వర్క్‌షాప్‌లో పాల్గొన్న పోలీసు అధికారులు.. ఇన్‌సెట్లో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ మోహన్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఇక నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్‌లలోనే సైబర్ నేరాలను నమోదు చేయనున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ సాదు మోహన్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో పోలీసులకు సైబర్ సవాలుగా మారే అవకాశం ఉన్నందున జిల్లా పోలీసులను అత్యాధునిక పరిజ్ఞానంతో సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక పోలీసు సమావేశ మందిరంలో సైబర్ నేరాలపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక సైబర్ దర్యాప్తు అధికారులు డీఎస్పీ బి.రవికుమార్, ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జిల్లా పోలీసు అధికారులకు సైబర్ నేరాలను అరికట్టేందుకు దర్యాప్తు వివరాలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భం గా అదనపు ఎస్పీ మాట్లాడారు. సైబర్ నేరాల ను అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలు సైతం మోసపోకుం డా వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సెల్‌ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అపరిచితుల మాయమాటలతో మోస పోకుండా బ్యాంకు ఖాతా వివరాలు ఓటీపీ, సీవీవీ, బ్యాంక్ ఏటీఎం పిన్ నెంబర్లను బహిర్గతం చేయరాదని తెలిపారు. జిల్లా పోలీసు అధికారులకు సైబర్ నేరాలపై దర్యాప్తు సామర్థ్యం కల్పించామని ఇక మీదట సైబర్ బాధితులు పోలీసు స్టేషన్‌లను ఆశ్రయించి ఫిర్యాదు చేసినచో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. సైబర్ నిందితులను గుర్తించుటకు హైదరాబాద్ పోలీసు విభా గం నిపుణులు జిల్లా పోలీసుకు సహకరిస్తారని తెలిపారు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ నేతృత్వంలో అన్ని కేసుల దర్యాప్తు కోణంలో జిల్లా పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ కల్పించి సిద్ధంగా చేసినట్లు పేర్కొన్నారు.
స్పెషల్ బ్రాం చ్ డీఎస్పీ ఎ.విశ్వప్రసాద్ మాట్లాడుతూ పోలీసు అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నారని, అందరికీ కంప్యూటర్ ల్యాప్‌టాప్‌లు అం దించామని తెలిపారు. కేసుల నమోదు నుంచి పూర్తయ్యే వరకు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నా ర ని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అం దించేందుకు పోలీసు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎస్సై లు కోల నరేశ్, తోట తిరుపతి, పి.సుబ్బారావు, జి.పుల్లయ్య, బి.అనిల్, జిల్లా పోలీసు కంప్యూట ర్ విభాగం అధికారులు శివాజీ చౌహాన్, సహారే కిశోర్, శ్రీధర్, సింగజ్‌వార్ సంజీవ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment