ల్యాప్‌టాప్‌లో కుమార్తె అభ్యంతరకర ఫోటోలు | Nacharam Police Book A Man Under Over Daughter Obscene Photos | Sakshi
Sakshi News home page

తండ్రి ల్యాప్‌టాప్‌లో కుమార్తె అభ్యంతరకర ఫోటోలు

Published Wed, Aug 19 2020 10:06 AM | Last Updated on Wed, Aug 19 2020 3:39 PM

Nacharam Police Book A Man Under Over Daughter Obscene Photos - Sakshi

నిందితుడు ( ఇన్‌సెట్‌లో )

సాక్షి, హైదరాబాద్‌: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కసాయి వాడిగా మారాడు. కూతురి అభ్యంతకర ఫోటోలను ల్యాప్‌టాప్‌లో సేవ్‌ చేసి.. వాటిని చూస్తూ రాక్షసానందం పొందాడు. తండ్రి నిజస్వరూపం తెలియడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నాచారం ప్రాంతంలో రెస్టారెంట్‌ ఓనర్‌గా పని చేస్తున్న నిందితుడు మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడు రెండో భార్య కుమార్తె అభ్యంతరకర ఫోటోలను తీసి తన ల్యాప్‌టాప్‌లో సేవ్‌ చేసుకున్నాడు. ఓ రోజు బాధితురాలు ల్యాప్‌టాప్‌ తీసి చూడగా తండ్రి బాగోతం బయటపడింది. కన్నతండ్రి ల్యాప్‌టాప్‌లో తన అభ్యంతరకర ఫోటోలు చూసి ఆమె తల్లడిల్లిపోయింది. (భార్య అందంగా లేదని.. గొంతు నొక్కి)

దీని గురించి బాధితురాలు తల్లికి తెలిపింది. అనంతరం నాచారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తండ్రి మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కొద్ది రోజుల తర్వాత అతడికి కరోనా సోకడంతో మందలించి విడిచిపెట్టారు. కోలుకోవడంతో ప్రస్తుతం నిందితుడిని మళ్లీ అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement