75,200 ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ | 75200 Engineering Seats Replacement: Telangana | Sakshi
Sakshi News home page

75,200 ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ

Published Sat, Jul 20 2024 6:17 AM | Last Updated on Sat, Jul 20 2024 6:17 AM

75200 Engineering Seats Replacement: Telangana

మొదలైన తొలి దశ సీట్ల కేటాయింపు 

కంప్యూటర్‌ కోర్సుల్లోనే 53 వేల సీట్లు 

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్స్‌లో తక్కువే 

కౌన్సెలింగ్‌కు దూరంగా టాపర్స్‌ 

వివరాలు వెల్లడించిన సాంకేతిక విద్యా శాఖ

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ తొలి దశ సీట్ల కేటాయింపు శుక్రవారం చేపట్టారు. సాంకేతిక విద్య విభాగం ఇందుకు సంబంధించిన వివరాలను సాయంత్రం వెల్లడించింది. మొత్తం 175 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. కనీ్వనర్‌ కోటా కింద 78,694 సీట్లు అందుబాటులో ఉండగా, వీటిల్లో 75,200 సీట్లు భర్తీ చేశారు. 3,494 సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 95.56 శాతం సీట్లు భర్తీ చేసినట్టు అధికారులు తెలిపారు. 95,735 మంది 62,60,149 ఆప్షన్లు ఇచ్చారు. 20,535 సరైన ఆప్షన్లు ఇవ్వలేదు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 6,038 మందికి సీట్లు వచ్చాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్‌లైన్‌ రిపోరి్టంగ్‌ చేయాలని సూచించారు. 

ముందుకు రాని టాపర్స్‌ 
ఈఏపీ సెట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు పొందడానికే ప్రాధాన్యమిచ్చారు. వందలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కేవలం ఒక్కరే తొలి కౌన్సెలింగ్‌లో సీటు కోసం పోటీ పడ్డారు. 201 నుంచి 500 ర్యాంకులు వచి్చన వాళ్ళు కూడా 10 మందే ఉన్నారు. ఆఖరుకు వెయ్యిలోపు ర్యాంకర్లు కూడా 74 మంది మాత్రమే కని్పంచారు. 5 వేలు పైబడిన ర్యాంకు వచ్చిన వాళ్ళే రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నించారు. 

 

53 వేల సీట్లు కంప్యూటర్‌ కోర్సుల్లోనే
భర్తీ అయిన 75,200 సీట్లల్లో 53,517 సీట్లు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ ఇతర కంప్యూటర్‌ సైన్స్‌ అనుబంధ గ్రూపుల్లోనే ఉన్నాయి. వివిధ విభాగాలుగా ఉన్న ఆరి్టఫిíÙయల్‌ ఇంటలిజెన్స్‌ బ్రాంచీలో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈలో 99.80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఐటీ, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌ కోర్సుల్లోనూ 97 శాతంపైగా సీట్లుకేటాయించారు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్‌ ఇంజనీరింగ్‌ల్లో సీట్లు తక్కువగా ఉన్నా మిగిలిపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement