కామవరపుకోట ఎంపీడీవో సస్పెన్షన్
Published Thu, Feb 27 2014 12:25 AM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM
కామవరపుకోట, న్యూస్‌లైన్ : కామవరపుకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కె.శిల్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యూయి. ఈనెల 15న జిల్లా కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌కు హాజరు కాని కారణంగా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశాల మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. ఎంపీడీవో శిల్పకు ఈ ఏడాది మే 26వ తేదీతో ప్రొబేషన్ కాలం ముగియనున్నది. మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకుడు ఎ.రాంబాబు ఇన్‌చార్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తారు.
ఏలూరులో ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్
ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : ఏలూరు సుబ్రహ్మణ్యం కాలనీలోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పత్తి శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ జి.నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఆయనను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.
Advertisement
Advertisement