మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి మరోసారి అరెస్ట్‌ | Former ASI Mohan Reddy Arrested Again | Sakshi
Sakshi News home page

మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి మరోసారి అరెస్ట్‌

Published Mon, Sep 28 2020 6:34 PM | Last Updated on Mon, Sep 28 2020 7:40 PM

Former ASI Mohan Reddy Arrested Again - Sakshi

సాక్షి, రంగారెడ్డి: గత నెల నాచారం లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న నాగమళ్ల వెంకట నరసయ్య కేసులో వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు చిట్టుమల్ల శ్రీనివాస్, నాగభూషణ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఫ్లాటును అక్రమంగా మోహన్‌రెడ్డి భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని సూసైడ్ నోట్ రాసి గత నెల 28 నాచారంలోని ఓ లాడ్జిలో కరీంనగర్‌కు చెందిన వెంకట నరసయ్య ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో వెంక‌ట న‌ర్స‌య్య పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై గతంలో ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నాచారం పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement