ఇబ్రహీంపట్నంరూరల్ : కుటుంబాలను పోషించాల్సిన కుటుంబ పెద్దలు రైస్‌మిల్ యాజమానుల నిర్లక్ష్యానికి ఇద్దరు కూలీలు బలయ్యారు. పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైస్‌మిల్లులో గోడ కూలిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ప్రమాదానికి సం బంధించి ప్రత్యక్షసాక్షుల, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామా నికి చెందిన గిరమోని శ్రీనివాస్(40), కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన గౌర బీరప్ప(42). వీరిద్దరూ ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి రెవెన్యూ పరిధిలో గల శ్రీలక్ష్మీ గణపతి రైస్‌మిల్లులో హమాలీలుగా పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
రోజుమాదిరిగానే శుక్రవారం ఉదయం పనికోసం రైస్‌మిల్ వద్దకు వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో మిల్‌లోంచి వస్తున్న బియ్యాన్ని తొ క్కుతుండగా బియ్యం ఆపేందుకు అడ్డంగా కట్టిన గోడ కూలిపోయింది. గోడ కూలడంతో శ్రీనివాస్, బీరప్పలు బియ్యంలో మునిగిపోయారు. దీంతో గమనించిన తోటివారు ఆరగంట పాటు శ్రమించి బియ్యంలో కూరుకుపోయిన ఇద్దరిని బయటకు తీశారు. అప్పటికే వీరిద్దరి పరిస్థితి విషమించడం తో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించా రు.
గోడ కూలి బియ్యంలో పడి ప్రమాదానికి గురయ్యారనే సమాచారం యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. మృతులిద్దరికీ భార్య, పిల్లలున్నారు. మృతుల కుటుంబాలను యాజమాన్యం ఆదుకోవాలని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, సీపీఎం నాయకులు పగడాల యాదయ్య, సీఐటీయూ నాయకులు బడ్డు నర్సింహా, జగదీష్‌లు డిమాండ్ చేశారు.
సాగర్‌రోడ్డుపై రాస్తారోకో..
ఇద్దరు హమాలీల కుటుంబాలకు న్యాయం చేయాలని శనివారం ఉదయం రైస్‌మిల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్నం వరకు యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు ఒక్కసారిగా సాగర్‌రోడ్డుపై మండుటెండలో రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల సీఐలు స్వామి, గోవింద్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని సర్ధిచెప్పే సమయంలో కూలీలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి కలగజేసుకొని ఇరువర్గాలను శాంతిపరిచారు.
సాగర్‌రహదారిపై రాస్తారోకో చేస్తున్న కూలీలు
Comments
Please login to add a commentAdd a comment