tenure extension
-
TG: కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పొడిగింపు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రెండు నెలలపాటు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31వ తేదీ వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా శనివారం(ఆగస్టు31) జీవో జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో ముఖ్య అధికారులుగా పనిచేసిన వారిని విచారించింది. తాజాగా గడువు పొడిగించడంతో విచారణ పూర్తయిన తర్వాతే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనుంది. -
డోంట్‌వర్రీ సార్! ఈడీని కొనసాగించొచ్చట కానీ.. డైరెక్టర్‌నే కొనసాగించొద్దంటున్నారు!
డోంట్‌వర్రీ సార్! ఈడీని కొనసాగించొచ్చట కానీ.. డైరెక్టర్‌నే కొనసాగించొద్దంటున్నారు! -
తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
ఈడీ డైరెక్టర్ పదవీ కాలం ఎందుకు పొడిగించారు?
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని మూడుసార్లు ఎందుకు పొడిగించారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రంతోపాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), ఈడీ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత జయా ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ విక్రమ్‌నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రంతోపాటు సీవీసీకి నోటీసులు జారీ చేసింది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగించుకుంటోందని, తద్వారా ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తోందని జయా ఠాకూర్ తన పిటిషన్లో ఆరోపించారు. సంజయ్‌కుమార్ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఆక్షేపించారు. -
ఈడీ డైరెక్టర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ విచారణ సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా(62) పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన సంజయ్ కుమార్ మిశ్రా 2023 నవంబర్ 18వ తేదీ వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఆ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. ఆయన పదవీ కాలం పొడిగింపునకు కేంద్ర మంత్రివర్గ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలియజేసింది. 2018 నవంబర్ 19న ఈడీ డైరెక్టర్‌గా నియమితులైన సంజయ్‌కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్రం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. -
గౌబా పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. రాజీవ్ గౌబా పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న గౌబా 2019లో కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం గత ఏడాది ఆగస్టులో ముగియగా, ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. తాజాగా మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గౌబా జార్ఖండ్ కేడర్ అధికారి. -
మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తనను సాంస్కృతిక సారథి చైర్మన్‌గా పునర్నియామకం చేయడంపై రసమయి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను రసమయి కలిశారు. ఉత్తర్వుల పత్రాన్ని రసమయికి సీఎం అందించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమంలో కష్టపడి పనిచేసిన సాంస్కృతిక కళాకారులను రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ క్రమంలోనే కళాకారులకు ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అందరికీ సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక కళాకారుల పాత్ర మరువలేనిదనీ గుర్తుచేశారు. స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర గొప్పదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరేలా సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీతి ఆయోగ్ సీఈవో పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ పదవీకాలాన్ని వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించడంతో అమితాబ్ పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కాలపరిమితి రెండేళ్లు ఉండే నీతి ఆయోగ్ సీఈవో పదవిని అమితాబ్ 2016 ఫిబ్రవరి 17న చేపట్టారు. నీతి ఆయోగ్‌లో పదవిచేపట్టకముందు ఆయన పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా పనిచేశారు. అమితాబ్ కేరళ కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. -
సలహాదారుల పదవీకాలం ఏడాది పొడిగింపు
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్.విద్యాసాగర్‌రావు (నీటిపారుదల), ఏకే గోయల్(ప్రణాళిక, ఇంధన), ఏ.రామలక్ష్మణ్ (సంక్షేమం), బి.వి.పాపారావు (విధాన నిర్ణయాలు, సంస్థాగత అభివృద్ధి), కేవీ రమణాచారి (సాంస్కృతిక పర్యాటక, యువజన, మీడియా విభాగాలు), జీఆర్‌రెడ్డి (ఆర్థిక శాఖ) సలహాదారులుగా ఉన్నారు. ఈ ఆరుగురు సలహాదారులు మరో ఏడాది పాటు ఈ పదవిలోనే కొనసాగుతారు.