మోహన్‌రెడ్డికి బెయిల్‌ | bail to mohanreddy | Sakshi
Sakshi News home page

మోహన్‌రెడ్డికి బెయిల్‌

Published Sat, Sep 24 2016 10:28 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

bail to mohanreddy

కమాన్‌చౌరస్తా : ఒకరి ఆత్మహత్య కేసులో నిందితుడైన మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి శనివారం జైలు నుంచి విడుదలయ్యాడు. కరీంనగర్‌ విద్యానగర్‌కు చెందిన నారాయణరెడ్డి ఆగస్టు 8న క్రిమసంహారక మందుతాగి అత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు మోహన్‌రెడ్డి, కరవేద శ్యాంసుందర్‌రెడ్డి కారణం అని సూసైడ్‌ నోట్‌ రాశాడు. ఈ మేరకు నారయణరెడ్డి కూతురు తిరుమల టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిందితులపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆగస్టు 23న ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో కరీంనగర్‌ జైలులో ఉన్న మోహన్‌రెడ్డికి హైకోర్టు శుక్రవారం బెయిల్‌మంజూరు చేసింది. ఇదే కేసులో నిందుతుడైన శ్యాంసుందర్‌రెడ్డి గతంలో ముందస్తు బెయిల్‌ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించగా జడ్జి తోసిపుచ్చారు. తర్వాత హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. కాగా, కెన్‌క్రెస్ట్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ప్రసాదరావు ఆత్మహత్య కేసులో సీఐడీ అధికారులు శనివారం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement