Subrahmanyam
-
Aditya Subramanian: ఫిట్‌గా ఒక్కో మెట్టెక్కి...
మిస్టర్ ఇండియా విజయం నేను కోరుకుంటున్న కెరీర్‌కు తొలి అడుగు మాత్రమే. నా ఈ విజయం మనదేశంలో మోడలింగ్, ఎంటర్టైన్మెంట్ రంగంలోకి రావాలనుకునే యువతకు స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను. అంకితభావంతో హార్డ్‌వర్క్ చేసినప్పుడే విజయం సొంతమవుతుంది. అదే మనల్ని మన లక్ష్యాల దరి చేరుస్తుంది. – ఆదిత్య సుబ్రమణియన్, మిస్టర్ ఇండియా విజేతఆదిత్య సుబ్రమణియన్... ఆరడుగుల ఎత్తున్న 27 ఏళ్ల కుర్రాడు. చెన్నైలోని పల్లవరానికి చెందిన ఈ యువకుడు ఎస్ఆర్ఎమ్ కాలేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్. చదువు పూర్తి చేసి కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడితో సంతృప్తి చెందలేదతడు. సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. కెరీర్ దృష్టిని విస్తృతం చేసుకున్నాడు. తనకిష్టమైన ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్‌లో అదృష్టాన్ని, అవకాశాలనూ పరీక్షించుకోవాలనుకున్నాడు. అందుకోసం ముందుగా ఏదైనా ఒక వేదిక మీద విజేతగా నిలవడం తొలి మెట్టు అనుకున్నాడు. ఏకకాలంలో పలువురి దృష్టిని ఆకర్షించడానికి మిస్టర్ ఇండియా పోటీలను ఎంచుకున్నాడు, విజేతగా నిలిచాడు. కలసాధనకు కాలపరీక్ష!సాహిత్యాభిలాషి అయిన ఆదిత్య తాను కలలు కన్న లక్ష్యాన్ని చేరడానికి ఆరేళ్లుగా కఠోరంగా శ్రమించాడు. పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ తనను తాను మలుచుకుంటూ దేహాకృతి కోసం క్రమం తప్పకుండా జిమ్‌లో ఎక్సర్సైజ్లు చేశాడు. మిస్టర్ మదరాసీ, ఐరిస్ గ్లామ్ మిస్టర్ సూపరామ్ప్, ఎస్టిలో మిస్టర్ సదరన్ క్రౌన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. మోడలింగ్‌లో నిరూపించుకున్నాడు. ఇదంతా చెప్పుకున్నంత సులువుగా జరగలేదు.ఒక్కో విజయాన్ని అందుకుంటూ తాను ఎంచుకున్న శిఖరం వైపు ప్రయాణం సాగిస్తున్న సమయంలో కాలం పెద్ద పరీక్ష పెట్టింది. మిస్టర్ ఇండియా పోటీల కోసం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నప్పుడు వెన్నెముకకు గాయమైంది. ప్రాక్టీస్ మానేయాల్సి వచ్చింది. గాయం మానే వరకు విశ్రాంతి తప్పదు. ఈ లోపు బాడీ షేపవుట్ కాకుండా, బరువు పెరగకుండా చూసుకోవడం కూడా పెద్ద చాలెంజ్ అనే చె΄్పాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ని కాపాడుకున్నాడు. ఆ సమయంలో మొదలైన అంతర్మథనం తనలో ప్రశాంతతను అలవరిచిందని, ఆత్మస్థయిర్యాన్ని పెంచి వ్యక్తిగా పరిణతి చెందడానికి దోహదం చేసిందని చె΄్పాడు ఆదిత్య. వెండితెర మీద వెలగాలి..ఆదిత్య గెలిచిన మిస్టర్ ఇండియా కిరీటం పేరు ‘రుబారు మిస్టర్ ఇండియా 2024 కాబల్లెరో యూనివర్సల్’. ఈ టైటిల్ విజేతలు వెనిజులాలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే కాబల్లెరో యూనివర్సల్ పోటీల్లో ప్రపంచదేశాలతో పోటీ పడతారు. ఆ పోటీల్లో మనదేశానికిప్రాతినిధ్యం వహించనున్నాడు ఆదిత్య. ఫ్యాషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, మోడలింగ్, యాక్టింగ్ పట్ల తన ఇష్టాన్ని తెలియచేస్తూ నటుడిగా స్థిరపడాలనేది తన అంతిమ లక్ష్యమని చె΄్పాడు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విద్యార్థులే భవిష్యత్ హీరోలు!!
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో విద్యార్థులే భవిష్యత్ హీరోలు. తాము నేర్చుకున్న నైపుణ్యాలతో సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలి. పరిశోధనలు, ఆవిష్కరణల్లో ముందుండాలి. సాంకేతిక నైపుణ్యాలతో చేసే పరిశోధనలు సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. అప్పుడే చదివిన చదువుకు సార్థకత లభిస్తుంది. – నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అప్పుడే చదివిన చదువుకు సార్థకత..సాంకేతిక కోర్సులు అభ్యసించాలనుకునే ఔత్సాహిక విద్యార్థులంతా ఐఐటీల్లో సీట్లు సాధించాలని భావిస్తున్నారు. ఆ సర్టిఫికెట్లతో మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్వసిస్తున్నారు. అయితే.. ఐఐటీ సర్టిఫికెట్ ఉంటే వ్యక్తిగత కీర్తిప్రతిష్టలు, అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తాయనే ఆలోచనలకే పరిమితం కాకూడదు. ఐఐటీల్లో తాము నేర్చుకున్న నైపుణ్యాలతో సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలి. సాంకేతిక నైపుణ్యాలతో చేసే పరిశోధనలు సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. అప్పుడే చదివిన చదువుకు సార్థకత లభిస్తుంది. యువత ముందు వరుసలో ఉండాలి..2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో విద్యార్థులే భవిష్యత్ హీరోలు. ముఖ్యంగా సామాజిక అభివృద్ధికి చేసే పరిశోధనలు, ఆవిష్కరణల్లో యువత ముందు వరుసలో ఉండాలి. ఈ క్రమంలో విద్యార్థులు సంకుచిత లేదా పరిమిత ఆలోచనల చట్రంలోంచి బయటకు రావాలి. విశాల దృక్పథంతో తమ ఆలోచనల పరిధిని విస్తృతం చేసుకోవాలి. దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడాలి.30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఈ రెండే కీలకం..ప్రస్తుతం మనం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. రానున్న రోజుల్లో 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాలను సాధించడానికి.. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి.. విద్య, నైపుణ్యాలే ఎంతో కీలకం. ప్రస్తుతం మనదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కూడా ఈ రెండు అంశాలే ప్రధాన కారణం. ఈ క్రమంలో చేతివృత్తుల నుంచి ఐటీ రంగం వరకు.. అన్ని రంగాల్లోని వారు నిరంతరం ఆధునిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఇప్పుడు చేసే పనిని భవిష్యత్తులో రోబోలు చేయొచ్చు. అప్పుడు అకస్మాత్తుగా ఆ మార్పును అందిపుచ్చుకోలేక వృత్తిలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించి ఆధునిక నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఇక.. ఐటీ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రంగంలోని విద్యార్థులు, ఉద్యోగులు ఏఐ, ఐవోటీ వంటి ఆధునిక నైపుణ్యాలను నిరంతరం నేర్చుకోవాలి. వాటిలో పట్టు సాధిస్తేనే భవిష్యత్తులో ముందుండటానికి అవకాశం ఉంటుంది.స్టార్టప్స్‌కు వెన్నుదన్నుగా..ఇటీవల కాలంలో మన దేశం అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలవడానికి మరో ప్రధాన కారణం.. స్టార్టప్స్‌కు వెన్నుదన్నుగా పలు చర్యలు తీసుకోవడం. విద్యా సంస్థల స్థాయిలోనే ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం, ఏంజెల్ ఫండింగ్ చేసేందుకు పెట్టుబడిదారులు అంగీకరించేలా ప్రణాళికలు రూపొందించడం వంటి చర్యలతో స్టార్టప్స్ సంఖ్య పెరుగు తోంది. ముఖ్యంగా ఐఐటీల్లో ఇవి విస్తృతమవుతున్నాయి. దేశంలో 100కు పైగా ఉన్న యూనికార్న్ స్టార్టప్స్‌లో 15 శాతం సంస్థలు ఐఐటీ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినవే. ఇదే తరహాలో అన్ని ప్రాంతాల స్టార్టప్స్‌కు తోడ్పాటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ముందుకు రావాలి..దేశాభివృద్ధికి తోడ్పడే యువతను తీర్చిదిద్దడంలో ప్రైవేట్ విద్యా సంస్థలూ ముందుకు రావాలి. కేవలం లాభాపేక్షతో విద్యా సంస్థలను నిర్వహించే ధోరణి విడనాడాలి. తమ విద్యార్థులు కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వాము లయ్యేలా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇంక్యుబేషన్ కేంద్రాలు, స్టార్టప్స్‌కు తోడ్పాటు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి.అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి..వేల సంవత్సరాల క్రితమే.. భారత్ అన్ని రకాలుగా ఎంతో ముందున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అలాంటి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే.. అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి. ఈ క్రమంలో నూతన జాతీయ విద్యా విధానంలోని మార్గదర్శకాలు సత్ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమాజంలోని అన్ని వర్గాల వారికి విద్యా ఫలాలు అందేలా జాతీయ విద్యా విధానం రూపకల్పన జరిగింది.గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా భారత్..విదేశీ విద్యకు వెళుతున్న విద్యార్థుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో మన దేశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో.. అంతర్జాతీయ విద్యార్థులే మన దేశానికి వచ్చేలా, మన దేశాన్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడాన్ని విజన్–2047 లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో 2047 నాటికి ఏటా ఐదు లక్షల మంది విదేశీ విద్యార్థులు.. ఉన్నత విద్య కోసం భారత్‌కు వచ్చేలా విద్యా రంగంలో మార్పులు చేయనున్నాం. అదే విధంగా మన విద్యార్థులు కూడా స్వదేశంలోనే చదువుకునేలా ఇక్కడి విద్యా సంస్థలను మెరుగుపరిచే చర్యలకు కూడా సిఫార్సు చేశాం.పరిశ్రమలు– విద్యా సంస్థల భాగస్వామ్యందేశాభివృద్ధిలో యువతది కీలక పాత్ర కానున్న నేపథ్యంలో పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం కూడా ఎంతో ప్రధానమని గుర్తించాలి. పరిశ్రమల అవసరాలకనుగుణంగా కోర్సులు లేకపోతే.. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు పరిశ్రమలు, ఇటు విద్యా సంస్థలు నిరంతరం సంప్రదింపులు సాగించాలి. పరిశ్రమల అవసరాలను తీర్చే విధంగా విద్యార్థులకు విద్యా సంస్థలు నైపుణ్యాలు అందించాలి.అప్పుడు విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుంది. వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా సాగుతాయి. ఇవి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడతాయి. అందుకే విద్యా సంస్థల కరిక్యులం, ఇతర బోధన వ్యవహారాల్లో పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి పరిశ్రమలు–విద్యా సంస్థల భాగస్వామ్యం కూడా ఒక ప్రధాన కారణం.బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రొఫెల్ఛత్తీస్గఢ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారిజమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో సంయుక్త కార్యదర్శి వంటి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.2022లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.2023లో నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు.విజన్–2047 డాక్యుమెంట్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. -
పోలిపల్లిలో కబ్జా గళం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రూ.వందల కోట్ల విలువైన భూములు అవి. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఉన్న ఈ ఖరీదైన భూములను ఆ పార్టీ నేతలు నకిలీ పత్రాలతో కొట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలిపల్లి కేంద్రంగా సాగించిన భూ దందాలు ఇప్పుడు టీడీపీ నేత నారా లోకేశ్ సభతో మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పత్రాలతో విక్రయించి.. పరిహారం కాజేసి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ గ్రామం, సర్వే నంబరు 27లో 45 ఎకరాలున్న ఆసామి తిరుమారెడ్డి ఆదినారాయణ 1973లోనే మృతి చెందారు. భీమునిపట్నం మండలం అమనాం ఆయన స్వగ్రామం. ఆ భూములను కాజేసేందుకు తిరుమలరెడ్డి ఆదినారాయణ, అతడి కుమారుడు రమేష్ అనే వ్యక్తులను టీడీపీ నేతలకు బినామీగా వ్యవహరించే పులవర్తి సుబ్రహ్మణ్యం నకిలీ ధ్రువపత్రాలతో రంగంలోకి దించాడు. నకిలీ పత్రాలతో 5.01 ఎకరాలను శ్రీరామినేని శ్రీధర్‌కు, మిగతా ఐదు ఎకరాలను కోనేరు కరుణాకరరావుకు 2000లో విక్రయించారు. అనంతరం దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన ఆర్డీవో నాగేశ్వరరావు ఆ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్స్ బోగస్ అని తేల్చారు. తహసీల్దారు, ఆర్డీవో సంతకాలను ఫోర్జరీ చేశారని నిర్ధారిస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలని 2005లోనే ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేసినా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. మరోవైపు జాతీయ రహదారి విస్తరణ సమయంలో తిరుమారెడ్డి ఆదినారాయణకు చెందిన సుమారు 1.74 ఎకరాల భూమి పోయింది. దీనికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చెల్లించిన పరిహారాన్ని ఆయన వారసులకు తెలియకుండా టీడీపీ భోగాపురం మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ కాజేసిన వైనాన్ని ‘సాక్షి’ జిల్లా ప్రతినిధి ఇప్పటికే బట్టబయలు చేశారు. బినామీ బాగోతం ఇలా... విలువైన భూములను కాజేసేందుకు పులవర్తి సుబ్రహ్మణ్యం అనే బినామీని తెరపైకి తెచ్చిన టీడీపీ నాయకులు తిరుమలరెడ్డి ఆదినారాయణ అనే పేరుతో బోగస్ గుర్తింపు కార్డులను సృష్టించారు. అయితే ఇంటి పేరు తిరుమారెడ్డి బదులు తిరుమలరెడ్డి అని రాయడంతో పప్పులో కాలేశారు! పులవర్తి సుబ్రహ్మణ్యం సాక్షి సంతకంతో భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1.2.2000వ తేదీన రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాదారు పాసు పుస్తకం లేకపోవడంతో సబ్‌రిజిస్ట్రార్ దస్తావేజులను పెండింగ్‌లో పెట్టారు. దీంతో నకిలీ పాసుపుస్తకం, టైటిల్ డీడ్లను టీడీపీ నాయకులు సృష్టించారు. వాటిని సమర్పించడంతో 31.3.2000న సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్లను రిలీజ్ చేశారు. చుట్టూ తిరిగి పులవర్తికే.. పట్టాదారు పుస్తకం, టైటిల్ డీడ్స్‌పై అనుమానం కలగడంతో కొనుగోలుదారులైన శ్రీరామినేని శ్రీధర్, కోనేరు కరుణాకరరావు ఆర్డీవోను ఆశ్రయించారు. దీన్ని పసిగట్టిన టీడీపీ నేతలు నాడు అధికారం అండతో విచారణను అడ్డుకుని కొనుగోలుదారులతో బేరసారాలకు దిగారు. శ్రీరామినేని శ్రీధర్ అప్పటి ఆనందపురం ఎంపీపీగా ఉన్న టీడీపీ నాయకుడు కోరాడ రాజబాబుకు విక్రయించినట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తరువాత పులవర్తి సుబ్రహ్మణ్యం బావ లక్ష్మణరావు పేరుతో బదలాయించారు. కోనేరు కరుణాకరరావు నుంచి నాలుగు ఎకరాలను సుబ్రహ్మణ్యమే స్వయంగా తన పేరున, మరో ఎకరం తన స్నేహితుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అలా చుట్టూ తిరిగి మొత్తం పది ఎకరాల భూమి పులవర్తి సుబ్రహ్మణ్యం చేతిలో పడింది! మారణాయుధాలతో దాడులు.. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం పోలిపల్లి పరిధిలో సర్వే నంబర్ 27లోని భూములకు సంబంధించి తిరుమలరెడ్డి ఆదినారాయణ పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌పై విచారణ మొదలైంది. అవేవీ భోగాపురం తహసీల్దారు కార్యాలయం నుంచి జారీ కాలేదని గుర్తించారు. ఆర్డీవో, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేయడంపై చర్యలకు ఆదేశించినా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. కబ్జాపై ప్రశ్నించిన తిరుమారెడ్డి ఆదినారాయణ బంధువులు, అమనాం, రావాడ గ్రామస్తులపై 2004 జనవరి 1న రౌడీమూకలు మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డాయి. ఆ భూమి వద్దకు వచ్చిన వారిని దారుణమైన చిత్ర హింసలకు గురి చేసిన వైనాన్ని స్థానికులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. బాధితులు భోగాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. నెలల పాటు కిరాయి మూకలు మారణాయుధాలతో ఆ భూమిలోనే తిష్ట వేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాకు ఎస్పీగా పని చేసిన ఓ పోలీసు అధికారి భార్య పేరిట 2.43 ఎకరాలు, ఆయన బావమరిది పేరుతో 49 సెంట్ల భూమి 2017లో బదిలీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఉద్యోగ విరమణ అనంతరం టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడికి సలహాదారుడిగా వ్యవహరించడం భూముల కబ్జాలో ఆ పార్టీ నేతల ప్రమేయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆక్రమణదారుల కోసమేనా యువగళం టీడీపీకి చెందిన భూ ఆక్రమణదారులు, అక్రమార్కులకు కొమ్ము కాయటానికే లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టినట్లుగా ఉంది. టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు భోగాపురం మండలంలో పలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్క పోలిపల్లి గ్రామ పరిధిలోనే రూ.వందల కోట్ల విలువైన భూములను రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసినట్లు బాధితులు ఆక్రోశిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పినా లోకేష్ నిస్సిగ్గుగా అదే చోట యువగళం ముగింపు సభ నిర్వహిస్తున్నారు. అక్రమార్కులు, పెత్తందారులకు టీడీపీ కొమ్ము కాస్తున్నట్లు దీన్నిబట్టి రుజువవుతోంది. తీరు మారని టీడీపీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయం. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు -
భారత్ పురోగతిపై యువత అభిప్రాయాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై యువత అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తుందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. భారతదేశం 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారవుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిని వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ‘‘భారతదేశం తన చరిత్రలో కీలక మలుపులో ఉంది’’ అని ఆయన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ పేర్కొన్నారు. యథాతథ విధానాలు వ్యాపార రంగం పురోగతికి దోహదపడవని అన్నారు. యువతసహా ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలను పంపడానికి ఒక వెబ్ పేజీ ఒక నెలపాటు లైవ్‌లో ఉంటుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. -
ఇదే అదను.. చైనా నుంచి తరలిపోయే కంపెనీలు భారత్‌కే..!
న్యూఢిల్లీ: రానున్న రెండు మూడేళ్లలో చైనా నుంచి తరలిపోయే కంపెనీలను భారత్ ఆకట్టుకుంటుందని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం తాజాగా పేర్కొన్నారు. ఈ కాలంలో రిస్కులను తగ్గించుకునే బాటలో చైనాను వీడుతున్న ప్రపంచ కంపెనీల వ్యూహాలను భారత్ అందిపుచ్చుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. ఇందుకు ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుందన్నారు. బిజినెస్‌లు తరలివచ్చేందుకు ఆకట్టుకునే విధానాల రూపకల్పనకు తెరతీయవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు సులభంగా తరలివచ్చేందుకు చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు తెలియజేశారు. సీఐఐ నిర్వహించిన 2023 ప్రపంచ ఆర్థిక విధాన వేదికలో సుబ్రహ్మణ్యన్ ఇంకా పలు అంశాలను ప్రస్తావించారు. రాజకీయ, భౌగోళిక పరిస్థితులు, భారీ యువశక్తి భారత్‌ను ఆకర్షణీయంగా నిలుపుతున్నట్లు పేర్కొన్నారు. వెరసి రానున్న 15–20 ఏళ్ల కాలంలో తయారీలో భారత్‌కు అవకాశాలు వెల్తువెత్తనున్నట్లు అంచనా వేశారు. అయితే రానున్న రెండు మూడేళ్ల కాలం ఇందుకు అత్యంత అనువైనదని అభిప్రాయపడ్డారు. సప్లై చైన్ వ్యవస్థలు మూతపడుతుండటం, కొత్త ప్రాంతాల కోసం చూస్తుండటం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించారు. ఇది చైనాయేతర కంపెనీలకే పరిమితంకాదని, కార్మిక కొరతతో చైనా కంపెనీలు సైతం తరలివెళ్లే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించారు. -
అభివృద్ధి చెందిన భారత్ హోదానే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే బాటలో రాష్ట్రాలు.. రాష్ట్రాలు కూడా తమ విజన్ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను డిసెంబర్ 2021లో క్యాబినెట్ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్ విజన్లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్ గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్ ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టింది. విద్యకు ప్రాధాన్యత... కేంద్రం దేశంలో విద్యా ప్రమాణాల పెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఈఓ సుబ్రమణ్యం పేర్కొన్నారు. దేశంలో కాలేజీల నమోదు రేటును 27 శాతం నుంచి 50–60 శాతానికి పెంచాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. ఉన్నత విద్య కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోందని పేర్కొన్న ఆయన, ఇప్పుడు భారత విద్యా రంగాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కాలేజీకి వెళ్లే జనాభా 4 కోట్ల నుండి 8–9 కోట్లకు పెరుగుతుందని ఆయన పేర్కొంటూ, కాబట్టి మనకు ఈ రోజు ఉన్న వెయ్యి విశ్వవిద్యాలయాలతో పాటు మరో వెయ్యి విశ్వవిద్యాలయాలు అవసరమని విశ్లేషించారు. రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నందున, కొత్త విశ్వవిద్యాలయాలను ప్రారంభించడానికి ప్రైవేట్ రంగం నుండి నిధులు మరింత రావాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. పరిశోధన–అభివృద్ధి– ఆవిష్కరణలే లక్ష్యంగా పనిచేసే బోస్టన్– శాన్ ఫ్రాన్సిస్కో వంటి విద్యా నగరాలను దేశంలో సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశ జనాభాలో సగం మంది సగటు వయస్సు 29 ఏళ్లలోపేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘భారతదేశం జనాభా సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మనకు 25 సంవత్సరాల సుదీర్ఘ అద్భుత సమయం ఉంది’’ అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామికశక్తిని అందించే దేశంగా భారత్ అవతరించబోతోందని పేర్కొన్న సుబ్రహ్మణ్యం, ప్రతి సంవత్సరం 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు తమ ఉన్నత విద్యను పూర్తి చేయడానికి భారతదేశం నుండి బయటకు వెళ్తున్నారని చెప్పారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులను భారత్‌కు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. తలసరి ఆదాయం 18,000 డాలర్లు లక్ష్యం... ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నేడు రెండో త్రైమాసిక జీడీపీ ఫలితాలు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెపె్టంబర్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు గురువారం వెలువడనున్నాయి. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వృద్ధి 7.8 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతం. కాగా, రెండవ త్రైమాసికంలో మంచి ఫలితాలే నమోదవుతాయన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వ్యక్తం చేశారు. అంతక్రితం ఆయన ‘పట్టణ మౌలిక రంగం అభివృద్ధి కోసం ప్రైవేట్ పెట్టుబడుల వినియోగం– జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ నుండి అనుభవ పాఠాలు’ అనే అంశంపై జరిగిన ఒక జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం. ఇది జీడీపీ నిష్పత్తిలో చూస్తారు) లక్ష్య సాధన సాధ్యమేనని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. -
Global Innovation Index 2023: ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు
న్యూఢిల్లీ: కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తాము దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) 2023 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. మరోవైపు 2047 నాటికి సంపన్న ఎకానమీగా ఎదగాలన్న భారత ఆకాంక్షలకు కారి్మక కొరత సమస్య కాబోదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. నవకల్పనల ప్రధాన లక్ష్యం కారి్మకుల ఉత్పాదకతను మరింతగా పెంచడం, వనరులను సమర్ధంగా వినియోగించుకునేలా చేయడమేనని ఆయన పేర్కొన్నారు. జెనీవాకు చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రూపొందించిన జీఐఐ 2023 నివేదికలోని 132 దేశాల్లో భారత్ 40వ ర్యాంకులో కొనసాగింది. అటు గత దశాబ్దకాలంగా జీఐఐలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏడు దేశాల్లో భారత్ కూడా ఒకటని జీఐఐ కో–ఎడిటర్ సషా ఉన్‡్ష–విన్సెంట్ తెలిపారు. -
రీసేల్.. రివర్స్
సిటీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదాశివపేటలో ఓ నిర్మాణ సంస్థ భారీ వెంచర్ చేసింది. ఇది నిమ్జ్‌కు అతి సమీపంలో ఉండడంతో రెట్టింపు ధర పక్కాగా వస్తుందని ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆశపడ్డాడు. గజానికి రూ. 8 వేలు చెల్లించి 150 గజాల ప్లాట్ కొన్నాడు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు సదరు ఉద్యోగి తన కొడుకు చదువుకని ప్లాట్ అమ్మకానికి పెట్టాడు.. రెట్టింపు ధర సంగతి దేవుడెరుగు.. కనీసం బ్యాంకు వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేదు. గ్రేటర్ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం ఐదు మాసాల్లో సుమారు 3.5 లక్షల దస్తావేజులు నమోదు కాగా, ఈసారి మాత్రం 2.2 లక్షలకు డాక్యుమెంట్లు కూడా దాటలేదు. రియల్ వ్యాపారం పూర్తిగా మందగించడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. సాక్షి, హైదరాబాద్: ఎవరైనా సరే భూమి ఎందుకు కొంటారు..? పిల్లల చదువుకోసమో.. అమ్మాయి పెళ్లి కోసమో.. ఇతరత్రా భవిష్యత్ అవసరాలకు అక్కరకొస్తుందనే కదా! కానీ, ప్రస్తుతం రీసేల్ ప్లాట్లకు అస్సలు గిరాకీ లేదు. కుప్పలుతెప్పలుగా వెంచర్లు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు లేకపోవటం, మౌలిక వసతులు కల్పించకపోవటంతో పాటు ఎన్నికల వాతావరణం కావడంతో రీసేల్ ప్లాట్లకు గిరాకీ లేకుండా పోయింది. నగరం చుట్టూ ఇదే పరిస్థితి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), యాదాద్రి, నిమ్జ్, ఫార్మా సిటీ, టెక్స్టైల్స్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ హబ్‌లు, మెట్రో రైలు విస్తరణ.. ఇలా అనేక ప్రాజెక్టులు వచ్చేస్తున్నా యంటూ హైదరాబాద్ నుంచి వంద కిలో మీటర్ల వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ వెంచర్లు చేస్తున్నారు. యాదాద్రి, జనగాం, సదాశివపేట, షాద్‌నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, చేవెళ్ల తదితర ప్రాంతాలలో ఫామ్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వీకెండ్ హోమ్స్ అని రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. స్థలం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఉంటాయని అందమైన బ్రోచర్లతో ఊదరగొడుతున్నారు. వీటిని నమ్మి కొన్నవారికి నిరాశే ఎదురవుతోంది. తెల్ల కాగితాల మీద గీతలు గీసేసి, ప్లాట్లు విక్రయించే బిల్డర్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రెరాలో నమోదు లేకుండానే నిబంధనల ప్రకారం స్థిరాస్తి సంస్థల ఏజెంట్లు కూడా టీఎస్–రెరాలో నమోదు చేసుకోవాలి. కానీ, నిర్మాణ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మార్కెటింగ్ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. ఏజెంట్లకు ఒక్క ప్లాట్ విక్రయిస్తే రూ.2 లక్షలకు పైగానే కమీషన్ అందిస్తున్నాయి. ఎక్కువ ప్లాట్లు విక్రయిస్తే ఏజెంట్లకు బంగారం, కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వడంతో పాటు గోవా, మలేíసియా, దుబా య్, బ్యాంకాక్ హాలీడే ట్రిప్పులకు తీసుకెళుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూ టివ్లతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తు న్నాయి. ప్రతి ఆదివారం బస్సులు, కార్లలో కొనుగోలుదారులను వెంచర్ల వద్దకు తీసుకెళుతున్నారు. రెండు మూడేళ్లుగా.. జనరద్దీ లేని చోట... అటవీ ప్రాంతాలకు సమీపంగా కూడా వెంచర్లు వేశారు. కనీసం అక్కడ ఊరు ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అత్యవసరమైతే అమ్ముకోలేక అగచాట్లు పడుతు న్నారు. వెంచర్లు చేసిన సంస్థ విక్రయించిన ధరకు ప్లాట్‌ను తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్లాట్‌పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ధర పెరుగుతుందనే ధీమాతో చాలా మంది కొనుగోలు చేశారు. వారంతా రెండుమూడేళ్లుగా విక్రయించడానికి ప్రయత్నించినా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. అభివృద్ధి జరిగే ప్రాంతంలోనే కొనాలి అభివృద్ధికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి. వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి అన్ని రకాల మౌలిక వసతులు ఉంటేనే భవిష్యత్‌లో విక్రయించినా మంచి ధర వస్తుంది. అనుమతులు ఉన్న వెంచర్లలో కొనడమే ఉత్తమం.– సీహెచ్ వెంకట సుబ్రహ్మణ్యం, సీఎండీ, భువన్‌తేజ ఇన్ఫ్రా -
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్టీఎస్ నెట్వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
‘సహకార రంగ’ సంస్కరణల్లో ఏపీదే అగ్రస్థానం
(పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి) : ‘సహకార రంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. సహకార రంగం బలోపేతానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు ప్రశంసనీయం. ఈ రంంగంలో అంతర్జాతీయంగా భారత్ ఎంత బలంగా ఉందో.. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతే బలంగా ఉంది. రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్)తో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు) చాలా బాగా పనిచేస్తున్నాయి. రికార్డుస్థాయి వ్యాపారంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నాయి. 36 ఏళ్ల తర్వాత కర్నూలు, 28 ఏళ్ల తర్వాత కడప డీసీసీబీలు లాభాల బాట పట్టాయంటే ఆషామాషీ కాదు. ప్యాక్స్‌ను కూడా లాభాల్లోకి తేవాలి’ అని జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య (నాఫ్స్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్, అంతర్జాతీయ సహకార బ్యాంకింగ్ సమాఖ్య (ఐసీఏ) సభ్యుడు భీమా సుబ్రహ్మణ్యం చెప్పారు. ఐసీఏ సభ్యునిగా ఎన్నికై తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. డీసీసీబీలకూ షెడ్యూల్ హోదా వచ్చేలా కృషి రాష్ట్రాల సహకార బ్యాంకుల (అపెక్స్ బ్యాంకు)ను ఒకే గొడుగు కిందకు తేవాలన్న సంకల్పంతో నాఫ్స్కాబ్ ఏర్పాటైంది. ఇది అపెక్స్ బ్యాంకులకు – ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తుంది. రైతులకు అనుకూలంగా పాలసీల రూపకల్పనలో కృషి చేస్తుంది. దేశంలోని 351 డీసీసీబీల్లో 348 డీసీసీబీలకు ఆర్బీఐ లైసెన్సులిచ్చేలా కృషి చేశాం. నాఫ్స్కాబ్ కృషి వల్లే దేశంలోని 34 అపెక్స్ బ్యాంకుల్లో 24 షెడ్యూల్ హోదా పొందాయి. డీసీసీబీలకు కూడా షెడ్యూల్ హోదా కలి్పంచేలా పాలసీ తేవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. నాఫ్స్కాబ్లో అపెక్స్ బ్యాంకులతో పాటు డీసీసీబీలకు కూడా సభ్యత్వం ఇవ్వాలా లేక అసోసియేట్‌గా గుర్తించాలా అనే విషయంపై సెపె్టంబర్లో నిర్ణయం తీసుకుంటాం. రీ ఫైనాన్స్ 80 శాతానికి పెంచాల్సిందే సహకార స్ఫూర్తితో ఏర్పాటైన బ్యాంకులు లాభాపేక్షతో పనిచేయడం సరికాదు. నాబార్డు 80 శాతం రీఫైనాన్స్ చేస్తేనే అపెక్స్ బ్యాంకులు డీసీసీబీలకు, వాటి పరిధిలోని ప్యాక్స్‌కు ఆ స్థాయిలో రీఫైనాన్స్ చేస్తాయి. నాబార్డు రీఫైనాన్స్‌ను 50 శాతం నుంచి 80 శాతానికి పెంచేలా నాఫ్స్కాబ్ కృషి చేస్తోంది. నష్టాల్లో ఉన్న ప్యాక్స్లకు ఆ ర్థిక సాయం చేయాల్సిన బాధ్యత అపెక్స్ బ్యాంకులదే. ఈ రంగంలో రెండంచెల వ్యవస్థ కంటే మూడంచెల వ్యవస్థ చాలా మంచిది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎ‹ఫ్పీవో)ను ప్రోత్సహించడం మంచిదే కానీ, సహకార చట్టం ప్రకారం వాటికి రిజి్రస్టేషన్ తప్పనిసరి చేయాలి. భారత్ సహకార వ్యవస్థ బలంగా ఉంది భారత్‌లో సహకార వ్యవస్థ చాలా బలంగా ఉంది. సుమారు 15 కోట్ల మంది భాగస్వాములైన వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. అయితే, దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారు. ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధం. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన పాలక మండళ్ల ద్వారా పాలన సాగిస్తే సహకార వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆర్బీకేలతో అనుసంధానం మంచి ఆలోచనే దేశంలో ఏపీ, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయి. మంచి వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి. ఏపీలో మంచి పురోగతి కన్పిస్తోంది. దశాబ్దాలుగా నష్టాల్లో ఉన్న బ్యాంకులు లాభాల బాట పట్టాయంటే దాని వెనుక ఎంతో కృషి ఉంది. ఆర్బీకేలతో పీఏసీఎస్‌లను అనుసంధానించడం మంచి ఆలోచనే. దీనివల్ల గ్రామ స్థాయిలో రైతులకు మరింత మంచి జరుగుతుంది. -
29 ఏళ్లుగా వేధిస్తున్నారు.. షాకింగ్ విషయాలు చెప్పిన నారాయణ మరదలు
హైదరాబాద్: ఏపీ మాజీమంత్రి పొంగూరు నారాయణపై ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యం భార్య కృష్ణప్రియ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 29 ఏళ్లుగా నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం అలియాస్ మణి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని ఆదివారం ఉదయం రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తాను ఎదుర్కొన్న అనుభవాలను పోస్టు చేశానని, రాజకీయంగా వారికి ఇబ్బంది కలుగుతోందని భావించి తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌ను మూసివేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గచ్చి బౌలిలోని బాంబూస్ మీనాక్షి విల్లాస్ ఎదుట కృష్ణప్రియ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నాను. ఆయన స్త్రీలోలుడు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే చెప్పారు. నేను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడు. నాకు మానసిక సమస్య ఉన్నట్లుగా నా భర్త తప్పుడు సర్టిఫికెట్లు చూపించి యూట్యూబ్ వేదికగా ప్రచారం చేయడం చాలా బాధేసింది. నారాయణ మెడికల్ కాలేజీలో పనిచేసే డాక్టర్ శేషమ్మ నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావడం వారికి పెద్ద సమస్య కాదు. అలాగే, నారాయణ పిల్లలకు మానసిక సమస్యలు ఉన్నాయి. డాక్టర్ విరించి వారికి చికిత్స చేస్తున్నారు. విరించి నుంచి కూడా సర్టిఫికెట్ తేవడం పెద్ద కష్టమేమి కాదు. ఒకరోజు మా నాన్నపై అరుస్తుంటే గుంటూరులో ఓ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. నిద్రలేమితో నిద్రమాత్రలు వేసుకుంటున్నట్లు డాక్టర్‌కు చెప్పాను. మానసిక ఒత్తిడితోనే నిద్రలేమి సమస్య ఉండవచ్చని డాక్టర్ చెప్పారు. నేను ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం నిజమే. ఇక రక్త సంబంధం ఉంది కాబట్టే నారాయణకు నా భర్త పెట్గా మారాడు. కేసు నమోదు చేయలేదు: సీఐ కృష్ణప్రియ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు. -
గీతా.. సుబ్రహ్మణ్యం 3 టీజర్
-
ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ 'గీతా సుబ్రహ్మణ్యం-3'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
గీతా సుబ్రహ్మణ్యం ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ కథలో సుప్రజ్ రంగా సుబ్రహ్మణ్యంగా కనిపించగా.. అభిజ్ఞ్య ఉతలూరు గీతగా నటించారు. ప్రేమలో ఉండే చిన్న పాటి గొడవలు ఎంతో ఫన్నీగా చూపించారు. ఎనిమిది ఎపిసోడ్లతో గీతాసుబ్రహ్మణ్యం అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. తాజాగా గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ ఆహాలో రిలీజ్ చేయనున్నారు. మే 5న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్‌ను టమడ మీడియా నిర్మిస్తోండగా.. శివ సాయి వర్దన్ దర్శకత్వం వహించారు. అసలు కథేంటంటే.. గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ గీతా, సుబ్బుల మధ్య నడుస్తుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బిజీ లైఫ్‌ను గడుపుతుంటారు. ఒక ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరినీ ఎంపిక చేయడం.. అందులో ఉద్యోగులు ఎలాంటి రిలేషన్ షిప్లో ఉండకూడదని కండీషన్ పెడతారు. కానీ ఆ కండీషన్‌ను గీతా, సుబ్బులు బ్రేక్ చేస్తారు. ప్రేమలో పడతారు. కానీ వారి ఫీలింగ్స్‌ను మిగతా ఉద్యోగుల ముందు బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తుంటారు. మే 5న ప్రేకక్షకులను అలరించేందుకు వస్తోంది. -
Vijayalakshmy Subramaniam: సరిగమలే ఔషధాలు
ఆమె సంగీత విద్వాంసురాలు. అంతేకాదు... వైద్యరంగంలో ప్రొఫెసర్. వృత్తిని ప్రవృత్తిని మేళవించారామె. సరిగమలు వైద్యానికి ఔషధాలయ్యాయి. రాగాలు ఆరోగ్యాన్నిచ్చే టానిక్లవుతున్నాయి. తీయని కృతులు షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాయి. సంగీత లయ బీపీకి గిలిగింత పెడుతోంది. ప్రొఫెసర్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యమ్... కర్ణాటక సంగీతంలో రాగాల మీద పరిశోధన చేశారు. ఆ రాగాలు డిప్రెషన్‌ను దూరం చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తాయనే విషయాలను శాస్త్రబద్ధం చేశారు. సంగీతం అనారోగ్యాన్ని మాయం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం తానేనని కూడా చెబుతారామె. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీలో గడిపిన సమయంలో సంగీత సాధన ద్వారా వేగంగా సాంత్వన పొందిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్‌గా తన వృత్తిని సంగీతం పట్ల మక్కువతో మేళవించి రాగాలతో చేస్తున్న వైద్యం గురించిన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ► తంజావూరు సరస్వతి మహల్ ‘‘నేను పుట్టింది బెంగళూరు, కర్నాటకలో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాలో సంగీతాభిలాష ఎలా మొదలైందని చెప్పడం కష్టమే. ఎందుకంటే మా ఇల్లే ఒక సంగీత నిలయం. నానమ్మ గాత్రసాధనతోపాటు వయొలిన్ సాధన కూడా చేసేవారు. అమ్మ ఉద్యోగపరంగా సైన్స్ టీచర్, కానీ ఆమె కూడా సంగీతంలో నిష్ణాతురాలు. మా నాన్న శిక్షణ పొందలేదనే కానీ సంగీతపరిజ్ఞానం బాగా ఉండేది. అలా నాకు మా ఇంటి గోడలే సరిగమలు నేర్పించాయి. నాన్న ఉద్యోగరీత్యా దేశంలో అనేకచోట్ల పెరిగాను. గుజరాత్, బరోడాలో ఉన్నప్పుడు సంగీతంతోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. సంగీతం నాకు ధారణ శక్తికి బాగా ఉపకరించింది. దాంతో చదువులోనూ ముందుండేదాన్ని. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిన తర్వాత నా చదువు, అభిరుచి రెండు వేర్వేరు ప్రపంచాలయ్యాయి. రెండింటినీ వేరుగా చూడడం నాకు సాధ్యపడలేదు. నాకు తెలియకుండానే కలగలిపి చూడడం మొదలైంది. సంగీతాన్ని ఒక కళగా సాధన చేయడంతో సరిపెట్టకుండా ఒక శాస్త్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నాదయోగ, రాగచికిత్సల గురించి అప్పుడు తెలిసింది. తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో సంగీతంతో వైద్యవిధానాల గురించి గ్రంథాలున్నాయి. మెడిసిన్‌తోపాటు మ్యూజిక్‌ని కూడా విపరీతంగా చదివాను. రాష్ట్రంలో మూడవ ర్యాంకుతో కర్ణాటక సంగీతంలో కోర్సు పూర్తి చేశాను. మన దగ్గరున్న పురాతన రాతిశాసనాలతోపాటు విదేశాల్లో ఉన్న మ్యూజిక్ థెరపీలను తెలుసుకున్నాను. వైద్యానికీ– సంగీతానికీ మధ్య ఉన్న, మనం మరిచిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే ఆకాంక్ష కలిగింది. ► మతిమరపు దూరం మ్యూజిక్ థెరపీ అనగానే అందరూ ఇక మందులు మానేయవచ్చని అపోహపడుతుంటారు. అలాగే మందులు కొనసాగించాల్సినప్పుడు ఇక మ్యూజిక్‌తో సాధించే ప్రయోజనం ఏముంది అని తేలిగ్గా తీసేస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే... మా దగ్గరకు వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ మూడు వందలకు పైగా డయాబెటిస్తో ఇన్సులిన్ తీసుకునేవాడు. మ్యూజిక్ థెరపీతో ఇన్సులిన్ అవసరం లేకుండా మందులు సరిపోయే దశకు తీసుకురాగలిగాం. నత్తితో ఇబ్బంది పడే పిల్లలు అనర్గళంగా మాట్లాడేటట్లు చేసింది సంగీతం. రెండు రోజులకోసారి డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్న పేషెంట్‌కి ఉపశమనం దొరికింది. ఇక నరాలు, నాడీ సంబంధ సమస్యలను నయం చేసి చూపిస్తున్నాం. ప్రతి పేషెంట్‌నీ వాళ్ల ఆహారవిహారాలు, ఇతర ఆరోగ్య సమస్యల ఆధారంగా విశ్లేషించి ప్రతి ఒక్కరికీ వారికి మాత్రమే ఉపకరించే సంగీత విధానాన్ని సూచిస్తాం. కొంతమంది కోసం ప్రత్యేకంగా పాటలు రాసి కంపోజ్ చేసి ఇస్తాం. పేషెంట్ ఇష్టాలు, మత విశ్వాసాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని డిజైన్ చేస్తున్నాం. అయితే దీనికి ప్రత్యామ్నాయ వైద్యవిధానం అర్హత ఉన్నప్పటికీ ఇంకా ధృవీకరణ రాలేదు. కాంప్లిమెంటరీ మెడిసిన్గానే ఆచరణలో పెడుతున్నాం. వార్ధక్యం కారణంగా అల్జైమర్స్, డిమెన్షియాతో బాధపడుతున్న వాళ్లకు మ్యూజిక్ థెరపీతో అద్భుతాలు సాధించామనే చెప్పాలి. ఓ పెద్దాయన అయితే... భార్య పేరు కూడా మర్చిపోయాడు. నేను స్వయంగా పాట పాడుతూ ఆయన ప్రతిస్పందించే తీరును గమనిస్తున్నాను. ఆశ్చర్యంగా పాటలో తన భార్య పేరు రాగానే చిన్న పిల్లవాడిలాగ ‘యశోదా’ అంటూ పెద్దగా అరిచాడు. మా పరిశోధనాంశాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని శాస్త్రబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అని చెప్పారు ప్రొఫెసర్ విజయలక్ష్మి. ఇదీ ఆమె మొదలు పెట్టిన ‘ఇల్నెస్ టూ వెల్నెస్ ’ జర్నీ. సరిగమలతో రాగాల వైద్యం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షిద్దాం. రాగాల చికిత్స సంగీతం ఆరోగ్యప్రదాయినిగా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఆకాంక్షలున్న వాళ్లందరం ఇండియన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఐఎమ్‌టీఏ)గా సంఘటితమయ్యాం. ఇలాంటి సమూహాలు ఇంకా ఉన్నాయి. కానీ మనదేశంలో మ్యూజిక్ థెరపీ శాస్త్రబద్ధంగా, ఒక వ్యవస్థీకృతమైన అధీకృత సంస్థ ఏదీ లేదు. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇటీవల మంగళూరులో మా ఎనెపోయా మెడికల్ యూనివర్సిటీలో ఆన్లైన్ కోర్సు ప్రారంభించాం. ఇది డాక్టర్ల కోసం మాత్రమేకాదు, వైద్యరంగంలో పని చేసే అందరూ ఈ కోర్సు చేయవచ్చు. ఇక నా ప్రయత్నంలో స్పెషల్ చిల్డ్రన్‌కి మ్యూజిక్ థెరపీ కోర్సు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ ఫెయిలయ్యి డయాలసిస్‌తో రోజులు గడుపుతున్న పేషెంట్లకు మెరుగైన ఫలితాన్ని చూశాను. – ప్రొ‘‘ విజయలక్ష్మి సుబ్రమణ్యమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓటోరైనోలారింగాలజీ, ఎనెపోయా మెడికల్ కాలేజ్, మంగళూరు, కర్ణాటక – జనరల్ సెక్రటరీ, ఐఎమ్‌టీఏ – వాకా మంజులారెడ్డి. -
ఇందిరాగాంధీ నా తండ్రిని ఆ పదవి నుంచి తొలగించారు: జై శంకర్
విదేశాంగ మంత్రి జై శంకర్ ఒక మీడియా ఇంటర్వ్యూలో విదేశాంగ అధికారి నుంచి క్యాబినేట్ మంత్రి వరకు సాగిన తన ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. తాను ప్రభుత్వాధికారుల కుటుంబానికి చెందినవాడినని అన్నారు. తనకు 2019లో కేంద్రమంత్రిగా రాజకీయ అవకాశం వచ్చిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ.. తన తండ్రి డాక్టర్ కె సుబ్రమణియన్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా పనిచేశారని, 1980లో ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ని తొలగించారని చెప్పారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సమయంలో తన తండ్రి కంటే జూనియర్ క్యాబినేట్ సెక్రటరీ అయ్యారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాధికారిగా ఉన్న తన తండ్రి సుబ్రమణ్యం 1979 జనతా ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన డిఫెన్స్ ప్రొడెక్షన్ సెక్రటరీ. అయితే ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగింపబడ్డ తొలి వ్యక్తి నా తండ్రే. అందువల్లే తన అన్నయ్య సెక్రటరీ అవ్వడంతో తన తండ్రి ఎంతగానో సంతోషించాడున్నారు. బహుశా అందువల్లే కాబోలు తాను కూడా మంచి అధికారిగానే కాకుండా విదేశాంగ కార్యదర్శి పదవికి ఎదగాలని కోరుకున్నా. కానీ తాను తన తండ్రి మరణించాకే విదేశాంగ కార్యదర్శిని అయ్యానన్నారు. 2019లో నరేంద్ర మోదీ నేతృత్వంలో క్యాబినేట్లో భాగం కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రధాని చేసిన ఫోన్‌కాల్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఆ తర్వాత తాను కేంద్ర మంత్రి వర్గంలో చేరినట్లు చెప్పారు. అయితే విదేశాంగ కార్యదర్శిగా జీవితాంతం ఎందరో రాజకీయ నాయకులను చూశానన్నారు.కానీ తాను పార్లమెంట్ సభ్యుడిని కాకపోవడంతో రాజకీయాల్లోకి చేరడం, రాజసభ సభ్యుడు కావడం, అన్ని ఒక్కొక్కటిగా తనకు తెలియకుండానే సాగిపోయాయని చెప్పుకొచ్చారు. ఒక ప్రభుత్వాధికారితో పోలిస్తే కేంద్ర మంత్రి ఎక్స్పోజర్ వేరే స్థాయిలో ఉంటుందన్నారు జైశంకర్. ఫారెన్ సర్వీస్ అధికారిగా, మంత్రిగా విభిన్న ప్రపంచ ఉండటమే గాక ఒక సవాలుగా కూడా ఉంటుందన్నారు. ఐతే బ్యూరోక్రాట్ కంటే మంత్రి వేగంగా ఆలోచించగలడని అన్నారు. ప్రతి సమస్య వెనుకు ఒక రాజకీయ కోణం దాగి ఉంటుందని, అది ఒక చాలెంజింగ్‌గా ఉంటుందన్నారు మంత్రి జై శంకర్. కాగా, 2015 నుంచి 2018 వరకు జై శంకర్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. (చదవండి: ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్: ఇద్దరికీ ఝలక్ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం) -
నీతి ఆయోగ్ సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం
న్యూఢిల్లీ: థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ సీఈవోగా మాజీ వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ప్రభుత్వ నిర్ణయానికి క్యాబినెట్ నియామకాల కమిటీ (ఫిబ్రవరి 20న) ఆమోదం తెలిపింది. సుబ్రమణ్యం బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు నీతి ఆయోగ్ సీఈవోగా ఉంటారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన కారణంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా సుబ్రహ్మణ్యం చత్తీస్‌గఢ్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, అతను సెప్టెంబర్ 30, 2022న వాణిజ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. మరోవైపు పరమేశ్వరన్ అయ్యర్ జూలై 1, 2022న నీతి ఆయోగ్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2009 లో ప్రభుత్వాధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి , 2014లో ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు నాయకత్వం వహించిన అయ్యర్ ఆ తరువాత ప్రపంచ బ్యాంకులో చేరారు. ఇపుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగ నున్నారు. -
టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702
సాక్షి, నాయుడుపేట టౌన్ (తిరుపతి జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా రూ.45,702 లబ్ధి చేకూరింది. వైఎస్సార్ ఆసరా ద్వారా 2020–21, 2021–22లకు రూ.17,261 చొప్పున, సున్నా వడ్డీ కింద 2020లో రూ.2,628, 2021లో రూ.1,575, 2022లో రూ.1,112 నగదు అమృతసరళ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. పంట రుణాల సున్నా వడ్డీ నగదును రెండు విడతలుగా రూ.5,865 నెలవల బ్యాంక్ ఖాతాలో వేసింది. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను నాయుడుపేటలో నెలవలకు అందజేశారు. చదవండి: (తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై ఈవో ధర్మారెడ్డి క్లారిటీ) -
రాయలసీమలోనే రాజధాని కావాలి..
తిరుపతి రూరల్: శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేసి రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యంరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి(ఆప్స్) అధ్యక్షుడు రఫీహిందూస్థానీ అధ్యక్షతన తిరుపతి యూత్ హాస్టల్లో ‘మూడు రాజధానులు – వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి’ అనే అంశంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీమ ప్రాంతానికి చెందిన పలువురు మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత ఈ సమావేశంలో పాల్గొని సీమ ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజలు అడగకున్నా స్వార్థం కోసమే గత పాలకులు అమరావతి పేరుతో రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ముందుగానే లీకులివ్వడంతో వందలాది ఎకరాలను గత పాలకులు మింగేశారని ఆరోపించారు. స్థిరమైన నగరాల్లోనే రాజధానిని అభివృద్ధి చేయాలని ఎస్వీయూ ప్రొఫెసర్ కృష్ణమోహనరెడ్డి కోరారు. అమరావతి ప్రాంత రైతులను టీడీపీ మోసం చేసి.. వారిని రోడ్డుపాల్జేసిందంటూ మండిపడ్డారు. రాయలసీమ రాజధాని ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసేందుకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఏ కమిటీ కూడా అమరావతిలోనే రాజధానిని పెట్టాలని సూచించిన దాఖలాల్లేవని సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ తెలిపారు. రాయలసీమకు వచ్చి సీమ వాసులు ఏర్పాటు చేసుకున్న మూడు రాజధానుల ఫ్లెక్సీలను చించిన దౌర్జన్యకారులకు టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలకడం దారుణమని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఆప్స్ జిల్లా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ, గిరిజన ప్రజా సమాఖ్య అధ్యక్షుడు శంకరనాయక్, సాహిత్య అకాడమీ కన్వీనర్ డాక్టర్ మస్తానమ్మ, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. -
భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు ఎగుమతుల భారీ వృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న పథకం ఇందులో ఒకటని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 419 బిలియన్ డాలర్లు భారత్ ఎగుమతుల లక్ష్యమని తెలిపారు. గడచిన పదేళ్లలో ఎగుమతులు దాదాపు 290 బిలియన్ డాలర్లు– 330 బిలియన్ డాలర్ల మధ్య నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. ప్రపంచ దేశాలతో సహకారాన్ని (అనుసంధానం) భారత్ విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని వాణిజ్య శాఖ కార్యదర్శి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అది లేకుంటే ప్రపంచంతో విడిపోయినట్టుగానే ఉంటుందన్నారు. గత 20 ఏళ్లలో ప్రపంచ వాణిజ్య సంస్థ చెప్పుకోతగ్గ సాధించిందేమీ లేదంటూ.. అంతర్గత సమస్యల కారణంగా ఇంతకుమించి ఆశించడానికి కూడా ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. దీని కారణంగానే ప్రపంచ దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకార ఒప్పందాల దిశగా అడుగులు వేసినట్టు చెప్పారు. ‘‘ప్రాంతీయంగా మనకు ఎటువంటి సహకార ఒప్పందాలు లేవు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ కోరుకునేట్టు అయితే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కలిగి ఉండాలి’’ అంటూ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సుబ్రమణ్యం తన అభిప్రాయాలను వెల్లడించారు. భారీ పన్ను వసూళ్ల అంచనా: రెవెన్యూ కార్యదర్శి బజాజ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) భారీ పన్ను వసూళ్లు జరుగుతాయని విశ్వసిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శ తరుణ్ బజాజ్ సీఐఐ సమావేశంలో పేర్కొన్నారు. కార్పొరేట్ రంగం పనితీరు ఊహించినదానికన్నా బాగుండడమే తమ ఈ అంచనాలకు కారణమని వివరించారు. ఆటో రంగంపై అధిక జీఎస్టీ రేట్లు ఉన్నాయన్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ పరిశీలన జరుగుతుందని, అధికంగా ఉన్న రేట్లను అవసరమైతే తగ్గిస్తుందని తెలిపారు. పన్ను పరిధిని పెంచడం ద్వారా స్థూల దేశీయోత్పత్తిలో పన్నుల నిష్పత్తి పెంపునకు మదింపు జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు. భారత్‌లో పన్ను వసూళ్లు జీడీపీలో దాదాపు 10 శాతంగా ఉంటే, అభివృద్ధి చెందని దేశాల్లో దాదాపు 25 నుంచి 28 శాతం శ్రేణి ఉందని అన్నారు. చదవండి: ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా? -
స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ విశాల శకం
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాలుపంచుకోవాలన్న కాంక్షతో.. తల్లిగా, భార్యగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉద్యమ పథంలో ఉరకలెత్తిన ధీశాలి... రూపాకుల విశాలాక్షి. సమరశీల మహిళగా మహాత్ముని పిలుపుతో ప్రత్యక్ష పోరాటంలో సైతం ఆమె భాగస్వామిగా మారారు. దేశంలో ఎక్కడ ఉద్యమం జరిగినా ముందు వరుసలో నిలబడ్డారు. లాఠీ దెబ్బలను, జైలు శిక్షలను లెక్క చెయ్యకుండా స్వేచ్ఛా స్వాతంత్య్రమే లక్ష్యంగా తెల్లదొరల్ని ఎదిరించారు. దేశం కోసం అహర్నిశలూ శ్రమించి, కడవరకు సేవా దృక్పథంతో జీవనం సాగించిన ఈ యోధురాలు గురువారం నాడు మాతృభూమి ఒడిలో శాశ్వతంగా ఒదిగిపోయారు. ఆమె మరణంతో విశాఖలో ఒక స్వాతంత్య్ర శకం ముగిసినట్లయింది. విశాఖపట్నం మహారాణి పేటకు చెందిన శిష్టా› దక్షిణామూర్తి, సీతామహాలక్ష్మి దంపతుల ఎనిమిది మంది సంతానంలో నాలుగో సంతానంగా విశాలాక్షి. 1926 ఏప్రిల్ 6వ తేదీన జన్మించారు. తండ్రి స్వాతంత్య్ర పోరాటంలో విశాఖ నుంచి కీలక పాత్ర పోషించేవారు. ఆయనను చూస్తూ పెరిగిన విశాలాక్షి.. తన తొమ్మిదవ ఏట.. తండ్రితో కలిసి ఉద్యమంలోకి తొలి అడుగు వేశారు. బాల్యంలోనే ఆమెకు స్వాతంత్య్ర సమర యోధుడైన రూపాకుల రామకృష్ణయ్య కుమారుడు సుబ్రహ్మణ్యంతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది నెలలకు గాంధీజీ విశాఖలో పర్యటించిన సందర్భంలో విశాలాక్షి ఆ సభకు హాజరై.. మహాత్ముని మాటలతో సమర స్ఫూర్తి పొందారు. తొలిసారి జైలుకి! ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్న విశాలాక్షిని రాజమండ్రి జైలుకి తరలించారు. జైలుకు వెళ్లడం అదే మొదటిసారి కావడంతో కాస్త భయం వేసినా.. దేశ భక్తి ముందు ఆ భయం బలాదూర్ అయిపోయిందని తమతో ఎప్పుడూ అంటుండేవారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతారు. అదే సమయంలో కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య వద్ద విశాలాక్షి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారు. తన సంగీత పరిజ్ఞానాన్ని సైతం స్వాతంత్య్ర పోరాటానికే ఆమె వినియోగించారు. విశాలాక్షి సంగీత సారథ్యంలో కొందరు గ్రామాల్లోకి వెళ్లి పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో ఒకరోజు బ్రిటిష్ వాళ్ల చేతికి విశాలాక్షి దొరికిపోయారు. బళ్లారి జైల్లో బ్రిటిష్ పోలీసులు ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో ఎడమ చెవి నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత వినికిడి కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ విశాలాక్షి వెనకడుగు వెయ్యలేదు. క్విట్ ఇండియా ఉద్యమం, ఖాదీ ఉద్యమం.. ఇలా ప్రతి ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఇసుక తిన్నెలపై సమాలోచనలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, మదరాసు, గుజరాత్.. ఇలా ఏ ప్రాంతంలో గాంధీజీ ఉద్యమానికి పిలుపునిచ్చినా.. అక్కడికి వెళ్లిపోయేవారు విశాలాక్షి. ఈ ప్రాంత సమర యోధులైన క్రొవ్విడి లింగరాజు, బులుసు కామేశ్వరరావు, వావిలాల గోపాల కృష్ణయ్య, మొదలైన ప్రముఖులతో కలిసి చర్చల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉదయమంతా ఆయా గ్రామాలు, ప్రాంతాల్లో తిరిగి.. ప్రజల్ని చైతన్య పరిచేవారు. సాయంత్రం మహారాణి పేటలో తమ ఇంటికి సమీపంలో ఉన్న సముద్రపు ఇసుకతిన్నెలపై కూర్చొని భావి ఉద్యమం కోసం సమాలోచనలు జరుపుతూ వ్యూహరచన చేసేవారు. బ్రిటిష్ సైన్యం కంటబడకుండా భోజనాలు విశాలాక్షి మామగారైన రామకృష్ణయ్యతో పాటు మరికొందరిపై బ్రిటిష్ అధికారులు కనిపిస్తే కాల్చివెయ్యాలని సైన్యానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఆయనతో సహా మరికొందరు పోరాట వీరులు తమ ఇంటి సమీపంలో ఉన్న మరొకరి ఇంట్లో తలదాచుకున్నారు. వారికి ప్రతిరోజూ బ్రిటిష్ సైన్యం కంటపడకుండా విశాలాక్షి భోజనాలు స్వయంగా తీసుకెళ్లేవారు. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి స్వాతంత్య్ర ప్రకటన వెలువడినప్పుడు ఆ విషయం తెలుసుకున్న విశాలాక్షి.. ఆనందంతో ఆ వీధి ప్రజలందరినీ నిద్రలేపేశారు. మాతృభూమి బానిస సంకెళ్లు తెంచుకున్న ఈ రోజు మనకు పండుగ రోజంటూ సంబరాలు చేసుకున్నారు. ఇంట్లో స్వీట్లు ఏవీ లేకపోవడంతో డబ్బాలో ఉన్న పంచదారని అందరి నోట్లో పోసి తీపి చేశారు. బాణాసంచా కాల్చి ఆ రోజంతా విశాలాక్షి ఆనందంగా గడిపారు. అగ్రవర్ణాలు వెలి వేసినా..! అగ్రవర్ణానికి చెందిన విశాలాక్షి చేపట్టిన ఆలయ ప్రవేశ హరిజనోద్ధరణ ఉద్యమం.. ఆ వర్గానికి మింగుడు పడలేదు. దీంతో.. అగ్రవర్ణాలంతా కలిసి.. విశాలాక్షి కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఏ శుభ కార్యానికి కూడా పిలవడం మానేశారు. అయినప్పటికీ.. విశాలాక్షి బాధపడకుండా.. హరిజనవాడల్లో వారి బాగోగుల కోసం కృషిచేశారు. వారితోనే సహపంక్తి భోజనాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. స్వాతంత్య్ర సమరంలో ఉద్ధృతంగా పాల్గొన్న సమరయోధులలో అతికొద్ది మందికి కేంద్ర ప్రభుత్వం తామ్రపత్రాన్ని అందించేది. ఆ మహద్భాగ్యం విశాలాక్షి కి దక్కింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా విశాలాక్షి తామ్రపత్రాన్ని అందుకున్నారు. విశాలాక్షి ఓ వైపు స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుంటూనే.. ఇంకోవైపు పేదలకు సహాయం చేస్తుండేవారు. 2002లో భర్త మరణించాక ఆయన పేరిట మరికొన్ని సేవా కార్యక్రమాలను చేపట్టారు. అమ్మ అడుగు జాడల్లో విశాలాక్షికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రవికుమార్ సంఘ సేవకుడు, రాజీవ్‌గాంధీ మానవసేవ జాతీయ అవార్డు గ్రహీత. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె శిష్టా› శ్రీలక్ష్మీ అంతర్జాతీయ వెటరన్ క్రీడాకారిణి, యోగా శిక్షకురాలు, ప్రకృతి చికిత్సాలయం వైద్యురాలు. మరో కుమార్తె కూడా మైథిలి హైదరాబాద్‌లో ఉంటున్నారు. రవికుమార్, శ్రీలక్ష్మి ఇరువురూ విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటున్నారు. తోడబుట్టిన నలుగురు అన్నదమ్ములు శిష్టా›్ల సత్యనారాయణ, వెంకటరామశాస్త్రి, యజ్ఞనారాయణ, లక్ష్మీనారాయణ విశాఖపట్నంలోనే నివసిస్తున్నారు. విశాలాక్షి ప్రతి ఏటా రాఖీ పండుగనాడు మహారాణిపేటలోని తన స్వగృహానికి వీరిని పిలిపించుకుని వారికి రాఖీ కట్టేవారు. విశాలాక్షి మరణంతో ఒక శకం అంతరించినట్లయింది. స్వాతంత్య్ర సముపార్జన కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి.. భావితరాలకు అందమైన భవిష్యత్తు ఫలాలు అందించేందుకు తమ శక్తిని ధారబోసిన సమరయోధులు చరిత్రలో ఒకరొకరుగా మమేకమైపోతున్నారు. వారిలో విశాఖ జిల్లాలో విశాలాక్షి చివరి వారు. – కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నం హరిజనులకు ఆలయ ప్రవేశం హరిజనోద్ధరణ ఉద్యమం మొదలైన రోజుల్లో ఉద్యమాన్ని ముందుండి నడిపిన అతి కొద్ది మందిలో విశాలాక్షి ఒకరు. అప్పట్లో హరిజనులకు ఆలయ ప్రవేశం నిషేధించారు. ఏపీ హరిజన సేవా సంఘం సభ్యురాలైన విశాలాక్షి పదివేల మంది కార్యకర్తలతో కలిసి హరిజనులకు తిరుమల తిరుపతి ఆలయ ప్రవేశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టారు. ఆ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసి బళ్లారి జైలులో పెట్టారు. అయినా వెరవక విశాలాక్షి ఉద్యమాన్ని కొనసాగించడంతో.. హరిజనులకు ఆలయ ప్రవేశం సుగమంగా మారింది. మొదట తిరుమల ఆలయం, ఆ తర్వాత అన్ని ఆలయాల్లోకీ హరిజనులకు ప్రవేశం కల్పించారు -
‘చంద్రబాబు వల్లే ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు నష్టం’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల ఈడబ్ల్యూఎస్ పథకంలో కాపుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ పథకం దేశవ్యాప్త పథకం అయితే చంద్రబాబు అది కేవలం ఏపీకి మాత్రమేనన్న భ్రమలు కల్పించారని మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్‌పై చంద్రబాబు గతంలో తూతూమంత్రంగా జీవో జారీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు నిర్వాహకంతో ఈడబ్ల్యూఎస్ పథకంపై స్పష్టత లేక చాలా మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఈడబ్ల్యూఎస్‌పై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని కోరారు. కాపునాడు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ జీవోని యధాతదంగా అమలు చేయడం వల్ల అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు పదివేల సీట్లు పెరిగాయని చెప్పారు. దీంతో జనాభాశాతం ఎక్కువగా ఉన్న కాపు విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని వివరించారు. తన రాజకీయ లబ్ధి కోసమే కాపులను చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఆరోపించారు. -
సీఎంఓ అదనపు కార్యదర్శిగా ధనుంజయరెడ్డి
సాక్షి, అమరావతి/రాయచోటి: ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ధనుంజయరెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అదనపు కమిషనర్‌గా, అనంతరం రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ)గా, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖల డైరెక్టర్‌గా, శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూనే గోదావరి పుష్కరాల ఇన్ఛార్జిగా కూడా రేయింబవళ్లు పనిచేసి ప్రశంసలందుకున్నారు. ధనుంజయరెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తారనే గుర్తింపు పొందారు. ఆయన ఇప్పటివరకూ పనిచేసిన ప్రతిచోటా ప్రణాళికాబద్ధంగా కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించారని అధికారవర్గాల్లో పేరుంది. వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన ధనంజయరెడ్డికి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుల్లో ఆయన ఒకరు. వీటన్నింటికీ తోడు సమర్థవంతమైన అధికారిగా మంచి పేరుండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆయన్ను తన అదనపు కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేషీలో నియమితులైన మొట్టమొదటి అధికారి ధనుంజయరెడ్డి కావడం గమనార్హం. సర్పంచ్ నుంచి అదనపు కార్యదర్శిగా.. ధనుంజయరెడ్డి 1988లో కడప జిల్లా రాయచోటి మండల చెన్నముక్కపల్లె సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచిగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతూ సివిల్స్‌లో ఉత్తీర్ణతను సాధించారు. 1992లో సర్పంచి పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీ పరిపాలనా విభాగంలో చేరారు. పాలనాదక్షుడిగా పేరు సంపాదించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కొలువులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు.అభివృద్ధితో పాలకులు, ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. టీడీపీ పాలనలో విపత్తుల శాఖ రాష్ట్రాధికారిగా, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా, శ్రీకాకుళం కలెక్టరుగా, అనంతరం పర్యాటక శాఖ రాష్ట్ర అధికారిగా ఉంటూ ప్రగతిపై తనదైన ముద్రను వేసుకున్నారు. ఎక్కడున్నా ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో మమేకమయ్యే తత్వముంది. విశిష్ట లక్షణాలున్న ఈ అధికారి రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక వహించగలరనే నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారానికి ముందే ధనుంజయరెడ్డిని అడిషనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. -
ఆ రోజు వచ్చింది
‘‘ఆకతాయి’ సినిమాలో కాలేజ్ కుర్రాడిలా నటించాను. ‘ఇగో’లో బాధ్యతలను నిర్లక్ష్యం చేసి లైఫ్‌ను ఎంజాయ్ చేసే గోపీ పాత్రలో నటించాను. ఎమోషన్స్‌తో రూపొందిన మా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ఆశిష్ రాజ్. ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఆయన హీరోగా విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన చిత్రం ‘ఇగో’. సిమ్రాన్ కథానాయికగా నటించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆశిష్ రాజ్ చెప్పిన విశేషాలు. ► ఇగో ఫీలయ్యే ఇద్దరు (గోపీ, ఇందు) వ్యక్తుల మధ్య ఎమోషన్స్‌తో సాగే లవ్‌స్టోరీ ఇది. సినిమాలో విలేజ్, సిటీ కల్చర్ మిక్సై ఉంటుంది. నటుడిగా నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది. అమలాపురం యాసలో నేను చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. కైరాదత్ చేసిన స్పెషల్ సాంగ్ సూపర్‌గా ఉంటుంది. దర్శకుడు సుబ్రహ్మణ్యం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కార్తీక్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ► చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. చదువు పూరై్తన తర్వాత మా నాన్నగారు ప్రోత్సహించారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం కష్టమే. కానీ నాకు దేవుడి అండ తోడుగా ఉంటుందనుకుంటున్నాను. మహేశ్‌బాబుతో ఓ యాడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు దేవుడా.. నా కంటూ ఓ రోజు రావాలని మనసులో అనుకున్నాను. అదే నిజమైంది. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏమి అనుకోలేదు. ఆశిష్ నా బర్త్‌డే గిఫ్ట్! ‘ఇగో’ చిత్రదర్శకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ – ‘‘మా హీరోనే నా పుట్టినరోజు కానుక. ఆశిష్ రాజ్ సూపర్‌గా నటించాడు. హీరోయిన్ సిమ్రాన్ బాగా నటించింది. మా సినిమాలో నటించిన సీనియర్ యాక్టర్స్ అందరూ ఎంతగానో హెల్ప్ చేశారు. వారిని మర్చిపోలేను. కథ విషయానికొస్తే.. పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చే ప్రేమకథ ఇది. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుంది. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు’’ అన్నారు. -
ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల దుర్మరణం
రంగారెడ్డి: దట్టమైన పొగమంచు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ సంస్ధకు చెందిన ఇద్దరు ఉద్యోగులు చనిపోయారు. కర్నూలు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం(24), మోహన్‌రెడ్డి(24) మరో ఆరుగురితో కలిసి బైక్‌లపై అనంతగిరి వైపు వెళ్తున్నారు. ఇంతలో సుబ్రహ్మణ్యం, మోహన్ రెడ్డిలు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగానే ఈప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్క మొగుడే హంతకుడు!
ఈ నెల 7న రామచంద్రాపురం జంక్షన్ వద్ద హత్యకు గురైన సుబ్రహ్మణ్యం(26) హత్య కేసులో నిందితుడు సుబ్రహణ్యం అక్క భర్తే నని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. తిరుపతిలోని జీవకోనకు చెందిన సుబ్రహ్మణ్యం, భాస్కర్ బావబామ్మర్థులు. సుబ్రహ్మణ్యం తన బావ భాస్కర్‌కు కొన్ని నెలల క్రితం రూ.లక్షన్నర అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వమని కొన్ని రోజులుగా అడుగుతున్నాడు. ఈ నేపధ్యంలో ఈ నెల 7న మద్యం సేవించడానికి రామచంద్రాపురం జంక్షన్ వద్దకు ఇద్దరూ వెళ్లారు. మద్యం సేవించే సమయంలో అప్పు గురించి అడిగేసరికి భాస్కర్ కోపోద్రిక్తుడయ్యాడు. రెచ్చిపోయి బావమరిది సుబ్రహ్మణ్యంను చంపేశాడు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లలేదు. నాలుగు రోజులుగా ఇద్దరి కోసం కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. గురువారం రామచంద్రాపురం జంక్షన్ వద్ద సుబ్రహణ్యం మృతదేహం స్థానికుల కంటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.