
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ పదవీకాలాన్ని వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించడంతో అమితాబ్ పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కాలపరిమితి రెండేళ్లు ఉండే నీతి ఆయోగ్ సీఈవో పదవిని అమితాబ్ 2016 ఫిబ్రవరి 17న చేపట్టారు. నీతి ఆయోగ్‌లో పదవిచేపట్టకముందు ఆయన పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా పనిచేశారు. అమితాబ్ కేరళ కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.