Sanjaykumar
-
TS Election 2023: రాహుల్‌గాంధీ రోడ్‌షో అట్టర్‌ఫ్లాప్! : ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ నిర్వహించిన రోడ్‌షో అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచిందని, జనాలు రారని గ్రహించి ఇరుకై న ప్రాంతంలో ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, గ్రామాల నుంచి కనీసం 10 మంది కూడా రాలేదని, జగిత్యాల పట్టణం నుంచి సైతం ప్రజలు హాజరు కాలేదన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి అబాసుపాలయ్యారని పేర్కొన్నారు. మార్గమధ్యలో నూకపల్లి వద్ద నిర్మించిన పేదోడి ఆత్మగౌరవ ప్రతీక అయిన రెండుపడకల గదులను చూడాల్సి ఉంటే బాగుండేదన్నారు. అలాగే 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉండి షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదో ప్రజలకు వివరించేది ఉండేదన్నారు. పసుపు బోర్డుకు సైతం నాడే ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో చేరిక.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
ఈడీ డైరెక్టర్ పదవీ కాలం ఎందుకు పొడిగించారు?
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని మూడుసార్లు ఎందుకు పొడిగించారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రంతోపాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), ఈడీ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత జయా ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ విక్రమ్‌నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రంతోపాటు సీవీసీకి నోటీసులు జారీ చేసింది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగించుకుంటోందని, తద్వారా ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తోందని జయా ఠాకూర్ తన పిటిషన్లో ఆరోపించారు. సంజయ్‌కుమార్ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఆక్షేపించారు. -
ఈడీ డైరెక్టర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ విచారణ సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా(62) పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన సంజయ్ కుమార్ మిశ్రా 2023 నవంబర్ 18వ తేదీ వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఆ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. ఆయన పదవీ కాలం పొడిగింపునకు కేంద్ర మంత్రివర్గ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలియజేసింది. 2018 నవంబర్ 19న ఈడీ డైరెక్టర్‌గా నియమితులైన సంజయ్‌కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్రం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. -
వరంగల్ జైలుకు సంజయ్
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పది మంది హత్యకేసులో నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్‌ను మంగళవారం పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ వరంగల్ శాంతినగర్‌లోని గోనెసంచుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్న మహమ్మద్ మక్సూద్ ఆలం, అతని కుటుంబ సభ్యులతో పాటు మరికొందరిని భోజనంలో నిద్రమాత్రలు కలిపి హత్య చేసిన విషయం తెలిసిందే. గొర్రెకుంట బావిలో తోసేసి తొమ్మిది మందిని, అంతకు ముందు ఒకరిని హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు సంజయ్‌కుమార్‌ను వరంగల్ పోలీసులు మంగళవారం ఉదయం 3వ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడికి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు. సంజయ్‌కుమార్‌ను హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచామని జైలు సూపరింటెండెంట్ మురళీబాబు తెలిపారు. మృతదేహాలకు వరంగల్‌లో అంత్యక్రియలు హత్యకు గురైన తొమ్మిది మందిలో ఏడుగురి అంత్యక్రియలను మంగళవారం ముస్లిం మత పెద్దలు వారి బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించారు. మృతుడు మక్సూద్ బంధువులు ఉదయం పశ్చిమ బెంగాల్ నుంచి వరంగల్‌కు చేరుకోవడంతో పోలీ సులు మృతదేహాలను వారికి అప్పగించగా పోతనరోడ్డులోని శ్మశానవాటిలో అంత్యక్రియలను పూర్తి చేశారు. షకీల్, మక్సూద్ ఆలం, అతని కుటుంబ సభ్యుల మృతదేహాలకు గీసుగొండ ఇన్చార్జి తహసీల్దార్ సుహాసిని, రాయపర్తి తహసీల్దార్ సత్యనారాయణ పంచనామా నిర్వహించారు. బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్‌కుమార్ మృతదేహాలు ఎంజీఎంలోనే ఉన్నాయి. సమగ్ర విచారణకు మృతుల బంధువుల డిమాండ్.. మక్సూద్ బంధువులకు ఆరు మృతదేహాలను అప్పగించిన అనంతరం షకీల్ మృతదేహాన్ని తమకు ఇవ్వకపోవడంతో అతని భార్య తాహెరా బేగం పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టింది. షకీల్‌కు ఇద్దరు భార్యలు ఉండటంతో ఎవరికి మృతదేహం అప్పగించాలనే విషయంలో అధికారులు ఇబ్బందికి గురయ్యారు. షకీల్ మొదటి భార్యకు విడాకుల ప్రక్రియ పూ ర్తయిందని అతని సోదరుడు సజ్జర్ చెప్పడంతో అతని వివరణ తీసుకున్న తర్వాత రెండో భార్య తాహెరా బేగంకు మృతదేహాన్ని అప్పగించారు. 9 మందిని ఒక్కడే హతమార్చాడని పోలీసులు చెప్పడంపై పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఎంజీఎం మార్చురీ వద్ద నిషా సోదరుడు ఫిరోజ్‌షా మాట్లాడుతూ తొమ్మిది మందిని సంజయ్‌కుమార్ యాదవ్ హత్య చేశాడని పోలీసులు పేర్కొంటున్నారని, ఒక్కడే ఇంతమందిని ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు. సంజయ్‌కుమార్‌కు మరికొంతమంది సహాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
నిరుపేదలకు అండగా కేసీఆర్
రాయికల్ : నిరుపేదల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని వర్తక సంఘ భవనంలో వివిధ గ్రామాలకు చెందిన 15 మందికి రూ.5.44లక్షల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేయడంతో ఆర్థికంగా ఆదుకున్న వారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడాల పూర్ణిమ, వైస్ ఎంపీపీ ఆడెపు లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు బెజ్జంకి మోహన్, రాజేశ్‌యాదవ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గండ్రరమాదేవి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండల్‌రెడ్డి, తిరుపతి, లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి పరామర్శ జగిత్యాల రూరల్ : పొలాసకు చెందిన ఎన్నమనేని హన్మం తరావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డా క్టర్ సంజయ్‌కుమార్ పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ నరేశ్, నాయకులు శంకర్, మల్లయ్య, గంగరాజం తదితరులు -
ఎంసెట్-2 స్కాంలో కీలక అరెస్టులు
-
ఎంసెట్-2 స్కాంలో కీలక అరెస్టులు
సీఐడీ అదుపులో ప్రధాన నిందితులు రాజ్‌వర్మ, సంజయ్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ఎం ట్రెన్స ప్రశ్నపత్రాల లీకేజీలో ఇద్దరు ప్రధాన నిందితులు రాజ్‌వర్మ (44), సంజయ్ కుమార్ ప్రభాత్ (40)లను శుక్రవారం అరెస్టు చేసినట్లు రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఐజీ సౌమ్య మిశ్రా తెలిపారు. బిహార్‌కు చెందిన రాజ్ వర్మ ఢిల్లీలో ఉంటూ అక్కడే బార్, రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. లీకై న రెండు సెట్ల ఎంసెట్-2 ప్రశ్నపత్రాలతో బెంగళూరులో 3 క్యాంపులు ఏర్పాటు చేసి 40 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు. మరో నిందితుడితో కలసి బెంగళూ రుకు ప్రశ్నపత్రాలను తీసుకొచ్చాడు. మరో నిందితుడు సంజయ్‌కుమార్ ప్రభాత్ ప్రవృత్తి ప్రశ్నపత్రాలను లీకు చేయడమేనని సౌమ్య మిశ్రా తెలిపారు. సునీల్‌సింగ్ అలియాస్ కమలేశ్ శర్మ అనే మరో నిందితుడికి ఇతను సహచరుడు. లీకైన 2 సెట్ల ప్రశ్నపత్రాలతో షిరిడీలో క్యాంపు నిర్వహించి 13 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన వ్యవహారంలో సంజయ్ కుమార్ ప్రభాత్ కీలక పాత్ర వహించాడు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి సునీల్ సింగ్‌కు అందజేశాడు.