
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్ షో గా నడిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. కీలకమైన సదస్సులో నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించరన్నారు. కనీసం నగర మేయర్‌నుకూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమెరికా అద్యక్ష సలహాదారు ఇవాంక కు హైదరాబాద్‌లో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు లేఖ రాసినట్టు వీహెచ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment