mohanreddy
-
కిసాన్‌మోర్చా ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట: వరిసాగు చేయొద్దంటూ మంత్రులు సూచనలు చేయడం, కొన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేయడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శుక్రవారం బీజేపీ కిసాన్‌మోర్చా చేపట్టిన వ్యవసాయ కమిషనరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. కమిషనరేట్‌లో కి దూసుకెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. గాయపడిన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మహేష్ యాదవ్, కామారెడ్డి జిల్లాకు చెందిన పాటిమీది గంగారెడ్డి తదితరులను ఆసుపత్రులకు తరలించారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడేళ్లుగా కేంద్రం సహకారంతో ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వరిసాగుపై ఆంక్షలు విధించడంలో కుట్ర దాగి ఉందని కిసాన్‌మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. వ్యవ సాయ ఉచిత విద్యుత్ హామీ నుండి తప్పించుకోవడానికే సీఎం కేసీఆర్ ఈ ఆంక్షలు విధించారన్నారు. కార్యక్రమంలో కిసాన్మోర్చానేతలు గోలి మధుసూదన్‌రెడ్డి, పాపయ్య గౌడ్, పడమటి జగన్మోహన్ రెడ్డి , బునేటి కిరణ్, అంజన్నయాదవ్ పాల్గొన్నారు. ధాన్యం కొనొద్దని కేంద్రం చెప్పలేదు: సంజయ్ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయొద్దని కేంద్రం ఎక్కడా చెప్పలేదని, అలాంటిదేమైనా ఉంటే బహి రంగ పరచాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ అన్నారు. లాఠీచార్జిలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుత్నున ఆ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మోహన్‌రెడ్డిని పరామర్శించారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరుణ, విజయశాంతి ఖండన గతేడాది నియంత్రిత సాగు పేరిట రైతులను వం చించిన కేసీఆర్ ఈసారి నియంతగా ప్రవర్తిస్తూ నిర్బంధ వ్యవసాయం చేయాలని బెదిరిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక ప్రకటనలో ఆరోపించారు. రైతులపక్షాన ఉన్న వారిపై లాఠీచార్జీ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి విమర్శించారు. -
మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి మరోసారి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: గత నెల నాచారం లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న నాగమళ్ల వెంకట నరసయ్య కేసులో వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డితో పాటు చిట్టుమల్ల శ్రీనివాస్, నాగభూషణ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఫ్లాటును అక్రమంగా మోహన్‌రెడ్డి భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని సూసైడ్ నోట్ రాసి గత నెల 28 నాచారంలోని ఓ లాడ్జిలో కరీంనగర్‌కు చెందిన వెంకట నరసయ్య ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో వెంకట నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై గతంలో ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నాచారం పోలీసులు తెలిపారు. -
ఠాణాలలోనే సైబర్ కేసుల నమోదు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఇక నుంచి స్థానిక పోలీస్స్టేషన్లలోనే సైబర్ నేరాలను నమోదు చేయనున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ సాదు మోహన్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో పోలీసులకు సైబర్ సవాలుగా మారే అవకాశం ఉన్నందున జిల్లా పోలీసులను అత్యాధునిక పరిజ్ఞానంతో సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక పోలీసు సమావేశ మందిరంలో సైబర్ నేరాలపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక సైబర్ దర్యాప్తు అధికారులు డీఎస్పీ బి.రవికుమార్, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జిల్లా పోలీసు అధికారులకు సైబర్ నేరాలను అరికట్టేందుకు దర్యాప్తు వివరాలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భం గా అదనపు ఎస్పీ మాట్లాడారు. సైబర్ నేరాల ను అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలు సైతం మోసపోకుం డా వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెల్‌ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అపరిచితుల మాయమాటలతో మోస పోకుండా బ్యాంకు ఖాతా వివరాలు ఓటీపీ, సీవీవీ, బ్యాంక్ ఏటీఎం పిన్ నెంబర్లను బహిర్గతం చేయరాదని తెలిపారు. జిల్లా పోలీసు అధికారులకు సైబర్ నేరాలపై దర్యాప్తు సామర్థ్యం కల్పించామని ఇక మీదట సైబర్ బాధితులు పోలీసు స్టేషన్లను ఆశ్రయించి ఫిర్యాదు చేసినచో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. సైబర్ నిందితులను గుర్తించుటకు హైదరాబాద్ పోలీసు విభా గం నిపుణులు జిల్లా పోలీసుకు సహకరిస్తారని తెలిపారు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ నేతృత్వంలో అన్ని కేసుల దర్యాప్తు కోణంలో జిల్లా పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ కల్పించి సిద్ధంగా చేసినట్లు పేర్కొన్నారు. స్పెషల్ బ్రాం చ్ డీఎస్పీ ఎ.విశ్వప్రసాద్ మాట్లాడుతూ పోలీసు అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నారని, అందరికీ కంప్యూటర్ ల్యాప్‌టాప్‌లు అం దించామని తెలిపారు. కేసుల నమోదు నుంచి పూర్తయ్యే వరకు ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నా ర ని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అం దించేందుకు పోలీసు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎస్సై లు కోల నరేశ్, తోట తిరుపతి, పి.సుబ్బారావు, జి.పుల్లయ్య, బి.అనిల్, జిల్లా పోలీసు కంప్యూట ర్ విభాగం అధికారులు శివాజీ చౌహాన్, సహారే కిశోర్, శ్రీధర్, సింగజ్‌వార్ సంజీవ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు. -
మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డిపై ఏసీబీ కేసు
సాక్షి, కరీంనగర్ : వడ్డీవ్యాపారి, మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదుచేశారు. కోతి రాంపూర్‌కు చెందిన గట్టయ్య తీసుకున్న అప్పు కింద అక్రమంగా ఇల్లు కబ్జా చేయడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన గౌడ్ మీడియాకు తెలిపారు. -
ఏసీబీ కేసులో మోహన్‌రెడ్డి అరెస్టు
-ఈ నెల 24 వరకు రిమాండ్ కరీంనగర్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే అభియోగంలో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన కరీంనగర్ ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు లో హాజరుపరిచారు. న్యాయమూర్తి పి.భాస్కరావు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. మోహన్‌రెడ్డి ఆదాయం కన్నా ఎక్కువగా ఆస్తులు కలిగి ఉన్నారని, కుటుం బ సభ్యుల పేర ఆస్తులు చూపి బినామీలు గా చేర్చారని రిమాండ్ షీట్లో పేర్కొన్నా రు. ఆస్తుల విలువ రూ.3 కోట్ల 27 లక్షల 39 వేలుగా చూపారు. 2015లో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎన్.శ్రీని వాస్ ఆయనపై ఏసీబీకి ఫిర్యాదు చేయగా విచారణ జరిపి సోదాలు చేపట్టారు. -
మోహనరెడ్డి పీఆర్ కళాశాల పూర్వ విద్యార్థే
పద్మశ్రీ అందుకున్న నాలుగో పూర్వ విద్యార్థి హర్షం వ్యక్తం చేసిన పూర్వ విద్యార్థి సంఘం భానుగుడి (కాకినాడ సిటీ) : జిల్లాలో విద్యా చరిత్రకు పునాదిగా నిలిచిన పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల మరో ఘనకీర్తిని సొంతం చేసుకుంది.1880వ దశకం నుంచి నేటి వరకు కొన్ని లక్షల మంది విద్యార్థుల ఉన్నతికి ఈ కళాశాల కల్పవల్లిగా నిలిచిన విషయం తెలిసిందే. వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విశేష సేవలందించి, భారత కీర్తిని ఆ రంగాల్లో ప్రపంచ యవనికపై సగర్వంగా నిలిపినందుకు పద్మశ్రీ అవార్డు అందుకున్న డాక్టర్ బీవీఆర్ మోహనరెడ్డి (సైయెంట్ వ్యవస్థాపకులు) పీఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థి. ఇప్పటికి ఈ కళాశాలకు చెందిన నలుగురు పూర్వ విద్యార్థులు పద్మ పురస్కారాలు అందుకోవడం కళాశాల కీర్తిని మరింత పెంచింది. ఇప్పటికి నలుగురు.. 1935లో పీఆర్ ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మామిడికుదురుకు చెందిన ప్రముఖ కవి భోయిభీమన్న (1973 పద్మశ్రీ,, 2001 పద్మభూషణ్),1950లో బోటనీ, జువాలజీలతో డిగ్రీ చదివిన పశ్చిమ గోదావరి చిట్టవరానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త మంగిన వెంకటేశ్వరరావు (1999 పద్మశ్రీ), 1940లో ఈ కళాశాలలో డిగ్రీ చదివిన ద్రాక్షారామకు చెందిన వీణా వాయిద్య, సంగీత కళాకారుడు ఈమని శంకరశాస్త్రి (1974 పద్మశ్రీ)లతో పాటు ప్రస్తుత పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహనరెడ్డి నలుగో వ్యక్తి కావడం విశేషం. ఉన్నత విద్య ఇక్కడే.. బీవీఆర్ మోహనరెడ్డి తండ్రి ఏపీఎస్పీలో ఉద్యోగ దీత్యా కాకినాడకు వచ్చారు. దీంతో మోహనరెడ్డి తన ఉన్నత విద్య అంతటినీ ఇక్కడే పూర్తిచేశారు. కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీని పూర్తిచేసి,1965–66లో పీఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివారు. 1966 నుంచి 70 వరకు జేఎన్టీయూకేలో ఇంజనీరింగ్Š చేశారు. ఆ తర్వాత ఐఐటీని ఖరగ్‌పూర్‌లో పూర్తిచేశారు. ఈ క్రమంలో మోహనరెడ్డి ఇక్కడ అనేక మంది స్నేహితులను సంపాదించుకున్నారు. తాను చదువుకున్న పీఆర్ కళాశాలలో ఆయన రూ.22 లక్షలతో మినీ ఆడిటోరియాన్ని నిర్మించారు. గతేడాది కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే లో విద్యార్థులకు ఆయన స్వయంగా డిగ్రీ పట్టాలను అందించి ప్రగతి పథంలో నడవాలని పిలుపునిచ్చారు. బీవీఆర్ మోహనరెడ్డికి పద్మశ్రీ పురస్కారం దక్కడం పట్ల పీఆర్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం హర్షం వ్యక్తం చేసింది. -
ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల దుర్మరణం
రంగారెడ్డి: దట్టమైన పొగమంచు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ సంస్ధకు చెందిన ఇద్దరు ఉద్యోగులు చనిపోయారు. కర్నూలు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం(24), మోహన్‌రెడ్డి(24) మరో ఆరుగురితో కలిసి బైక్‌లపై అనంతగిరి వైపు వెళ్తున్నారు. ఇంతలో సుబ్రహ్మణ్యం, మోహన్ రెడ్డిలు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగానే ఈప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మోహన్‌రెడ్డికి బెయిల్
కమాన్‌చౌరస్తా : ఒకరి ఆత్మహత్య కేసులో నిందితుడైన మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి శనివారం జైలు నుంచి విడుదలయ్యాడు. కరీంనగర్ విద్యానగర్‌కు చెందిన నారాయణరెడ్డి ఆగస్టు 8న క్రిమసంహారక మందుతాగి అత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు మోహన్‌రెడ్డి, కరవేద శ్యాంసుందర్‌రెడ్డి కారణం అని సూసైడ్ నోట్ రాశాడు. ఈ మేరకు నారయణరెడ్డి కూతురు తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆగస్టు 23న ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో కరీంనగర్ జైలులో ఉన్న మోహన్‌రెడ్డికి హైకోర్టు శుక్రవారం బెయిల్మంజూరు చేసింది. ఇదే కేసులో నిందుతుడైన శ్యాంసుందర్‌రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించగా జడ్జి తోసిపుచ్చారు. తర్వాత హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. కాగా, కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు ఆత్మహత్య కేసులో సీఐడీ అధికారులు శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. -
నారాయణరెడ్డి ఆత్మహత్య వెనుక ఆంతర్యమేమిటి?
మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలే కారణమంటూ కూతురు ఫిర్యాదు తర్వాత పొరపాటుగా ఫిర్యాదు చేశామంటూ పోలీసులకు పిటిషన్ కానీ వారిద్దరే కారణమంటూ నారాయణరెడ్డి సూసైడ్ నోట్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం : కరీంనగర్ విద్యానగర్‌కు చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య సర్వత్రా చర్చనీయాంశమైంది. అక్రమ ఫైనాన్స్ దందాతో సంచనలం సృష్టించిన ఏఎస్సై మోహన్‌రెడ్డి, కరివేద శ్యాంసుందర్‌రెడ్డి అనే వ్యక్తుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి కుటుంబసభ్యులు ఆ తరువాత కొద్దిసేపటికే మాట మార్చారు. ఇందులో మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి ప్రమేయం లేదని, ఇతరుల మాటలు నమ్మి పొరపాటుగా ఫిర్యాదు చేశామని పేర్కొంటూ పోలీసులకు మళ్లీ పిటిషన్ ఇవ్వడం విశేషం. అయితే అప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నారాయణరెడ్డి కుటుంబసభ్యులు ఇతరుల మాటలు నమ్మి తొలుత పొరపాటుగా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మరోవైపు నారాయణరెడ్డి ఎవరో తనకు తెలియదని, ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని మోహన్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. బెజ్జంకి మండలం గుండ్లపల్లికి చెందిన చాడ నారాయణరెడ్డి(48) తన కుటుంబంతో గత కొంతకాలంగా కరీంనగర్ విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. కుమారుడు వంశీధర్‌రెడ్డి సింగపూర్‌లో ఉద్యోగం చేస్తుండగా, కూతురు తిరుమల వివాహం కావడంతో వరంగల్‌లో నివాసం ఉంటున్నారు. నారాయణరెడ్డి సోమవారం రాత్రి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో నారాయణరెడ్డి మృతి చెందాడు. మంగళవారం ఉదయం నారాయణరెడ్డి కూతురు గంగ తిరుమల, తల్లి చాడ లక్ష్మితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తండ్రి చావుకు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలే కారణమని, ఈ మేరకు తన తండ్రి సూసైడ్ నోట్ రాశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రికి స్వగ్రామంలోని సర్వే నంబర్ 293లో రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేదని, సుమారు ఐదేళ్ల క్రితం కుటుంబ అవసరాలకు శ్యాంసుందర్‌రెడ్డి ద్వారా ఏఎస్సై మోహన్‌రెడ్డి వద్ద ఆ భూమిని తనఖా పెట్టి రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడని పేర్కొన్నారు. తర్వాత వడ్డీతో కలిపి మొత్తం చెల్లించినా ఆ భూమి పత్రాలు తిరిగి ఇవ్వలేదని అందులో తెలిపారు. ఇదే విషయంపై తన తండ్రి నారాయణరెడ్డి బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీఐడీకి బదిలీ చేశారని, తర్వాత ఆ భూమిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఇదే విషయంపై తన తండ్రి బాధపపడుతుండేవాడని పేర్కొన్నారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చిన తన తండ్రి నోటి నుంచి నురగ రావడంతో ప్రతిమ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ పరీక్షించిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని డాక్టర్లు చెప్పారని, అప్పటికే అర్ధరాత్రి ఒంటి గంట అయ్యిందని పేర్కొన్నారు. తన తండ్రి జేబులో ‘మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి వేధింపుల వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని రాసి ఉన్న సూసైడ్ నోటు లభించిందని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు, సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు కుటుంబసభ్యులు పోలీసులకు అందజేసిన సూసైడ్ నోట్లో ‘నేను అందరూ నావాళ్లు అనుకుని సాయం చేసిన. కానీ నన్నెవరూ అర్ధం చేసుకోలేదు. మీ నుంచి నేను వెళ్లిపోతున్నందుకు క్షమించగలరు. నా చావుకు ముఖ్య కారకులు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి’ అని రాసి ఉండటం గమనార్హం. ఫిర్యాదు పొరపాటు... మోహన్‌రెడ్డి ప్రమేయం లేదు ఉదయం మోహన్‌రెడ్డి వల్లే తన తండ్రి చనిపోయాడని ఫిర్యాదు చేసిన నారాయణరెడ్డి కూతురు తిరుమల మధ్యాహ్నం తల్లి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరో పిటిషన్ ఇచ్చారు. ‘గత కొద్దిరోజులుగా తన తండ్రి కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. సోమవారం నొప్పి ఎక్కువకావడంతో ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. అది గమనించి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. మా నాన్న చావుకు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లు ఎప్పుడూ మా నాన్నను వేధింపులకు గురి చేయలేదు. కావున వారిపై ఎలాంటి చర్య తీసుకోవద్దు. ఇది నేను ఆరోగ్యంగా మానసికంగా ఉండి రాసి ఇస్తున్నాను’ అని పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తొలుత మోహన్‌రెడ్డే కారణమంటూ ఎందుకు ఫిర్యాదు చేశారని విలేకరులు ప్రశ్నించగా... మోహన్‌రెడ్డి బాధిత సంఘం సభ్యులు వచ్చి ఆయనపై లేనిపోనివి కల్పించి చెప్పడంతో వారి మాటలు నమ్మి పొరపాటుగా తప్పుడు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. నాకు సంబంధం లేదు : మోహన్‌రెడ్డి నారాయణరెడ్డి చావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సస్పైండైన ఏఎస్సై మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కొందరు వ్యక్తులు తనపై పై కక్షకట్టి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని పేర్కొన్నారు. -
'ఏ తప్పు చేయలేదు, ఎవ్వరినీ బెదిరించలేదు'
కరీంనగర్: 'నేను ఏ తప్పు చేయలేదు, ఎవ్వరినీ బెదిరించలేదని' మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. తొలిసారిగా గురువారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.... తాత, తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులే తనకు ఉన్నాయని అక్రమ ఆస్తులేమి లేవన్నారు. బ్లాక్మెయిల్ చేయడానికే బాధితులు ఆందోళనలు చేస్తున్నారని మోహన్‌రెడ్డి ఆరోపించారు. తనపై ఉన్న కేసుల్లో కోర్టే నిర్ణయిస్తుందని...నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. బాధితులు కోరినట్లు సీబీఐ విచారణకు సిద్దమని..అనవసరమైన దుష్ప్రాచారం చేయొద్దని వారిని విన్నమించారు. సీఎం కేసీఆర్ వాస్తవాలను వెలికి తీసి తనకు న్యాయం చేయాలని మోహన్‌రెడ్డి కోరారు. గత మూడు రోజులుగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మోహన్‌రెడ్డి బాధితులు న్యాయం చేయాలని కోరుతూ రిలే దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. -
'శెట్టూరు ఘటనపై విచారణ జరిపించాలి'
అనంతపురం: శెట్టూరు ప్రమాద ఘటన పై విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్రకార్యదర్శి ఎల్.ఎం మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. నలుగురి మృతికి కారణమైన బోర్ వెల్ లారీ సిబ్బంది, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ క్షేత్రంలో వేస్తున్న బోరును చూడటానికి వెళ్లిన నలుగురు గ్రామస్థులు, బోర్వెల్ లారీ రివర్స్ తీస్తుండగా దాని కిందపడి మృతిచెందిన విషయం తెలిసిందే. శెట్టూరు మండలం పర్లచేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన సంజీవ(33), మంతేష్(27), తిమ్మప్ప(33), నర్సింహమూర్తి(30) అనే నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు అనూహ్యంగా మృతిచెందడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఫోటో గ్యాలరీ: తెలంగాణ, సీమాంధ్ర లాయర్ల నిరసన
హైకోర్టులో సీమాంధ్ర లాయర్ల మానవహారాన్ని తెలంగాణ న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని మాజీ అడ్వకేట్ జనరల్, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ అద్యక్షుడు సీవీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. కేవలం తమను అడ్డుకోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే వాళ్లు చలో హైకోర్టు కార్యక్రమం తలపెట్టారన్నారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులకు పూర్తిగా సహకరించారు. -
మహిళల పట్ల టి-లాయర్ల అసభ్యప్రవర్తన: మోహన్‌రెడ్డి
హైకోర్టులో సీమాంధ్ర లాయర్ల మానవహారాన్ని తెలంగాణ న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని మాజీ అడ్వకేట్ జనరల్, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ అద్యక్షుడు సీవీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. కేవలం తమను అడ్డుకోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే వాళ్లు చలో హైకోర్టు కార్యక్రమం తలపెట్టారన్నారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులకు పూర్తిగా సహకరించారని, తమ కార్యక్రమానికి ముందస్తు అనుమతి ఉన్నా కూడా కావాలనే తమను అరెస్టు చేశారని అన్నారు. తమను అడ్డుకునే క్రమంలో సీమాంధ్ర న్యాయవాదుల్లో ముగ్గురిని తెలంగాణ న్యాయవాదులు తీవ్రంగా గాయపరిచారని, మహిళా న్యాయవాదులని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. వాళ్లు తమపై దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని, హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడే ఇలాంటి దాడులు జరుగుతుంటే.. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీమాంధ్రుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగే సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికను విజయవంతం చేస్తామని మోహన్‌రెడ్డి తెలిపారు.