నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత | Tollywood Actress Samantha Praises A student Gets Good Rank | Sakshi
Sakshi News home page

Samantha: నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత

Published Mon, May 20 2024 4:54 PM | Last Updated on Mon, May 20 2024 5:05 PM

Tollywood Actress Samantha Praises A student Gets Good Rank

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. మయోసైటిస్ నుంచి కోలుకున్నాక యోగ చేస్తూ బిజీగా ఉంటోంది. గతేడాది ఖుషీ, శాకుంతలం సినిమాలతో అలరించిన భామ.. సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ అభిమానిపై ప్రశంసలు కురిపించింది.

ఇటీవల రిలీజైన తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంకు సాధించింది. తన డైహార్డ్‌ ఫ్యాన్‌ అయిన అమ్మాయి ఎంసెట్‌ ర్యాంక్‌ సాధించడంతో సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆమెతో దిగిన ఫోటోను పంచుకుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ ఛాంపియన్‌ అంటూ సమంత రాసుకొచ్చింది. తన అభిమాని అయిన స్టూడెంట్‌ను స్టార్‌ హీరోయిన్‌ సమంత అభినందించడం చూసిన ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement