'ఏ తప్పు చేయలేదు, ఎవ్వరినీ బెదిరించలేదు' | former ASI mohan reddy speaks over his allegations | Sakshi
Sakshi News home page

'ఏ తప్పు చేయలేదు, ఎవ్వరినీ బెదిరించలేదు'

Published Thu, Apr 21 2016 7:03 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

'ఏ తప్పు చేయలేదు, ఎవ్వరినీ బెదిరించలేదు' - Sakshi

'ఏ తప్పు చేయలేదు, ఎవ్వరినీ బెదిరించలేదు'

కరీంనగర్: 'నేను ఏ తప్పు చేయలేదు, ఎవ్వరినీ బెదిరించలేదని' మాజీ ఏఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. తొలిసారిగా గురువారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.... తాత, తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులే తనకు ఉన్నాయని అక్రమ ఆస్తులేమి లేవన్నారు.

బ్లాక్మెయిల్ చేయడానికే బాధితులు ఆందోళనలు చేస్తున్నారని మోహన్రెడ్డి ఆరోపించారు. తనపై ఉన్న కేసుల్లో కోర్టే నిర్ణయిస్తుందని...నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. బాధితులు కోరినట్లు సీబీఐ విచారణకు సిద్దమని..అనవసరమైన దుష్ప్రాచారం చేయొద్దని వారిని విన్నమించారు. సీఎం కేసీఆర్ వాస్తవాలను వెలికి తీసి తనకు న్యాయం చేయాలని మోహన్రెడ్డి కోరారు. గత మూడు రోజులుగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మోహన్రెడ్డి బాధితులు న్యాయం చేయాలని కోరుతూ రిలే దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement