న్యూఢిల్లీ: ఆపిల్, గూగుల్, డ్రాప్‌బాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్ కంపెనీలకు నీతి ఆయోగ్ భారీ షాక్ ఇచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా డీజీబాక్స్(Digi Boxx)అనే స్వదేశీ క్లౌడ్ స్టోరేజ్, మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. దీనికోసం డీజీబాక్స్ బృందంతో కలిసి పనిచేసినట్లు నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందులో రా ఫైల్స్, ఫోటోలు, ఈ-డాక్యుమెంట్స్ వంట వాటిని నిల్వచేసుకోవచ్చు. ఈ సేవలు వెబ్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని త్వరలో ఐఓఎస్ వెర్షన్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుందని బృందం తెలిపింది.
డీజీబాక్స్ లో ఆన్-డిమాండ్, రియల్ టైమ్ యాక్సెస్, ఎడిటింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఇందులో ఫైల్స్ లేదా డేటాని ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు మీ మొబైల్ లేదా లాప్టాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మెటాడేటా ఫీచర్ ఆధారంగా డేటాను సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో వేర్వేరు ఫార్మాట్, సైజులలో ఉన్న డాక్యుమెంట్స్ ఒకేసారి అప్లోడ్ చేయవచ్చు. ఇందులో ఉన్న ఫిల్టర్స్ ఫీచర్ ద్వారా ఫైల్స్‌ను వేర్వేరు విభాగాలుగా విభజించడం, లేబుల్స్ క్రియేట్ చేయడం, ముఖ్యమైన ఫైల్స్‌ను టాప్‌లో ఉండేటట్లు కూడా చేసుకోవచ్చు.
డీజీబాక్స్ ఎలా ఉపయోగించాలి?
డీజీబాక్స్ క్లౌడ్ స్టోరేజ్ సేవలను ఉపయోగించడానికి వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఖాతా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ పేరు, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, నివాస చిరునామా వంటి వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. తరువాత డీజీబాక్స్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మీ స్వంత ఫైల్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ ఫైల్స్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైల్‌లను వెంటనే షేర్ చేయడానికి మీ మెయిల్, రిసీవర్ యొక్క మెయిల్ అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు 2జీబీ ఫైల్స్ వరకు షేర్ చేయవచ్చు. ఈ ఫైల్‌లు 45 రోజుల పాటు డిజిబాక్స్‌లో ఉంటాయి.
డీజీబాక్స్ ధర
ఈ సేవలు పొందటం కోసం డీజీబాక్స్ యొక్క నెల, వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఉచితంగా పొందడానికి కూడా 20జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ, జీమెయిల్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు కూడా లభించనున్నాయి. ఫ్రీ యూజర్లు 2జీబీ సైజు ఉన్న ఫైల్స్ ఒకేసారి షేర్ చేసుకోవచ్చు. అదే నెలకు రూ.30 రూపాయలు చెల్లిస్తే 5టీబీ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. వీరు 10 జీబీ సైజ్ ఉన్న ఫైల్స్ కూడా ఒకేసారి అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం నెలకు రూ.999 ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. ఈ ఫైల్స్ ను 500 వినియోగదారులు వాడుకోవచ్చు. ఇందులో 50టీబీ స్పేస్ లభిస్తుంది. వీరు కూడా ఒఒకేసారి 10 జీబీ సైజ్ ఉన్న ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు.
ఆపిల్, గూగుల్ కంపెనీలకు భారీ షాక్
Published Wed, Dec 23 2020 7:39 PM | Last Updated on Wed, Dec 23 2020 7:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment