టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించడం లేదు. అందుకే ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. ఇటీవలే ఇషా ఫౌండేషన్‌లో సామ్ మెరిసింది. అక్కడ ధ్యానం చేస్తూ ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న భామ.. పూర్తిగా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
అయితే తాజాగా సమంత ఓ క్రేజీ కాంబోలో పని చేయనున్నట్లు వార్త తెగ వైరలవుతోంది. ఏకంగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ సరసన నటించనుందని బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలొచ్చాయి. కాగా.. గతేడాది ఆయన డైరెక్షన్‌లో వచ్చిన డుంకీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.
అయితే షారూఖ్ సరసన సమంత నటిస్తోందన్న వార్తలను రాజ్ కుమార్ హిరానీ సన్నిహితులు కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ రాసే దశలోనే ఉన్నారని తెలిపారు. ఈ సినిమాకు నటీనటులను ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. ఈ వార్తలన్నీ ఫేక్ అని డైరెక్టర్ సన్నిహితులు వెల్లడించారు. ఏ ప్రాజెక్ట్‌కి సంబంధించి షారుఖ్, సమంతతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.
కాగా.. 2022 ఇంటర్వ్యూలో సమంత ఒకసారి షారుఖ్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన డ్రీమ్ కో-స్టార్స్ ఎవరని అడిగినప్పుడు.. మహేష్ బాబు, సూర్య, షారూఖ్ పేర్లను సామ్ చెప్పింది. నేను ఇప్పటికీ షారుఖ్ ఖాన్‌తో కలిసి పని చేయలేదు.. నా కల ఇప్పటికీ నిజం కాలేదు సమంత వ్యాఖ్యానించింది.
మరోవైపు షారూక్ తదుపరి చిత్రం ది కింగ్‌లో తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి నటించనున్నాడు. దీనికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment