మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ నిర్వహించిన రోడ్‌షో అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచిందని, జనాలు రారని గ్రహించి ఇరుకై న ప్రాంతంలో ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, గ్రామాల నుంచి కనీసం 10 మంది కూడా రాలేదని, జగిత్యాల పట్టణం నుంచి సైతం ప్రజలు హాజరు కాలేదన్నారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి అబాసుపాలయ్యారని పేర్కొన్నారు. మార్గమధ్యలో నూకపల్లి వద్ద నిర్మించిన పేదోడి ఆత్మగౌరవ ప్రతీక అయిన రెండుపడకల గదులను చూడాల్సి ఉంటే బాగుండేదన్నారు. అలాగే 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉండి షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదో ప్రజలకు వివరించేది ఉండేదన్నారు. పసుపు బోర్డుకు సైతం నాడే ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్‌లో చేరిక..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment