
న్యూఢిల్లీ: కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తాము దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) 2023 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. మరోవైపు 2047 నాటికి సంపన్న ఎకానమీగా ఎదగాలన్న భారత ఆకాంక్షలకు కారి్మక కొరత సమస్య కాబోదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు.
నవకల్పనల ప్రధాన లక్ష్యం కారి్మకుల ఉత్పాదకతను మరింతగా పెంచడం, వనరులను సమర్ధంగా వినియోగించుకునేలా చేయడమేనని ఆయన పేర్కొన్నారు. జెనీవాకు చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రూపొందించిన జీఐఐ 2023 నివేదికలోని 132 దేశాల్లో భారత్ 40వ ర్యాంకులో కొనసాగింది. అటు గత దశాబ్దకాలంగా జీఐఐలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏడు దేశాల్లో భారత్ కూడా ఒకటని జీఐఐ కో–ఎడిటర్ సషా ఉన్‡్ష–విన్సెంట్ తెలిపారు.