అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా, తల్లిగా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే స్ట్రాంగ్ విమెన్. ముగ్గురు పిల్లల తల్లి అయినా.. ఆమె ఇప్పటకీ అంతే స్లిమ్‌గా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆమె శరీరాకృతి చూస్తే 16 ఏళ్ల అమ్మాయే అన్నంత అందంగా ఉంటుంది. అంతలా టోన్డ్ ఫిజిక్‌ని మెయింటైన్ చేసేందుకు ఎలాంటి వర్కౌట్‌లు చేస్తుంటుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇవాంక. సాధారణ వ్యాయమాలతో సరిపెట్టెకుండా అలాంటి వర్కౌట్‌లు కూడా చేస్తే.. ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉండగలమని అంటోంది. ఇంతకీ ఆమె విల్లులాంటి శరీరాకృతి కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తుందో తెలుసా..!.
చాలామంది మహిళల మాదిరిగానే తాను కూడా కార్డియో, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్‌లపైనే దృష్టిసారిస్తానని ఆ వీడియోలో పేర్కొంది ఇవాంక. అయితే తన కండరాల బలం కోసం ప్రస్తుతం తాను వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్‌లపై శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎప్పుడూ సాధారణ వ్యాయామాలే కాకుండా ఎల్లప్పుడు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఇలాంటి వ్యాయామాలు కూడా చేయాలని చెబుతోంది.
మన కండరాలు బలోపేతంగా ఉండేలా స్క్వాట్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, హింగ్‌లు, పుష్-పుల్ అప్స్ వంటి వర్కౌట్‌లు అవసరమని గట్టిగా విశ్వసిస్తానంటోంది ఇవాంక. స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఇలాంటివి ప్రతి మహిళ తప్పనిసరిగా చేయాలని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్‌లలో అత్యంత కీలకమైనవి ఇవేనని పేర్కొంది. వారంలో నాలుగు రోజులు ఇలాంటి వ్యాయామాలకు కేటాయిస్తానని చెప్పారు. జిమ్‌కి వెళ్లడమే గాక ఆరు బయట సర్ఫింగ్ పాడిల్ టెన్నిస్, స్విమ్మింగ్, వేక్ సర్ఫింగ్, బ్రెజిలియన్ జియు-జిట్సు, హైకింగ్, వాకింగ్, గోల్ప్ వంటి వాటిల్లో కూడా పాల్గొంటానని అన్నారు.
తాను రొటీన్ వ్యాయామాలతో సరిపెట్టనని గేమ్‌చేంజర్‌లా వివిధ వ్యాయామాలపై దృష్టిపెడతానని చెప్పారు. తాను శరీరాకృతి విల్లులా ఉండేలా.. అత్యంత బలంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది ఇవాంక. అందుకు అంకితభావంతో కూడిన నిబద్ధత అవసరమని చెప్పారు. అలా క్రమతప్పకుండా వర్కౌట్‌లు చేస్తే మంచి ఫిట్‌నెస్ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని అంటోంది. అలాగే వీడియోలో అందర్నీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిట్‌గా ఉండమని కోరింది ఇవాంక.
(చదవండి: బెల్ట్‌లు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్ ఖురాన్! బాల్యం భారంగా మారకూడదంటే..)
Comments
Please login to add a commentAdd a comment