వీసాలో మార్పులు: అమెరికాకే ఎఫెక్ట్ | Trump will realise that restrictions on H-1B visa affect US: Niti Aayog CEO | Sakshi
Sakshi News home page

వీసాలో మార్పులు: అమెరికాకే ఎఫెక్ట్

Published Tue, Feb 14 2017 1:39 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM

వీసాలో మార్పులు: అమెరికాకే ఎఫెక్ట్ - Sakshi

వీసాలో మార్పులు: అమెరికాకే ఎఫెక్ట్

హెచ్-1బీ వీసాలో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రతిపాదనలపై దిగులుపడాల్సింది భారత్ కాదంట. ఆ దేశమే హెచ్-1బీ వీసాల్లో మార్పులకు ఆందోళన చెందాల్సి ఉందట.

హెచ్-1బీ వీసాలో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రతిపాదనలపై దిగులుపడాల్సింది భారత్ కాదంట. ఆ దేశమే హెచ్-1బీ వీసాల్లో మార్పులకు  ఆందోళన చెందాల్సి ఉందట. హెచ్-41బీ వీసా ప్రక్రియల్లో నిబంధనలు కఠినతరం అమెరికాపైనే ప్రభావం చూపుతాయని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ తెలిపారు. ''ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ త్వరలో వాస్తవాలు తెలుసుకోవాల్సినవసరం ఉంది. అమెరికాలో సాఫ్ట్వేర్ గ్రోత్కు భారతీయులు గణనీయమైన సహకారం అందిస్తున్నారు'' అని కాంత్ సోమవారం చెప్పారు.
 
ఇప్పటివరకు అమెరికా ఓపెనీ ట్రేడ్కు ఎక్కువగా పేరొందింది. అంతర్జాతీయంగా ఉన్న ప్రతిభావంతులను ఇది ఎక్కువగా ఆకట్టుకునేది, ఓపెన్ ట్రేడ్ వల్లనే అమెరికా వృద్ది చెందుతున్నారు. అమెరికా అధ్యక్షుడు అమలు పరుస్తున్న కఠిన చర్యలు అమెరికానే బలహీనపరుస్తాయని, ఆ విషయాన్ని ట్రంప్ తెలుసుకోవాలని సూచించారు. ఇన్పుట్ కాస్ట్ పెరుగుతోందని, వినియోగదారులకు ఉత్పత్తిచేసే గూడ్స్ కూడా ఇక అత్యంత ఖరీదుగా మారతాయని చెప్పారు. ప్రస్తుతం మనందరం ప్రపంచీకరణలో ఉన్నామని, దీన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యపడదని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement