న్యూఢిల్లీ: పర్యాటక రంగం 2022 నాటికి 50 బిలియన్ డాలర్ల (రూ.3.55 లక్షల కోట్లు) ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ సూచించారు. ఈ రంగానికి వృద్ధి అవకాశాలు, ఉపాధి కల్పన అవకాశాలు అపారంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సీఐఐ 15వ వార్షిక పర్యాటక సదస్సు ఢిల్లీలో గురువారం జరిగింది. దీనికి కాంత్ హాజరై మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం పర్యాటకానికి ఉందన్నారు. ‘‘2018లో భారత పర్యాటక రంగం 28.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీన్ని 2022 నాటికి 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యాన్ని పెట్టుకోవాలి’’అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment