
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ విచారణ సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా(62) పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
1984 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన సంజయ్ కుమార్ మిశ్రా 2023 నవంబర్ 18వ తేదీ వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఆ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. ఆయన పదవీ కాలం పొడిగింపునకు కేంద్ర మంత్రివర్గ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలియజేసింది. 2018 నవంబర్ 19న ఈడీ డైరెక్టర్‌గా నియమితులైన సంజయ్‌కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్రం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది.