సాక్షి, సిద్దిపేట: రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని నేడు రైతులు భారత్ బంద్‌కు పెలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రైతులు దేశవ్యాప్తంగా నిరసన, ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతారావ్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు రైతులకు మద్దతు తెలుపుతూ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కండువాలు మోసి పార్టీకి సేవ చేసన నాయకులను కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన రాములమ్మను స్టార్ క్యాంపైనర్‌గా బాధ్యతలు ఇచ్చామన్నారు. ఆ అదృష్టం ఎవరికి రాదని, కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్‌లు ఉన్నారని, పార్టీ వదిలిపెట్టినప్పుడు మీకు తెలిసిందా? అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకునేంతవరకు కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్దమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు వలన కార్పొరేట్ వ్యవస్థలకు లాభమే కానీ రైతుకు మాత్రం ఉరిశిక్ష వేసినట్లే అని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment