Hanumantha Rao
-
దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ వేడుకలకు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలను రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ హనుమంతరావు శనివారం వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరగనున్నాయని చెప్పారు. కార్యక్రమాలు ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్ వద్ద మొదలై.. రాత్రి 9 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ముగుస్తాయని తెలిపారు. ట్యాంక్ బండ్‌పై నిర్వహించే వేడుకలకు వచ్చే ప్రజలు సాయంత్రం 5 గంటలోపే చేరుకోవాలని సూచించారు. సర్వాంగ సుందరంగా ట్యాంక్‌బండ్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల కోసం పరేడ్ గ్రౌండ్స్‌లో, ట్యాంక్‌బండ్‌పై చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలు పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో వేదికలు, హాజరయ్యే వారికోసం సిద్ధం చేస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇక దశాబ్ది ఉత్సవాల కోసం ట్యాంక్‌బండ్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై జరిగే కార్యక్రమాలను వీక్షించడానికి పలుచోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 80కిపైగా ఫుడ్, వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేశారు.మంచినీటిని అందుబాటులో పెట్టారు. పదేళ్ల తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నాడు సోనియా గాంధీ ఒక అడుగు వెనక్కి వేసి ఉంటే తెలంగాణ రాకపోయేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ పాత్రను మరవలేమన్నారు. ఇక ప్రత్యేక తెలంగాణ కోసం ప్రపంచం గరి్వంచదగ్గ ఉద్యమం జరిగిందని.. కానీ ఆ ఉద్యమానికి అనుగుణంగా గత పదేళ్లలో పాలన జరగలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో మంత్రుల వెంట ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఉత్సవాల షెడ్యూల్ ఇలా..⇒ ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంటారు. అమరులకు నివాళులు అర్పిస్తారు. ⇒ 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు సీఎం చేరుకుంటారు. ⇒ 10.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయుధ బలగాల కవాతు, గౌరవ వందనం ఉంటాయి. ⇒10.15 నుంచి 10.35 వరకు బలగాల మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. ⇒10.35 గంటలకు ‘జయ జయహే తెలంగాణ’రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. ⇒ 10.38 కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరైతే ఆమె తొలుత ప్రసంగిస్తారు. తర్వాత సీఎం రేవంత్ ప్రసంగం ఉంటుంది. సోనియా రాకుంటే నేరుగా సీఎం ప్రసంగిస్తారు. ⇒ 11.08 గంటలకు పోలీసు, ఉత్తమ కాంటింజెంట్ల అవార్డుల ప్రదానం. ⇒11.20కు పరేడ్ ముగింపు కోసం పరేడ్ కమాండర్‌కు అనుమతి ⇒11.25 గంటలకు అవార్డుల స్వీకర్తలతో ఫొటో సెషన్ ⇒11.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో కార్యక్రమం ముగింపు.సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కార్యక్రమాలివీ..⇒ 6.50 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటారు. ⇒ 7.00 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను సందర్శిస్తారు ⇒ 7.20 గంటలకు కార్నివాల్ మొదలవుతుంది. ⇒ 7.30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు.. కళాకారుల నృత్యాలు, ఆటపాటలు ⇒ 8.30కు ఫ్లాగ్ వాక్.. జయ జయహే తెలంగాణ గేయం 13.5 నిమిషాల పూర్తి వెర్షన్ విడుదల. ⇒ 8.44 గంటలకు గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మానం ⇒ 8.50 గంటలకు ఆకట్టుకునేలా బాణసంచా ⇒ 9.00గంటలకు ట్యాంక్‌బండ్‌పై కార్యక్రమం ముగింపు. -
మోదీ అవుట్..వీహెచ్ గెలుపు లెక్కలు..
-
యాంకర్ తో వీహెచ్ కామెడీ మాములుగా లేదు..
-
సూర్యాపేటలో బీసీ మీటింగ్ పెట్టనివ్వలేదు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సొంత పార్టీకి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ నేత వి. హనుమంతరావు ధ్వజమెత్తారు. తాను అంబర్‌పేట నియో జకవర్గం నుంచే గతంలో గెలిచి మంత్రిని అయ్యానని, ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడ్డానని, తాను అక్కడ లక్ష్మణ్‌యాదవ్‌కు టికెట్ అడుగుతుంటే ఉత్తమ్ కుమార్‌రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని ఆదివారం హైదరాబాద్‌లోని తన నివా సంలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. శ్రీకాంత్‌గౌడ్ అనే వ్యక్తి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడని, ఆయన్ని ప్రోత్సహిస్తూ తనపై ఉత్తమ్ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సూర్యాపేటలో బీసీ గర్జన సభ పెడతానని అంటే ఉత్తమ్ పెట్టనీయలేదని, ఆయనకు బీసీ ఓట్లు కావాలి కానీ, బీసీల మీటింగ్ వద్దా అని ప్రశ్నించారు. తన మనుషులైన మహేశ్వర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డిలను పార్టీ నుంచి బయటకు పంపింది ఉత్తమేనని ఆరోపించారు. పార్టీ మారుతున్నానని ప్రచారం చేసుకుని, బ్లాక్మెయిల్ చేసి ఉత్తమ్ స్క్రీనింగ్ కమిటీ లాంటి పదవులు తెచ్చుకున్నాడని విమర్శించారు. అంబర్‌పేట సీటు జోలికొస్తే ఉత్తమ్ వెంటపడుతానని హెచ్చరించారు. పార్టీ నుంచి చాలా మందిని బయటకు వెళ్లేలా చేసిన ఉత్తమ్ తనను కూడా పంపాలని కుట్ర పన్నుతున్నాడని, తాను గాంధీ కుటుంబానికి విధేయుడినని వీహెచ్ స్పష్టం చేశారు. -
విడివిడిగా.. కూలంకషంగా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమావేశమయ్యారు. గాందీభవన్‌లో సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ఈ భేటీలు కొనసాగాయి. ప్రతి నాయకుడితో వేర్వేరుగా 10 నిమిషాలకు పైగా మాట్లా డిన మురళీధరన్, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అభిప్రాయ సేకరణ చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను, మీ నాన్న ఫ్రెండ్స్: పొన్నాల మురళీధరన్‌ను కలిసిన సందర్భంగా ఆయన తండ్రి, కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పొన్నాల గుర్తు చేసుకున్నారు. తాను మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేరళతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రుణం తీసుకువచ్చామని, ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లో రొయ్యల పరిశ్రమ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. పార్టీలో పరిస్థితులు, టికెట్ల ఖరారులో పాటించాల్సిన సామాజిక సమతుల్యత గురించి వారు చర్చించినట్టు సమాచారం. బీసీలకు టికెట్ల కేటాయింపులో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై వీహెచ్ చర్చించినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సిద్దిఖీ కూడా సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ భేటీల్లో పాల్గొనగా, మరో సభ్యుడు, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కోర్టు కేసుల కారణంగా రాలేకపోయారని, మంగళవారం వస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. జగ్గారెడ్డి లేఖ: పీసీసీ మాజీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పంచాలని, పార్టీ అనుబంధ సంఘాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని మురళీధరన్‌ను జగ్గారెడ్డి కోరారు. టికెట్ల కేటాయింపు విషయంలోనూ పీసీసీ మాజీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ లేఖ ఇచ్చారు. నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం టీïపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నమ్మకం నిలబెట్టుకుంటాం: రేవంత్ ట్వీట్ సీడబ్ల్యూసీ తొలి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అంగీకరించిన పార్టీ అధిష్టానానికి రేవంత్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సమావేశాలను విజయవంతం చేస్తామంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీసీలు ఎందుకు గెలవడం లేదు? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పాటించాల్సిన సామాజిక సమతుల్యతపై ఈ భేటీల్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. 1989 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో 50 శాతం సీట్లు ఎప్పుడూ రాలేదని, ఇందుకు కాంగ్రెస్ పార్టీని వెనుకబడిన వర్గాలు అక్కున చేర్చుకోకపోవడమే కారణమని కొందరు వివరించారు. తొలుత తెలుగుదేశం, ఆ తర్వాత బీఆర్ఎస్ వైపు బీసీలు మొగ్గుచూపుతున్నారని, అత్యధిక సంఖ్యలో ఉండే బీసీల హృదయాల్లో చోటు సాధించని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవుతోందని చెప్పారు. దీంతో ‘బీసీలకు సీట్లు ఇస్తే ఎందుకు గెలవడం లేదు?’అని మురళీధరన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా ఓ ముఖ్య నాయకుడు బదులిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోనే అలా జరుగుతోందని, మిగిలిన పార్టీల నుంచి బీసీ నేతలు గెలుస్తున్నారని, ఇందుకు కారణం ఏంటనేది సమీక్షించుకోవాల్సింది పార్టీయేనని చెప్పినట్టు సమాచారం. ఇక రెడ్డి సామాజిక వర్గంలోని గ్రూపు గొడవలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయని ఓ నేత వివరించినట్టు సమాచారం. కర్ణాటకలోని లింగాయత్‌లు, గౌడ సామాజిక వర్గ నేతలు ఐక్యంగా ఉండి అక్కడ అధికారాన్ని దక్కించుకోవడాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలను విన్న మురళీధరన్ ‘ఏం జరుగుతుందో వేచి చూద్దాం.’అంటూ బదులివ్వడం గమనార్హం. -
మల్కాజిగిరి నియోజకవర్గానికి పాలకుడు ఎవరు?
మల్కాజిగిరి నియోజకవర్గం మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మైనంపల్లి హనుమంతరావు ఘన విజయం సాదించారు. గతంలో ఆయన ఒకసారి రామాయంపేట ఉప ఎన్నికలోను, ఆ తర్వాత మెదక్ నుంచి అసెంబ్లీకి టిడిపి పక్షాన గెలిచారు. 2014 లో టిఆర్ఎస్ లో చేరి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు.ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. 2018 ఎన్నికలలో అసెంబ్లీకి మల్కాజిగిరి నుంచి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావుపై 73698 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇక్కడ నుంచి తెలంగాణ జనసమితి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ కు 34 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ జనసమితి మహాకూటమిలో భాగంగా ఉంది.మైనంపల్లి హనుమంతరావుకు 114149 ఓట్లు రాగా, రామచంద్రరావుకు 40451 ఓట్లు వచ్చాయి. హనుమంతరావు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. రామచంద్రరావు 2014లో కూడా బిజెపి తరపున పోటీచేసి ఓటమి చెందారు. అప్పుడు టిడిపితో పొత్తుతో పోటీచేయగా, ఈసారి ఒంటరిగా నిలబడిరది. 2014 ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ది కనకారెడ్డి విజయం సాధించారు. కనకారెడ్డికి 2768 ఓట్ల ఆదిక్యత వచ్చింది. 2009 నుంచి ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఒక వెలమ, ఒక రెడ్డి, ఒక బిసి నేత(మున్నూరు కాపు) విజయం సాధించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
యాంకర్ తో వీహెచ్ సరదా ముచ్చట్లు
-
నా పేరు వీ హనుమంతరావు కాదంతే.! వీహెచ్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, సంగారెడ్డి: గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో ఓబీసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తానంటున్నారు.. నువ్వెందుకు వేస్తావు.. బంగళాఖాతంలో నిన్నే జనం వేస్తారు’’ అంటూ మండిపడ్డారు. ‘‘దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది. పప్పు అన్న మా రాహుల్ పప్పా అయ్యాడు...మీ బాబై కూర్చున్నాడు. ఈ సారి ప్రధాని రాహుల్ అవుతాడు.. లేకుంటే నా పేరు హనుమంతరావు కాదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆదాని, మోదీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు’’ అంటూ వీహెచ్ దుయ్యబట్టారు. ‘‘మా దగ్గర ఉంటే అవినీతి పరులు.. బీజేపీలో చేరితే సత్యహరిశ్చంద్రులు. త్వరలోనే బీసీ గర్జన పెడుతున్నాం. అందుకు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ ఒప్పుకున్నారు. అగ్ర కులాలకే కాదు రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుంది. అగ్రకులాల వాళ్లు ఓబీసీలను అణగదొక్కుతున్నారు. రాహుల్ జోడో యాత్రలో అన్ని వర్గాల వారిని కలిశారు. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారు. ఫస్ట్ 20 శాతం తెచ్చుకుందాం.. ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. నేనెవ్వరికి వ్యతిరేకం కాదు.. మా హక్కుల కోసం మేం పోరాడుతున్నాం.. ఫైనల్‌గా సోనియా, రాహుల్ గాంధీ మాటా వింటాను’’ అని వీహెచ్ చెప్పారు. చదవండి: టీ కాంగ్రెస్ ఎన్నికల యాక్షన్ ప్లానేంటి? కోమటిరెడ్డి నివాసంలో ఏం జరిగింది? ‘‘ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పి రైతులను జైల్లో వేయిస్తున్నాడు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి సహాయం చేస్తావ్. పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య చిన్న చిన్న గోడవలున్నాయి. సీనియర్ మీద జూనియర్ పెత్తనం చెలాయిస్తా అంటే ఉరుకుంటారా..?. మా పార్టీలో లొల్లి కూడా అంతే’’ అంటూ వీహెచ్ వ్యాఖ్యానించారు. -
సంబంధం లేని ప్రకటన.. కాంగ్రెస్ లో అంతే
-
టీడీపీకి దెబ్బ మీద దెబ్బ: మాజీమంత్రి గుడ్ బై
మంగళగిరి: వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలు భేషుగ్గా ఉన్నాయని, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని మాజీ మంత్రి, ఆప్కో మాజీ చైర్మన్ మురుగుడు హనుమంతరావు ప్రశంసించారు. టీడీపీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసి, మాజీ సీఎం చంద్రబాబుకు లేఖ పంపిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. టీడీపీలో తనకు గుర్తింపు లేదని, 2019 ఎన్నికల్లో తన కుటుంబానికి టికెట్ ఇస్తానని చెప్పి చివరకు లోకేశ్‌ను రంగంలోకి దింపి పార్టీ అధిష్టానం తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు, మాజీ ఇన్చార్జ్ పెత్తనంతో ఇతర కులాలన్నింటినీ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం పార్టీలో చంద్రబాబు సామాజికవర్గానికి తప్ప మిగతా ఏ కులానికీ ప్రాధాన్యం లేదన్న విషయాన్ని తాను గుర్తించానని, ఆ సామాజికవర్గం వారు తప్ప ఇతర ఏ కులాలూ ఇమడలేవని ఓ సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా తాను స్పష్టంగా చెబుతున్నానన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే.. అభివృద్ధి పనులను వేగవంతంగా చేస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ తనకు రాజకీయ జీవితాన్నిచ్చారని, ఆయన కుటుంబంపై తనకు ఎంతో ప్రేమ ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని మురుగుడు స్పష్టం చేశారు. -
రేవంత్‌రెడ్డిని మాత్రం కానివ్వను..
రేవంత్‌రెడ్డిని ప్రెసిడెంట్‌ని చేస్తారని మళ్లీ ఓ బ్రేకింగ్. రెండు రోజులుగా టీవీల్లో ఆ బ్రేకింగ్ వినిపిస్తూనే ఉంది. బ్రేకే రావడం లేదు. మీరుండగా, కోమటిరెడ్డి ఉండగా, భట్టి విక్రమార్క ఉండగా, శ్రీధర్‌బాబు ఉండగా, జీవన్‌రెడ్డి ఉండగా, పొన్నం ప్రభాకర్ ఉండగా, మధు యాష్కీ ఉండగా.. టీడీపీని ముంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌ని చెయ్యడం ఏమిటని టీవీ చానెళ్ల వాళ్లు మైకులు, వ్యాన్లు వేసుకొచ్చి బాధగా మా ఇంటి బయట అరుగు మీద కూర్చున్నారు. నేనూ బయటికే కనిపించేలా ఇంటి లోపల కూర్చొని ఉన్నాను. కొద్దిసేపు అలా కూర్చున్నాక.. దారిన పోయేవాళ్లు నన్ను, మీడియాను కలిపి చూసుకుంటూ వెళ్తున్నట్లు అనిపించి పడక్కుర్చీలోంచి కుర్చీలోకి మారాను. ‘‘హనుమంతరావు గారూ.. మీకేం వయసైపోయిందని.. మీరుండగా, కోమటి రెడ్డి ఉండగా, భట్టి విక్రమార్క ఉండగా..’’ అని మళ్లీ మొదలు పెట్టారు! ‘‘ఇదిగో బాబూ.. నేనేమీ అనుకోను గానీ, ‘మీరుండగా..’ అని అనడానికి మీరేమీ కష్టపడకండి. నేను కాకుండా మిగతావాళ్లలో ఎవరు ప్రెసిడెంట్ అయినా నేనేమీ అనుకోను. రేవంత్‌రెడ్డిని మాత్రం కానివ్వను’’ అన్నాను. ‘‘ఒకవేళ అయితే?’’ అని గుంపులోంచి ఎవరో అన్నారు. అతడి వైపు చూశాను. ‘కానివ్వను’ అని నేను అంటుంటే, ‘ఒకవేళ అయితే’ అని అంటున్నాడు! ‘‘నువ్వుగానీ సోనియాజీతో మాట్లాడి రేవంత్‌రెడ్డిని ప్రెసిడెంట్‌ని చేయబోతున్నావా?’’ అని అడిగాను. అతడు మళ్లీ మాట్లాడలేదు. సమర్థుడు కాని వారెవరినీ కాంగ్రెస్ చేరనివ్వదు. సమర్థులైనవారిని చేరదీసేందుకు తొందరపడదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొందరపడి వెళ్లిపోయాడు కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం అని ఉత్తమ్‌ని గానీ, నన్ను గానీ, తక్కిన సీనియర్లను గానీ కాంగ్రెస్ అడిగిందా?! రాహుల్ అడిగాడా, సోనియా అడిగారా, గులామ్ నబీ ఆజాద్ అడిగారా? నిజానికి వీళ్లంతా అడగవలసిన బాధ్యత ఉన్నవాళ్లు. మోదీని అడుగుతారు. మోదీని అడగమని రాష్ట్రపతిని అడుగుతారు. సొంత పార్టీలోని వాళ్లను మాత్రం ఒక్క మాటా అడగరు. కాంగ్రెస్‌లో ఉండే పద్ధతీ పెద్దరికమే ఇది. నిలబడి నీళ్లు తాగడం మేలనుకుంటుంది. అప్పటికీ తాగదు. పరుగెత్తడం లేదు కదా, తాగడం ఎందుకు అనుకుంటుంది! నాకైతే నమ్మకం. టీపీసీసీ పోస్టును ఇప్పట్లో కాంగ్రెస్ ఎవరికీ ఇవ్వదు. ప్రధాని కొన్ని కేబినెట్ పోస్టుల్ని దగ్గర పెట్టుకున్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం పార్టీ ప్రెసిడెంట్ పోస్టులను బూజు పట్టేవరకు తన దగ్గరే ఉంచుకుంటుంది. పార్టీ ఓడిపోడానికి, పార్టీ ప్రెసిడెంటుకు సంబంధం లేదని కాంగ్రెస్ నమ్ముతుంది కనుక పార్టీని గెలిపించడం కోసమైతే మాత్రం పార్టీ ప్రెసిడెంటును నియమించదు. పార్టీ ఓడిపోయిందని పార్టీ అధ్యక్షుల్ని తొలగించదు. రాహుల్ అయినా, ఉత్తమ్ అయినా ఓటమి బాధ్యతను వాళ్ల భుజాన వాళ్లు వేసుకుని వెళ్లిపోవడమే. కాంగ్రెస్ ఏం చేస్తుందో ఏం చెయ్యదో ఊహించడం కూడా కష్టమే. పార్టీని గెలిపించలేకపోయిన వాళ్లను ఎంపిక చేసుకుని మరీ అధ్యక్షుడిని చేసినా చేస్తుంది! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి నలభై ఎనిమిది డివిజన్లకు ఇన్చార్జిగా ఉన్నాడు. బీజేపీకీ సరిగ్గా నలభై ఎనిమిది సీట్లొచ్చాయి. కాంగ్రెస్‌కు రెండంటే రెండే. పెరగలేదు. తగ్గలేదు. అందుకు రేవంత్‌రెడ్డి కారణం కాదనుకుంటే కనుక రేవంత్‌ని ప్రెసిడెంట్‌ని చెయ్యడానికి కాంగ్రెస్‌కి కారణం ఉండదు. మీడియా వాళ్లకు బ్రేకింగ్ ఏదో వచ్చినట్లుంది! సరంజామా సర్దుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి దగ్గరకే కావచ్చు. వర్క్ లేకున్నా ప్రెసిడెంట్లు అయ్యే వర్కింగ్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్‌లోనే ఉంటారు. మాధవ్ శింగరాజు -
భారత్ బంద్: ఆ అదృష్టం ఎవరికి రాదు.. కానీ..
సాక్షి, సిద్దిపేట: రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని నేడు రైతులు భారత్ బంద్‌కు పెలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రైతులు దేశవ్యాప్తంగా నిరసన, ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతారావ్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు రైతులకు మద్దతు తెలుపుతూ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కండువాలు మోసి పార్టీకి సేవ చేసన నాయకులను కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన రాములమ్మను స్టార్ క్యాంపైనర్‌గా బాధ్యతలు ఇచ్చామన్నారు. ఆ అదృష్టం ఎవరికి రాదని, కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్‌లు ఉన్నారని, పార్టీ వదిలిపెట్టినప్పుడు మీకు తెలిసిందా? అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకునేంతవరకు కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్దమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు వలన కార్పొరేట్ వ్యవస్థలకు లాభమే కానీ రైతుకు మాత్రం ఉరిశిక్ష వేసినట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. -
‘పాతబస్తీలో బంకర్లు ఉన్నాయా?’
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు హిందూ-ముస్లిం ఎజెండాగా మారుతున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు. సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన లేకపోవడం బాధాకరం అన్నారు. అనంతరం వీహెచ్ గ్రేటర్ వార్‌పై మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడ చూసిన కేటీఆర్, కేసీఆర్ ఫోటోలే కనిపిస్తున్నాయి. బండి సంజయ్ ఒక అడుగు ముందుకు వేసి సర్జికల్ స్ట్రైక్ అంటున్నాడు..ఆయనకు ఎలా తెలిసింది?. అక్బరుద్దీన్ కేవలం ముస్లిం ఓట్ల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మతం ముసుగులో ప్రజలని రెచ్చగొడుతున్నారు. ప్రశాంత వాతావరణం ఉన్న హైదరాబాద్‌లో ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ముస్లింలకు న్యాయం చేయలేదు. పాతబస్తీలో బంకర్స్, ట్యాంకర్లు ఉన్నాయా అని వీహెచ్ ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. (ఆమె ముస్లిం కాదు : ఒవైసీ) ‘ఎవరి మాటలు వారు మాట్లాడుతున్నారు.. ఇలాంటి వారిని నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాను. ఒక దుబ్బాక లో గెలిచినంత మాత్రాన పొంగి పోవద్దు. మేము చేసిన చిన్న పొరపాటు వల్ల తప్పిదం జరిగింది. ఎవరు మా పార్టీ నుంచి వెళ్లినా నష్టం లేదు. రక్తపాతం చేసి ఓట్లు తీసుకోవాలని బండి చూస్తున్నారు.. మహారాష్ట్ర, బీహార్ వెళ్లినవ్ ఎవరికి లాభం చేశావు అసద్’ అని వీహెచ్ ప్రశ్నించారు -
భలే 'మామయ్య'
అనుకున్న పని వొక్కటీ కాలేదు. కాని యీ ఊరుకాని ఊళ్లో కాలక్షేపం ఎలా? ఇంత పెద్ద పట్టణంలో యెవరో ఒక స్నేహితుడు ఉండిఉండొచ్చు; కాని ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. సామాను హోటల్లో పడేశాను. ఊరు కొత్తదైనా– పట్టణమైనా ఇంతకన్నా గొప్ప పట్టణాల్నే చూసిన నాకు దీని ప్రత్యేకత యేమీ కనిపించలేదు. తిరిగిన బజారే తిరుగుతూ గడిపాను. కొంతసేపు రైల్వేస్టేషనులో కూర్చున్నాను. వొచ్చే జనమూ, పొయ్యే జనమూ ఆకర్షించలేదు: కొత్తదనమేది కనిపించకపోతే– కనిపించలేదే అనే మరో కొత్త బాధ. కనిపించాక దాన్ని భరించగలమో లేమో అది వేరే విషయం! సినిమా మంచిది కాదని తెలుసు. అంతకన్నా గత్యంతరం లేదు. వెళ్లి కొత్తగా తలకాయ నెప్పిని తెచ్చుకోవటమా, మానటమా అనే సమస్య తెగక, హాలు దగ్గరే తారాట్లాడసాగాను. ‘‘ఎప్పుడూ రావటం?’’ ఎంతో పరిచయాన్ని సూచించే కంఠస్వరం వెనుక నుంచి వినవొచ్చింది. మనిషిని ముసలివాడుగానే చెప్పవొచ్చు. ముఖకళలో ఎంతో ఆత్రుత, మాధుర్యం, తను పోగొట్టుకుని ఇక దొరకదని నిరాశ చేసుకున్న విలువైన వస్తువేదో హఠాత్తుగా కనిపించినప్పుడు కలిగే ఆనందం లాంటిదాన్ని నేను గుర్తించాను. బహుశా నేనెవర్నో తెలిసి ఉండితీరాలి. నాకు మాత్రం ముఖం ఎక్కడా చూసిన జ్ఞాపకం రావటం లేదు. నా చిన్నతనంలో నన్ను యెరిగివుంటాడు. మా కుటుంబంతో పరిచయం వుండివుండొచ్చు. నిజానికి మా బంధువు లందర్నీ నేను యెరుగను. కనుక ఆ అనుభవంతోటే సంభాషణను నడపగలిగే చాకచక్యం నాకు వున్నదని వేరే చెప్పాలా? అన్నాను: ‘‘వుదయానే వొచ్చాను.’’ ‘‘ఇంటికన్నా రాలేదే?’’ ఈయన యెవరో నిర్ధారణగానన్నా తెలియదు. ఈయన ఇంటి సంగతి నాకెలా తెలుస్తుంది? ‘‘ఏం లేదు... వేరే పనివుండి...’’ అని నీళ్లు నమిలాను. ‘‘మనసులో వుండాలి కాని, పనులు అడ్డం వొస్తయ్యా?... రా పోదాం.’’ నేనేమీ మాట్లాడకుండా ఆయన వెనకాలే నడవసాగాను. యీయన యెవరో తెలుసుకోవటం యెట్లాగా? ‘‘అందరూ కులాసా?’’ అన్నాడు. ‘‘ఆ’’ అన్నాను. ఆ ‘అందరూ’ అనే పదంలో యెందరు వున్నారో కూడా ఊహించకుండానే. సందుల్లోంచి తీసుకు వెళ్తున్నాడు– ఆ పెద్దమనిషి ముఖం చూస్తే అపకారాన్ని చేసే చిహ్నాలు కనిపించటం లేదు. ‘‘రండి’’ అన్నాడు ఇంట్లోకి జొరబడుతూ. మధ్య తరగతి ఇల్లు. శుభ్రంగా వుంది. నన్ను సావిట్లో కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. ఐదు నిమిషాల తర్వాత పదేళ్ల పిల్ల కాఫీ పట్టుకొచ్చింది. అందిస్తూ నా మొహంలోకి తేరిపార చూచింది– నేను అవునా కాదా అన్నట్టు. వెళ్తూ వెళ్తూ ‘బావగారే’ అనుకుంది తనలో– నాకు వినిపించేటంత మెల్లిగా! ముసలాయన వొచ్చాడు. గది గుమ్మంలోంచి రెండు స్త్రీ మొహాలు రహస్యంగా తొంగిచూస్తున్నవి. ఒక ముసలామె, యీ ముసలాడికి భార్య అయివుండొచ్చు; ఆమె వెనుకాల పద్దెనిమిదేళ్ల నవజవ్వని. వీళ్లెవరిగోలా నాకు పట్టలేదు. ఆ యువతి! నన్నా విధంగా చూసినందుకే నా గొప్పతనమంతా ఇప్పుడే బైటపడ్డట్టు ఉప్పొంగిపొయ్యాను. ‘‘ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాము. ఇలాటి శుభ గడియలు జీవితంలో ఉండవేమోననే నిరాశ కూడా ఒకప్పుడు కలగకపోలేదు...’’ అని ముసలాడు నా మొహంలోకి చూశాడు. నన్ను ఉద్దేశించిన మాటలే అయినా, నాకు అర్థం కానందువల్ల పరధ్యానంలో వున్నట్టు తల వొంచేశాను. ‘‘పిల్లా తల్లీ కూడా ఏకధారగా ఏడ్చారనుకో. ఏమనుకొని ఏం లాభం? ఎవరి తప్పని కూడా విచారించటం అనవసర మనిపించింది. తప్పు యెవరిదైనా దాని ఫలితం దానికి ఇచ్చుకున్న జరిమానా ఒక పండంటి కాపురం.’’ ఎలా అర్థం చేసుకునేది యీ మాటల్ని? ముసలాడు మళ్లీ సాగించాడు: ‘‘నిజానికి వెధవ గొలుసు... ఏం అది లేకపోతే? సంసారానికి అది అడ్డమా? యీమాత్రం ఆలోచన వుంటే అది నీతో పోట్లాడుతుందీ? పోనీ నువ్వు మాత్రం– ఏదో సరదా పడి అడిగింది కదా అని ముచ్చట తీర్చకూడదూ? మరీ తిండికీ గుడ్డకూ మొహం వాచినవాళ్లు కాదుగా? సంవత్సరం నుంచీ యెడమొగం పెడమొగం!’’ ముసలాడి లెక్చర్ పూర్తయి, మంచినీళ్ల కోసం ఆజ్ఞాపించాడు. ఇప్పుడు కాస్త తలకెక్కింది. ఈయన అల్లుడు ఈయన అమ్మాయితో పోట్లాడటం వల్ల సంవత్సరం నుంచీ పుట్టింట్లోనే ఉండిపోయింది. యీ పోట్లాటకు కారణం గొలుసు చేయించమని ఆమె అడగటం, అల్లుడు కాదనటమూను. పోతే ఆ అల్లుడు నాలాగే ఉంటాడు కాబోలు. కనుక, వెంటనే ఆయన పొరపాటును చెప్పి ఇక్కణ్నుంచి తప్పుకోవటం అత్యుత్తమం. మంచినీళ్ల గ్లాసుతో ఆ యువతి ప్రవేశించింది. నేను అక్కడే ఉన్నట్లు ఇప్పుడే చూసినట్టు నా ముఖంలోకి చూసి, ఎంతో సిగ్గుపడి ఆ గ్లాసుతో ముందుకు పోవటమా లేక వెనక్కు తగ్గటమా అని ఆలోచిస్తూన్నట్టు తోచింది. ‘‘సిగ్గేమిటే? మీ ఆయనేనే!’’ అన్నాడు ముసలాడు. ముసిముసి నవ్వుల్తో ముసలాడికి గ్లాసు అందించింది. ఇలాంటి అపురూపవతిని ఏ కఠిన హృదయుడు కష్టాలపాలు చేసివుంటాడు? యీ క్షణంలో ‘‘నేను మీరు అనుకునే వ్యక్తిని కాను’’ అని చెపితే యీమె కొయ్యబారవొచ్చు. ఇంతమందీ నన్ను ఇంటి అల్లుడుగానే నమ్మారు. ‘‘నేను నేనే’’ అని రుజూ చేసుకునేందుకు తాతలు దిగిరావాలి. నా పనల్లా అన్నిటికీ మౌనంగా కూర్చోవటమే. మిగతా పనులల్లా వాటంతటవే జరుగుతవి. అనుకున్నట్టే అల్లుడికి జరగాల్సిన మర్యాదల్లో ఏ లోటూ లేకుండానే జరిగింది. చచ్చి స్వర్గానికి పోయి పొందదగ్గ సౌఖ్యం ఏదన్నావుంటే– అదంతా చవిచూశాను. మాటల్నీ, లాలననూ పట్టి చూస్తే యెంత అమాయకురాలో ననిపించింది. ఆ దౌర్భాగ్యుడైన భర్త మీద నిజంగా జాలివేసింది. యెన్నాళ్లయినా ఇక్కడే ఉందామా అనిపించింది. మర్నాటి వుదయం నిద్ర లేచేప్పటికి కాఫీ వుప్మాలు సిద్ధంగా వున్నవి. స్వర్గంలో మాత్రం ఇంతకన్న ఎక్కువ వుండేడుస్తుందా? బైటికి వెళ్లబుద్ధి కాలేదు. ఇంట్లో బాధపడలేక బైటికి వెళ్లవలసిన అవసరం ఇంకా కలగలేదు. ఇలాగే ఐదు రోజులు గడిచిపోయినవి. కాలం సాగినకొద్దీ నాలో భయం ఎక్కువవసాగింది. వాళ్లు వెళ్లమనరు– కానీ యీ వ్యవహారం చాలాదూరం వెళ్లేట్టుగా వుంది. నేను వెళ్లేప్పుడు ఆమె కూడా నా వెంటపడితే? అసలు బండారమంతా అప్పుడు బైటపడక మానదాయె. మెల్లిగా కదలేశాను. ‘‘రేపు నేను వెళ్తాను’’ అన్నాను ఆమెతో.‘‘ఎక్కడికీ! నన్ను కూడా తీసుకు వెళ్లండి.’’‘‘నేను వెళ్లి ఉత్తరం రాస్తాను. మీ నాన్న తీసుకొచ్చి దిగపెడతాడులే!’’‘‘ఊహు. నన్ను తీసుకువెళ్లకపోతే చంపుకున్నట్టే!’’ ఎంత బతిమాలి చెప్పినా ఇదే వరస. ఇంకో వుపాయం ఆలోచించాను. సామాన్యంగా స్త్రీలను నగలతో మభ్యపెట్టవొచ్చు. ఇన్నాళ్లుగా ఆమెను బాధపెట్టిన ఆ గొలుసు కనక చేయించి ఇస్తే ఆమెకు ఎంతో తృప్తి కలుగుతుంది. పిల్లాడికి తినుబండారమేదో ఇచ్చి మాయపుచ్చినట్టు యీమె మనసును కూడా వేరే తోవలోకి నెట్టి నేను బైటపడదామనే నిశ్చయానికి వొచ్చాను. మర్నాడు గొలుసు సంగతి ఎత్తేప్పటికి బుంగమూతి పెట్టి ‘‘పోనీండి– మళ్లీ ఆ సంగతి దేనికి?’’ అంది. ‘‘అది కాదు... గొలుసు చేయించుకో. ఇదుగో పైకం’’ ఐదు వందల రూపాయల కాగితాలు ఇచ్చాను. ఇంత ధరా అనే అనుమానం నాకు కలగలేదు. ఆమె ముఖం వికసించటంతో నాకు ఎంతో రిలీఫ్ కలిగింది. ‘‘యీ మధ్యాహ్నం బండికి నేను వెళ్తాను. మళ్లీ ఐదారు రోజుల్లో వొచ్చి నిన్ను తీసుకెళ్తాను. అప్పటికి యీ బోసిమెడలో గొలుసు కూడా వుంటుందిగా!’’ అని ఊరడించి బైటపడ్డాను. స్నేహితుణ్ని వెతికాను. సాయంత్రం దాకా వాడితో ఉండి రాత్రిబండికి పోదామని నిశ్చయం. ఆ ముసలాడు ఎక్కడ యెదురౌతాడో నని భయంగానే వుంది. ఆ సాయంత్రం కాఫీ హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మావాడి స్నేహితులు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. హఠాత్తుగా ఒకడు ‘‘అడుగో మామయ్య అల్లుణ్ని తీసుకొని వెళ్తున్నాడు!’’ అన్నాడు. తిరిగి చూద్దును కదా– ముసలాడు! ‘‘ఎవరూ?’’ అన్నాను. ‘‘ఆ ముసలాడు అఖండుడు. కొత్త మొహం ఊళ్లో కనిపిస్తే– కాస్త జల్సారాయుడిగా ఉంటే చాలు తన అల్లుడని భ్రమించినట్టు యెత్తువేసి ఇంటికి తీసుకువెళ్తాడు.’’ ముసలాడు యువకుడితో మేము కూర్చున్న హోటల్‌కే వొచ్చాడు. నన్నెక్కడ చూస్తాడోనని భయపడి చస్తున్నాను. చూడనే చూశాడు– నన్నెప్పుడూ చూడనట్టే ఊరుకున్నాడు. ఇక జీవితంలో ఆ వూరు వెళ్లదల్చుకోలేదు. ధనికొండ హనుమంతరావు (1919–1989) కథ ‘మామయ్య’కు సంక్షిప్త రూపం ఇది. ఈ సరదా కథ సౌజన్యం: కథానిలయం. క్రాంతి పబ్లికేషన్స్, క్రాంతి ప్రెస్సుల స్థాపకుడు ధనికొండ. అభిసారిక పత్రిక వ్యవస్థాపకుడు. నవలలు, నాటకాలు, కథలు విస్తృతంగా రాశాడు. అనువాదాలు చేశాడు. ఇంద్రజిత్ కలంపేరుతోనూ రాశాడు. గుడ్డివాడు, మగువ మనసు, జగదేక సుందరి, క్లియోపాత్రా ఆయన రచనల్లో కొన్ని. - ధనికొండ హనుమంతరావు -
కుమార్తెలే..కుమారులై!
ప్రకాశం, పర్చూరు: ఇద్దరూ ఆడ బిడ్డలే.. అయితేనేం ఆ తండ్రి వారిని రెండు కళ్లనుకున్నారు. ఏ బిడ్డకు చిన్న కష్టమొచ్చినా తట్టుకునే వాడు కాదు. చిన్న తనంలో ఆడుకుంటూ బిడ్డలకు ఎదురుదెబ్బ తగిలితే ఆయన విలవిల్లాడిపోయేవారు. ‘హనుమంతురావు ఇద్దరూ ఆడపిల్లలే కదరా..అని ఎవరైనా అంటే’..అయితేనేం రా..అంటూ గట్టిగా సమాధానం చెప్పేవారు. ఇలా తండ్రి ప్రేమను నిండుగా కలిగిన ఆ కుమార్తెలు.. పెరిగేకొద్దీ ఆయన ఆకాంక్షలు గుర్తించారు. నాన్న కలలను రూపమిస్తూ ఇద్దరూ విద్యావంతులై ఆయన కళ్లలో ఆనందబాష్పాలు నింపారు. వృద్ధాప్యంలోకి వెళ్లిన ఆ తండ్రి ఊపిరి సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు అర్ధంతరంగా ఆగిపోయింది. కర్మకాండలు పూర్తి చేయాలంటే వారసుడు లేరే అంటూ బంధువులు నసుగుతున్నారు. ఆ సమయంలో తండ్రిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కన్న బిడ్డలిద్దరూ ముందుకొచ్చారు. తండ్రికి తామే అంత్యక్రియలు చేస్తామంటూ నడుం కట్టారు. శ్మశాన వాటికలో తండ్రికి తలకొరివి పెడుతున్న కుమార్తె స్పందన ఒక్కొక్క అడుగు పడే కొద్దీ తమను గుండెలపై పెట్టుకుని పెంచిన నాన్న జ్ఞాపకాలు కన్నీటి బొట్లయి రాలుతుండగా.. కుమార్తెలిద్దరూ ఆయన మృతదేహంతో నడిచారు. చివరకు తండ్రికి తలకొరివి పెట్టుకుని జన్మనిచ్చిన రుణం తీర్చుకున్నారు. కొడుకులైనా, కుమార్తెలైనా తల్లిదండ్రుల కన్నపేగు మమకారాన్ని మరువకూడదనే సత్యాన్ని చాటి చెప్పారు. వివరాలు.. పర్చూరు జూనియర్ కళాశాలలో ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందిన అడపాల హనుమంతురావు (64) సోమవారం తన స్వగృహంలో మృతి చెందాడు. ఆయనకు సృజన, స్పందన ఇద్దరు కుమార్తెలు. వీరిని తల్లిదండ్రులు వామపక్ష భావజాలంతో పెంచారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె సృజన వివాహమై యూఎస్ఏలో ఉంటుండగా చిన్న కుమార్తె స్పందన ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకుంటున్నది. తండ్రి మరణవార్త విని ఇద్దరూ పర్చూరుకు చేరుకున్నారు. తండ్రికి తలకొరివి పెట్టేందుకు కొడుకుల లేకపోవడంతో తలకొరివి పెట్టడానికి కుమార్తెలు ముందుకొచ్చారు. పెద్ద కుమార్తె దహనక్రియకు ఉపయోగించే నిప్పుల కుంపటి పట్టుకోగా చిన్న కుమార్తె స్పందన పిండం పట్టుకొని తండ్రి పాడె వెంట నడిచారు. అనంతరం స్థానిక శ్మాశాన వాటికలో హనుమంతురావు భౌతిక కాయాన్ని కట్టెల పాడెపై ఉంచగా చిన్న కుమార్తె స్పందన తన తండ్రికి తలకొరివి పెట్టి కొడుకు లేని లోటును తీర్చుతూ తండ్రి రుణం తీర్చుకుంది. -
ఉత్తమ కలెక్టర్‌గా ఎం.హనుమంతరావు
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. దివ్యాంగులకు అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ప్రభుత్వం ఆయనను ‘ఉత్తమ కలెక్టర్’అవార్డుకు ఎంపిక చేసింది. మంగళవారం ఆయన ఈ అవార్డును హైదరాబాద్‌లో అందుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని సోమవారం ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంలో కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక చొరవ చూపించారు. వీల్‌చైర్స్ సమకూర్చడం, కళ్లులేని వారిని, నడవలేని వారిని ఇంటి నుంచే సిబ్బందితో పోలింగ్ కేంద్రానికి తీసుకురావడం, ఓటు వేసిన తరువాత మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టడం, పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వారికి సిబ్బంది సహాయంగా ఉండడం లాంటి చర్యలను ఆయన చేపట్టారు. దివ్యాంగుల ఆర్థిక ప్రగతికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేశారు. అలాగే బ్యాటరీతో నడిచే వాహనాలు, వీల్చైర్ల పంపిణీ, ప్రజావాణిలో వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, డివిజన్ స్థాయిల్లో కూడా వారికి ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సేవలను గుర్తించి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఆయనను ఉత్తమ కలెక్టర్‌గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. -
కాస్త ఇసుక ఉంటే ఇస్తారా..! : కలెక్టర్
‘‘మీ జిల్లాలోని ఇసుక క్వారీల నుంచి కాస్త ఇసుక ఇవ్వండి..’’ – ఇది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హన్మంతరావు పక్షం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావుకు రాసిన లేఖ సారాంశం. ‘‘ఇక్కడ ఇసుక అందుబాటులో లేదు.. మా జిల్లా నుంచి ఇసుక ఇవ్వడం వీలు కావడం లేదు..’’ – ఇది జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు ప్రత్యుత్తరం..? సాక్షి, నిజామాబాద్: సంగారెడ్డి జిల్లా పరిధిలో నల్లవాగు ప్రాజెక్టు ఉంది. మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. అయితే ఈ పనులు చేపట్టాలంటే ఆ జిల్లాలో ఇసుక అందుబాటులో లేదు. దీంతో అక్కడి కలెక్టర్ హన్మంతరావు మన జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావుకు పక్షం రోజుల క్రితం లేఖ రాశారు. కోటగిరి మండలం పరిధిలోని కుమ్మరివాగు నుంచి ఇసుక తోడుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మొత్తం 9,500 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని రాశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎంరావు స్పందిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని భూగర్భ గనుల శాఖను పురమాయించారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన ఆశాఖ అధికారులు అక్కడ ఇసుక అందుబాటులో లేదని, అక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లడం కుదరదని తేల్చి చెప్పారు. ఈమేరకు ఇక్కడ ఇసుక లేదని నిజామాబాద్ కలెక్టర్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. -
మరి ఆమె ఎవరు?
ఒకసారి ఆకాశవాణి హైదరాబాద్ ఆవరణలో జరిగిన సంఘటన. అప్పట్లో రేడియోలో స్పోకెన్ వర్డ్ ప్రయోక్తగా పనిచేస్తున్న రావూరి భరద్వాజ గేటువైపు నడుస్తూ బయటికి వెళుతున్నారు. గేటులోంచి ఆకాశవాణికే చెందిన ఒక ఉన్నతాధికారి తన భార్యతో లోనికి ప్రవేశించారు. ఆయన రావూరి గారికి అభివాదం చేసి, తన భార్యని వారికి పరిచయం చేశారు. ఉన్నట్టుండి భరద్వాజ సీరియస్‌గా మొహం పెట్టి ‘‘మొన్నామధ్య భార్య అంటూ మరొకరినెవర్నో పరిచయం చేశారు?’’ అని అన్నారు. దాంతో ఆ అధికారి బిత్తరపోయి ఇబ్బందిగా మొహం పెట్టారు. తన చమత్కారానికి తనే భళ్లున నవ్వేస్తూ వాతావరణాన్ని తేలికపరిచారు రావూరి. విషయం అర్థమయ్యి దంపతులిద్దరూ ఫక్కున నవ్వారు. -ఎస్.హనుమంతరావు (ఆకాశవాణి విశ్రాంత అధికారి) -
నిజాం క్లర్క్ నుంచి మేయర్ దాకా..
నాటి నిజాం నిరంకుశ పాలనలో తెలు గువారు అనుభవించే బాధలు చూడలేక తెలుగువారి ఉనికిని కాపాడటానికి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రోద్య మాన్ని వ్యాపింపజేసిన నాయకులలో మాడపాటి హనుమంతరావు ఒకరు. మాడపాటి కృష్ణా జిల్లా నందిగామ తాలుకాలోని పొక్కునూరు గ్రామంలో జనవరి 22, 1825లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి చిన్న తనంలోనే మరణించడంతో, తెలంగాణ ప్రాంతంలో నిజాం ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మేనమామల ఇంటికి తల్లి తన పెద్ద న్నలతో స్వగ్రామం నుంచి తెలంగాణ ప్రాంతానికి మకాం మార్చారు. వరంగల్లులో 1903లో మెట్రిక్యులేషన్ ప్యాసయి, వరంగల్లు విద్యాశాఖలో ‘మీర్ మున్షి’ (క్లర్క్)గా 1904లో చేరి 8 ఏళ్లు కొనసాగారు. వరం గల్లులో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే పలు సాంఘిక, సాంస్కృతిక విద్యా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనేవారు. హైదరాబాద్‌కు మకాం మార్చి, నిజాం ప్రభుత్వ శాసనసభలో అనువాదకుడిగా పనిచేస్తూనే ప్రైవేటుగా లా పూర్తి చేశారు. ప్రముఖ న్యాయవాది రాయి విశ్వేశ్వరనాథ్ దగ్గర జూనియర్‌గా చేరారు. 1917లో హైదరాబాద్‌లోని హైకోర్టులో వకీలుగా స్వతంత్రంగా న్యాయవాద వృత్తి చేపట్టి పేరొందారు.. 1952–53, 1953–54లలో మూడుసార్లు వరుసగా హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికయ్యారు. హైదరా బాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వ హించడం మొదలుపెట్టాక ఎన్నికైన తొలి నగర మేయర్ మాడపాటివారే. ఆయన పలు వినూత్న పథకాలు ప్రవే శపెట్టారు. ఆ తర్వాత 1958లో రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఆయన ఆరు సంవత్సరాలు నిష్పక్షపాతంగా సమర్థవం తంగా నిర్వహించారు. జన వరి 26, 1955లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్న తొలి తెలుగు పెద్దగా నిలిచిన ఆయనను, 1956లో ఉస్మానియా వర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరిం చింది. మాడపాటి 85 ఏళ్ల వయస్సులో నవంబర్ 11, 1970లో కన్నుమూశారు. నాటి ప్రముఖ హిందీ నవలా రచయిత ప్రేమ్‌చంద్ రాసిన హిందీ రచనలను తెలుగులోకి అనువదించినవారిలో ప్రథ ములు. తెలంగాణ–ఆంధ్ర ఉద్యమాల గురించి రెండు సంపుటాలను ఆయన రచించారు. (నేడు మాడపాటి జయంతి) కొలనుపాక కుమారస్వామి మొబైల్ : 99637 20669 -
‘రాఫెల్’ కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ యుద్ధ విమానా ల కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. బీజేపీ కుంభకోణాల ప్రభుత్వమని, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కేసీఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడూతూ, బోఫోర్స్ కుంభకోణాన్ని బీజేపీ గోరంతది కొం డతగా చూపి రాజీవ్‌గాంధీని పార్లమెంట్లో అవమానించారని, ఆయన చనిపోయిన తర్వాత ఆ కుంభకోణంపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీకి చెందిన కంపెనీకి రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టు ఏలా ఇస్తారని ప్రశ్నించారు. -
‘వీహెచ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదనుకుంటా’
హైదరాబాద్: అంబర్పేట్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ నుంచి రూ. 12 కోట్లు... విశాక ఇండస్ట్రీస్ తీసుకుందన్న వీహెచ్ ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వీహెచ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీహెచ్ మానసిక పరిస్థతి సరిగ్గా లేదంటూ వాగ్బాణాలు విసిరారు. ‘వీహెచ్ ఆరోపణలన్నీ నిరాధారమైనవి. విశాక ఇండస్ట్రీస్ డబ్బు తీసుకుందనడంలో నిజం లేదు. 2004లో స్టేడియం కట్టే సమయంలో విశాక ఇండస్ట్రీస్ నుంచి రూ. 4.32 కోట్లు స్పాన్సర్షిప్ చేశాం. 2011లో అర్షద్ ఆయూబ్ మా అగ్రిమెంట్‌ను అక్రమంగా రద్దు చేశారు. దీనిపై మేము ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేస్తే... హెచ్‌సీఏ రూ. 25.92 కోట్లు విశాకకు పెనాల్టీగా ఇవ్వాలని ఆర్బిట్రేషన్ తీర్పునిచ్చింది. కానీ తర్వాత జరిగిన ఎస్‌జీఎంలో విశాకతో వివాదాన్ని కోర్టు బయట తేల్చుకోవాలని నిర్ణయించుకున్న హెచ్‌సీఏ... అందుకు అనుగుణంగా వ్యవహరించింది. అప్పటి హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్ సివిల్ కోర్టు జడ్జి ఎదుట విశాకతో తమ వివాదం ముగిసిందంటూ మెమో సమర్పించాడు. ఇందుకు ప్రతిఫలంగా విశాకకు రూ. 17.50 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు ఆ మెమోలో పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా హెచ్‌సీఏ నుంచి విశాకకు అందలేదు’ అని ఆయన వివరించారు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీపడిన అజహరుద్దీన్, కార్యదర్శి శేష్ నారాయణ్, మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, మాజీ కార్యదర్శి జాన్ మనోజ్ అందరిపై కేసులున్నాయని... వీరంతా తనను విమర్శిస్తున్నారని వివేక్ మండిపడ్డారు. -
పార్లమెంటే చట్టం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బంజారాలను ఎస్టీలుగా పరిగణించడాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆదిలాబాద్‌కు చెందిన గోం డ్వానా సంక్షేమ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు దాఖలు చేసిన వ్యాజ్యా న్ని హైకోర్టు కొట్టేసింది. ఎస్టీ జాబితాలో చేర్పులు, తొలగింపులన్నీ పార్లమెంట్ పరిధిలోని వ్యవహారాలని హైకోర్టు స్పష్టం చేసింది. లంబాడీలు, సుగాలీలను ఎస్టీల్లో చేరుస్తూ అధికరణ 342 (2) కింద పార్లమెంట్ చట్టం చేసినందున, వారిని ఆ జాబితా నుంచి తొలగించడం దాని పరిధిలోని అంశమని తేల్చిచెప్పింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గతవారం తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. -
ఆర్టీసీని మూసేస్తాననడం సరైంది కాదు
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులను భయపెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నాడని, ఆర్టీసీని మూసేస్తానని సీఎం చెప్పడం సరైనది కాదని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. దాదాపు 50 వేలకు పైగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను విస్మరించడం దారుణమన్నారు. ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికి సీఎం కేసీఆర్ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. ఆర్టీసీ అధికారుల వల్ల ఆర్టీసీ నష్టల్లో లేదని, ప్రభుత్వ విధానాల వల్లే నష్టాల్లో కూరుకుపోయిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కానీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృసి చేయడం లేదని మండిపడ్డారు. డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని హితవు పలికారు. ప్రైవేటు బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడపడం వల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు మాట్లాడుతూ..‘ ఉద్యోగాలు తీసేస్తామని కేసీఆర్, ఆర్టీసీ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఓట్ల కోసం అడగకపోయినా కుల సంఘాలకు రూ.5 కోట్లు, 5 ఎకరాలు కేటాయిస్తున్నారు. న్యాయంగా రావాల్సిన జీతాలు అడిగితే ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్ భయపెడుతున్నారు. రోడ్లపైన కూడా ప్రజలకు అన్యాయంగా జరిమానాలు విధిస్తున్నారు. ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బంది కలిగే పనులను ప్రభుత్వం మానుకోవాలి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పీసీసీ ఆలోచిస్తుంది. ఈ నెల 11న రాహుల్ గాంధీ సమక్షంలో జాతీయ ఓబీసీ కమిటీ మీటింగ్ ఉంది. 2019 ఎన్నికల్లో కలసి ఉంటే కలదు సుఖం అనే నినాదంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంద’ని అన్నారు. -
సమకాలీన మార్పులను గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా సమకాలీన మార్పులను గుర్తించి అందుకనుగుణంగా ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం–లెనినిజం టు నెహ్రూవియన్ సోషలిజం: సమ్ మెమోరీస్, రిఫ్లెక్షన్స్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్’పేరుతో ఆర్థికవేత్త ప్రొ.సీహెచ్ హనుమంతరావు రాసిన పుస్తకాన్ని మన్మోహన్ సింగ్ గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీల హయాంలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా హనుమంతరావు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. మార్క్సిజం–లెనినిజం భావాల నుంచి నెహ్రూవియన్ సోషలిజం వైపు వచ్చేందుకు హనుమంతరావుకు ఎక్కువ సమయం పట్టలేదన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలను ఇప్పటికీ రూపుమాపలేకపోయామని ఇందుకు కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రొ.మనోరంజన్ మొహంతి, దీపక్ అయ్యర్, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు అమ్ముడుపోయిన గవర్నర్: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు గవర్నర్ నరసింహన్ అమ్ముడుపోయారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, గవర్నర్ ఏకపక్షంగా పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గవర్నర్ పదవిని కాపాడుకోవడానికి చెంచాగిరీ చేస్తున్నారని ఆరోపించారు. గుళ్లు, గోపురాలు తిరగడానికి తప్ప గవర్నర్ దేనికీ పనికిరారని విమర్శించారు. ఇలాంటి గవర్నర్‌ను కలిస్తే ప్రయోజనం ఏమీ లేదన్నారు. రైతులకు నాణ్యమైన కరెంటును ఇస్తే సరిపోతుందని, 24 గంటల కరెంటు అవసరంలేదన్నారు. ఈ సమస్యలను గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం లేదన్నారు. గ్రామగ్రామాన తిరిగి ప్రజలకే చెప్పాలని వీహెచ్ అన్నారు. -
'ఇవాంకకు లేఖ రాశా'
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్ షో గా నడిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. కీలకమైన సదస్సులో నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించరన్నారు. కనీసం నగర మేయర్‌నుకూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమెరికా అద్యక్ష సలహాదారు ఇవాంక కు హైదరాబాద్‌లో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు లేఖ రాసినట్టు వీహెచ్ తెలిపారు. -
సచివాలయం నిర్మిస్తే ప్రాణత్యాగానికి సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపడితే అడ్డుకుంటానని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణానికి పునాది వేస్తే ఆ రోజున ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతానన్నారు. ఇప్పుడున్న సచివాలయాన్ని ఉద్దేశించి సీఎం చేసిన ‘చెత్త’ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం ఇష్టానుసారంగా భూములను కొట్టేస్తోందని మండిపడ్డారు. సచివాలయం, బేగంపేట విమానాశ్రయం రెండో టెర్మినల్ విస్తరణ పేరుతో బైసన్ పోలో, పరేడ్ గ్రౌండ్స్ భూములను కేసీఆర్ కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని వీహెచ్ పేర్కొన్నారు. -
బీసీలను మోసగిస్తున్న కేసీఆర్: వీహెచ్
-
బీసీలను మోసగిస్తున్న కేసీఆర్: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్.. బీసీలను కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నా రని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బర్లు, గొర్లు, బతుకమ్మ చీరలు అంటూ బీసీల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లుగానే రాష్ట్రంలోనూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రిమిలేయర్‌ను ఎత్తి వేయాలని, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని వీహెచ్ కోరారు. -
‘వ్యవసాయాన్ని జీఎస్టీలో కలపొద్దు’
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు డిమాండ్ చేశారు. దేశంలో రైతులు మొదటిసారి రోడ్ల మీదకి వస్తున్నారని, కానీ ప్రధానికి వారికి సాయం చేయాలనే బుద్ధి రావడం లేదన్నారు. పంటలు, వ్యవసా య పరికరాల మీద జీఎస్టీ లేకుండా చూడాలన్నారు. -
ప్రభుత్వమే నడిపిస్తోంది: వీహెచ్
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద కాలనీవాసులు ఎవరూ ఆందోళన చేయడంలేదని, ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు అన్నారు. సోమవారం ఆయన జేఏసీ పిలుపు మేరకు మద్దతు తెలుపుతూ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్నాచౌక్ వద్ద బైఠాయించి సేవ్ ధర్నాచౌక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఏమీ తెలియనట్టుగా నటిస్తోందన్నారు. ఏదిఏమైనా ధర్నాచౌక్‌ను ఇక్కడి నుంచి తరలించకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. -
రోజాను నిర్బంధించడం అమానుషం
-
జగమెరిగిన ‘జల’ దార్శనికుడు
సందర్భం వ్యవసాయ సంక్షోభానికి డాక్టర్ హనుమంతరావు వంటి నిపుణులు సూచించే పరిష్కారాలపై పాలకులు దృష్టి పెట్టలేదు. ఆయన అపార అనుభవాన్ని మన దేశం విస్మరించినా.. ఆఫ్రికా, వియత్నాం ప్రజలు మాత్రం ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ చీఫ్ ఇంజనీర్, ‘వాలం తరి’ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టి. హనుమంతరావు ఇటీవల కన్నుమూశారు. మాన వాళి అభ్యున్నతికి ఆయన సుదీర్ఘ కాలం పాటు చేసిన నిరుపమాన సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన స్నేహి తులు, రైతులు, ఇంజనీర్లు, ఆర్థిక వేత్తలు, దేశభక్తులు బరువెక్కిన హృదయాలతో స్మరించుకున్నారు. డా. హనుమంతరావు వినూత్నమైన చతుర్విధ జల వనరుల సంరక్షణ పద్థతిని ఆవిష్కరించారు. భారత్, వర్ధమాన దేశాల్లోని మెట్ట ప్రాంతాల చిన్న, సన్నకారు రైతాంగం జీవనోపాధుల అభివృద్ధికి ఈ ఆవిష్కరణను గొప్ప కానుకగా అందించారు. ఆయన జల సంరక్షణ పద్ధతి సరళమైనది. వర్షాధార భూముల్లో పంట మొక్కల వేరు వ్యవస్థలోనే 60% నీటి తేమ నిల్వ ఉంటుందని ఆయన గుర్తించారు. భూమిని కప్పి ఉంచే ఆచ్ఛాదన పంటలను పెంచడం ద్వారా భూమిలోని ఉష్ణోగ్రతను తగ్గించ గలిగితే వేరు వ్యవస్థలోని నీటి తేమ ఆరిపోకుండా చూడవచ్చు. మెట్ట పొలా ల్లోని చెట్లు, నత్రజనిని స్థిరీకరించే ద్విదళ జాతికి చెందిన ఆచ్ఛాదన పంటల వేళ్లు భూమి లోపలికి లోతుగా చొచ్చుకెళ్తాయి కాబట్టి.. భూగర్భంలో నీటి తేమను పట్టి ఉంచడంలో అవి తోడ్పడతాయి. మెట్ట భూముల్లో అర్ధచంద్రాకార వలయాలతో పాటు నీటి వాలుకు అడ్డంగా చిన్నపాటి ఆనకట్టలు, మట్టి కట్టలు, చెక్ డ్యామ్‌లను జాగ్రత్తగా నిర్మిస్తే ఆ పరిసరా ల్లోని రైతులు నీటి కరువును సమర్థవంతంగా ఎదుర్కో వడం సాధ్యమేనన్నది ఆయన దృఢ విశ్వాసం. సాగునీటి భద్రత సాధనపై ఆయన అద్భుత ఆలో చనలను 1980వ దశకంలో తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించి చూశారు. ప్రజా సంక్షే మమే ధ్యేయంగా, నిస్వార్థంగా దేశాభివృద్ధికి పాటు పడే అరుదైన ఐఏఎస్ అధికారి, అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దివంగత స్మరజిత్రేతో పాటు ఎస్.ఆర్. శంకరన్, డా. వై.వి. రెడ్డి వంటి ఆదర్శప్రాయులైన ఉన్నతా ధికారుల పర్యవేక్షణలో డా. హనుమంతరావు చతుర్విధ జలసంరక్షణ పద్ధతులను ప్రయోగాత్మకంగా అమలు చేసి సత్ఫలితాలు సాధించారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టు లకు అయ్యే ఖర్చులో అతికొద్ది శాతం నిధులతోనే రైతు లకు పుష్కలంగా సాగునీటి వనరులను అందుబాటులోకి తేవచ్చని ఈ గణాంకాలు చాటి చెప్పాయి. అయితే, దురదృష్టవశాతూ ్త అవినీతిని కొమ్ముకాసే రాజకీయ నాయకులు, సాంకేతిక జ్ఞానంలేని వారి వంది మాగధులు డా. హనుమంతరావు గారి ఆలోచనలను ఆచ రణలోకి తేవడానికి అంగీకరించలేదు. భారీ నీటిపారు దల ప్రాజెక్టులకు బదులుగా చిన్న ప్రాజెక్టుల వల్ల పంట లకు సాగునీటి భద్రత చేకూర్చవచ్చని, ఎక్కువ ఎకరాలకు నీరు అందించవచ్చని ఆయన సూచించేవారు. తన ఆలోచ నలు స్థానికంగా అమల్లోకి రాకముందే ఆయన పదవీ విరమణ జరిగిపోయింది. అయితే, ప్రపంచంలో కొన్ని చోట్ల ఆయన ఆలోచనలకు ఆదరణ లభించింది. మారిషస్ దేశం తీవ్ర నీటి కరువుతో సతమతమ వుతూ ఉండేది. అధిక ఖర్చుతో అమెరికా, యూరోపి యన్ దేశాల నుంచి కన్సల్టెంట్లను పిలిపించినప్పటికీ మారిషస్ నీటి సమస్య తీరలేదు. విదేశాల నుంచి ఆహా రాన్ని దిగుమతి చేసుకోవడం మినహా గత్యంతరం లేదని వారు తేల్చి చెప్పారు. మారిషస్ ప్రభుత్వం డా. హనుమం తరావుగారి చతుర్విధ జల సంరక్షణ పద్ధతుల గురించి తెలుసుకొని ఆయనను సంప్రదించింది. మారిషస్ ద్వీపం నీటికి కరువే లేదని, పుష్కలంగా నీటి వనరులు ఉన్నా యన్న వాస్తవాన్ని డా. హనుమంతరావు నిరూపించారు. ఆహారోత్పత్తులను అంతకుముందు మాదిరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మలే సియాకు లేకుండా పోయింది. ఆయన జ్ఞానానికి అంతర్జాతీ యంగా గుర్తింపు లభించింది. ఐక్య రాజ్యసమితి కన్సల్టెంటుగా కనీసం డజను దేశాల్లో నీటి సమస్య పరిష్కా రానికి తోడ్పాటునందించారు. తిరిగి భారతదేశం వచ్చిన తర్వాత తన స్వరా ష్ట్రంలో నీటి సమస్య పరిష్కారానికి ఉచితంగా సేవలందిస్తానని ఆయన ప్రకటించారు. కానీ, ఆయన సేవలను ఉపయోగించుకున్నవారు లేరు. వయసు మీద పడిన దశలో కూడా ఏదైనా స్వచ్ఛంద సంస్థ లేదా స్థానిక సంస్థ కోరితే ఉచి తంగానే సలహాలు ఇచ్చేవారు. రోజంతా మండు టెండలో నిలబడి సైతం క్షేత్రస్థాయిలో ఆయన సలహాలు ఇచ్చే వారు. తమిళనాడు రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర కరువు పరిస్థితు లను ఎదుర్కొంటున్నది. రుణాల వసూళ్ల గడువును వాయిదా వేయడం, ఉపాధి హామీ పథకం కింద పేదలకు పనులు కల్పించడం జరుగుతున్నది. గత ఏడాది దేశ వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి వాన దేవుడ్ని నిందించడం మనకు తెలుసు. అయితే, వ్యవసాయ సంక్షోభానికి డా. హనుమంతరావు గానీ, కర్ణాటకలోని డా. ఆర్. ద్వారకానాథ్ వంటి దిగ్గజా ల్లాంటి నిపుణులు సూచించే పరిష్కార మార్గాలపై పాల కులు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. వీరు చూపే పరిష్కార మార్గాలు నేరుగా రైతులకు ఉపయోగపడతాయే గాని అవినీతికి ఆస్కారం ఇచ్చేవి కావు. డా. హనుమంతరావు దార్శనికత, అపారమైన అనుభవం, నిబద్ధతలను మన దేశం విస్మరించినప్పటికీ.. ఆఫ్రికా, వియత్నాం ప్రజలు మాత్రం ఉపయోగించుకోగలగడం విశేషం. విఠల్ రాజన్ ప్రముఖ రచయిత, ఆర్థికవేత్త, హక్కుల కార్యకర్త, ప్రత్యామ్నాయ నోబెల్ ప్రైజ్ జ్యూరీ సభ్యులు 97045 40608 -
హనుమంతరావు మృతికి పలువురి సంతాపం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ ఈఎన్సీ టి.హనుమంతరావు మృతిపై రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజస్తాన్ లో నీటి వనరుల అభివృద్ధికి హనుమంతరావు అందించిన సేవలు మరువ లేనివని వసుంధర కొనియాడారు. చిన్న నీటిపారుదల రంగంలో హనుమంతరావు ప్రయో గాలు ప్రామాణికంగా ఉన్నట్టు మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణలో గుర్తింపుపొందిన ఇంజనీర్లలో హనుమంతరావు ఒకరని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. హనుమంతరావు అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి. హనుమంతరావు మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. నీటిపారుదల శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, చతుర్విద జల ప్రకియను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఆయన రూపొందించిన టెక్నాలజీని పలు దేశాల్లో, మన దేశంలోని వివిధ రాష్ట్రాలు ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని సాగిస్తున్నారని నివాళులర్పించారు. ఐక్యరాజ్యసమితికి సలహాదారుగా వ్యవహరించడంతోపాటు ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ దేశాల్లో పలు సాగునీటి ప్రాజెక్టుల అమల్లో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. శ్రీరాం వెదిరె సంతాపం సాక్షి, న్యూఢిల్లీ: నీటి పారుదల రంగ నిపుణులు టి.హనుమంతరావు మృతికి కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా నీటి పారుదల రంగానికి సేవలందించి హనుమంతరావు మార్గదర్శిగా నిలిచారని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
బీసీల వివరాలను బయటపెట్టాలి: వీహెచ్
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో నమోదు చేసిన బీసీల వివరాలను బయటపెట్టాలని కోరుతూ గవర్నర్ నరసింహన్, బీసీ కమిషన్ చైర్మన్లకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు లేఖ రాశారు. బీసీలకు కేంద్రం ఇస్తున్న 27 శాతం రిజర్వేషన్ అమలు కావడలేదని వీహెచ్ లేఖలో పేర్కొన్నారు. సచివాలయాన్ని కూల్చేసి కొత్తవి నిర్మిస్తామంటూ సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఇష్టాను సారం అప్పులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని వీహెచ్ విమర్శించారు. కొత్త జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. -
ఎగువ రాష్ట్రాలకు అదనపు కేటాయింపులు వద్దు
ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హనుమంతరావు సూచన ఈ అంశంపైనే మన వాదనలు ఉండాలి కర్ణాటక, మహారాష్ట్ర 254 టీఎంసీలు వాడితే కిందకు చుక్కనీరు రాదు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో అదనపు నీటి కేటాయింపులు చేయాలని కోరడం కంటే.. ఎగువ రాష్ట్రాలకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేసిన అదనపు కేటాయింపులను రద్దు చేయాలన్నదే ప్రధానాం శంగా తెలంగాణ, ఏపీ పోరాడాలని సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు సూచించారు. తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు పెంచినా ఎగువ నుంచి నీరు రాకుంటే చేసేదేమీ ఉండదన్నారు. కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘బ్రిజేశ్ ట్రిబ్యునల్.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అదనంగా 65 శాతం డిపెండబులిటీ ఆధారంగా కర్ణాటక, మహా రాష్ట్రలకు 254 టీఎంసీల అదనపు జలాలు కేటాయించింది. నీరంతా ఎగువ రాష్ట్రాల నుంచే వస్తుంది కాబట్టి వారికి కేటాయించినవన్నీ నికర జలాలే అవుతాయి. ఈ నీటిని సైతం ఎగువ రాష్ట్రాలు మొదలెడితే కిందికి చుక్క రాదు. ఉమ్మడి ఏపీకి సైతం అదనంగా 190 టీఎంసీల అదనపు జలాలిచ్చినా పై నుంచి రాకుంటే ఆ జలాలన్నీ కాగితాలకే పరిమితమవుతాయి’’ అన్నారు. నిజానికి ఎగువ రాష్ట్రాల నుంచి దిగువకు 447 టీఎం సీల నీరు రావాలి. ప్రస్తుతం మంచి వర్షాలు కురిసినా 250 టీఎంసీలకు మించి రాలేద న్నారు. బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వచ్చి ఎగువ రాష్ట్రాలు 254 టీఎంసీల వాడకం మొదలు పెడితే చుక్క నీరు కిందకు రాదన్నారు. -
ఆప్కో చైర్మన్ పదవికి హనుమంత రావు రాజీనామా
- కొత్త చైర్మన్‌గా గుజ్జల శ్రీను పేరు సీఎంకు సిఫారసు - ఇరువర్గాలతో చర్చించి కొలిక్కి తెచ్చిన మంత్రులు సాక్షి, విజయవాడ బ్యూరో ఆప్కో చైర్మన్ పదవికి ఎం.హనుమంతరావు సోమవారం రాజీనామా చేశారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలతో విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన తన అనుచరులతో కలిసి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆప్కో చైర్మన్ పదవిని చేపట్టిన హనుమంతరావు అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీలో చేరారు. అప్పట్లో మూడున్నర సంవత్సరాలు ఆయన ఆప్కో చైర్మన్ పదవిలో కొనసాగేలా అవకాశం ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించి మరో ఏడాదిన్నర కాలాన్ని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన గుజ్జ్జల శ్రీనుకు కట్టబెట్టేలా నిర్ణయించారు. ఆప్కో చైర్మన్ పదవి విషయంలో హనుమంతరావు, శ్రీను వర్గాలు పంతాలకు పోయి పట్టుబట్టడంతో ముగ్గురు మంత్రులు నచ్చజెప్పి వారి పంచాయితీని సర్దుబాటు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఎం.హనుమంతరావు తాను ఆప్కో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రులు గంటా, ప్రతిపాటి, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముందుగా అనుకున్న షరతు ప్రకారం హనుమంతరావు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం అభినందనీయమన్నారు. ఆప్కో చైర్మన్ పదవికి గుజ్జల శ్రీను పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి సిఫారసు చేసి ఖరారు చేస్తామన్నారు. అందుకు 13 జిల్లాల ఆప్కో డెరైక్టర్లు ఆమోదం తెలిపారని మంత్రులు చెప్పారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9 ప్రకారం ఉమ్మడి ఆప్కో ఆస్తుల పంపకాల వివరాలను స్పష్టం చేయడం జరిగిందని వివరించారు. తెలంగాణ నుంచి రూ.40కోట్లు మన ఆప్కోకు రావాల్సి ఉంటుందన్నారు. నిధులు ఉన్నప్పటికీ పంపకాలు జరగడంలేదని, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ద్వారా చర్యలు కోరతామని మంత్రులు వివరించారు. ఏపీ ప్రభుత్వం, అనుబంధ శాఖలు కూడా ఆప్కోకు రావాల్సిన నిధులను సమీకరించేందుకు చర్యలు చేపడతామని, చేనేత రంగంలో ఉత్పత్తులను సేకరించడానికి కూడా ప్రభుత్వం చొరవచూపుతోందని వివరించారు. -
లౌకికవాదానికి బాబు తూట్లు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: విజయవాడలో గుళ్లు, గోపురాలను కూల్చివేయడం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో చినజీయర్ స్వామి ఆశ్రమానికి కూతవేటు దూరంలోనే కూల్చివేతలు జరుగుతుంటే పీఠాధిపతులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామంటూ వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో దేశంలోని లౌకికవాదాన్ని దెబ్బకొడుతున్నారని మండిపడ్డారు. -
హరీశ్ మంచోడనుకున్నా: వీహెచ్
దేవరకొండ: ‘రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మంచోడనుకున్నా.. ఇదేం పద్ధతి.. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.. రైతులు ఏం కావాలంటున్నారు.. భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం అడుగుతున్నారు.. మీరు 4 గ్రామాల వాళ్లను లేపితే.. నేను 400 గ్రామాల వాళ్లను లేపుతా! అని ఆయన అనడం సమంజసం కాదు?’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు విమర్శించారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండలో యాంటీ టైస్ట్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. అధికార దాహంతో కాంట్రాక్టులు, మంత్రి పదవులు ఎరగా విసురుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెలంగాణ ఏర్పాటు సోనియాగాంధీ పెట్టిన భిక్షని కేసీఆర్ అర్థం చేసుకోవాలన్నారు. వలసలను ప్రోత్సహిస్తూ పార్టీలను నిర్వీర్యం చేయడం మంచిది కాదన్నారు. దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పార్టీ మారడంపై స్పందిస్తూ ‘నీ జెండా ఏమైంది... నీ ఐడియాలజీ ఏమైంది?’ అని వీహెచ్ విమర్శించారు. -
రీ ఇంజనీరింగ్ ఇందుకే..
♦ ప్రాజెక్టుల రీ డిజైన్‌పై హనుమంతరావుకు హరీశ్ వివరణ ♦ రిటైర్డ్ ఈఎన్సీ అనుమానాలు నివృత్తి చేసిన మంత్రి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత -చేవెళ్ల సహా ఇతర ప్రాజెక్టుల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ ఇంజనీరింగ్‌కు కారణాలు, అందుకు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికపై రిటైర్డ్ ఈఎన్సీ, ప్రముఖ నీటి పారుదల రంగ నిపుణుడు టి.హనుమంతరావుకు భారీ నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. శుక్రవారం స్వయంగా హనుమంతరావు ఇంటికి వెళ్లి సుమారు గంటపాటు ప్రాజెక్టుల రీ డిజైనింగ్, మిషన్ కాకతీయ, గోదావరి, ఇతర ఉపనదుల పూర్తిస్థాయి నీటి వినియోగంపై చర్చించారు. ప్రాణహిత రీ డిజైన్‌ను సమర్థిస్తూనే, ప్రాజెక్టులో కొన్ని మార్పుల ద్వారా ప్రభుత్వానికి రూ.20 వేల కోట్లు ఆదా అవుతుందని, వీలైనంత ఎక్కువ నీటిని తమ్మిడిహెట్టి నుంచే తీసుకోవాలంటూ పలు వేదికలపై హనుమంతరావు సూచిస్తున్న నేపథ్యంలో ఆయనతో హరీశ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత 110 టీఎంసీలు ఉంటుందని, ఎత్తుతో సంబంధం లేకుండా దాన్ని మళ్లించుకోవచ్చని హనుమంతరావు చెబుతున్న అంశాలపై అధికారులతో కలిసి మంత్రి ఆయనకు వివరణ ఇచ్చారు. సాంకేతికంగా తమ్మిడిహెట్టి ఎత్తు వద్ద 148 మీటర్ల ఎత్తులో 40 నుంచి 50 టీఎంసీలకు మించి నీటి లభ్యత ఉండదని, అందులో ఆదిలాబాద్ తాగు, సాగు అవసరాలకు 25 టీఎంసీల మేర వినియోగించుకుంటామని మంత్రి వివరించారు. ‘‘అదీగాక తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తీసుకెళ్లేక్రమంలో 71వ కిలోమీటర్ వద్ద 39 మీటర్ల లిఫ్టు అవసరముంటుంది. దానికే రూ.5 వేల కోట్లు కావాలి. అదే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తే అదే ఖర్చుతో ఎక్కువ నీటిని తీసుకోవచ్చు’’ అని వివరించారు. దీనితో హనుమంతరావు కూడా ఏకీభవించారు. అనంతరం ఆయన, మంత్రి మీడియాతో మాట్లాడారు. జీవనదులుగా గోదావరి, ఉపనదులు: హరీశ్ ప్రాజెక్టుల పరిధిలో రీ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నామో హనుమంతరావుకు వివరణ ఇచ్చినట్టు హరీశ్ వివరించారు. ‘‘తమ్మిడిహెట్టి నుంచి నీళ్లు వచ్చే పరిస్థితుల్లేవు గనక ఇంజనీరింగ్ తప్పనిసరి. మేడిగడ్డ వద్ద ఎక్కువ నీటిని తీసుకోవడంతో పాటు స్టెప్ లేడార్ పద్ధతిన నౌకాయాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యారేజీలు నిర్మిస్తున్నాం. మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య వరద ఉన్నప్పుడు విద్యుదుత్పాదన చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే జరిగిన పనులను వాడుకుంటూనే, కరువు ప్రాంతాలైన మెదక్, నిజామాబాద్, నల్లగొండలకు నీరందించేలా ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. ఈ అంశాలన్నింటినీ హనుమంతరావుకు వివరించాం. ఆయన సైతం మేడిగడ్డే మేలన్నారు. గోదావరిని, దాని ఉపనదులను జీవనదులుగా మార్చాలని సూచించారు. దీన్ని పరిశీలిస్తాం. మిషన్ కాకతీయ విషయంలోనూ ఆయన చేసిన సూచనలను తక్షణం అమలు చేస్తాం’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా: హనుమంతరావు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వచ్చి చర్చలు జరపడం శుభపరిణామమని, రాష్ట్ర పురోగాభివృధ్ధికి ఇవి దోహదపడతాయని హనుమంతరావు అన్నారు. ‘‘రాష్ట్ర స్వల్ప, దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి చర్చించాం. నౌకాయానానికి, విద్యుదుత్పత్తికి నిధుల కూర్పు, భూగర్భ జలాల పెంపునూ చర్చించాం. ఉపనదులను జీవనదులుగా ఎలా మార్చవచ్చో వివరించా. ప్రాజెక్టుల ఇంజనీరింగ్‌ను ప్రభుత్వం పూర్తి శాస్త్రీయంగా చేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నా. ఎల్లంపల్లికి నీటిని తమ్మిడిహెట్టి కన్నా మేడిగడ్డ నుంచి తరలించడమే ఉత్తమం. తమ్మిడిహెట్టి-ఎల్లంపల్లి మార్గంలో 5 వేల కోట్ల ఖర్చుతో 39 మీటర్ల లిఫ్టు కట్టడం ప్రయోజనకారి కాదు. అవే నిధులతో మేడిగడ్డ-ఎల్లపల్లి బ్యారేజీలు నిర్మిచండంతో పాటు వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిదే’’ అన్నారు. -
కేంద్రానికి ఏరాష్ట్రంపైనా సవతి ప్రేమ ఉండదు : వెంకయ్య
ఎంపీ దేవేందర్‌గౌడ్ ‘ఉద్యమబాట’ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ రాసిన ‘ఉద్యమబాట’ పుస్తకాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పుస్తకం చదివి భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. బీసీల గళాన్ని రాష్ట్రంలో అందరికంటే గట్టిగా వినిపించిది దేవేందర్‌గౌడ్ అని చెప్పారు. కేంద్రానికి ఏ రాష్ట్రంపైనా సవతి ప్రేమ ఉండదని, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలు దాటినప్పటికీ మన దేశంలో ్రపజాస్వామ్య విలువలు అంతంత మాత్రంగా ఉండడమే తనతో ఈ పుస్తకం రాయించిందని దేవేందర్ గౌడ్ చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన దేవేందర్ గౌడ్ ఆంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగి తనదైన స్ధానాన్ని సంపాదించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకురావడంలో దేవేందర్‌గౌడ్ సఫలీకృతమయ్యారని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. -
ఆన్లైన్లో పీడీ ఖాతాల నిర్వహణ
- మే ఒకటి నుంచి అమలు - ఆగస్టు నుంచి నూరుశాతం చెల్లింపులు - ఆన్లైన్లోనే - ఖజానా శాఖ అదనపు సంచాలకుడు హనుమంతరావు వెల్లడి విజయవాడ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాలను మే ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఖజానా శాఖ అదనపు సంచాలకుడు బీఎల్ హనుమంతరావు తెలిపారు. గురువారం విజయవాడ లయోలా క ళాశాలలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఖజానా సిబ్బంది, పీడీ ఖాతాలు నిర్వహించే కార్యాలయ అధికారులు, సంస్థల సిబ్బందికి ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం విడుదల చేసే నిధుల ఖాతాలను పూర్తి పారదర్శకతతో నిర్వహించాల్సి ఉందన్నారు. దీని కోసం సంబంధిత శాఖాధిపతులు జవాబుదారీతనంతో కూడిన పీడీ ఖాతాల నిర్వహణ చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, డ్వామా, డీఆర్డీఏ తదితర సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు నిర్వహించే అన్ని పీడీ ఖాతాలూ ఆన్లైన్ విధానానికి అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిధుల ఖర్చులను సరళీకృత విధానంలో నిర్వహించేందుకు గాను పర్సనల్ డిపాజిట్ పోర్టల్‌ను అభివృద్ధి పరచినట్లు తెలిపారు. దీనిని ట్రెజరీ పోర్టల్‌కు అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. ఖాతా నిర్వహణ, జమా ఖర్చుల చెల్లింపులకు సంబంధించి అన్ని అంశాలు ఆన్లైన్లోనే లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ విధానంలో చెక్కుల ద్వారా జరిపే చెల్లింపులను నిలిపివేస్తూ ఆన్లైన్ విధానంలోనే లావాదేవీలు నిర్వహిస్తామన్నారు. సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించడంలో భాగంగా ఆన్లైన్, ప్రస్తుతం నిర్వహిస్తున్న విధానాన్ని సమాంతరంగా మూడు నెలలపాటు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నూటికి నూరు శాతం పీడీ ఖాతాలకు ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. విజయవాడ ట్రెజరీకి నూతన కార్యాలయం ఏర్పాటు విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలోని ప్రస్తుత తూర్పు ఖజానా కార్యాలయం నిర్వహిస్తున్న ప్రాంగణంలోనే పబ్లిక్, ప్రైవేటు సమన్వయంతో పశ్చిమ, తూర్పు ఖజానా కార్యాలయాల నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే కార్యాలయాలను సొంత భవనాల్లో ఏర్పాటు చేసుకునే విధానంలో భాగంగా ఖజానా కార్యాలయాల నిర్మాణం త్వరలో చేపట్టి పూర్తిచేస్తామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఖజానా శాఖ డెప్యూటీ డెరైక్టర్లు కె.సురేంద్రబాబు, ఎన్.నాగేశ్వరరావు, సీఆర్డీఏ డెప్యూటీ డెరైక్టర్ కె.పాలేశ్వరరావు, హైదరాబాద్ ఖజానా కార్యాలయం సహాయ సంచాలకుడు కె.అచ్యుతరామయ్య, విజయవాడ జిల్లా ఖజానా అధికారి కేడీవీఎం ప్రసాద్ పాల్గొన్నారు. -
కిడ్నాపైన బాలిక సురక్షితం
గుంటూరు సిటీ : ఇటీవల హైదరాబాద్ హైకోర్టు వద్ద కిడ్నాపైన మౌనిక ఆచూకీ బుధవారం లభ్యమైంది. జిల్లాలోని అరండాల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురవయ్య హైస్కూల్ వెనక ఉన్న ఒక గుడిసెలో పాపను దాచాడు. పోలీసులు సీసీటీవీ పుటేజీల ద్వారా నిందితుడ్ని గుర్తించారు. అతని కదలికలను నిఘా ఉంచి పట్టుకున్నారు. నిందితుడు గుంటూరుకు చెందిన హనుమంతరావుగా గుర్తించారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ మరణం: వీహెచ్
చంద్రబాబు చేసిన అవమానం వల్లే ఎన్టీ రామారావు మరణించారని, ఆయన మరణంపై మళ్లీ విచారణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తానని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఎన్టీఆర్ మీద లేనిపోని ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టించింది కాంగ్రెస్ పార్టీయేనని వీహెచ్ తెలిపారు. కావాలంటే బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలి గానీ, శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్‌కు మాత్రం రాజీవ్ గాంధీ పేరు ఉండాల్సిందేనన్నారు. దీనికోసం పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ధర్నా చేస్తామని చెప్పారు. -
కట్టలు, అలుగులపై దృష్టిపెట్టాలి
* చెరువుల పునరుద్ధరణపై నీటి పారుదల * నిపుణుడు హనుమంతరావు సూచన * చెరువుల్లో పూడిక కంటే ముందు కట్టల బలోపేతం, అలుగు విస్తరణ తప్పనిసరి * ఇప్పటికే తెగిపోయిన 1,700 చెరువులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలి * చెరువులకు నీరు వచ్చే కాలువలు, వాగుల్లో పూడిక తీత వద్దని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం అభినందనీయమని... అయితే ముందుగా చెరువుల్లో పూడిక తీయడం కాకుండా వాటి కట్టల భద్రత, అలుగు (మత్తడి) విస్తరణ చేపట్టాలని ప్రముఖ నీటి పారుదల నిపుణుడు, రిటైర్డ్ ఈఎన్సీ టి.హనుమంతరావు సూచించారు. భారీ వర్షాల సమయంలో చెరువుల కట్టలు తెగి, నీరు నిల్వ ఉండ టం లేదని ఆయన చెప్పారు. ఈ విషయమై ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటికే 1,700 చెరువుల కట్టలు తెగిపోయి వృథాగా ఉన్నాయని.. వాటిని యుద్ధప్రతిపాదికన మరమ్మతు చేయాలని పేర్కొన్నారు. పదేళ్ల వరదను దృష్టిలో ఉంచుకోవాలి.. పదేళ్లపాటు ఆ చెరువులకు వచ్చే వరదను దృష్టిలో పెట్టుకుని, ఆయా ప్రాంతాల నేల స్వ భావం ఆధారంగా పనులు చేపట్టాలని హనుమంతరావు సూచించారు. చెరువుల పూడికతీత కార్యక్రమం సాధారణంగా తూముల వద్ద ఎక్కువగా జరుగుతుందని, తూముల వద్ద పూడిక తీయడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. దీనివల్ల అక్కడ తూములుపైకి ఉండి, చెరువులోతుగా ఉంటే.. నీరు బయటకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. త్వరగా నిండే వాటికి ప్రాధాన్యత.. చెరువుల్లో నీరు నిండుగా ఉన్నప్పుడు వాటి కట్టలు తెగకుండా ఉండాలంటే... వాటి భద్రత సామర్థ్యాన్ని పెంచి, ఏటవాలుగా ఏర్పాటు చేయాలని, అలుగు విస్తీర్ణం కూడా పెంచాల్సి ఉంటుందని హనుమంతరావు తెలిపారు. వర్షాలతో త్వరగా నిండే చెరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని... భారీ వర్షాలు వచ్చినా నిండని చెరువుల్లో పూడికతీసే కార్యక్రమంతో ప్రయోజనం ఉండదని చెప్పారు. చెరువులకు సంబంధించి తాను రాసిన ‘చిన్న నీటిపారుదల సాంకేతిక మార్గదర్శకాలు (మైనర్ ఇరిగేషన్ టెక్నికల్ గైడ్‌లైన్స్)’ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. చెరువుల్లోకి నీరు చేరే కాలువలు, వాగుల్లో పూడిక, చెట్లను కొట్టేయడం వల్ల నీరు వేగంగా వచ్చి చెరువుల్లో చేరుతుందని... కానీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు చేరకుండా పోయే అవకాశముంటుందని హనుమంతరావు చెప్పారు. కాలువలు, వాగుల్లో పూడిక తీయకుంటే... వర్షం నీరు కాస్త ఆలస్యంగా వచ్చినా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. గరిష్ట నీటి మట్టం వద్ద... పట్టణాలు, నగరాల్లో చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) వద్ద కంచె నిర్మాణం చేస్తున్నారని, అలా కాకుండా గరిష్ట నీటిమట్టం (ఎంటీఎల్) వద్ద కంచె వేయడం మంచిదని హనుమంతరావు అభిప్రాయపడ్డారు. చెరువుల చుట్టుపక్కల ఇళ్లు నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వర్షాలు పడినప్పుడు ఆ ఇళ్లన్నీ ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల గరిష్ట స్థాయి నీటి మట్టం వద్ద కంచె నిర్మాణం చేపడితే.. దాని లోపల ఇళ్ల నిర్మాణం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. పునరుద్ధరణకు 100 మంది రిటైర్డ్ ఇంజనీర్ల సేవలు! భారీ ఎత్తున చేపట్టనున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి రిటైర్డ్ ఇంజనీర్ల సహకారం తీసుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. మండల స్థాయిలో ఏర్పాటు చేయనున్న సెక్షన్ కార్యాలయాల పరిధిలో సుమారు 100 మంది రిటైర్డ్ ఇంజనీర్ల సేవలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి... ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. మండల స్థాయిలో చెరువు పనుల అంచనాలు, పనుల పర్యవేక్షణ, పనుల సర్వే తదితర బాధ్యతలను వారు నిర్వర్తిస్తారని తెలిపాయి. -
‘నగర పాలన’పై ఆరా
గజ్వేల్: నగర పంచాయతీ పాలన తీరుపై ‘బాబోయ్ ఇదేం నగర పాలన’ శీర్షికన శనివారం ప్రచురితమైన ‘సాక్షి’ కథనం సంచలనం సృష్టించింది. ప్రధానంగా ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో దళారుల ప్రమేయం, జాప్యం, పన్నుల పెరుగుదల తదితర అంశాలను వివరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ పేషీ ఆరాతీయడమే కాకుండా.. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు శనివారం పట్టణంలోని తన కార్యాలయంలో నగర పంచాయతీకి చెందిన అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణ అనుమతి కోసం ఎవరు ధరఖాస్తు చేసుకున్నా వారంలో అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఏదేని కారణంతో అనుమతిని ఇవ్వకపోతే...సంబంధిత నిర్మాణాదారులకు కారణాలను వివరిస్తూ నోటీసు అందజేయాలని సూచించారు. అలాకాకుండా అవకతవకలకు పాల్పడితే ఊరుకునేదిలేదన్నారు. ఇదిలావుంటే నగర పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నుంచి ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాక్స్‌ను వారానికోసారి తెరిచి ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా, జాప్యం చేసినా నిర్మాణాదారులు నేరుగా తన దృష్టికి తీసుకువస్తే..బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముగ్గురు అధికారులపై ఫిర్యాదులు... నగర పంచాయతీలో కీలకమైన ముగ్గురు అధికారులపై శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావుకు మెజార్టీ కౌన్సిలర్లు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. ఆ ముగ్గురు అవకతవకలకు పాల్పడటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వివరించారని తెలిసింది. -
జీతాల్లేకుండా ఎట్లా బతకాలి?
తాండూరు: ‘ఆస్పత్రి శుభ్రంగా లేకపోతే దూషిస్తారు. కానీ ఆరు నెలలుగా మాకు జీతాలు రాకుంటే ఎవరికీ పట్టింపు లేదు. కాంట్రాక్టర్‌ను అడిగితే పైనుంచి రావడం లేదంటారు. ఆస్పత్రి అధికారులకు మొరపెట్టుకుంటే ఫలితం లేదు. నెలలుగా జీతాలు రాకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. పూట గడటమే కష్టంగా మారింది. రెండు రోజుల్లోపు మా జీతాలు మొత్తం చెల్లించకపోతే ఆస్పత్రి ఎదుటే మందు తాగి సచ్చిపోతాం’ అంటూ తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కాంట్రాక్ట్ పారిశద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా ఆస్పత్రి సమన్వయకర్త డాక్టర్ హనుమంతరావు వచ్చారన్న విషయం తెలుసుకున్న కార్మికులు ఆయన వద్దకు వచ్చి తమ బాధలను వివరించారు. రూ.3,500 అరకొర జీతంలో నెలలుగా జాప్యం జరిగితే ఏం తిని బతకాలి సార్ అంటూ నిలదీశారు. ‘ఇచ్చే జీతంలో పీఎఫ్ పేరుతో రూ.500 కోత విధిస్తారు. కానీ నాలుగేళ్లుగా మా పీఎఫ్ డబ్బులు ఎక్కడున్నాయో తెలియదు. దసరా పండుగ వస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పండగను ఎలా జరుపుకోవాలి’ అంటూ మహిళా కార్మికులు ధ్వజ మెత్తారు. ఈ విషయం తెలుసుకున్న ము న్సిపల్ కౌన్సిలర్ లింగదళ్లి రవికుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి సమన్వయకర్త హనుమంతరావు,సూపరింటెండెంట్ వెంకటరమణప్పలతో మా ట్లాడారు. ఇన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ.. రెండు రోజుల్లోపు రెండు నెలల జీతాలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీనికి కార్మికులు అంగీకరించలేదు. రెండు నెలల జీతాలు తమకు అవసరం లేదని, మొత్తం కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సంబంధిత ఏజెన్సీ, కాంట్రాక్టర్‌తో మాట్లాడి జీతాలు, పీఎఫ్ డబ్బుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సమన్వయకర్త సమాధానం ఇచ్చారు. సోమవారానికల్లా జీతాల సమస్య పరిష్కరించాలని కార్మికులు స్పష్టం చేసి వెళ్లిపోయారు. -
బడుగులపై పిడుగు
బల్లికురవ, ఇంకొల్లు, న్యూస్‌లైన్: బల్లికురవ మండలం కొత్తూరులో బత్తిన హనుమంతరావు, పెంట్యాల ఆంజనేయులుకు చెందిన మెట్టపొలం ఆరు ఎకరాలను అదే గ్రామానికి చెందిన పరిమి శింగరకొండ, యన్నం ఆంజనేయులు, మన్నెం అమరయ్యలు తలా రెండెకరాల చొప్పున కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశారు. వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. కోసిన మిర్చిని పొలాల్లోని కళ్లాలు చేసి ఎండబెట్టారు. సోమవారం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండటంతో వర్షం పడుతుందేమోనని పరిమి శింగరకొండ (45), యన్నం ఆంజనేయులు కుమారుడు రాఘవ (16), మన్నెం అమరయ్య కుమారుడు పవన్‌కుమార్ (12) కళ్లాల్లో ఉన్న మిర్చికి పరదాలు కప్పేందుకు పొలం వెళ్లారు. పరదాలు కప్పిన తరువాత వర్షం పెరగడంతో అక్కడే పరదాలతో వేసిన గుడారం కిందకు ముగ్గురూ చేరారు. ఆ గుడారమే వారి పాలిట మృత్యుకుహరమైంది. గుడారంపై పిడుగు పడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. పశువులు తోలుకుని ఉదయం 11 గంటల సమయంలో పొలం చేరుకున్న గ్రామస్తులు ముగ్గురూ మరణించడం గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని అద్దంకి సీఐ వీవీ రమణకుమార్ సందర్శించి మృతుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వీఆర్వో పోతురాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రెక్కాడితేగానీ..డొక్కాడని కుటుంబాలు: పరిమి శింగరకొండ, యన్నం ఆంజనేయులు, మన్నెం అమరయ్యలు బంధువులు. వీరు ముగ్గురికీ సెంటు భూమిలేదు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. వీరు కలిసి పొలం కౌలుకు తీసుకుని తలా రెండెకరాల మెట్ట, రెండెకరాల మాగాణిలో మిర్చి, వరి సాగు చేస్తూ కుటుంబాలు నెట్టుకొస్తున్నారు. పిడుగుపాటుకు మృతిచెందిన శింగరకొండకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆంజనేయులుకు కుమారుడు రాఘవ, కుమార్తె అంజమ్మ ఉన్నారు. అంజమ్మను శింగరకొండ కుమారుడు శివకు ఇచ్చి వివాహం చేశారు. రాఘవ ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో సీ గ్రేడులో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియెట్‌లో చేరే పనిలో ఉన్నాడు. అమరయ్యకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు పవన్‌కుమార్ చనిపోయాడు. దీంతో ఈ మూడు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మృతుల బంధువుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పూసపాడులో... ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గంటా వెంకట సుబ్బారావు మిరప సాగు చేశాడు. కోతలు పూర్తయి కళ్లాల్లో ఆరబెట్టారు. సోమవారం తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై ఉండటంతో మరో ఐదుగురితో కలిసి మిర్చిపై పరదాలు కప్పేందుకు వెళ్లారు. మిరపకాయలు తడవకుండా పట్టలు కప్పుతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో శీలం కనకాంబరం (42) అనే కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న మృతుని కుమారుడు క్రాంతికుమార్, గంటా వెంకట సుబ్బయ్య, శీలం అనీల్, శీలం సన్ని, మద్దిరాల సుందరరావులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన చీరాల ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీఆర్ఓ జి.కోటయ్య ఫిర్యాదు మేరకు ఇంకొల్లు ఏఎస్ఐ ఆర్.ఎస్.ఎన్ మూర్తి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను గ్రామ సర్పంచ్ పర్చూరు సింగయ్యతో పాటు పరామర్శించారు. కనకాంబరం వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేశాడు. కుమారుడిని కష్టపడి చదివిస్తున్నాడు. పిడుగుపడి కనకాంబరం మృతిచెందగా..తండ్రికి సాయమందించేందుకు వెళ్లిన కొడుకు క్రాంతికుమార్ గాయాలపాలవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
'రాష్ట్రాలు వేరైనా...ప్రజలుగా కలిసుందాం'
-
ప్రీపెయిడ్‌లో ఇకనుంచి సీయూజీ సేవలు
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: దేశంలో ఏ సెల్ నెట్వర్క్ చేయని ప్రయోగాన్ని భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) చేస్తోందని ఆ సంస్థ జిల్లా జనరల్ మేనేజర్ హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. గతంలో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఉన్న సీయూజీ అవకాశాన్ని ఇక నుంచి ప్రీపెయిడ్ కస్టమర్లకు కూడా అందిస్తున్నామని అన్నారు. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఒక్కో సిమ్ రూ. 80 చొప్పుల నెలకు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. 25 మంది కంటే ఎక్కువ ఉంటే రూ. 60కే ఈ ఆఫర్ అందచేస్తున్నామని తెలిపారు. సిగ్నల్ పెంచేందుకు చర్యలు... జిల్లాలో సిగ్నల్ వ్యవస్థను పెంపొందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా 27 నూతన సెల్ టవర్లు(2జీ) ఏర్పాటు చేశామని, మరో ఏడు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2జీ సెల్ టవర్లు 216, 3జీ సెల్ టవర్లు 23, సీడీఎంఏ టవర్లు 40, వైమాక్స్సైట్స్ టవర్లు 10 పని చేస్తున్నాయని అన్నారు. కొత్త కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వారి కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రవేశపెట్టామన్నారు. అందులో భాగంగా నేస్తమ్ ప్లాన్‌తో సిమ్ రూ.29 పెట్టి కొనుగోలు చేస్తే 60 ఎస్సెమ్మెస్‌లతో పాటు ఎవైనా ఐదు నెంబర్లుకు కాల్రేట్లు తగ్గించే అవకాశన్ని కల్పిస్తున్నామన్నారు. రూ.20 పెట్టి సిమ్‌ను కొనుగోలు చేస్తే రెండు సెకన్లకు ఒక్కపైసా ఆఫరును రెండు నెలల పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.199తో ఆరునెలలపాటు రోమింగ్‌లో ఉచిత ఇన్కమింగ్ వర్తిస్తుందని తెలిపారు. ఈ ఆఫర్లు మార్చి 31వ తేదీ వరకు మాత్రమేనని తెలిపారు. రూ.1000కి పైగా రీచార్జు చేసుకునే వారికి పదిశాతం ఎక్స్ట్రా టాక్‌టైంను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా రూరల్ ప్రాంతల్లో రూ.250గా ఉన్న బ్రాండ్‌బాండ్ కనెక్షను రూ.100కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాలల యాజమాన్యాలకు శుభవార్త... యూనివర్సిటి గ్రాండ్ కమిషన్ (యూజీసీ) అప్రువల్ ఉన్న డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యలకు బీఎస్ఎన్ఎల్ సంస్థ శుభవార్తను ప్రకటించిందని, ప్రస్తుతం ఏడాదికి రూ. లక్షగా ఉన్న బీఎస్ఎన్ఎల్ నెట్ కనెక్షన్‌ను రూ. 25,300కే అందిస్తున్నామని తెలిపారు. మిగిలిఇన 74,700ను బీఎస్ఎన్ఎల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెల్లిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని అన్ని కళాశాలల యాజమాన్యాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ఏడాది ఆగస్టు నుంచే ఈ ఆఫర్ అందుబాటులో ఉందని, కళాశాలల యాజమాన్యాలకు తెలియక రాలేదని అన్నారు. పూర్తి వివరాలకు 9490146346, 9490146400 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ వాసుదేవారావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సిద్ధారెడ్డి, డీఈ హరినాథ్‌రావు, బీడీ సుష్మ ,సతీష్, గోపినాథ్ పాల్గొన్నారు.