Niti Aayog CEO
-
టారిఫ్‌లు తగ్గిస్తే దేశానికే మంచిది: నీతి ఆయోగ్ సీఈవో
న్యూఢిల్లీ: టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) ఏ దేశాన్ని కాపాడలేవని, ఎవరో చెప్పారని కాకుండా భారత్ తన ప్రయోజనాల కోసం సుంకాలు తగ్గించాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రపంచంతో స్వేచ్ఛాయుత వాణిజ్యం నెరపడం ఐదు కీలక ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలన్నారు. టారిఫ్‌లు తగ్గించేందుకు వీలుగా భారత్ యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఇతర ప్రముఖ ఆర్థిక వ్యవస్థలతో ముందుగా వాణిజ్య ఒప్పందాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో నియంత్రణలను తొలగించడం ప్రపంచ సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానానికి కీలకమన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఆసక్తి ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు ఇక్కడి వచ్చి చూసి వేరే దేశాలకు వెళ్లిపోతున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు అనుసరిస్తున్న ‘చైనా ప్లస్ వన్’ విధానంతో ఇండోనేషియా, వియత్నాం, టర్కీ ఎక్కువగా లాభపడుతున్నట్టు తెలిపారు. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలకు మించి నియంత్రణల తొలగింపు, నైపుణ్యాభివృద్ది అన్నవి అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు అవసరమన్నారు.వివిధ రంగాల్లో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్‌ను భాగం చేసేందుకు నీతి ఆయోగ్ కృషి చేస్తున్నట్టు సుబ్రమణ్యం తెలిపారు. ఎల్రక్టానిక్స్ విడిభాగాలకు సంబంధించి తాము చేసిన సిఫారసులు కేబినెట్ ఆమోదానికి వేచి ఉన్నట్టు్ట చెప్పారు. ఆటో విడిభాగాలు, కెమికల్స్, టెక్స్టైల్స్, పాదరక్షలను సైతం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో అనుసంధానించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు ప్రకటించారు. తాము రూపొందించిన జాతీయ తయారీ మిషన్‌ను మూడు నెలల్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు విద్య, వ్యవసాయానికి సైతం ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. -
ఆర్సీఈపీ, సీపీటీపీపీలో భారత్ చేరాలి
న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)తోపాటు, సమగ్ర, ట్రాన్స్‌పసిఫిక్ పార్టనర్షిప్కు సంబంధించి ప్రగతిశీల అంగీకారం (సీపీటీపీపీ)లో భారత్ కూడా భాగం కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. 2019లో ఆర్సీఈపీ నుంచి భారత్ బయటకు రావడం గమనార్హం. ‘‘భారీ వాణిజ్య ఒప్పందాల్లో పాలుపంచుకోని దేశాల్లో భారత్ ఒకటి. ఆర్సీఈపీ, సీపీటీపీపీలో భారత్ పాలుపంచుకోవడంతోపాటు సభ్య దేశం కావాలి. దేశ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు ఇది మేలు చేస్తుంది. దేశ ఎగుమతుల్లో 40 శాతం ఎంఎస్ఎంఈలవే ఉంటున్నాయి. బడా కొర్పొరేట్ సంస్థలు గొప్ప ఎగుమతిదారులుగా లేవు’’అని అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆర్సీఈపీ అన్నది 10 ఆసియా దేశాల కూటమి. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిల్యాండ్, ఫిలిప్పీన్స్, లావోస్, వియత్నాం సభ్యదేశాలుగా ఉన్నాయి. సీపీటీపీపీ అన్నది కెనడా, మెక్సికో, పెరూ, చిలే, న్యూజిల్యాండ్, ఆ్రస్టేరలియా, బ్రూనై, సింగపూర్, మలేషియా, వియత్నాం, జపాన్‌తో కూడిన కూటమి.చైనా ప్లస్ వన్‌తో పెద్దగా లబ్ది పొందలేదు..చైనా ప్లస్ వన్ అవకాశాలను భారత్ తగినంత అందిపుచ్చుకోలేదని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారత్ కంటే వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, తుర్కియే, మెక్సికో ఎక్కువగా ప్రయోజనం పొందినట్టు చెప్పారు. అంతర్జాతీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్ బలపడాలంటూ 70 శాతం వాణిజ్యం ఈ రూపంలోనే ఉంటుందన్నారు. ఇతర దేశాల కంటే మన దగ్గర టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మన దగ్గర 2–3 అవరోధాలున్నాయి. టారిఫ్‌లు ఎక్కువగా ఉండడం ఇందులో ఒకటి. టారిఫ్‌లను తగ్గించకపోతే మనం ప్రయోజనం పొందలేం. అలాగే, మనకు కావాల్సిన స్థాయిలో ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు ఉండడం లేదు. సామర్థ్య వినియోగం 70 శాతంగానే ఉంది’’అని సుబ్రమణ్యం వివరించారు. అంతర్జాతీయంగా భారత్ ప్రకాశిస్తున్న కిరణమంటూ, విధానపరమైన స్థిరత్వంతోపాటు సంస్కరణలు వేగవంతమైన వృద్ధి దిశగా నడిపిస్తున్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 8.2 శాతం జీడీపీ వృద్ధిని గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధిలో భారత్ 20 శాతం వాటా సమకూరుస్తోందని, రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుందన్నారు. -
విద్యార్థులే భవిష్యత్ హీరోలు!!
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో విద్యార్థులే భవిష్యత్ హీరోలు. తాము నేర్చుకున్న నైపుణ్యాలతో సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలి. పరిశోధనలు, ఆవిష్కరణల్లో ముందుండాలి. సాంకేతిక నైపుణ్యాలతో చేసే పరిశోధనలు సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. అప్పుడే చదివిన చదువుకు సార్థకత లభిస్తుంది. – నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అప్పుడే చదివిన చదువుకు సార్థకత..సాంకేతిక కోర్సులు అభ్యసించాలనుకునే ఔత్సాహిక విద్యార్థులంతా ఐఐటీల్లో సీట్లు సాధించాలని భావిస్తున్నారు. ఆ సర్టిఫికెట్లతో మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్వసిస్తున్నారు. అయితే.. ఐఐటీ సర్టిఫికెట్ ఉంటే వ్యక్తిగత కీర్తిప్రతిష్టలు, అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తాయనే ఆలోచనలకే పరిమితం కాకూడదు. ఐఐటీల్లో తాము నేర్చుకున్న నైపుణ్యాలతో సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలి. సాంకేతిక నైపుణ్యాలతో చేసే పరిశోధనలు సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. అప్పుడే చదివిన చదువుకు సార్థకత లభిస్తుంది. యువత ముందు వరుసలో ఉండాలి..2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో విద్యార్థులే భవిష్యత్ హీరోలు. ముఖ్యంగా సామాజిక అభివృద్ధికి చేసే పరిశోధనలు, ఆవిష్కరణల్లో యువత ముందు వరుసలో ఉండాలి. ఈ క్రమంలో విద్యార్థులు సంకుచిత లేదా పరిమిత ఆలోచనల చట్రంలోంచి బయటకు రావాలి. విశాల దృక్పథంతో తమ ఆలోచనల పరిధిని విస్తృతం చేసుకోవాలి. దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడాలి.30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఈ రెండే కీలకం..ప్రస్తుతం మనం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. రానున్న రోజుల్లో 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాలను సాధించడానికి.. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి.. విద్య, నైపుణ్యాలే ఎంతో కీలకం. ప్రస్తుతం మనదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కూడా ఈ రెండు అంశాలే ప్రధాన కారణం. ఈ క్రమంలో చేతివృత్తుల నుంచి ఐటీ రంగం వరకు.. అన్ని రంగాల్లోని వారు నిరంతరం ఆధునిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఇప్పుడు చేసే పనిని భవిష్యత్తులో రోబోలు చేయొచ్చు. అప్పుడు అకస్మాత్తుగా ఆ మార్పును అందిపుచ్చుకోలేక వృత్తిలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించి ఆధునిక నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఇక.. ఐటీ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రంగంలోని విద్యార్థులు, ఉద్యోగులు ఏఐ, ఐవోటీ వంటి ఆధునిక నైపుణ్యాలను నిరంతరం నేర్చుకోవాలి. వాటిలో పట్టు సాధిస్తేనే భవిష్యత్తులో ముందుండటానికి అవకాశం ఉంటుంది.స్టార్టప్స్‌కు వెన్నుదన్నుగా..ఇటీవల కాలంలో మన దేశం అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలవడానికి మరో ప్రధాన కారణం.. స్టార్టప్స్‌కు వెన్నుదన్నుగా పలు చర్యలు తీసుకోవడం. విద్యా సంస్థల స్థాయిలోనే ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం, ఏంజెల్ ఫండింగ్ చేసేందుకు పెట్టుబడిదారులు అంగీకరించేలా ప్రణాళికలు రూపొందించడం వంటి చర్యలతో స్టార్టప్స్ సంఖ్య పెరుగు తోంది. ముఖ్యంగా ఐఐటీల్లో ఇవి విస్తృతమవుతున్నాయి. దేశంలో 100కు పైగా ఉన్న యూనికార్న్ స్టార్టప్స్‌లో 15 శాతం సంస్థలు ఐఐటీ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినవే. ఇదే తరహాలో అన్ని ప్రాంతాల స్టార్టప్స్‌కు తోడ్పాటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ముందుకు రావాలి..దేశాభివృద్ధికి తోడ్పడే యువతను తీర్చిదిద్దడంలో ప్రైవేట్ విద్యా సంస్థలూ ముందుకు రావాలి. కేవలం లాభాపేక్షతో విద్యా సంస్థలను నిర్వహించే ధోరణి విడనాడాలి. తమ విద్యార్థులు కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వాము లయ్యేలా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇంక్యుబేషన్ కేంద్రాలు, స్టార్టప్స్‌కు తోడ్పాటు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి.అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి..వేల సంవత్సరాల క్రితమే.. భారత్ అన్ని రకాలుగా ఎంతో ముందున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అలాంటి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే.. అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి. ఈ క్రమంలో నూతన జాతీయ విద్యా విధానంలోని మార్గదర్శకాలు సత్ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమాజంలోని అన్ని వర్గాల వారికి విద్యా ఫలాలు అందేలా జాతీయ విద్యా విధానం రూపకల్పన జరిగింది.గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా భారత్..విదేశీ విద్యకు వెళుతున్న విద్యార్థుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో మన దేశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో.. అంతర్జాతీయ విద్యార్థులే మన దేశానికి వచ్చేలా, మన దేశాన్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడాన్ని విజన్–2047 లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో 2047 నాటికి ఏటా ఐదు లక్షల మంది విదేశీ విద్యార్థులు.. ఉన్నత విద్య కోసం భారత్‌కు వచ్చేలా విద్యా రంగంలో మార్పులు చేయనున్నాం. అదే విధంగా మన విద్యార్థులు కూడా స్వదేశంలోనే చదువుకునేలా ఇక్కడి విద్యా సంస్థలను మెరుగుపరిచే చర్యలకు కూడా సిఫార్సు చేశాం.పరిశ్రమలు– విద్యా సంస్థల భాగస్వామ్యందేశాభివృద్ధిలో యువతది కీలక పాత్ర కానున్న నేపథ్యంలో పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం కూడా ఎంతో ప్రధానమని గుర్తించాలి. పరిశ్రమల అవసరాలకనుగుణంగా కోర్సులు లేకపోతే.. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు పరిశ్రమలు, ఇటు విద్యా సంస్థలు నిరంతరం సంప్రదింపులు సాగించాలి. పరిశ్రమల అవసరాలను తీర్చే విధంగా విద్యార్థులకు విద్యా సంస్థలు నైపుణ్యాలు అందించాలి.అప్పుడు విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుంది. వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా సాగుతాయి. ఇవి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడతాయి. అందుకే విద్యా సంస్థల కరిక్యులం, ఇతర బోధన వ్యవహారాల్లో పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి పరిశ్రమలు–విద్యా సంస్థల భాగస్వామ్యం కూడా ఒక ప్రధాన కారణం.బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రొఫెల్ఛత్తీస్గఢ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారిజమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో సంయుక్త కార్యదర్శి వంటి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.2022లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.2023లో నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు.విజన్–2047 డాక్యుమెంట్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. -
భారత్‌లో పేదరికం తగ్గుతోంది: నీతి అయోగ్ రిపోర్ట్!
భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు ఫలవంతమయ్యాయి. భారత్‌లో శుభ పరిణామాం మొదలవుతోందన్న కొత్త ఆశలను అందిచింది నీతి అయోగ్ సర్వే. అది జరిపిన తాజా సర్వేలో భారత్‌లో పేదరికం ఎంత మేర తగ్గిందో సవివరంగా పేర్కొంది. దీన్ని గృహ వినియోగం సర్వేని ఆధారంగా చేసుకుని అంచనా వేసింది. నీతి అయోగ్ సర్వే ఏం చెప్పిందంటే.. భారతదేశంలో పేదరికం ఐదు మేర తగ్గిందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆయన దీన్ని తాజ గృహ వినియోగ డేటా సర్వేను కీలకంగా చేసుకుని దీన్ని అంచనావేసినట్లు తెలిపారు. తాము ఆగస్టు 2022 నుంచి జులై 2023ల మధ్య జరిపిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దీన్ని వెల్లడించినట్లు తెలిపారు. ఆయా ఏడాదుల మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేల ప్రకారం..గ్రామీణ , పట్టణ ప్రాంతాల రెండింటిలోనూ 2.5 పెరుగుదల కనిపించింది. పట్టణ గృహాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-12 నుంచి 3.5% మేర పెరిగి రూ. 3,510కి చేరుకుంది. అయితే గ్రామీణ భారతదేశం గణనీయంగా 40.42% పెరుగుదలలో రూ. 2,008కి చేరుకుంది. ఈ డేటాల ఆధరాంగా దేశంలో పేదరికం 5% లేదా అంతకంటే తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ సర్వే ఆహారంపై పెడుతున్న ఖర్చు విధానాల్లో మార్పులను కూడా గుర్తించింది. ఆహార వ్యయం పరంగా గ్రామీణ కుటుంబాలు మొత్తం వ్యయంలో 50% కంటే తక్కువ ఆహారం కేటాయించినట్లు సర్వే తెలిపింది. అలాగే పట్టణ గ్రామీణ వినియోగ విభజన 2004-05లో 91% నుంచి 2022-23 నాటికి 71% తగ్గిందని సర్వే పేర్కొంది. అయితే ఆహారంలో పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, పాలు, పండ్ల వినయోగం పెరుగుతోందని వెల్లడించింది. ఈ సర్వే ఒక వైవిధ్యమైన సమతుల్య వినియోగ సూచన ఇచ్చిందిన నీతి అయోగ్ సీఈవో బీవీర్ సుబ్రహ్మణ్య అన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలను హైలెట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పలు పథకాలు పతాక స్థాయిలో విజయవంతమయ్యాయని దీన్ని బట్టి చెప్పొచ్చు. అలాగే ఈ సర్వే ఒకరకంగాపేదరికం, లేమీ వంటివి దాదాపు అదృశ్యమవుతాయని చెబుతోంది. ఇది నిజంగా శుభపరిణామాం కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల తట్టుకుని మరీ ఇలా చక్కటి పురోగతి దిశగా అడుగులు వేయండ విశేషం. (చదవండి: బోర్డ్ ఎగ్జామ్ కూడా రాయలేదు..కానీ ఏకంగా రూ. 41 కోట్లు..!) -
భారత్ పురోగతిపై యువత అభిప్రాయాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై యువత అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తుందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. భారతదేశం 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారవుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిని వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ‘‘భారతదేశం తన చరిత్రలో కీలక మలుపులో ఉంది’’ అని ఆయన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ పేర్కొన్నారు. యథాతథ విధానాలు వ్యాపార రంగం పురోగతికి దోహదపడవని అన్నారు. యువతసహా ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలను పంపడానికి ఒక వెబ్ పేజీ ఒక నెలపాటు లైవ్‌లో ఉంటుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. -
ఇదే అదను.. చైనా నుంచి తరలిపోయే కంపెనీలు భారత్‌కే..!
న్యూఢిల్లీ: రానున్న రెండు మూడేళ్లలో చైనా నుంచి తరలిపోయే కంపెనీలను భారత్ ఆకట్టుకుంటుందని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం తాజాగా పేర్కొన్నారు. ఈ కాలంలో రిస్కులను తగ్గించుకునే బాటలో చైనాను వీడుతున్న ప్రపంచ కంపెనీల వ్యూహాలను భారత్ అందిపుచ్చుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. ఇందుకు ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుందన్నారు. బిజినెస్‌లు తరలివచ్చేందుకు ఆకట్టుకునే విధానాల రూపకల్పనకు తెరతీయవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు సులభంగా తరలివచ్చేందుకు చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు తెలియజేశారు. సీఐఐ నిర్వహించిన 2023 ప్రపంచ ఆర్థిక విధాన వేదికలో సుబ్రహ్మణ్యన్ ఇంకా పలు అంశాలను ప్రస్తావించారు. రాజకీయ, భౌగోళిక పరిస్థితులు, భారీ యువశక్తి భారత్‌ను ఆకర్షణీయంగా నిలుపుతున్నట్లు పేర్కొన్నారు. వెరసి రానున్న 15–20 ఏళ్ల కాలంలో తయారీలో భారత్‌కు అవకాశాలు వెల్తువెత్తనున్నట్లు అంచనా వేశారు. అయితే రానున్న రెండు మూడేళ్ల కాలం ఇందుకు అత్యంత అనువైనదని అభిప్రాయపడ్డారు. సప్లై చైన్ వ్యవస్థలు మూతపడుతుండటం, కొత్త ప్రాంతాల కోసం చూస్తుండటం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించారు. ఇది చైనాయేతర కంపెనీలకే పరిమితంకాదని, కార్మిక కొరతతో చైనా కంపెనీలు సైతం తరలివెళ్లే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించారు. -
అభివృద్ధి చెందిన భారత్ హోదానే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే బాటలో రాష్ట్రాలు.. రాష్ట్రాలు కూడా తమ విజన్ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను డిసెంబర్ 2021లో క్యాబినెట్ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్ విజన్లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్ గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్ ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టింది. విద్యకు ప్రాధాన్యత... కేంద్రం దేశంలో విద్యా ప్రమాణాల పెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఈఓ సుబ్రమణ్యం పేర్కొన్నారు. దేశంలో కాలేజీల నమోదు రేటును 27 శాతం నుంచి 50–60 శాతానికి పెంచాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. ఉన్నత విద్య కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోందని పేర్కొన్న ఆయన, ఇప్పుడు భారత విద్యా రంగాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కాలేజీకి వెళ్లే జనాభా 4 కోట్ల నుండి 8–9 కోట్లకు పెరుగుతుందని ఆయన పేర్కొంటూ, కాబట్టి మనకు ఈ రోజు ఉన్న వెయ్యి విశ్వవిద్యాలయాలతో పాటు మరో వెయ్యి విశ్వవిద్యాలయాలు అవసరమని విశ్లేషించారు. రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నందున, కొత్త విశ్వవిద్యాలయాలను ప్రారంభించడానికి ప్రైవేట్ రంగం నుండి నిధులు మరింత రావాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. పరిశోధన–అభివృద్ధి– ఆవిష్కరణలే లక్ష్యంగా పనిచేసే బోస్టన్– శాన్ ఫ్రాన్సిస్కో వంటి విద్యా నగరాలను దేశంలో సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశ జనాభాలో సగం మంది సగటు వయస్సు 29 ఏళ్లలోపేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘భారతదేశం జనాభా సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మనకు 25 సంవత్సరాల సుదీర్ఘ అద్భుత సమయం ఉంది’’ అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామికశక్తిని అందించే దేశంగా భారత్ అవతరించబోతోందని పేర్కొన్న సుబ్రహ్మణ్యం, ప్రతి సంవత్సరం 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు తమ ఉన్నత విద్యను పూర్తి చేయడానికి భారతదేశం నుండి బయటకు వెళ్తున్నారని చెప్పారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులను భారత్‌కు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. తలసరి ఆదాయం 18,000 డాలర్లు లక్ష్యం... ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నేడు రెండో త్రైమాసిక జీడీపీ ఫలితాలు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెపె్టంబర్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు గురువారం వెలువడనున్నాయి. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వృద్ధి 7.8 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతం. కాగా, రెండవ త్రైమాసికంలో మంచి ఫలితాలే నమోదవుతాయన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వ్యక్తం చేశారు. అంతక్రితం ఆయన ‘పట్టణ మౌలిక రంగం అభివృద్ధి కోసం ప్రైవేట్ పెట్టుబడుల వినియోగం– జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ నుండి అనుభవ పాఠాలు’ అనే అంశంపై జరిగిన ఒక జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం. ఇది జీడీపీ నిష్పత్తిలో చూస్తారు) లక్ష్య సాధన సాధ్యమేనని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. -
Vision 2047: 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ప్రణాళిక!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల (29.2 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి తగిన విజన్ ప్లాన్ సిద్ధమవుతున్నట్లు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు. రూపకల్పనలో ఉన్న ఈ విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు. ఈ ముసాయిదా విజన్ డిసెంబర్ 2023 నాటికి సిద్ధమవుతుందని, వచ్చే మూడు నెలల్లో విజన్ దేశ ప్రజల ముందుకు వస్తుందని వెల్లడించారు. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను డిసెంబర్ 2021లో క్యాబినెట్ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్ విజన్లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్ గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్ ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టింది. రాష్ట్రాలు కూడా తమ విజన్ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో తెలిపారు. అభివృద్ధి చెందిన దేశం అంటే... ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98, 374) అంచనా. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
Global Innovation Index 2023: ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు
న్యూఢిల్లీ: కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తాము దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) 2023 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. మరోవైపు 2047 నాటికి సంపన్న ఎకానమీగా ఎదగాలన్న భారత ఆకాంక్షలకు కారి్మక కొరత సమస్య కాబోదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. నవకల్పనల ప్రధాన లక్ష్యం కారి్మకుల ఉత్పాదకతను మరింతగా పెంచడం, వనరులను సమర్ధంగా వినియోగించుకునేలా చేయడమేనని ఆయన పేర్కొన్నారు. జెనీవాకు చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రూపొందించిన జీఐఐ 2023 నివేదికలోని 132 దేశాల్లో భారత్ 40వ ర్యాంకులో కొనసాగింది. అటు గత దశాబ్దకాలంగా జీఐఐలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏడు దేశాల్లో భారత్ కూడా ఒకటని జీఐఐ కో–ఎడిటర్ సషా ఉన్‡్ష–విన్సెంట్ తెలిపారు. -
నీతి ఆయోగ్ సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం
న్యూఢిల్లీ: థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ సీఈవోగా మాజీ వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ప్రభుత్వ నిర్ణయానికి క్యాబినెట్ నియామకాల కమిటీ (ఫిబ్రవరి 20న) ఆమోదం తెలిపింది. సుబ్రమణ్యం బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు నీతి ఆయోగ్ సీఈవోగా ఉంటారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన కారణంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా సుబ్రహ్మణ్యం చత్తీస్‌గఢ్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, అతను సెప్టెంబర్ 30, 2022న వాణిజ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. మరోవైపు పరమేశ్వరన్ అయ్యర్ జూలై 1, 2022న నీతి ఆయోగ్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2009 లో ప్రభుత్వాధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి , 2014లో ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు నాయకత్వం వహించిన అయ్యర్ ఆ తరువాత ప్రపంచ బ్యాంకులో చేరారు. ఇపుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగ నున్నారు. -
టెక్నాలజీతో హెల్త్‌కేర్ ఇన్ఫ్రా మెరుగు
న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు (హెల్త్‌కర్ ఇన్ఫ్రా) మెరుగుపడేందుకు టెక్నాలజీ, ఆవిష్కరణలు కీలకమని నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. అపోలో హాస్పిటల్ నిర్వహించిన 9వ ఎడిషన్ ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ సదస్సులో భాగంగా పరమేశ్వరన్ మాట్లాడారు. వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స అందించే వరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశ హెల్త్‌కేర్ వ్యవస్థను మార్చే కీలక టెక్నాలజీగా పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో డిజిటల్ హెల్త్‌కేర్ పరిష్కారాలు మరిన్ని అందుబాటులోకి వస్తాయన్నారు. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక హెల్త్ కవరేజీకి భారత్ చేరువ అయిందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అపోలో హాస్పిటల్ జేఎండీ సంగీతా రెడ్డి అన్నారు. ఈ క్రమంలో రోగుల భద్రత, డిజిటల్ హెల్త్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కోసం ఎంఎస్ఎంఈని ప్రోత్సహించండి
న్యూఢిల్లీ: ఆహార ప్రాసెసింగ్ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనకు కీలకమని నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ శుక్రవారం పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన వస్తువుల ఉత్పత్తి, ఎగుమతులను పెంచడం అవశ్యమని ఉద్ఘాటించారు. పారిశ్రామిక వేదిక సీఐఐ ఇక్కడ నిర్వహించన ఒక కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించడానికి సూక్ష్మ లఘు చిన్న మధ్య (ఎంఎస్ఎంఈ) రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రైతుల ఆదాయ పురోగతికే కాకుండా, పోషకాహార లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఆహార భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ దిశలో కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం దేశంలో క్రమంగా పురోగతి చెందుతోందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం పురోగతికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోందని పేర్కొంటూ, ఈ రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి అనుసంధానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక 2023ను ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ విభాగం నుంచి భారఎగుమతులు లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫుడ్ వేస్టేజ్‌ని అరికట్టాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రాసెసింగ్ కీలక భూమికను పోషిస్తుందని అన్నారు. -
ఎన్ఎంపీతో కేంద్రానికి రూ.33,422 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్తుల ద్వారా ఆదాయాల (నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్– ఎన్ఎంపీ) అన్వేషణ పథకం కింద కేంద్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.33,422 కోట్లు ఒనగూడింది. ఇందులో రూ.17,000 కోట్లతో బొగ్గు మంత్రిత్వశాఖ ముందడుగులో ఉండగా, పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మంత్రిత్వశాఖ తన ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను అధిగమించే స్థాయికి చేరుకుంది. అధికార వర్గాల తాజా సమాచారం ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో జరిగిన సమావేశంలో ఎన్ఎంపీ అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సమీక్ష అంశాలపై అందిన సమాచారం క్లుప్తంగా... ► 2021–22లో ఎన్ఎంపీ ద్వారా ప్రభుత్వ సమీకరణ లక్ష్యం రూ.88,000 కోట్లు. అయితే రూ. 1 లక్ష కోట్ల విలువైన లావాదేవీలను పూర్తి చేయడం ద్వారా లక్ష్యాన్ని అధిగమించింది. ► 2022–23లో లక్ష్యం రూ.1,62,422 కోట్లు. అయితే లక్ష్యాలను చేరకపోవచ్చన్నది ప్రభుత్వ తాజా అంచనా. లక్ష్యానికి రూ.38,243 కోట్ల దూరంలో ఉండవచ్చని భావిస్తున్నారు. రూ.1,24,179 కో ట్ల అసెట్ మోనిటైజేషన్ జరగవచ్చని భావిస్తోంది. ► బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు–షిప్పింగ్ మంత్రిత్వ శాఖలు అసెట్ మానిటైజేషన్ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. రోడ్డు రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ కూడా లక్ష్యాలను చేరుకునే వీలుంది. ► విద్యుత్, రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు అలాగే చమురు– గ్యాస్ మంత్రిత్వ శాఖ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. ► రైల్వేల లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి ఒనగూరింది రూ.1,829 కోట్లు. ► విద్యుత్ మంత్రిత్వశాఖ విషయంలో లక్ష్యం రూ.15,000 కోట్లయితే, ఇప్పటికి లక్ష్యంలో రూ.2,000 కోట్లకు చేరుకోవడం జరిగింది. ► బొగ్గు మంత్రిత్వశాఖ లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి రూ.17,000 కోట్ల విలువైన మానిటైజేషన్ జరిగింది. రోడ్డు, ట్రాన్స్‌పోర్స్, హైవేల శాఖ లక్ష్యం రూ.32,855 కోట్లయితే, ఇప్పటికి రూ.4,100 కోట్ల సమీకరణ జరిగింది. ► మోనిటేజేషన్ లక్ష్యాల సాధనకు ఆస్తులను గుర్తించవలసినదిగా వివిధ మంత్రిత్వశాఖలను ఆర్థికశాఖ కోరింది. ► వివిధ రంగాల్లో మౌలిక ఆస్తుల విలువలను గుర్తించడం, తద్వారా నాలుగేళ్ల కాలంలో ఈ ఆస్తుల ద్వారా రూ. 6 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యంగా 2021 ఆగస్టులో ఆర్థికమంత్రి సీతారామన్ ఎన్ఎంపీ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నీతి ఆయోగ్ వివిధ మంత్రిత్వశాఖలతో నిరంతరం సంప్రతింపులు జరుపుతోంది. -
నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వర్ అయ్యర్ బాధ్యతలు!
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జూన్ 30న పదవీ విరమణ చేసిన అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ తాజా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అయ్యర్ తాజా బాధ్యతల్లో కొనసాగుతారు. కాంత్‌కు వర్తించిన నియామక, బాధ్యతల విధివిధానాలే అయ్యర్‌కూ వర్తిస్తాయని అధికారిక ప్రకటన పేర్కొంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా పరిగణించిన 20 బిలియన్ డాలర్ల స్వచ్ఛ భారత్ మిషన్ అమలుకు అయ్యర్ గతంలో నాయకత్వం వహించారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పని చేశారు. 2016–20 మధ్య కాలంలో తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. -
నీతి ఆయోగ్ సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్ నియామకం!
నీతి ఆయోగ్ సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ఆయన నియమాకాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం అధికారికంగా ప్రకటించింది. పరమేశ్వరన్ అయ్యర్ రెండేళ్ల పాటు నీతి ఆయోగం సీఈవోగా కొనసాగనున్నారు. 1981 ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన పరమేశ్వరన్ అయ్యర్ పారిశుద్ధ్య నిపుణుడిగా గుర్తింపు పొందారు. 2009లో ఐఏఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన.. ఐక్యరాజ్యసమితిలో సీనియర్ గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య నిపుణుడిగా పని చేశారు. ఆ తర్వాత 2016లో భారత్‌కు తిరిగి వచ్చారు. వెంటనే డ్రింకింగ్ అండ్ శానిటేషన్ విభాగానికి అధిపతిగా కేంద్రం నియమించింది. అంతకు ముందు 2014లో కేంద్రం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు నాయకత్వం వహించారు. -
భారత్ స్టార్టప్‌ల విప్లవం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భారత స్టార్టప్‌లు శాసిస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ముఖ్యంగా హెల్త్, నూట్రిషన్, వ్యవసాయ రంగాల్లో ఇవి తమదైన ప్రత్యేకతను చాటుతున్నాయని పేర్కొన్నారు. మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు సమ సమాజ సాకారంలో కీలక వాహకాలుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో 61,000 స్టార్టప్‌లు, 81 యూనికార్న్‌లు ఉన్నట్టు చెప్పారు. మహిళల నిర్వహణలోని వ్యాపార సంస్థలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భారత స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో మహిళలే తదుపరి విప్లవానికి దారి చూపిస్తారని అంచనా వేశారు. ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు మహిళా స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపారు. ‘‘ఇది వ్యూహాలు రూపొందించుకునేందుకు, స్టార్టప్‌లు చక్కగా వృద్ధి చెందేందుకు తగిన చర్యలను సూచించేందుకు, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు దారితీస్తుంది’’అని కాంత్ చెప్పారు. నేడు భారత్ విప్లవాత్మకమైన వినియోగం, పట్టణీకరణ, డిజిటైజేషన్, పెరుగుతున్న ఆదాయాలతో గొప్ప వృద్ధిని చూడనుందన్నారు. -
ప్రైవేటు రైళ్లా ? మాకొద్దు బాబోయ్ !
న్యూఢిల్లీ: రైల్వే విభాగంలో ప్రైవేట్ సంస్థలను అనుమతించడం తదితర చర్యలతో రైల్వే అసెట్స్‌ను మానిటైజ్ చేయాలన్న ప్రతిపాదనకు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. మానిటైజేషన్ ప్రక్రియను సరిగ్గా రూపొందించకపోవడం ఇందుకు కారణం కావచ్చని .. ఈ నేపథ్యంలో సదరు ప్రణాళికలను రైల్వే శాఖ పునఃసమీక్షిస్తోందని ఆయన తెలిపారు. కచ్చితంగా రాబడులు వస్తాయంటేనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ముందుకు వస్తుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అసెట్ మానిటైజేషన్ ప్రణాళికలో పేర్కొన్న రూ. 6 లక్షల కోట్ల అసెట్స్ నుంచి కచ్చితంగా ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంత్ వివరించారు. చదవండి: ఎల్ఐసీ ఐపీవో వాయిదా! -
సంస్కరణలు పెద్ద ఎత్తున చేపట్టాలి
న్యూఢిల్లీ: భారత్‌కు మరిన్ని సంస్కరణలు అవసరమని, అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున సంస్కరణలను చేపట్టాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సు 2021ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎగుమతులు గణనీయంగా పెరిగిన సందర్భాల్లోనే భారత్ వృద్ధి సాధించినట్టు గుర్తు చేశారు. భారత్ పోటీనిచ్చేలా ఉండాలని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం.. తదుపరి మరిన్ని సంస్కరణలు చేపట్టే విషయంలో ప్రభుత్వం తీరుపై ప్రభావం చూపిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘సంపద సృష్టి ప్రైవేటు రంగం ద్వారానే సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. వారికి (పారిశ్రామికవేత్తలకు) పరిస్థితులు అనుకూలంగా ఉండేలా చూడడమే ప్రభుత్వం చేయాల్సిన పని. ఉత్ప్రేరకంగా, సదుపాయ కల్పనదారుగానే ప్రభుత్వం వ్యవహరించాలి. సంస్కరణలను ఈ దిశగానే ముందుకు నడిపించాలి’’ అని కాంత్ చెప్పారు. -
కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలో రియాలిటీ షో.. ఎందుకోసమంటే ?
న్యూఢిల్లీ: వినూత్నమైన ఐడియాలున్న స్టార్టప్‌ల నిధుల సమీకరణకు ఊతమిచ్చే విధంగా ప్రత్యేక రియాలిటీ షోను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సోమవారం ఆవిష్కరించారు. ‘హార్సెస్ స్టేబుల్ – జో జీతా వహీ సికందర్‘ పేరిట ఈ షోను రూపొందించారు. స్టార్టప్‌లు, చిన్న.. మధ్య తరహా సంస్థలు తమ ఐడియాలను వివరించి, పెట్టుబడులను అందిపుచ్చుకునేందుకు ఇది తోడ్పడగలదని కాంత్ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు తోడ్పాటునిచ్చేందుకు పరిశ్రమ దిగ్గజాలు ముందుకు రావడం హర్షణీయమని ఆయన తెలిపారు. హెచ్పీపీఎల్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కలిసి ఈ షోను రూపొందించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (మిషన్ డైరెక్టర్) చింతన్ వైష్ణవ్, సునీల్ శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరైన ఇన్వెస్టరు నుంచే నిధులు సమకూర్చుకోవడం, తగిన భాగస్వాములే.. వ్యాపార వృద్ధికి దోహదపడగలవని చింతన్ వైష్ణవ్ పేర్కొన్నారు. చదవండి: ఐఐటీ హైదరాబాద్..స్టార్టప్‌ల కోసం స్పెషల్ ఫండ్ -
టెస్లా ఎంట్రీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు టెస్లా సిద్దమైన విషయం తెలిసిందే. దిగుమతి సుంకాలు అధిక ఉండడంతో టెస్లా రాక కాస్త ఆలస్యమవుతోంది. అధిక దిగుమతి సుంకాలపై ఇప్పటికే టెస్లా ప్రతినిధులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా భారత్‌లోకి టెస్లా ఎంట్రీ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. డ్యూటీ కోత తగ్గించే అవకాశం..! ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనపై భారత ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. దిగుమతి సుంకాలపై ఎంతమేర కోత పెట్టవచ్చుననే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. టెస్లా ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తగ్గించే అవకాశాలపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు ఆయన అన్నారు. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 ప్రభుత్వంతో చర్చలు..! ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరిన విషయం తెలిసిందే. టెస్లాతో పాటుగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్ధ బీఎండబ్ల్యూ కూడా దిగుమతి సుంకాలపై ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలని కోరింది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా వాదించింది. అదనంగా 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. విదేశీ కార్లపై దిగుమతి సుంకాలు భారత్‌లో ఇలా..! విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది. చదవండి: లక్షకోట్లకు పైగా నష్టం, రాజకీయాల్లోని ఆ వృద్దులపై నిషేదం విధించాలి..! ఎలన్ పిలుపు -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నీతిఆయోగ్ సీఈవో
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతీబాగ్‌లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అమితాబ్‌కాంత్ ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం నీతిఆయోగ్ సీఈవోకు వృక్ష వేదం పుస్తకాన్ని సంతోష్ బహూకరించారు. పుస్తక వివరాలతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మరో ముగ్గురిని ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్‌కి నామినేట్ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు. వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ‘ఊరిఊరికో జమ్మిచెట్టు.. గుడిగుడికో జమ్మిచెట్టు’ నినాదంతో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆదివారమిక్కడ జమ్మి మొక్కలను పంపిణీ చేశారు. -
మహిళలకు ఆర్థిక సేవలు మరింతగా విస్తరించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల రంగం పరిధిలోకి పెద్ద సంఖ్యలో మహిళలను తీసుకురావడానికి మరింత సమ్మిళిత వ్యవస్థ అవసరమమని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మహిళలు సులభతరంగా ఆర్థిక సేవలు పొందేందుకు డిజిటల్ సాధనాలు, వినూత్న పథకాలు వంటివి తోడ్పడగలవని ఆయన తెలిపారు. భారత్‌లోని మహిళలకు ఆర్థిక తోడ్పాటులో జన్ ధన్ పథకం ప్రాధాన్యం అంశంపై రూపొందిన నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసి దీన్ని రూపొందించాయి. మహిళా కరెస్పాండెంట్స్ నియామకం వంటి వినూత్న విధానాలతో బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసుల రంగం పరిధిలోకి మరింత మంది మహిళా కస్టమర్లను తీసుకువచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవకాశాలు ఉన్నాయని కాంత్ చెప్పారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి సాధించడానికి జన్ ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం) ఊతంతో, 40 కోట్ల మంది ప్రజలు అధికారికంగా ఆర్థిక సేవల పరిధిలోకి వచ్చారని పేర్కొన్నారు. మరోవైపు, మహిళలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేసేందుకు జన్ ధన్ ప్లస్ విధానాన్ని పాటించవచ్చని నివేదిక సూచించింది. దీని ప్రకారం నాలుగు నెలల పాటు జన్ ధన్ ఖాతాలో రూ. 500 డిపాజిట్ చేస్తే.. ప్రోత్సాహకంగా రూ. 10,000 మేర రుణం/ఓవర్‌డ్రాఫ్ట్ ఇవ్వొచ్చని పేర్కొంది. 2020 ఫిబ్రవరి–2020 ఆగస్టు మధ్యకాలంలో 101 బీవోబీ శాఖల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా 50,000 మంది పురుషులు, మహిళ కస్టమర్లు జన్ ధన్ ప్లస్ ఖాతాలు తీసుకున్నట్లు వివరించింది. -
నీతి ఆయోగ్ సీఈఓకు నిరసన సెగ
సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ బస చేసిన హిల్‌టాప్ గెస్ట్‌హౌస్ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్యంలో ఈ పోరాటాన్ని చేపట్టారు. ‘సేవ్ వైజాగ్ స్టీల్’ అంటూ నినదించారు. నీతి ఆయోగ్ సీఈఓ గో బ్యాక్ అనే నినాదాలతో హోరెత్తించారు. సీఈఓ అమితాబ్ కాంత్ గురువారం మెడ్‌టెక్ జోన్లో పర్యటించనున్నారు. చదవండి: Afghanistan: ఆమె భయపడినంతా అయింది! -
రిటైల్ 4.0తో కోటికి పైగా కొత్త కొలువులు
న్యూఢిల్లీ: రిటైల్ రంగానికి సంబంధించి ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలు రెండూ కలిస్తే గణనీయంగా కొత్త కొలువులు వచ్చేందుకు, ఎగుమతులనూ పెంచుకునేందుకు అవకాశం లభించనుంది. కన్సల్టింగ్ సంస్థ టెక్నోపాక్తో కలిసి దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి. రిటైల్ 4.0 పేరిట రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ఆన్లైన్ + ఆఫ్‌లైన్ విధానంతో కొత్తగా 1.2 కోట్ల మేర కొత్త కొలువులు రాగలవు. అలాగే రిటైల్ ఎగుమతులు 125 బిలియన్ డాలర్ల దాకా పెరగగలవని అంచనా. గడిచిన దశాబ్దకాలంలో భారత రిటైల్ మార్కెట్ మూడు రెట్లు వృద్ధి చెందింది. 2019–20లో భారత స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో రిటైల్ రంగం వాటా 10% దాకా ఉండగా, 3.5 కోట్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ‘కోవిడ్–19 అనేది ఒక అగ్నిపరీక్షలాంటిది. డిజిటల్ మాధ్యమాన్ని అందిపుచ్చుకో వడం, వేగవంతంగా ఆన్లైన్ వైపు మళ్లడం ద్వారా దేశీ రిటైల్ రంగం ఈ సంక్షోభం నుంచి మెరుగ్గానే బైటపడగలిగింది‘ అని నివేదిక పేర్కొంది. మార్కెట్ వృద్ధి..: నివేదిక ప్రకారం .. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీ రిటైల్ మార్కెట్ 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. 2.5 కోట్ల మేర కొత్త కొలువులు రానున్నాయి. ఇందులో సగభాగం వాటా ఆఫ్‌లైన్+ఆఫ్‌లైన్ విధానానిదే ఉండనుంది. 1.2 కోట్ల కొలువులు, 125 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు దీన్నుంచి రానున్నాయి. అలాగే, మొత్తం రిటైల్ రంగం కట్టే పన్నుల్లో ఈ విభాగం వాటా 37 శాతం దాకా ఉండనుంది. సాంకేతికత ఊతం..: రాబోయే రోజుల్లో రిటైల్ రంగం వృద్ధి చెందడంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. దేశీయంగా రిటైల్ వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు కేంద్రం జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉందన్నారు. రిటైల్ 4.0 ప్రయోజనాలు పొం దేందుకు రిటైల్ వర్గాలతో పాటు విధాన నిర్ణేతలు, అనుబంధ పరిశ్రమలు కలిసి రావాలని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ అభిప్రాయపడ్డారు. -
త్వరలో అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ విధానం
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలు, ఇతరత్రా అవసరాలకు ఉపయోగపడే అత్యాధునిక బ్యాటరీ సాంకేతికతలో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం త్వరలో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన రంగం వృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే సెల్స్‌ను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర విధానం అవసరమని మంత్రి చెప్పారు. ఆటోమొబైల్ తయారీతో పాటు విద్యుత్ వాహనాల విషయంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాల పరిశోధన, అభివృద్ధి అంశంపై జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కే విజయ రాఘవన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధనానికి సంబంధించిన పరిశోధనలు ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నారు. వీటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి అంతా కలిసికట్టుగా పనిచేస్తే అత్యుత్తమ టెక్నాలజీలను అభివృద్ధి చేయొచ్చు. దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాం. ఆయా టెక్నాలజీల లాభదాయకతపై కూడా దృష్టి పెడతాం. ఇందుకోసం ప్రత్యేక విధానం అవసరం‘ అని మంత్రి చెప్పారు. -
గూగుల్ పేకు మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా రెండో నెలలో కూడా పేమెంట్ యాప్ ఫోన్‌పే టాప్‌లో నిలిచింది. ఫ్లిప్‌కార్ట్ మద్దతున్న ఫోన్‌పే మళ్లీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపీఐ) చార్టులో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా వాల్‌మార్ట్‌కు చెందిన ఈ పేమెంట్ యాప్ గూగుల్ పేని అధిగమించి, టాప్ యూపీఐ యాప్‌గా ఫోన్‌పే నిలిచింది. జనవరిలో మొత్తం యుపీఐ లావాదేవీల్లో 41శాతం వాటాతో 968.72 మిలియన్ల లావాదేవీల వాల్యూమ్‌తో ఉన్న ఫోన్‌పే వరుసగా రెండవ నెలలో పరంపరను కొన సాగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఫోన్‌పే లావాదేవీలు 7 శాతం పెరిగాయి, ట్రాన్సాక్షన్స్ విలువ జనవరిలో 5 శాతం పెరిగింది. ఫోన్‌పే తరువాత రూ .1.71 లక్షల కోట్ల విలువైన 853.53 మిలియన్ లావాదేవీలతో గూగుల్ పే రెండవ స్థానంలో ఉంది. 33,910 కోట్ల రూపాయల విలువైన 281.18 మిలియన్ లావాదేవీలను రికార్డు చేసిన పేటీఎం మూడో స్థానంలో నిలిచింది. అమెజాన్ పే, భీమ్, వాట్సాప్ పే లావాదేవీల విలువ వరుసగా రూ .4,004 కోట్లు, రూ .7,463 కోట్లు, రూ .36 కోట్లుగా ఉన్నాయి. జనవరిలో యూపీఐ ద్వారా మొత్తం రూ .4.2 లక్షల కోట్ల 2.3 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయని, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గతవారం ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘనతను ఇది అసాధారణమైన ఘనత అని పేర్కొన్నారు. నెలకు ఒక బిలియన్ లావాదేవీలను దాటడానికి యూపీఐకి 3 సంవత్సరాలు పట్టిందని, అయితే ఆ తరువాతి బిలియన్ టార్గెట్‌ను ఏడాదిలోపే సాధించామన్నారు. లావాదేవీలు 76.5 శాతం పెరుగుదలను నమోదు చేయగా, లావాదేవీల విలువ దాదాపు 100 శాతం పెరిగిందని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా డిసెంబరులో, ఫోన్‌పే 1.82 లక్షల కోట్ల రూపాయల విలువైన 902 మిలియన్ లావాదేవీలతో ఫోన్‌పే టాప్ ప్లేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గూగుల్ పే 854 మిలియన్ లావాదేవీలను 1.76 లక్షల కోట్ల రూపాయలను నమోదు చేసింది. Phenomenal ! UPI recorded 2.3 billion transactions worth ₹ 4.3 trillion in Jan 2021. On a YOY basis, UPIs transaction value jumped 76.5 % while transaction value jumped nearly 100%. Took UPI 3 years to cross 1 billion transactions a month. Next billion came in less than a year.— Amitabh Kant (@amitabhk87) February 3, 2021 -
పర్యాటక రంగం పరుగు!
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరోనా ప్రభావం పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాలపై తీవ్రంగా ఉంది. ఇప్పటికీ హోటల్స్‌లో తినాలన్నా, వేరే ఊళ్లకి వెళ్లాలన్నా ప్రజలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందుకే పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్రం ఒక ఆర్థిక ప్యాకేజీని రూపొందించడానికి కసరత్తు చేస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఒక జాతీయ చానెల్‌కు వెల్లడించారు. ఈ ప్యాకేజీతో పర్యాటక రంగం పరుగులు పెట్టడమే కాకుండా పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి. అంతే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బలోపేతంపై కూడా కేంద్రం దృష్టి సారిస్తున్నట్టుగా అమితాబ్ కాంత్ వెల్లడించారు. అయితే ఈ ప్యాకేజీని ప్రకటించడానికి మరో రెండు మూడు నెలలు పడుతుందని ఆయన వివరించారు. ఈ పండుగ సీజన్లో వచ్చే ఆదాయ మార్గాలపై కేంద్రం దృష్టి సారించింది. పౌర విమానయానం, రైల్వేల నుంచి ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. సెప్టెంబర్‌లో ప్రజల కొనుగోలు శక్తి సూచి 56.8 పాయింట్లకు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే మధ్య తరగతి ప్రజలు దసరా, దీపావళి సీజన్లో ఎంత ఖర్చు పెడతారో చూడాల్సి ఉందని అమితాబ్ కాంత్ చెప్పారు. -
త్వరలో విశాఖలో 'డిజిటల్ కాన్క్లేవ్': మేకపాటి
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంగీకరించిందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లే విధంగా ఒక కేంద్ర బృందం ఏర్పాటు చేయనున్నట్లు సీఎండీ సింఘాల్ చెప్పారని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఈ బృందాన్ని నడిపించేలా నోడల్ అధికారి నియమించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో విశాఖలో 'డిజిటల్ కాన్క్లేవ్' ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలిపారు. బీహెచ్ఈఎల్ సీఎండీ, నీతి ఆయోగ్ సీఈవో తో సమావేశమైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆర్డీవో ఛైర్మన్, నేవీ అధ్యక్షుడు, వైమానికదళ ప్రధాన అధికారులతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పారిశ్రామిక ప్రగతిపై మంత్రి మేకపాటి ఆలోచనలకు ప్రశంసలు అందాయి. (సీఎం జగన్ విజన్‌కు అభినందనలు) మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలకు కేంద్రంలోని ప్రముఖులు నీరాజనం పలుకుతున్నారని మంత్రి పేర్కొన్నారు. దొనకొండలో 'సోనిక్ సిస్టమ్' ఏర్పాటుకు సానుకూలత చూపారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అసలైన పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది ఇప్పుడేనన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నలిన్ సింఘాల్‌తో మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిపై మంత్రి మేకపాటికి గల ఆలోచనలను బీహెచ్ఎల్ సీఎండీ ప్రశంసించారు. విశాఖలో 'డిజిటల్ కాన్క్లేవ్' ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలిపారు. (‘ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్’) ఐటీఐ కాలేజీలకు తోడ్పాటు పాఠశాల విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బీహెచ్ఈఎల్ సంయుక్తంగా నైపుణ్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు అందించే కార్యక్రమంలో భాగస్వామ్యమవ్వాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు. మంత్రి మేకపాటి ఇతర ప్రతిపాదనల పట్ల కూడా బీహెచ్ఈఎల్ సీఎండీ నలిన్ సింఘాల్ సానుకూలంగా స్పందించారు. ఐటీఐ కాలేజీలకు తోడ్పాటు, నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యమవుతామని మంత్రికి తెలిపారు. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఎంట్రిప్యూనర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. అనంతరం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక సోలార్ పానల్స్ ఏర్పాటు మంత్రి మేకపాటి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్ పాల్గొన్నారు. (ఏపీలో కొత్తగా 9999 కరోనా కేసులు) నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌లో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. అక్టోబర్ నుంచి ఎప్పుడైనా విశాఖలో 'డిజిటల్ సదస్సు' నిర్వహించేందుకు అమితాబ్ కాంత్ సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన, కీలక సంస్కరణలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను అమితాబ్ కాంత్ మెచ్చుకున్నారని పేర్కొన్నారు. కరోనా విపత్తు సమయంలో దేశంలోనే తొలుత స్పందించి ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆర్థిక అండగా నిలిచిన ఏకైక రాష్ట్రం ఏపీ అని నీతి ఆయోగ్ సీఈవో ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగులలో ఏపీ మొదటి స్థానం కైవసం చేసుకోవడాన్ని ఆయన అభినందించారని మంత్రి పేర్కొన్నారు. కరోనా విపత్తులో ప్రభుత్వ పాలన బాగుంది ఏపీ పారిశ్రామిక విధానం గురించి ప్రస్తావించిన అమితాబ్ కాంత్. అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ కాపీ కావాలని మంత్రిని అడిగారు. ఒకసారి పాలసీ కాపీ చదవుతానని నీతి ఆయోగ్ సీఈవో అన్నట్లు మంత్రి తెలిపారు. కరోనా విపత్తులో, ఆర్థిక లోటులో ప్రభుత్వ పాలన బాగుందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించినపుడే భారతదేశ అభివృద్ధి జరిగినట్లని మంత్రి మేకపాటితో అమితాబ్ కాంత్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గురించి అమితాబ్ కాంత్ ఆరా తీశారు . సీఎం జగన్ నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్న తీరును ఫోటోల ద్వారా అమితాబ్ కాంత్ మంత్రి మేకపాటి వివరించారు. ఈశాన్య భారత్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పోర్టుల పాత్ర కీలకమని, ఏపీలో జాతీయ స్థాయి పోర్టుగా భావనపాడు పోర్టును తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకారం ఉంటుందని నీతి ఆయోగ్ సీఈవో వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో అందుబాటులోకి రానున్న 30 నైపుణ్య కళాశాలలకు సహకారమందించాలని మంత్రి మేకపాటి కోరారు. వ్యవసాయం, పరిశ్రమలే రాష్ట్ర రెవెన్యూకి కీలకమని, అందుకు కేంద్ర సహకారమందించాలని మంత్రి కోరగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. పాఠశాల విద్య పూర్తయ్యే స్థాయి నుంచే నైపుణ్యం సాధించే విధంగా నైపుణ్య మానవవనరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రంగాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటయ్యే విధంగా చూడాలని నీతి ఆయోగ్ సీఈవోను ఏపీఎస్ఎస్డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్ కోరారు. ఏపీ నుంచి 8-9 యూరప్ దేశాలకు అవసరమైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులలో కీలకమైన విశాఖ పోర్టుకు మరింత ఎగుమతుల సామర్థ్యం పెంచేందుకు అనుమతులు, సహకారం కావాలని విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ నీతి ఆయోగ్ సీఈవోను కోరారు. ఏపీ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. 'డిఫెన్స్'పై ప్రత్యేక దృష్టి డీఆర్డీవో, నావికా, వైమాణికదళ ప్రధాన అధికారులతో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డితో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఏపీ కొత్త పారిశ్రామిక విధానంలో 'డిఫెన్స్'పై ప్రత్యేకంగా దృష్టి సారించామని ఆ రంగంలో అభివృద్ధికి డీఆర్డీవో సహకారం కావాలని మంత్రి మేకపాటి కోరారు. నౌకదళాల అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్‌తో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. దొనకొండలో సోనిక్ (ధ్వని తరంగాలకు సంబంధించిన) వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద యుద్ధాల సమయంలో ఉపయోగపడే 'నేవీ బేస్' స్థాపించాలని మంత్రి మేకపాటి కోరారు. యుద్ధాలు జరిగే సమయంలో ఏవైనా విమానాలు, ఓడలు మరమ్మతులకు గురైనపుడు నేవీ ఆధ్వర్యంలో నావల్ బేస్ ద్వారా విమానాలకు ఓడలలో తాత్కాలికంగా ఆశ్రయం పొందే అవకాశముంటుందన్నారు. అనంతరం, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవాను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలోని రక్షణ వ్యవస్థ, అభివృద్ధికి సహకారం కోసం మంత్రి మేకపాటి చర్చించారు. ఈ సమావేశం అనంతరం మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మంత్రి మేకపాటి హైదరాబాద్ చేరారు. -
రాష్ట్రానికి బకాయిలు విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని, కోవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా రాష్ట్రంపై ఒత్తిడి పెరిగినందున అదనంగా సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలు, ప్లానింగ్, శాసన వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌లతో శుక్రవారం ఇక్కడ సమావేశమయ్యారు. బకాయిలు, అదనపు సాయం కోసం.. ► కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,597.27 కోట్లను విడుదల చేయాలని కోరారు. అలాగే, రూ.3,832.89 కోట్లు జీఎస్టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు రూ.700 కోట్ల నిధులు, రెవెన్యూ లోటు గ్రాంట్ రూ.18,830 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు. ► మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై, పునర్ వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రితో చర్చించినట్లు బుగ్గన తెలిపారు. ► రూ.3 వేల కోట్ల మేర జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని, అలాగే సీఎం జగన్ ప్రతి ఒక్క అంశం మీద చేసిన విన్నపాన్ని కేంద్ర మంత్రికి తెలియజేసి బకాయిలు విడుదల చేయాలని కోరామన్నారు. ► జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో çసమావేశమైన బుగ్గన, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం వెచ్చించిన రూ.3,805 కోట్ల మేర నిధులు రీయింబర్స్ చేయాలని కోరారు. ప్రాజెక్టులో జాప్యం లేకుండా త్వరగా నిధులు ఇచ్చేందుకు వీలుగా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఖర్చును రీయింబర్స్ చేయాలని కోరారు. కిషన్‌రెడ్డితో భేటీ: రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయం అందేలా చూడాలని, పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనలు అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిని బుగ్గన కోరారు. ► అలాగే, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో చర్చించారు. అనంతరం ఆయన నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌తో భేటీ అయి రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరుకు సిఫారసు చేయాల్సిందిగా కోరినట్టు తెలిపారు. ► ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, జల వనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆయా సమావేశాల్లో పాల్గొన్నారు. -
తయారీ, ఎగుమతి కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: కీలకమైన రంగాల్లో నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భారత్‌ను అంతర్జాతీయ తయారీ, ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు ప్యాకేజీ రూపకల్పన జరుగుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. ‘కరోనా వైరస్ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు’ అనే అంశంపై ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో ఆయన మాట్లాడారు. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, మొబిలిటీ, జీనోమిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, 5జీ, ఫిన్‌టెక్, తయారీ అన్నవి ప్రాధాన్య క్రమంలో వేగంగా విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసే రంగాలుగా పేర్కొన్నారు. తయారీ రంగం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైనదని, చైనాలో సరఫరా పరంగా ఏర్పడిన ఇబ్బందులను అనుకూలంగా మలుచుకోవాలని భారత్ కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 1,450 కంపెనీలను ప్రభుత్వం సంప్రదించిందని, భారత్‌లో వేగంగా ఇన్వెస్ట్ చేసేందుకు, ఇక్కడికి తరలివచ్చేందుకు వీలుగా వాటికి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘భారత్ టెక్నాలజీని విదేశాల నుంచి అరువు తెచ్చు కోవాలి. చోరీ చేయాలి. చైనా ఇదే పని చేసింది. అందుకే తక్కువ ఖర్చుకే ఉత్పత్తి చేయగలుగుతోంది’’ అని అమితాబ్ కాంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. -
సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ముడి చమురు ధరల రికార్డు పతనంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారిని, చమురు ధరల్లో ఇంతటి పతనాన్ని తన జీవితం కాలంలో చూడాల్సి వస్తుందని ఊహించలేదని ట్వీట్ చేశారు. అంతేకాదు ఇపుడు కోక్ బాటిల్ కంటే.. చమురు చౌక అయి పోయిందని వ్యాఖ్యానించారు. (ముడి చమురు ధర రికార్డు పతనం) కాగా అమెరికా డబ్ల్యుటీఐ ముడి చమురు సోమవారం మైనస్ లోకి పడిపోయిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ సంక్షోభం, లాక్డౌన్ సమయంలో భారీగా క్షీణించిన డిమాండ్, పేరుకు పోయిన చమురు నిల్వలతో ఉత్తర అమెరికా చమురు ఉత్పత్తిదారులు చమురు నిల్వ చేయడానికి స్థలం లేకుండా పోయింది. దీంతో అధిక మొత్తంలో చమురు తీసుకోవటానికి కొనుగోలుదారులకు చెల్లించవలసి వచ్చింది. ప్రస్తుతం కాస్త తెప్పరిల్లిన ముడి చమురు ప్రస్తుతం బ్యారెల్‌కు 1.450 డాలర్ల ధర వద్ద వుంది. (క్రూడ్ క్రాష్..) చదవండి : ఆల్ టైం కనిష్టానికి రూపాయి కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా History! Oil now cheaper than a bottle of coke ! Never imagined this crash & #Coronavirus would both happen in my lifetime. #OilPrices pic.twitter.com/XG1uUU6Tz9 — Amitabh Kant (@amitabhk87) April 20, 2020 -
పర్యాటక రంగం.. 50 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: పర్యాటక రంగం 2022 నాటికి 50 బిలియన్ డాలర్ల (రూ.3.55 లక్షల కోట్లు) ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ సూచించారు. ఈ రంగానికి వృద్ధి అవకాశాలు, ఉపాధి కల్పన అవకాశాలు అపారంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సీఐఐ 15వ వార్షిక పర్యాటక సదస్సు ఢిల్లీలో గురువారం జరిగింది. దీనికి కాంత్ హాజరై మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం పర్యాటకానికి ఉందన్నారు. ‘‘2018లో భారత పర్యాటక రంగం 28.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీన్ని 2022 నాటికి 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యాన్ని పెట్టుకోవాలి’’అని ఆయన పేర్కొన్నారు. -
‘150 రైళ్లు..50 స్టేషన్లు ప్రైవేటుపరం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత రైల్వేల ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. తేజాస్ రైలును ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా మరో 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను దశలవారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం గురువారం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం గురించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ముందకు తీసుకువెళ్లేందుకు సాధికార కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని లేఖలో కాంత్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల ప్రైవేటకీరణ అనుభవాన్ని ప్రస్తావిస్తూ రైల్వేల్లోనూ ఇదే తరహాలో ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యదర్శులతో కూడిన సాధికార కమిటీ ఏర్పాటవుతుందని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్‌కు రాసిన లేఖలో అమితాబ్ కాంత్ తెలిపారు. ప్రయాణీకుల రైళ్ల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ప్రక్రియతో ఈ రైళ్ల నిర్వహణలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. -
సాగు సంక్షోభంతోనే మాంద్యం
మన వ్యవసాయరంగంలో కనీవినీ ఎరుగని రీతిలో కనిపిస్తున్న ప్రస్తుత సంక్షోభం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత తారస్థాయికి చేరుకుంటోంది. అయినప్పటికీ మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ సంక్షోభంపై ఎలాంటి ప్రతిస్పందనా వ్యక్తపర్చకపోవడం బాధాకరం. అయితే భారతీయ వ్యవసాయరంగాన్ని ఆవరిస్తున్న కఠిన వాస్తవాలపై నీతి ఆయోగ్ మేల్కొనకపోయి ఉన్నట్లయితే ఆర్థిక మందగమనం గురించి ఈ స్థాయిలో ఎవరూ గగ్గోలు పెట్టేవారు కాదు. వ్యవసాయ రంగ నిజ ఆదాయాలు తగ్గుముఖం పట్టి, గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ కుప్పగూలడంతో దేశీయ డిమాండ్ క్షీణించిపోయిన పరిస్థితికి అనివార్య ఫలితమే ఆర్థిక మందగమనం. దీన్ని పక్కనబెట్టి పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలపై మన ఆలోచనలు సాగినంతకాలం ఆర్థిక రంగం కోలుకోవడం కలలో మాటే. దేశాన్ని ఆవరిస్తోన్న ఆర్థిక రంగ క్షీణత అనూహ్యమైనదని, బహుశా గత 70 ఏళ్లలో ఇంతటి హీన పరిస్థితిని చవిచూడనట్లుందని సాక్షాత్తూ నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్వయంగా పేర్కొన్నారు. పైగా ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు కల్పించాలంటే అసాధారణ చర్యలు తీసుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు. అయితే గత 17 ఏళ్ల కాలంలో అంటే 2000–17 మధ్య కాలంలో భారతీయ రైతులు దాదాపు రూ.45 లక్షల కోట్లను నష్టపోయి తీవ్రంగా దెబ్బతిన్నారనన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ నీతి అయోగ్ ఎలాంటి ప్రమాద హెచ్చరికలను చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముందే చెప్పినట్లు మన వ్యవసాయరంగంలో కనీవినీ ఎరుగని రీతిలో కనిపిస్తున్న ప్రస్తుత సంక్షోభం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత తారస్థాయికి చేరుకుంటోంది. అయినప్పటికీ మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ సంక్షోభంపై ఎలాంటి ప్రతిస్పం దనా వ్యక్తపర్చకపోవడం బాధాకరం. రైతులకు న్యాయంగా లభించాల్సిన ఆదాయాన్ని తిరస్కరించడం వల్లే వారు రూ. 45 లక్షల కోట్లను కోల్పోవలసి వచ్చిందని ఓఈసీడీ–ఐసీఆర్ఐఈఆర్ నివేదిక తెల్పింది. అలాగే 2017–18లో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసుకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సమర్పించిన సర్వే ప్రకారం 2011–12 నుంచి 2017– 18 మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 3.4 కోట్లమంది సాధారణ కూలీలు (వీరిలో 3 కోట్లమంది వ్యవసాయ కార్మికులు) తమ ఉపాధి కోల్పోయారు. భీతిగొల్పుతున్న గ్రామీణ ఆర్థిక దుస్థితి సంకేతాలు ఇక్కడే ఉన్నాయి. కానీ అసలు విషయం ఏదంటే మన విధాన నిర్ణేతలు ఈ వాస్తవాన్ని చూడడానికి కూడా ఇష్టపడకపోవడమే. తీవ్ర సంక్షోభం బారిన పడుతున్నట్లు మన పారిశ్రామికరంగం సంకేతాలు వ్యక్తపరిచేంతవరకు, భారత ఆర్థిక వ్యవస్థను ఏదీ దెబ్బతీయలేదనే భ్రమల్లో మునిగిపోయాం. ఇంకా సూటిగా చెప్పాలంటే గ్రామీణ భారత్ అసలు ఉనికిలోనే లేనట్లు, అది ఎక్కడో సబ్– సహారా ఆఫ్రికాలో ఉంటున్నట్లు భావిస్తూ వచ్చిన విధాన నిర్ణేతలు, ఆర్థిక వేత్తలు మన రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోనంత దూరానికి జరిగిపోయారు. అయితే భారతీయ వ్యవసాయరంగాన్ని ఆవరిస్తున్న కఠిన వాస్తవాలపై నీతి ఆయోగ్ మేల్కొనకపోయి ఉన్నట్లయితే ఆర్థిక మందగమనం గురించి ఈ స్థాయిలో ఎవరూ గగ్గోలు పెట్టేవారు కాదు. వ్యవసాయ రంగ నిజ ఆదాయాలు తగ్గుముఖం పట్టి, గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ కుప్పగూలడంతో దేశీయ డిమాండ్ క్షీణించిపోయిన పరిస్థితికి అనివార్య ఫలితమే ఆర్థిక మందగమనం. అంతే తప్ప ప్రస్తుత సంక్షోభానికి నిపుణులు నొక్కి చెబుతున్నట్లుగా దేశంలో ద్రవ్యలభ్యత లేకపోవడం కారణం కాదు. గత రెండేళ్లుగా వ్యవసాయ రంగంలో వాస్తవాదాయం దాదాపు జీరో వృద్ధిరేటుకు పడిపోయింది. అంతకుముందు 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో అయిదేళ్లలో వ్యవసాయ రంగ వృద్ధి అర్ధశాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక్కడే భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత పతనాన్ని చవిచూస్తోందని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇక వ్యవసాయ రంగ ఆదాయాలు చూస్తే గత 14 ఏళ్లలో అత్యంత స్వల్పస్థాయికి దిగజారిపోయాయి. నమ్మలేని విషయం ఏమిటంటే 2011–2017 మధ్య కాలానికి వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు మొత్తం జీడీపీలో 0.3 నుంచి 0.4 శాతంగా మాత్రమే నమోదైనట్లు సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వెల్లడయింది. వీటిని బట్టే, దేశంలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వ్యవసాయ రంగం ఇన్నేళ్లుగా ఎంతటి దారుణ నిర్లక్ష్యానికి గురయిందో బోధపడుతుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడమే ప్రాతిపదికగా అన్ని ప్రయత్నాలు ముందుకుసాగాలి. కానీ దీనికి భిన్నంగా, అసలు సమస్య వ్యవసాయరంగ సంక్షోభంలో కనిపిస్తుం డగా వాహనాల అమ్మకాలు పడిపోయాయి మొర్రో అంటున్న పరి శ్రమ విషాదగీతికే ప్రచారం పొందుతోంది. దేశవ్యాప్తంగా లోదుస్తుల అమ్మకాలు కూడా పడిపోయాయని, చివరకు అయిదు రూపాయిలు పెడ్జి బిస్కెట్లు కొనడానికి కూడా ఒకటికి రెండుసార్లు పేదవారు ఆలోచిస్తున్నందున దాదాపు 10 వేలమంది కార్మికులను ఉద్యోగాల్లోంచి తీసేయాల్సి వస్తోందని ప్రముఖ బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే బిస్కెట్స్ ప్రకటించడం వంటివి జాతీయ మీడియాలో విపరీత ప్రచారానికి నోచుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై కన్నేసిన పారిశ్రామిక లాబీ బృందాలకు మన మీడియాలోని అతి పెద్ద సెక్షన్ పూర్తి మద్దతుగా నిలుస్తోంది. ఇలా పారిశ్రామికరంగానికి మద్దతుగా టముకు వాయిస్తున్న మీడియా కఠోర శబ్దాల మరుగున రైతులు, గ్రామీణ పేదలు మరోసారి తెరవెనక్కు పోతున్నారు. మందకొడిగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలంటే సంపన్నులకు మరిన్ని రాయితీలు, మినహాయింపులు కల్పించాల్సిం దేనంటూ మీడియాలో వస్తున్న ఆర్భాటపు ప్రకటనల సారాంశం ఒక్కటే. సమాజంలో ఇప్పటికే బలిసి ఉన్న సంపన్న వర్గాలకు మరింత డబ్బును అందుబాటులో ఉంచడమే ఈ ప్రచారం పరమార్థం. కానీ పారిశ్రామిక పెట్టుబడుదారులు పెడుతున్న ఈ గావుకేకలు, హాహాకారాలు డిమాండును సృష్టించడంలో ఎలా తోడ్పడతాయన్నది నాకు పరమాశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. పరిశ్రమలకు మరిన్ని పెట్టుబడులను, డబ్బును తరలిస్తే అది పేదల చేతుల్లో మరింత డబ్బు చేరడానికి ఎలా సహకరిస్తుందన్నది పెద్ద పజిల్. అన్నిటికంటే మించి ఆర్థిక మాంద్యానికి వాస్తవంగా కారకులైన వారి చేతుల్లో మరింత డబ్బును పెట్టడానికే విధాన నిర్ణేతలు అన్ని చర్యలూ తీసుకుంటుండటాన్ని నేను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ మొత్తం పరిస్థితిని చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ కె. సుబ్రమణియన్ గతంలో చేసిన ప్రకటనకు అన్వయించుకోవచ్చు. భారతీయ పారిశ్రామికవర్గం లాభాలను తమ సొంతం చేసుకుంటూ నష్టాలను సమాజపరం చేస్తోందా? అని ఆయన గతంలో ప్రశ్నించారు. ఆయన ప్రశ్నను సమర్ధిస్తున్న్టట్లుగానే, 2007 నుంచి గత 12 ఏళ్ల కాలంలో రూ. 8.5 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసేశారు. పైగా బ్యాంకులు తమపై ఇంకా రూ. 17 లక్షల కోట్ల రుణ భారం ఉందని ప్రకటిస్తున్నాయి. దీంట్లో కనీసం రూ. 12 లక్షల కోట్ల రుణాలు తిరిగి రానివే ఉంటాయని ఆర్థిక విశ్లేషకుల ఉవాచ. దేశీయ ప్రైవేట్ రంగం ఇప్పటికే బ్లాక్‌హోల్‌లో మునిగిపోయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో 2009 నుంచి భారతీయ పరిశ్రమ ప్రతి సంవత్సరం రూ. 1.8 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని అందుకుంటూ వచ్చింది. గత పదేళ్లలోనే అది రూ.18 లక్షల కోట్లను బెయిలవుట్ ప్యాకేజీ రూపంలో అందుకుంది. అదనంగా జీడీపీలో 5 శాతం వార్షిక పన్ను మినహాయింపును కూడా పొందుతోంది. కష్టమొచ్చినప్పుడు పరిశ్రమ తనకు తానుగా నిలదొక్కుకోవాలే తప్ప ప్రభుత్వం వద్దకు పరుగెత్తకూడదని ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పింది సరైనదే. ఎయిర్ ఇండియా నష్టాలనుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ఇస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ ఎయిర్‌లైన్‌ని ప్రైవేటీకరించాలని పరిశ్రమదారులు గావుకేకలు పెడుతుంటారు. కానీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రైవేట్ పరిశ్రమలు కూడా ఉద్దీపన ప్యాకేజీలకు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో వాటిని మనం ఎందుకు జాతీయం చేయకూడదు? ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల జీవనదానాన్ని ఆర్బీఐ సమర్పిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పునరుద్ధరించాలంటే గ్రామీణ పేదలకు మరింత డబ్బును అందుబాటులోకి తీసుకురావడమే ఉత్తమ ఎంపిక. 17 రాష్ట్రాల్లో ఒక రైతు కుటుంబం సగటు ఆదాయం సంవత్సరాదాయం రూ.20,000లు మాత్రమే. అందుకే కేంద్రానికి అందుతున్న భారీ మొత్తంనుంచి ప్రధాన్ మంత్రి కిసాన్ స్కీం కింద రైతులకు అందిస్తున్న ప్రత్యక్ష నగదు సహాయాన్ని రెట్టింపు చేయాలి. ప్రస్తుతం భూమి ఉన్న రైతుకు ఏటా రూ.6 వేల రూపాయల నగదు సహాయం చేస్తుండగా దాన్ని కుటుంబానికి 12 కోట్ల రూపాయలకు పెంచాలి. అంటే నెలకు రైతుకు కనీసం వెయ్యిరూపాయల నగదు సహాయం అందుతుందన్నమాట. భూమిలేని రైతులను కూడా పీఎమ్ కిసాన్ పథకంలో భాగం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అలాగే వ్యవసాయంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను గణనీయంగా పెంచాలి. దీంట్లో భాగంగానే ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా 20,000 గ్రామీణ రైతు బజార్లను ఆధునిక మండీలుగా మార్చాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
కృత్రిమ మేథతో సమూల మార్పులు
దావోస్ : కృత్రిమ మేథ (ఏఐ)తో మానవ జీవితంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెనుప్రభావం చూపుతుందని తాము భావిస్తున్నామన్నారు. మెరుగైన డేటా ఇవ్వగలగడం, వైద్యులకు నివేదికలు, చిత్రాలు పంపడం, విద్యలో వెనుకబడిన విద్యార్ధులను పర్యవేక్షించడం వంటి ఎన్నో ఊహించని మార్పులు ఏఐతో అనుభవంలోకి వస్తాయన్నారు. కృత్రిమ మేథను పౌరుల జీవితం మెరుగయ్యేందుకు శాస్త్రీయ కోణంలో అమలు చేయాలని సూచించారు. అందరి ప్రయోజనం కోసం ఏఐని వాడుకోవడంపై దృష్టిసారించాలని, దీనిపై మితిమీరిన ఆంక్షలు వినూత్న ఆవిష్కరణలపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. -
వీసాలో మార్పులు: అమెరికాకే ఎఫెక్ట్
హెచ్-1బీ వీసాలో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రతిపాదనలపై దిగులుపడాల్సింది భారత్ కాదంట. ఆ దేశమే హెచ్-1బీ వీసాల్లో మార్పులకు ఆందోళన చెందాల్సి ఉందట. హెచ్-41బీ వీసా ప్రక్రియల్లో నిబంధనలు కఠినతరం అమెరికాపైనే ప్రభావం చూపుతాయని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ తెలిపారు. ''ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ త్వరలో వాస్తవాలు తెలుసుకోవాల్సినవసరం ఉంది. అమెరికాలో సాఫ్ట్వేర్ గ్రోత్‌కు భారతీయులు గణనీయమైన సహకారం అందిస్తున్నారు'' అని కాంత్ సోమవారం చెప్పారు. ఇప్పటివరకు అమెరికా ఓపెనీ ట్రేడ్‌కు ఎక్కువగా పేరొందింది. అంతర్జాతీయంగా ఉన్న ప్రతిభావంతులను ఇది ఎక్కువగా ఆకట్టుకునేది, ఓపెన్ ట్రేడ్ వల్లనే అమెరికా వృద్ది చెందుతున్నారు. అమెరికా అధ్యక్షుడు అమలు పరుస్తున్న కఠిన చర్యలు అమెరికానే బలహీనపరుస్తాయని, ఆ విషయాన్ని ట్రంప్ తెలుసుకోవాలని సూచించారు. ఇన్పుట్ కాస్ట్ పెరుగుతోందని, వినియోగదారులకు ఉత్పత్తిచేసే గూడ్స్ కూడా ఇక అత్యంత ఖరీదుగా మారతాయని చెప్పారు. ప్రస్తుతం మనందరం ప్రపంచీకరణలో ఉన్నామని, దీన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యపడదని పేర్కొన్నారు. -
2022 నాటికి వాటి అవసరమే ఉండదట!
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవాలకు లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో రానున్నకాలంలో ఏటీఎం కార్డులు, మెషీన్లకు ఇక కాలం చెల్లినట్టేనట. పెద్ద నోట్ల రద్దు తరువాత, 2022 నాటికి ఏటీఎంకార్డులు, పీఓఎస్ మెషీన్ల అవసరం ఉండదని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. యూత్ ప్రవాసీ భారతీయ దివస్ 2017లో బాగంగా నిర్వహించిన సెషన్లో ప్రసంగించిన కాంత్, ప్రతి భారతీయుడూ కేవలం తన బొటనవేలిని, మొబైల్ ఫోన్ ద్వారా అన్ని లావాదేవీలు జరుపుతున్న నేపథ్యంలో ఇక కార్డులు వ్యర్థంగా మారిపోతాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల, డిజిటల్ చెల్లింపులు భారీ స్థాయిలో జరుగుతాయని, ప్రపంచంలోనే వందకోట్ల (బిలియన్) మొబైల్ కనెక్షన్లు, వందకోట్ల బయోమెట్రిక్‌లను కలిగిన ఏకైక దేశంగా భారత్ అవతరించిందని కాంత్ పేర్కొన్నారు. ఇటీవల విడుదల భీమ్ యాప్ , ఆధార్ ఆధారిత సేవలను గుర్తు చేశారు. సాంకేతికంగా శరవేగంగా జరుగుతున్న మార్పులు, డిజిటల్ చెల్లింపుల పురోగతి కారణంగా మరో మూడేళ్లలోనే భారత్‌లో ఏటీఎంలు, క్రిడిట్ కార్టులు అదృశ్యం కానున్నాయని చెప్పారు. ద్రవ్య సాంకేతికత మరియు సామాజిక ఆవిష్కరణల పరంగా భారత్ శరవేగంగా మార్పులకు గురికానుందని, ఈ నేపథ్యంలో వచ్చే రెండున్నరేళ్ల కాలంలోనే భారత్‌లో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పీఓఎస్ మెషీన్లు దండగే అని చెప్పారు. ఆదార్ కార్డ్ ఆధారిత టెక్నాలజీ వల్ల ప్రతి లావాదేవీ కూడా కేవలం 30 సెకన్లలో పూర్తవుతుందన్నారు. దేశంలోఇంతవరకు 85శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతుండగా, దేశంలో అతికొద్దిమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని అందుకే డిజిటల్ లావాదేవీలు, నియత ఆర్థిక వ్యవస్థను రూపొందిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చట్టబద్ధంగా రెండు లక్షల కో్ట్ల డాలర్లు చలామణిలో ఉంటూ మరొక లక్ష కోట్ల డాలర్లు అనియతరంగంలో నల్ధ ఆర్థిక వ్యవస్థగా ఉంటున్న స్థితిలో భారత్ పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే అసాధ్యమన్నారు. ఇలాంటి నేపథ్యంలో భారత్ అభివృద్ధి చెందడమే సాధ్యం కాదని చెప్పారు. వ్యాపార సరళీకరణలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలు ఎఫ్ డీఐ వృద్ధికి దారితీసిందన్నారు. దేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి, ఉద్యోగ సృష్టిలో ప్రభుత్వ కృషిని ఆయన నొక్కి చెప్పారు. యూరోప్, అమెరికాలో జనాభా పెద్దవాళ్ల సంఖ్య పెరుగుతోంటే, మనదేశంలో మాత్రం యువత సంఖ్య బాగాపెరుగుతూ ఉండడం అతిపెద్ద సాంఘిక, ఆర్థిక అద్భుతమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ వృద్ధి రేటు 7.6 శాతంతో కొనసాగడం గమనించాలన్నారు. అభివృద్ధిలో కుంటుపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఇప్పటికీ ఒయాసిస్‌గానే ఉందని నీతి అయోగ్ సీఈఓ అభిప్రాయపడ్డారు. -
నీతిఅయోగ్ సీఈఓగా అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ (భారత జాతీయ పరివర్తన సంస్థ)కు నూతన సీఈవోగా అమితాబ్ కాంత్ నియమితులయ్యారు. అమితాబ్ కాంత్ ను నియమించినట్లు కేంద్ర సిబ్బంది గురువారం వెల్లడించాయి. ప్రస్తుతం నీతి ఆయోగ్ సీఈవోగా ఉన్న సింధుశ్రీ ఖుల్లార్ పదవీ కాలం ముగియటంతో ఆమె స్థానంలో ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ శాఖ కార్యదర్శి అమితాబ్ కాంత్ కు బాధ్యతలు అప్పగించింది. అమితాబ్ కాంత్ 1980 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఇప్పటివరకూ ఆయన పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహం శాఖ కార్యదర్శిగా పని చేశారు. అమితాబ్ కాంత్ 2016 ఫిబ్రవరిలో పదవీవిరమణ చేయనున్నారు. కాగా గత ఆరు దశాబ్దాల కాలంలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంకేతిక, జనాభా పరమైన అంశాల్లో భారత ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదే క్రమంలో దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లోనూ మార్పులు వచ్చాయి. కాలానుగుణంగా సంభవించిన మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆశలను, అవసరాలను తీర్చేందుకు ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పాటైంది. దేశంలోని అన్ని ప్రాంతాలను దేశాభివృద్ధిలో భాగం చేసేందుకు నీతి ఆయోగ్‌లో రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించారు. టీం-నీతి ఆయోగ్ చైర్పర్సన్: నరేంద్రమోదీ, భారత ప్రధాని వైస్ చైర్పర్సన్: అర్వింద్ పనగారియా శాశ్వత సభ్యులు: బిబేక్ దెబ్రోయ్, వీకే సారస్వత్, ప్రొ. రమేశ్‌చంద్ ప్రత్యేక ఆహ్వానితులు: నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర సామాజిక న్యాయ శాఖ స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర మానవవనరుల శాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: అమితాబ్ కాంత్