
సాక్షి, హైదరాబాద్: ఇవాంకా ట్రంప్.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారారు. హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభంకానున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఆమె పాల్గొంటున్న నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఆమె ఫొటోలు, విశేషాలతో పాటు సెటైర్లు వంటివి చక్కర్లు కొడుతున్నాయి. పత్రికలు, మీడియా కూడా ఆమె పర్యటన విశేషాలను, వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తుండడంతో.. ఇంటర్నెట్, సామా జిక మాధ్యమాల్లో చర్చలు జరుగు తున్నాయి. ‘రావమ్మా ఇవాంకా..’అంటూ ఆహ్వానిస్తున్న వారితోపాటు.. ఆమె పర్యటనపై సెటైర్లూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాంకా రాకపోకలు సాగించే మార్గా లను సుందరీకరిస్తుండ డం, రోడ్లు బాగుచేయి స్తుండడం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. రాజధానిలో బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించే కార్యక్రమం, వీధి కుక్కలను నియంత్రించే ప్రయత్నాల గురించి అయితే చలోక్తులు, విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇవాంకా విందు చేసే ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని భారీ టేబుల్ గురించి, ఆమె తినే వంటకాలు, ప్రయాణించే వాహనాల గురించి చిత్ర విచిత్ర చర్చలు జరుగుతున్నాయి. ‘శతాబ్దాల రాతియుగపు సమాధుల నుంచి..’అంటూ ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ కవిత అయితే బాగా వైరల్ అయింది.
ఈ వంక రావమ్మా... ఇవాంకా!
ఇకఇవాంకా తమ ఊరికి రావాలంటూ కొందరు పోస్టు చేస్తున్న ఆన్‌లైన్ ఆహ్వానాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. వరంగల్‌కు వస్తే ఓరుగల్లు కోట చూపెడతామని, కల్లు తాగిస్తామని ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టింగ్‌కు భారీగా లైకులు, కామెంట్లు రావడం గమనార్హం. హైదరాబాద్‌లోని మణికొండకు రావాలంటూ ఇవాంకాతో వాట్సాప్‌లో డిస్కస్ చేసినట్టు.. ఆమె అంగీకరించినట్టు వచ్చిన మరో వీడియో అంతే వైరల్ అయింది. ఇలా మరెన్నో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment