ఎంసెట్-2 స్కాంలో కీలక అరెస్టులు
ఎంసెట్-2 స్కాంలో కీలక అరెస్టులు
Published Sat, Nov 26 2016 3:52 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM
సీఐడీ అదుపులో ప్రధాన నిందితులు రాజ్‌వర్మ, సంజయ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ఎం ట్రెన్‌స ప్రశ్నపత్రాల లీకేజీలో ఇద్దరు ప్రధాన నిందితులు రాజ్‌వర్మ (44), సంజయ్ కుమార్ ప్రభాత్ (40)లను శుక్రవారం అరెస్టు చేసినట్లు రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఐజీ సౌమ్య మిశ్రా తెలిపారు. బిహార్‌కు చెందిన రాజ్ వర్మ ఢిల్లీలో ఉంటూ అక్కడే బార్, రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. లీకై న రెండు సెట్ల ఎంసెట్-2 ప్రశ్నపత్రాలతో బెంగళూరులో 3 క్యాంపులు ఏర్పాటు చేసి 40 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు.
మరో నిందితుడితో కలసి బెంగళూ రుకు ప్రశ్నపత్రాలను తీసుకొచ్చాడు. మరో నిందితుడు సంజయ్‌కుమార్ ప్రభాత్ ప్రవృత్తి ప్రశ్నపత్రాలను లీకు చేయడమేనని సౌమ్య మిశ్రా తెలిపారు. సునీల్‌సింగ్ అలియాస్ కమలేశ్ శర్మ అనే మరో నిందితుడికి ఇతను సహచరుడు. లీకైన 2 సెట్ల ప్రశ్నపత్రాలతో షిరిడీలో క్యాంపు నిర్వహించి 13 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన వ్యవహారంలో సంజయ్ కుమార్ ప్రభాత్ కీలక పాత్ర వహించాడు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి సునీల్ సింగ్‌కు అందజేశాడు.
Advertisement