. సరేనంటూ ఫోన్ కట్ చేసింది. లోపలికెళ్ళాను. శరత్ గాడు కొంచెంగా తేరుకున్నాడు. బలహీనంగా మాట్లాడుతున్నాడు. నన్నెందుకు బతికించావంటూ అడిగాడు. ఆ మాత్రం మాట్లాడుతున్నాడంటే ఇంక వాడికి ఫర్వాలేదనుకున్నాను. అక్కడ మిగతా వాళ్ళకి చూసుకోమని చెప్పి కాసేపట్లో వస్తానని బయటకొచ్చాను. రోడ్డు మీద కొచ్చి కనిపించిన ఆటో ఎక్కి మా ఇంటి అడ్రస్ చెప్పి పొమ్మన్నాను. శ్రావణికి వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి రావడానికి అరగంట కూడా పట్టదు. నేను విషం బాటిల్ పెట్టిన కప్ బోర్డ్ శ్రావణిది.. తనొచ్చేలోగా ఆ బాటిల్‌ని తీసి పారెయ్యాలి..! - ఎం. రమేష్ కుమార్ -
పాకిస్థాన్ కు అమెరికా ఝలక్!
వాషింగ్టన్: భారత్ లో పఠాన్ కోట్ పై దాడి ప్రభావం పాకిస్థాన్ పై పడుతోంది. ఆ దేశానికి అమెరికా ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్ కు ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల అమ్మే ఆలోచనకు అమెరికా బ్రేక్ వేసింది. దీనిపై అప్పుడే తుది నిర్ణయానికి రాకుండా నిలుపుదల చేసింది. పాకిస్థాన్ కు ఎనిమిది ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాలు విక్రయించేందుకు అమెరికా అంతకుముందు ప్రాథమిక ఒప్పందాలు చేసుకుంది. దీనిపై కాంగ్రెస్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా దీనికి కాంగ్రెస్ సభ్యులు అంత సముఖంగా లేనట్లు తెలుస్తోందని అక్కడి స్థానిక పత్రిక ఒకటి తెలిపింది. పాకిస్థాన్ ఈ విమానాలను చివరకు ఎలాంటి పనులకు ఉపయోగిస్తుందో అనే అనుమానాలను కూడా ఇంకొందరు వెలిబుచ్చినట్లు సమాచారం. సెనేట్ కూడా పాకిస్థాన్ కు ఇప్పుడే జెట్ విమానాలు విక్రయించవద్దని ఒబామా పాలన విభాగానికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయిలో నిలిచిపోయినట్లు కాదని.. కొంతకాలంపాటు ఇలా నిలిపేసి అనంతరం సరైన సమయం అని భావించినప్పుడు, అందరితో చర్చించి ఏకాభిప్రాయం పొందితే అప్పుడు విక్రయించాలని భావిస్తోందని కూడా ఆ పత్రిక తెలిపింది. భారత్ లోని పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి పాకిస్థాన్ సీరియస్ గా స్పందించాలని, నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకొని ఉగ్రవాదానికి ఆ దేశం పూర్తిగా వ్యతిరేకం అని నిరూపించుకోవాలని అమెరికా గట్టిగా చెప్పిన మరుసటి రోజే యుద్ధ విమానాల విక్రయ ఆలోచనను ప్రస్తుతానికి నిలిపిఉంచేందుకు అమెరికా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సాక్షికార్యాలయంలో ప్యూరిఫయర్ స్టాల్ ఏర్పాటు