ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల దుర్మరణం
రంగారెడ్డి: దట్టమైన పొగమంచు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ సంస్ధకు చెందిన ఇద్దరు ఉద్యోగులు చనిపోయారు. కర్నూలు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం(24), మోహన్‌రెడ్డి(24) మరో ఆరుగురితో కలిసి బైక్‌లపై అనంతగిరి వైపు వెళ్తున్నారు.
ఇంతలో సుబ్రహ్మణ్యం, మోహన్ రెడ్డిలు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగానే ఈప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.