సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఎంటర్‌ప్రిన్యూయర్ షిప్(జీఈఎస్) సదస్సుకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులు భాగ్యనగరానికి చేరుకోనున్నారు. ప్రముఖుల సుడిగాలి పర్యటనకు సంబంధించిన ఫ్యాక్ట్ పాయింట్స్ మీ కోసం..
సుడిగాలి పర్యటన ఇలా..
- మంగళవారం మధ్యాహ్నం 01.10 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మియాపూర్ మెట్రో స్టేషన్‌కు వెళ్తారు.
- మధ్యాహ్నం 02.15 నిమిషాలకు మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు.
- మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకూ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణిస్తారు.
- మధ్యాహ్నం 02.45 నిమిషాలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి బయల్దేరుతారు.
- మధ్యాహ్నం 03.35 నిమిషాలకు ఇవాంకా ట్రంప్‌తో 20 నిమిషాల పాటు భేటీ అవుతారు.
- సాయంత్రం నాలుగు గంటలకు ఇండియన్ ఎడ్జ్ ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
- సాయంత్రం 04.40 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తారు.
- సాయంత్రం 04.43 నిమిషాలకు జీఈఎస్ సదస్సును మోదీ ఆరంభిస్తారు.
- సాయంత్రం 04.45 నిమిషాలకు ఇవాంకా ట్రంప్ ప్రసంగం ఉంటుంది.
- సాయంత్రం 04.50 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.
- సాయంత్రం 05.10 నిమిషాలకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ముగింపు ప్రసంగం చేస్తారు.
- సాయంత్రం 05.30 గంటలకు హెచ్‌ఐసీసీలో మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి భేటీ అవుతారు.
- సాయంత్రం 06.00 గంటల నుంచి దేశ, విదేశాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని ముఖాముఖి మాట్లాడతారు.
- రాత్రి 07.00 గంటలకు ప్రధానమంత్రి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.
- రాత్రి 07.30 గంటలకు హెచ్‌ఐసీసీ నుంచి ప్రధానమంత్రి ఫలక్‌నూమా ప్యాలెస్‌కు వెళ్తారు.
- రాత్రి 08.00 గంటలకు ప్యాలెస్‌లో ఇవాంకా, ప్రధానమంత్రి మోదీ, జీఈఎస్ ప్రతినిధులతో కలసి విందు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment