
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రెండు నెలలపాటు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31వ తేదీ వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా శనివారం(ఆగస్టు31) జీవో జారీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఇప్పటికే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో ముఖ్య అధికారులుగా పనిచేసిన వారిని విచారించింది. తాజాగా గడువు పొడిగించడంతో విచారణ పూర్తయిన తర్వాతే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment