-ఈ నెల 24 వరకు రిమాండ్
కరీంనగర్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే అభియోగంలో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన కరీంనగర్ ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు లో హాజరుపరిచారు. న్యాయమూర్తి పి.భాస్కరావు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు.
మోహన్‌రెడ్డి ఆదాయం కన్నా ఎక్కువగా ఆస్తులు కలిగి ఉన్నారని, కుటుం బ సభ్యుల పేర ఆస్తులు చూపి బినామీలు గా చేర్చారని రిమాండ్ షీట్‌లో పేర్కొన్నా రు. ఆస్తుల విలువ రూ.3 కోట్ల 27 లక్షల 39 వేలుగా చూపారు. 2015లో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎన్.శ్రీని వాస్ ఆయనపై ఏసీబీకి ఫిర్యాదు చేయగా విచారణ జరిపి సోదాలు చేపట్టారు.
ఏసీబీ కేసులో మోహన్‌రెడ్డి అరెస్టు
Published Tue, Apr 11 2017 2:41 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement