సంగీత దర్శకుడి కోసం పోలీసుల వేట | police searching music director sairam sakheth | Sakshi
Sakshi News home page

సంగీత దర్శకుడి కోసం పోలీసుల వేట

Published Fri, Aug 7 2015 5:39 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

సంగీత దర్శకుడి కోసం పోలీసుల వేట - Sakshi

సంగీత దర్శకుడి కోసం పోలీసుల వేట

హైదరాబాద్: సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇస్తానంటూ మాయ మాటలు చెప్పి ఓ మైనర్‌ను కిడ్నాప్ చేసిన ఆరోపణలపై సినీ సంగీత దర్శకుడు సాయిరాం సాకేత్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న సాకేత్ పలు సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఇతడికి తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోనకు చెందిన సుబ్రహ్మణ్యంతో సినీ రంగ నేపథ్యంలోనే పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో సంగీతం పట్ల ఆసక్తి ఉన్న తన చిన్న కుమార్తెకు(17) పాటలు పాడే అవకాశం ఇవ్వాల్సిందిగా సుబ్రహ్మణ్యం కోరాడు.

ఈ నేపథ్యంలో మే 20న ఆమెకు సినిమాలో పాడే అవకాశం ఇస్తానని చెప్పి, ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ తీసుకువచ్చాడు. కుమార్తె కనిపించకపోవడంతో ఆమె కుటుంబీకులు ఉండ్రాజవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ హైదరాబాద్‌లో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమె వాంగ్మూలంతో సాయిరాం సాకేత్ మాయ మాటలు చెప్పి హైదరాబాద్ తీసుకువెళ్లి నిర్బంధించినట్లు వెలుగులోకి వచ్చింది.

అప్పటి నుంచి పరారీలో ఉన్న సాయిరాం కోసం ఉండ్రాజవరం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేస్తున్నామని, సాకేత్ ఆచూకీ తెలిస్తే 9440796639 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తణుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంకబాబు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement