
ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు ఒక్క శాతమే
నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: దేశంలో దాదాపు 130 కోట్ల మంది ప్రజలు ఉంటే... ఇందులో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఇప్పటికీ 95 % మందిప్రజలు నగదు లావాదేవీలనే జరుపుతున్నారని చెప్పారు. 2030 కల్లా భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న 2 లక్షల కోట్ల డాలర్ల స్థాయి నుంచి 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలంటే ఇంత భారీ మొత్తంలో నగదులావాదేవీలు, అత్యంత కనిష్టస్థాయి ఐటీ చెల్లింపుదారులతో సాధ్యం కాదని కాంత్ పేర్కొన్నారు. నగదురహిత(క్యాష్‌లెస్) లావాదేవీలపై బుధవారమిక్కడ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) నిర్వహించిన ఒకకార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అధికారిక గణాంకాల ప్రకారం... ప్రస్తుతం దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ ఫోన్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని.. ఘిం కా 100 కోట్ల మంది ‘ఆధార్’తోఅనుసంధానం అయ్యారని వివరించారు. ‘ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ను నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం అందరికీ బ్యాంకింగ్ సేవలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే 26 కోట్ల జనధన బ్యాంక్‌ఖాతాలను, 20 కోట్ల రూపే కార్డులను జారీచేయడం జరిగింది. ఇక ఇప్పుడు క్యాష్‌లెస్ లావాదేవీలకు మారాల్సిన సమయం వచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు. హోం మంత్రిత్వశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుమాట్లాడుతూ... ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది క్యాష్‌లెస్ లావాదేవాలను అందిపుచ్చుకోవాలన్నారు.