Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

KSR Comments On TDP-Janasena-BJP Alliance Politics
కళ్లెదుటే అరాచకాలు.. దాస్తే దాగుతాయా?

ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతున్న తీరు, పైశాచికంగా రాజకీయ ప్రత్యర్ధులను నరుకుతున్న వైనం, ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తిపై సైతం దాడులు చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేసిన ఘట్టాలు గమనిస్తుంటే నలభైఆరేళ్ల సీనియర్ చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా ఉందా? అనే భావన కలగక మానదు. పైకి ఎప్పుడూ నీతులు వల్లిస్తూ, రౌడీయిజంను అణచివేస్తా.. అంటూ కబుర్లు చెప్పడం, దారుణమైన అకృత్యాలు జరుగుతుంటూ మాత్రం చూస్తూ ఊరుకోవడమే కాకుండా ఆ నేరాలు చేసేవారిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏపీ ప్రజలు ఇలాంటి పాలననా కోరుకుంది అనిపిస్తుంది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన రీతిలో అరాచకంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌, తదితర టీడీపీ, జనసేన నేతలు అదే అరాచకాన్ని నిజం చేసి చూపుతున్నారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా మద్దతు ఇస్తున్న పద్దతి నీచాతినీచంగా ఉంది. చివరికి హత్యలు చేసినవారిని, దాడులు చేసి వాహనాలను నాశనం చేసినవారిని సైతం ఈ మీడియా సంస్థలు వెనుకేసుకు వస్తూ జర్నలిజం స్థాయిని పాతాళానికి తీసుకువెళ్లాయి. అందుకు ఆ మీడియా యజమానులు ఏ మాత్రం సిగ్గుపడడకపోవడం విషాదం.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ఇంతవరకు సాగిన విధ్వంసకాండ ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. వారేదో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అంతు చూస్తున్నామని టీడీపీ వారు భావిస్తున్నారేమో తెలియదు కాని, చివరికి జరిగేది ప్రజలే టీడీపీ వారి అంతు చూసే పరిస్థితి వస్తుంది. వినుకొండలో నడిరోడ్డులో కత్తితో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను బహిరంగంగా, పాశవికంగా నరికిన ఘటన చంద్రబాబు రాక్షస పాలనకు అద్దం పడుతుంది.గతంలో జగన్ ప్రభుత్వంపై సైకో పాలన అంటూ ఏది పడితే అది మాట్లాడే ఆయన ఇప్పుడు నిజంగానే సైకో అంటే ఎలా ఉంటారో, శాడిజం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపిస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేసినవారు తమను తాము నిందించుకునే దశకు తీసుకువెళుతున్నారు. వినుకొండలో పాతపగల కారణంగా హత్య జరిగిందని టీడీపీ వారు, పోలీసులు, వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ప్రచారం చేశాయి. ఒకే అదే కరెక్టు అనుకుందాం. పాత పగలు ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడే కూటమి అధికారంలోకి వచ్చాకే ఎందుకు కత్తితో నరికాడు.31 మందిని రాష్ట్రంలో టీడీపీ వారు హత్య చేసినా ఏమీ కాలేదు కనుక.. ఇప్పుడు తనకు ఏమీ కాదులే.. తమ ప్రభుత్వమే ఉందిలే అనే ధీమాతో కాదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? పైగా మంత్రి లోకేష్ విపక్షంలో ఉన్నప్పుడు యువగళం యాత్రలో తిరుగుతూ ఒక్కొక్క టీడీపీ కార్యకర్త కనీసం పన్నెండు కేసులు పెట్టించుకోవాలని బహిరంగంగానే చెబుతూ వచ్చారు. అలా అయితేనే తనను కలవవచ్చని, పదవులు ఇస్తామని ఆయన అనేవారు. దానిని స్పూర్తిగా తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది వాస్తవం అనిపిస్తుంది.ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ఆఫర్ ఇచ్చేవారు. ఆ ప్రకారం ఇప్పుడు మర్డర్లు చేసినవారికి మంత్రి హోదా ఏమైనా కల్పిస్తారేమో చూడాలి. పుంగనూరులో అరాచకం నానాటికి పెట్రేగిపోతూనే ఉంది. దళిత నేత, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఉన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన తీరు ఏపీలో పోలీసు యంత్రాంగం ఎంత అసర్ధంగా ఉన్నదీ తెలియచేస్తుంది. దీనికి ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా కవరింగ్ ఇవ్వడం గమనిస్తే వీరు ఇంతగా దిగజారారా? అనేది తెలియచేస్తుంది.తాడిచెట్టు ఎందుకు ఎక్కారంటే దూడమేతకు అన్నట్లుగా వీరు ఒక వాదన తయారు చేశారు. కొందరు రైతులతో కలిసి టీడీపీ కార్యకర్తలు పుంగనూరు వచ్చిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని కలిసి ఆ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయిర్ల నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడానికి వెళ్లారట. అక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారట. ఈ కట్టుకధ అల్లడానికి సిగ్గుండాలి. అసలు ఒక ఎంపీ తన కార్యకర్తలతో సమావేశం అవుతుంటే వేరే పార్టీవారు వెళ్లడం ఏమిటి? ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ది కానప్పుడు మిధున్ రెడ్డి వారి సమస్యను ఎలా తీర్చుతారు.ప్రభుత్వంలో ఉన్నదే టీడీపీ అయితే, ఆ పార్టీవారు వైఎస్సార్‌సీపీ వారిని కోరడం ఏమిటి? అంటే టీడీపీ ప్రభుత్వం అంత అసమర్దంగా ఉందని వారు అనుకున్నారా? పైగా రెడ్డప్ప ఇంటి వద్ద ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, వాహనాలపై రాళ్లు వేయడం, ఒక వాహనాన్ని తగులపెట్టడం.. ఇలా చేసినవారిని రౌడీలు అంటారా? లేక రైతులు అంటారా? టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచే ఈ దాడుల సంస్కృతి తీవ్రంగా మారిందా అన్న డౌటు వచ్చేలా పాలన సాగుతోందనిపిస్తుంది.1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద పాదిరికుప్పం అనే గ్రామంలో కాంగ్రెస్‌కు ఓటేశారన్న కారణంగా దళితులు కొందరిని, బహుశా ఐదుగురిని అనుకుంటా.. టీడీపీ వారు దహనం చేసిన ఘటన తీవ్ర సంచలనం అయింది. 1987 ప్రాంతంలో ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద దళితులకు ఒక అగ్రవర్ణ సామాజికవర్గానికి మద్య గొడవలలో దళితులు పాతిక మందికిపైగా హత్యకు గురయ్యారు. 1988లో టీడీపీకి చెందినవారు విజయవాడలో నడిరోడ్డులో నిరాహార దీక్షలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను కత్తులు, గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఇలా బహిరంగంగా చంపడం అన్నది టీడీపీ గత చరిత్రలో కూడా ఉందన్నమాట.ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆ సందర్భంలో ఒక సామాజికవర్గంవారితో పాటు టీడీపీ వారు కూడా నష్టపోయారు. వ్యక్తిగత కక్షలతో టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవలు చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు గొడవలు, హింసాకాండ జరగడం మాత్రం ఇదే అని చెప్పాలి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి ఘర్షణలు దాదాపు లేవనే చెప్పాలి. ఆ తర్వాత కాలంలో అక్కడక్కడా జరిగినా ఈ స్థాయిలో లేవన్నది వాస్తవం. కాకపోతే ఏ చిన్న గొడవ జరిగినా ఈనాడు వంటి మీడియా బూతద్దంలో చూపడం, తెలుగుదేశం పెద్ద ఎత్తున హడావుడి చేయడం జరిగేది. అలాంటిది ఇప్పుడు ఇంత దారుణంగా హత్యాకాండ జరుగుతుంటే సంబంధిత వార్తల వాస్తవాలను ఇవ్వకపోగా, ఎదురు బాధితులపైనే నెపం నెడుతూ ఎల్లో మీడియా కధనాలు ఇవ్వడం శోచనీయం.బాధ్యతాయుతంగా ఉండవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సరైన రీతిలో స్పందించకపోవడం సమాజానికి చెడ్డ సంకేతం పంపిస్తోంది. గతంలో లోకేష్ నేరాలు ఎక్కువ చేసినవారికి పెద్ద పదవులు అన్నట్లుగా ఇప్పుడు మర్డర్ చేయడం మంత్రి హోదా కలిగిన పదవికి టీడీపీలో అర్హత పొందినట్లు అవుతుందేమో తెలియదు. ఇప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు హింసాకాండలో పాల్గొన్నారు. బహుశా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది కనుక వారిపై కేసులు పెట్టి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీరికి పదవులలో ప్రాధాన్యత ఇవ్వకపోతే వారిలో వారు గొడవలు పడతారో, ఏమో చూడాలి. తాము ఇంతమందిని చంపామని, లేదా ఇంత ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ వారిని కొట్టామని, ఇంత పెద్ద ఎత్తున ఇళ్లపై దాడులు చేశామని, కనుక తమకే పదవులు రావాలని డిమాండ్ చేసేలా ఉన్నారు.ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు టీడీపీ వారి ఘాతుకాలను తట్టుకోలేక ఊళ్లు వదలి వెళ్లిపోయారు. సుమారు 500కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీడీపీ వారు ధ్వంసం చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో చలనం లేకపోవడం. కనీసం ఈ దాడులు జరగకుండా చర్యలు చేపట్టండి అని చంద్రబాబు ప్రభుత్వానికి సలహా ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం ఉంది.టీడీపీ ఎంపీల మద్దతు కీలకం కావడంతో బీజేపీ పెద్దలు మౌనం దాల్చారనుకోవాలి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా గత ప్రభుత్వ టైమ్‌లో తన కార్యకర్తలను రెచ్చగొట్టేవారు. వైఎస్సార్‌సీపీ వారిని మెడలు పిసికాలని, కొట్టాలని.. ఇలా ఏవేవో తీవ్రమైన మాటలు చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇందిరాగాంధీ అంతటి గొప్ప నేతే ఎలా ఓటమిపాలైందో చరిత్ర తెలియచేస్తుంది. ఎమర్జన్సీ విదించి ఆమె వందల మంది విపక్షనేతలను జైళ్లలో పెట్టించింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జైళ్ల నుంచి విడుదల అయిన విపక్ష నేతలంతా ఒక్కటే, ప్రజల మద్దతు కూడగట్టుకుని ఆమెను పరాజయం పాలు చేశారు.రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఆ సంగతులన్నీ తెలిసినా చంద్రబాబు పాలన ఇలా హీనంగా సాగడం వల్ల ఏమి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. ఈ ఘటనలతోనే ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది భ్రమే అవుతుంది. గత ప్రభుత్వంలో జరిగాయి కనుక ఇప్పుడు ఇంత ఎక్కువ హింస జరుగుతోందని టీడీపీ, లేదా ఎల్లో మీడియా వాదించవచ్చు. అది కరెక్టా? కాదా? అన్నది పక్కనబెడితే , ఒకవేళ అది నిజమే అనుకున్నా, అంతకంటే ఘోరంగా హింసకాండ చేయమని ప్రజలు టీడీపీని ఎన్నుకున్నారా? తమ ప్రభుత్వం వచ్చింది ప్రత్యర్ధులపై కక్ష రాజకీయాలకు పాల్పడడానికే అని బహిరంగంగా చెప్పి చేయడమే మిగిలింది. ఏమి చేస్తాం. ఇలాంటివారిని ఎన్నుకున్నామని ప్రజలు తమ నెత్తి తాము కొట్టుకోవడం తప్ప.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Ysrcp Parliamentary Party Meeting Updates
ఏపీలో అరాచకాలపై పార్లమెంట్‌లో గళమెత్తాలి: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ‘‘వినుకొండలో జరిగిన హత్యా ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే.. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డుమీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం.’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్‌ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది. రషీద్‌… వైన్‌షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ఎల్లోమీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్‌ కాల్చిన ఘటనకు, జరిగిన దారుణహత్యకు ముడిపెట్టే ప్రయత్నంచేస్తున్నారు. కాలిన బైక్‌.. వైఎస్సార్‌సీపీ వాళ్లది, దీనికి సంబంధించిన కేసు కూడా నమోదయ్యింది. దాన్ని ట్విస్ట్‌ చేసి… నానా తప్పుడు రాతలు రాస్తున్నారు.’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..మా కొడుకు ఏం తప్పుచేశాడని రషీద్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వైఎస్‌ జగన్‌ ఉంటే.. మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడురోజుల్లో ఘటనలు జరిగాయిదీనికి ముందు ఉన్న ఎస్పీ మల్లికాగార్గ్‌ను ఉద్దేశపూర్వకంగా బదిలీచేశారుఇప్పటివరకూ 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు.వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉందిలోకేష్‌ పుట్టినరోజున హతుడు ఎమ్మెల్యే భార్యకు కేక్‌ తినిపించిన ఫొటోలు హంతకుడి ఫొటోలను తల్లిదండ్రులు చూపారుస్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫొటోలనుకూడా తల్లిదండ్రులు చూపారుతన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారుటీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ప్లాన్‌చేసి దాడులు చేశారుమాజీ ఎంపీ రెడ్డప్ప, న్యాయవాది అయిన రెడ్డప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారుతప్పులు వారు చేసి తిరిగి మన పార్టీ వాళ్లమీద కేసులు పెడుతున్నారు.రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలి15 సంవత్సరాలగా వైయస్సార్‌సీపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్థానంలో ఉందిచంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కలేరుజరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయిరాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేయాలిచంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలిపోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదురేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారుబుధవారం నాడు నిరసన తెలుపుతాంరాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతాంఈ విషయంలో మనతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలిజరిగిన ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉందిఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల పాయింట్‌మెంట్లను కోరాను.ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివికావు:అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీమీద దాడులు చేయడం అనేది ధర్మమా?ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది?రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదుప్రజాస్వామ్యం మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలిఅన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలిరాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచికాదుప్రభుత్వాలు చేసే మంచి పనులు ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయిబుధవారం ధర్నా అయిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలో రాష్ట్రంలో దారుణమైన, హింసాత్మక పరిస్థితులపైన గళం విప్పాలిపార్లమెంటు దృష్టికి, దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలను తీసుకు వెళ్లాలిఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత అప్పగించాలని వైఎస్‌ జగన్‌ ఆదేశంఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి వెంటనే ఈకార్యక్రమంలో నిమగ్నం కావాలని ఆదేశంగత ఎన్నికల్లో మనం 86శాతం సీట్లను గెలిచాంఅయినా ఇలాంటి ఘటనలు జరగలేదువైఎస్సార్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాందాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదుప్రజలందరినీ సమానంగా చూశాం, అందరికీ పారదర్శకంగా సేవలు అందించాంప్రజలిచ్చిన వాగ్దానాల అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశందీనిపై ఎవ్వరూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశంఅందుకే దగ్గరుండి వీటిని ప్రోత్సహిస్తున్నారుపార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యంఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యతఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలికార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలిరాష్ట్రంలో వైయస్సార్‌సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారువారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందిమన పోరాటం ద్వారా గట్టి ఒత్తిడి తీసుకురావాలి

KTR And BRS Leaders Meets Telangana Governor
గవర్నర్‌ను కలిసిన కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు.. కాంగ్రెస్‌పై ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులు, పార్టీ ఫిరాయింపుల అంశం, ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.గవర్నర్‌తో భేటీ అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు తుంగలో తొక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో నిరుద్యోగులపై కేసులు, దాడులు జరుగుతున్నాయని.. హైదరాబాద్‌లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. మొదటి సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే లేదని అన్నారు. గతంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవని తెలిపారు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకొచ్చి అరెస్టులు చేశారన్నారు.‘రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఖననంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. పార్టీ ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేశాం. భయపెట్టి పదిమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తేదీలతో సహా గవర్నర్‌కు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశాం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని వివరించాం. ఈ రెండు అంశాలపై గవర్నర్‌కు సుదీర్ఘంగా మా అభ్యర్థన వినిపించాం. హోమ్ శాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలిపారు. ఎమ్మెల్యేలపై ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరుగుతుంది. మాలో ఎవరికి కూడా నియోజకవర్గాల్లో గౌరవం దక్కడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలుస్తాం. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయంపై వివరిస్తాం. కాళేశ్వరంలో జరిగిన చిన్నతప్పి దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను సందర్శిస్తాం’ అని తెలిపారు

Actor Madhavan Shares His Weight Loss Method
జిమ్‌ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్‌

‘‘వ్యాయామం చేయలేదు. రన్నింగ్‌ చేయలేదు. సర్జరీ అసలే లేదు. మెడికేషన్‌ పాటించలేదు... కానీ 21 రోజుల్లోనే పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యాను. బాగా బరువు తగ్గిపోయాను’’... ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ సినిమాలో తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌ గురించి మాధవన్‌ చెప్పిన మాటలు ఇవి. ఈ ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవన్‌ వెల్లడించగా, ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మాధవన్‌ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన బయోగ్రాఫికల్‌ డ్రామా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా మాధవన్‌ ఈ సినిమాను తెరకెక్కించి, టైటిల్‌ రోల్‌ చేశారు. ఈ చిత్రంలో మాధవన్‌ వివిధ వయస్సుల్లో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో బాగా బరువు పెరిగి, పొట్ట ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఈ లుక్‌ నుంచి మాధవన్‌ మళ్లీ తన సాధారణ లుక్‌కు మారేందుకు కేవలం 21 రోజులు మాత్రమే పట్టిందట. ఆ మార్పు గురించి మాధవన్‌ మాట్లాడుతూ– ‘‘నేనొక డాక్టర్‌లా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. నా శరీరానికి ఏది మంచి ఆహారమని భావించానో దాన్నే తిన్నాను. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’కి దర్శకత్వం వహిస్తున్నప్పుడు కాస్త పొట్టతో కనిపించేవాడిని. ఆ తర్వాత 21 రోజులకు నార్మల్‌గా మారిపోయాను. ఇదంతా నేను తీసుకున్న ఆహారం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. చెప్పాలంటే నా జీవితంలోనే సైన్స్‌ ఓ భాగమైపోయిందని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయంపై మాధవన్‌ స్పందిస్తూ– ‘‘అప్పుడప్పుడూ ఉపవాసం ఉన్నాను. ఆహారాన్ని 45 నుంచి 60 సార్లు బాగా నమిలాను (మీ ఆహారాన్ని తాగండి... నీటిని నమలండి). సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకే రోజులోని నా చివరి భోజనం పూర్తయ్యేది. జ్యూస్‌లు ఎక్కువగా తాగాను. ఆకుపచ్చ కూరగాయలు తిన్నాను. ఉదయాన్నే సుదీర్ఘంగా నడిచేవాడ్ని. నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు ఏ స్క్రీనూ చూడలేదు. రాత్రివేళ గాఢంగా నిద్రపోతాను. నా శరీరానికి, నా ఆరోగ్యానికి, నా జీవన శైలికి, జీవక్రియకు తగ్గట్లుగా ఆహారాన్ని తీసుకున్నాను. దాంతో క్రమ క్రమంగా మార్పు వచ్చింది’’ అన్నారు. No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan (@aadaavaan) July 17, 2024

Nasa Devulge Interesting Facts On iss De Commission And Further Research
‘ఐఎస్‌ఎస్‌’ కూల్చడమెందుకు? ‘నాసా’ ఏం చెప్పింది?

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్(ఐఎస్‌ఎస్‌) ఫ్యూచరేంటి..? 400కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో తిరుగుతున్న ఐఎస్‌ఎస్‌ను కక్ష్య నుంచి తప్పించి ఎలా కూలుస్తారు. ఐఎస్‌ఎస్‌ను కక్ష్య నుంచి తప్పించేందుకు సిద్ధం చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్‌ వెహిహికిల్‌(యూఎస్‌డీవీ)ని ఎలా ఉపయోగిస్తారు..?అసలు ఐఎస్‌ఎస్‌ను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతా సజావుగా జరిగి 2030లో ఐఎస్‌ఎస్‌ నింగి నుంచి మాయమైన తర్వాత అంతరిక్ష పరిశోధనల మాటేమిటి..? ఈ విషయాలన్నింటిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అసలు ఐఎస్‌ఎస్‌ ఏంటి.. ఎందుకు..?అమెరికా, రష్యా, కెనడా, జపాన్‌, యూరప్‌లు 1998 నుంచి 2011వరకు శ్రమించి ఐఎస్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాయి. 2000 సంవత్సరం నవంబర్‌ 2వ తేదీనే ఐఎస్‌ఎస్‌ కమిషన్‌ అయింది. అప్పటినుంచే అది అంతరిక్షంలో వ్యోమగాములకు ఆశ్రయమిస్తూ ఎన్నో పరిశోధనలకు వేదికైంది. ప్రస్తుతం 15 దేశాలు ఐఎస్‌ఎస్‌ను నిర్వహిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భారీ ఖర్చుతో ఐఎస్‌ఎస్‌ను నిర్మించారు. ఆశించినట్లుగానే స్పేస్‌ రీసెర్చ్‌లో 24 ఏళ్లుగా ఐఎస్‌ఎస్ గొప్పగా సేవలందిస్తోంది.డీ కమిషన్‌ చేయడం ఎందుకు..?ఐఎస్‌ఎస్‌ నింగిలో పనిచేయడం ప్రారంభించి 2030నాటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి ఐఎస్‌ఎస్‌ చాలా పాతదవుతుంది. అంతరిక్ష వాతావరణ ప్రభావం వల్ల దాని సామర్థ్యం తగ్గిపోతుంది. అందులోని చాలా విడిభాగాలు పనిచేయవు. ఐఎస్‌ఎస్‌లోని పరికరాలన్నీ నెమ్మదిస్తాయి. ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు నివసించే మాడ్యూళ్లు పనికిరాకుండా పోతాయి. అది ప్రస్తుతం తిరుగుతున్న 400 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్‌ నుంచి దానికదే కిందకు దిగడం ప్రారంభమవుతుంది. నిజానికి ఐఎస్‌ఎస్‌ను నిర్దేశిత కక్ష్యలో ఉంచడం మళ్లీ సాధ్యమే అయినప్పటికీ అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇందుకే 2030లో ఐఎస్‌ఎస్‌ను డీ కమిషన్‌ చేయాలని నిర్ణయించారు.ఎలా కూలుస్తారు..?ఐఎస్‌ఎస్‌ను తొలుత కక్ష్యలో నుంచి తప్పించి(డీఆర్బిట్‌) నెమ్మదిగా భూమిపై కూల్చేస్తారు. ఐఎస్‌ఎస్‌ను కక్ష్య నుంచి తప్పించి భూమిపై కూల్చేయడం సాధారణ విషయం కాదు. దీనిని చాలా అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ నైపుణ్యంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఈలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్ కంపెనీ తయరు చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్‌ వాహనాన్ని నాసా వాడనుంది. 2030లో ఐఎస్‌ఎస్‌ను డీ కమిషన్‌ చేయనున్నప్పటికీ 18 నెలల ముందే డీ ఆర్బిట్‌ వెహికిల్‌ నింగిలోకి వెళ్లి ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐఎస్‌ఎస్‌ను కక్ష్య నుంచి తప్పించి జాగ్రత్తగా భూ వాతావరణానికి తీసుకువస్తారు. భూ వాతావరణానికి రాగానే ఐఎస్‌ఎస్‌ మండిపోతుంది. దాని శకలాలను మనుషులెవరూ ఉండని దక్షిణ పసిఫిక్‌ ఐలాండ్‌లలో పడేలా చేస్తారు. డీఆర్బిట్‌ వెహిహికల్‌ ఎలా పనిచేస్తుంది..సాధారణంగా ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను మోసుకెళ్లి దానితో అనుసంధానమయ్యే డ్రాగన్‌ కాప్స్యూల్స్‌తో పోలిస్తే డీఆర్బిట్‌ వెహికిల్‌ యూఎస్‌డీవీకి ఆరు రెట్ల ఎక్కువ శక్తి కలిగిన ప్రొపల్లెంట్‌ ఉంటుంది. డీ ఆర్బిట్‌ వెహికిల్‌ ఐఎస్‌ఎస్‌ డీ కమిషన్‌కు 18 నెలల ముందే వెళ్లి దానితో అనుసంధానమవుతుంది. ఇంకో వారంలో ఐఎఎస్‌ఎస్‌ డీ ఆర్బిట్‌ అవనుందనగా యూఎస్‌డీవీలోని ఇంధనాన్ని మండించి ఐఎస్‌ఎస్‌ను కక్ష్య నుంచి తప్పించి భూమివైపు తీసుకురావడం మొదలుపెడతారు. చివరిగా భూ వాతావరణంలోకి రాగానే ఐఎస్‌ఎస్‌ మండిపోతుంది. దీంతో ఐఎస్‌ఎస్‌ 30 ఏళ్ల ప్రస్థానం ముగిసిపోతుంది.ఐఎస్‌ఎస్‌ తర్వాత నాసా ప్లానేంటి..? పరిశోధనలు ఎలా..? ఐఎస్‌ఎస్‌ చరిత్రగా మారిన తర్వాత సొంతగా కొత్త స్పేస్‌ స్టేషన్లను అభివృద్ధి చేసే ప్లాన్‌ అమెరికాకు లేదు. ప్రైవేట్‌ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న స్పేస్‌ స్టేషన్‌లను అద్దెకు తీసుకుని అంతరిక్ష పరిశోధనలు చేసే అవకాశముంది. ఒకవేళ 2030కల్లా ప్రైవేట్‌ కంపెనీల స్పేస్‌ స్టేషన్‌లు సిద్ధం కాకపోతే డీ ఆర్బిట్‌ వెహికిల్‌ను వాడి ఐఎస్‌ఎస్‌ జీవితకాలాన్ని పొడిగించాలన్న ప్లాన్‌ బీ కూడా నాసాకు ఉండటం విశేషం.

Manoj Soni Resigned From The Post Of Upsc Chairman
యూపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి మనోజ్‌ సోని రాజీనామా

ఢిల్లీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఛైర్మన్‌ పదవికి మనోజ్‌ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ఐదేళ్లు పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే.. మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సమాచారం. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. 2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరిన మనోజ్ సోనీ.. మే 16, 2023న చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్‌గా ఆయన పనిచేశారు.ప్రొబేషనరీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ వివాదం నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజుల ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు సమాచారం. ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ పరీక్షతోనే ఐఏఎస్‌కు ఎంపికైన ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ ఇటీవల అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. 2022 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్‌ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్‌ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్‌ నోటీసులు కూడా పంపించింది.కాగా, మనోజ్‌ సోని రాజీనామా చేయడం వెనుక.. మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Crowdstrike may lose 6 billion fifth of its value amid global IT outage
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘క్రౌడ్‌స్ట్రయిక్‌’ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. అనేక కంపెనీలు, విమానాశ్రయాలను తాకిన భారీ ఐటీ అంతరాయం కారణంగా క్రౌడ్‌స్ట్రయిక్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి.యూఎస్‌లో ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌లో దాని విలువలో ఐదవ వంతును కోల్పోయాయి. అనధికారిక ట్రేడింగ్‌లో 21% తగ్గాయి. ఫలితంగా క్రౌడ్‌స్ట్రయిక్‌ వాల్యుయేషన్‌లో దాదాపు 16 బిలియన్‌ డాలర్ల (రూ.1.34 లక్షల కోట్లు) నష్టానికి దారి తీస్తుంది.మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్‌’ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్‌ సెన్సార్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్, సర్వీసెస్‌ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్‌ దాడి కాదు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తప్పుడు అప్‌డేట్‌ను రన్‌ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్‌’ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్‌ సీఈఓ జార్జ్‌ కుర్జ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు.

Mohammed Shami Breaks Silence On Rumours Of Marriage With Sania Mirza
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్‌ షమీ

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ-టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం చేసుకోబోతున్నారంటూ గ‌త కొన్ని రోజులగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ వార్త‌లను సానియా తండ్రి ఖండిస్తూ ఓ క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌ట‌కి.. ఎదో ఒక చోట వీరిద్ద‌రూ పెళ్లి ప్రస్తావన వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై మహ్మద్ షమీ స్పందించాడు. ఇటీవలే శుభంకర్ మిశ్రా అనే యూట్యూబర్‌కు షమీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన రెండో పెళ్లి గురుంచి వస్తున్న పుకార్లపై షమీని శుభంకర్ మిశ్రా ప్రశ్నించాడు."ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. సానియాతో నా పెళ్లి అనేది కేవలం రూమర్స్ మాత్రమే. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం మానుకోవాలి. మీ సరదా కోసం ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదు. మీరు చేస్తుంది సరైనది కాదు. ఆ మధ్య కాలంలో నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే చాలు అవే మీమ్ప్ కనిపించేవి. మీమ్‌లు అనేది కేవలం వినోదం కోసం మాత్రమే. అంతే తప్ప అబద్దాలను ప్రచారం చేయడానికి కాదు. ట్రోలర్స్, మీమర్స్‌కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను.దయచేసి వ్యక్తిగత జీవితాల విషయానికి రావొద్దు. ఒకరి వ్యక్తిగత జీవితాన్నిఇంకొకరితో ముడివేస్తూ వారిని బజారుకి లాగవద్దు. మీకు దమ్ము ఉంటే ఇలాంటి పోస్టులను గుర్తింపు లేని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి కాకుండా నిజమైన అకౌంట్స్ నుంచి పోస్ట్ చేయండి.అప్పుడు నేను ఏమి సమాధానం చెప్పాలో అదే చెబుతా. దయచేసి ఎటువంటి వికృత చేష్ఠలు మానుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నంచండి. మీ వంతు ప్రజలకు సహాయం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అప్పుడే మీరు మంచి వ్యక్తిగా ఈ సమాజంలో జీవించగలరు" అని షమీ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు. కాగా ష‌మీ ఇప్ప‌టికే త‌న భార్య హసిన్ జహాన్‌కు విడాకులు ఇవ్వ‌గా.. సానియా కూడా తన భ‌ర్త‌ షోయ‌బ్ మాలిక్‌తో విడిపోయింది.

Tragic fire claims four member Malayali family deceased in Kuwait
కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం

గల్ఫ్‌​ దేశం కువైట్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ భారతీయ కుటుంబం సజీవదహనం అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కువైట్‌లోని అబ్బాసియా ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో చోటు చేసుకుంది.వివరాలు.. కేరళకు చెందిన నాలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు రాత్రి 9 గంటలకు నిద్రపోయిన తర్వాత వారిలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే ఆ కుటుంబం మంటల్లో సజీవదహనం అయింది.Four members of a #Malayali family died in a fire accident at their residence in Abbasiya, #Kuwait. The deceased are Mathew Muzhakkal, his wife Lini Abraham, and their children Isaac and Irene, all hailing from Thiruvalla, #Kerala.The fire broke out in the second-floor… pic.twitter.com/AAa8K7jZqz— South First (@TheSouthfirst) July 20, 2024మృతి చెందినవారిని మాథ్యూ ములక్కల్ (40), అతని భార్య లిని అబ్రహం (38), వారి పిల్లలు ఇరిన్ (14),ఇస్సాక్ (9)గా గుర్తించారు. వీరు కేరళలో అలప్పుజ జిల్లాలోని నీరట్టుపురానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇటీవల వారు కేరళ వచ్చి.. శుక్రవామరే అక్కడివెళ్లారు. అంతలోనే రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనలో కుటుంబం మొత్తం మృతి చెందటంపై తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు కనీరుమున్నీరు అవుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఇంట్లోని ఏసీ పవర్‌ ఫెయిల్యూర్‌ కారణంగా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో వారంతా విషపూరిత వాయువును పీల్చుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక.. గతనెల ఓ అపార్టుమెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో మొత్తం 49 మంది మరణించగా.. 45 మంది భారతీయులేనని అధికారలు గుర్తించారు. ఇందులో కేరళ, తళమిళనాడుకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది.

Kethireddy Pedda Reddy Who Went To Tadipatri Police Station
తాడిపత్రిలో హై టెన్షన్‌

సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్‌ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. బెయిల్‌ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్‌ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement
National View all
title
విమానంలో మహిళ పట్ల జిందాల్‌ స్టీల్‌ సీఈవో పైత్యం : స్పందించిన సంస్థ

జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు  విమానంలో తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ కోలకతాకు చెందిన ఒక మహిళ ఆర

title
సినీ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. మూవీ టి​కెట్స్‌, ఓటీటీలపై పన్ను

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సినిమా అభిమానులకు

title
భారీ వర్షాలతో కూలిన బిల్డింగ్‌.. మహిళ మృతి

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

title
కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్‌

ఢిల్లీ: లిక్కర్ పాలసీ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై తిహార్‌ జ

title
కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం

గల్ఫ్‌​ దేశం కువైట్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

NRI View all
title
కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం

గల్ఫ్‌​ దేశం కువైట్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

title
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా

title
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.

title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

title
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all