సాక్షి, వేములవాడ: అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకాకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బతుకమ్మ చీరను బహుమతిగా ఇవ్వాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ చీరను కానుకగా ఇవ్వకుంటే నేత కార్మికులను అవమాన పరిచినట్లేనని ఆయన తెలిపారు. చీరను కానుకగా ఇవ్వకపోతే తామే మెండితో బాక్స్ తయారు చేసి, అందులో చీరను ప్రభుత్వానికి అందజేస్తామని పొన్నం అన్నారు.
అమెరికా- భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ఈ సదస్సు కోసం నగరానికి నవంబర్ 28న విచ్చేయనున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 28న జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు హజరవనున్న ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం రెండు పోచంపల్లి పట్టుచీరలు, డైమండ్ నెక్లెస్ బహూకరించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment