Narsa reddy
-
ఆదిలాబాద్ జిల్లాకు నర్సారెడ్డి పేరు పెట్టేందుకు కృషి
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేసిన మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును ఆదిలాబాద్ జిల్లాకు పెట్టేందుకు కృషి చేస్తానని, ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన నర్సారెడ్డి సంతాప సభలో మాజీ మంత్రులు జానారెడ్డి, వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ మహే ష్‌కుమార్‌గౌడ్, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో ఎన్నో పద వులు చేపట్టిన నర్సారెడ్డి సిద్ధాంతం, విలువల కోసం ఎప్పు డూ పాటు పడేవారని కొనియాడారు. మాజీ మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నర్సారెడ్డి శాసనసభ ఐక్య వేదిక ఫోరాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేశారని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. వీహెచ్ మాట్లా డుతూ నర్సారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు. మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ నర్సారెడ్డి నియమ, నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీలో పని చేశారన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పోరాటం చేశారనీ, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన భూ సంస్కరణలో రెవెన్యూ మంత్రిగా తన భూమిని పేదలకు త్యాగం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. -
గజ్వేల్ జేజేల కోసం..
యెన్నెల్లి సురేందర్ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. గజ్వేల్ గడ్డ పై మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. కేసీఆర్ : అభివృద్ధి ఎజెండా ఈటల : బీసీ మంత్రం నర్సారెడ్డి : లోకల్ ఫ్లేవర్ అభివృద్ధి మంత్రం.. బహుముఖ వ్యూహం ‘సెంటిమెంట్’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్ గజ్వేల్‌ను రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా మలచడంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలోని మర్కూక్ వద్ద కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, కొండపాక మండలంలో మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్సిటీ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆస్పత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆస్పత్రి, ఎడ్యుకేషన్ హబ్ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన అభివృద్ధిని చూపిస్తూ కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం బహుముఖ వ్యుహంతో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ మించి బూత్‌లెవల్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేలా వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రజా ఉద్యమాలకు ఊపిరి... గజ్వేల్, తూప్రాన్, మనోహరాబాద్, ములుగు, మర్కూక్, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజకవర్గం యాదాద్రి, జనగామ, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సరిహద్దున ఉన్నది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 179 పంచాయతీలున్నాయి. నిర్వాసితులను ఆకట్టుకునే ప్రయత్నం గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్నసాగర్ నిర్వాసితులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన సంగతి తెలిసిందే. ఆయా గామాల్లో 10వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటిస్తే పోరాడుతామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. ఈటల ముమ్మర ప్రచారం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బీసీ నినాదం, స్థానిక సమస్యలే ఎజెండాతో ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో సుమరుగా 1.40లక్షల బీసీ ఓటర్లు ఉండగా..అందులో తన సొంత సామాజికవర్గం ముదిరాజులు 55వేల వరకు ఉంటారు. వీరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరిట 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, సరైన నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డారని చెబుతూ...వారందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి నేతలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1992 నుంచి సుమారు పదేళ్లకుపైగా ఈటల ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ’లోకల్’ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నేను లోకల్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా స్థానిక వ్యక్తి కాదని, ఆయన గెలిచినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. -
కేసీఆర్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి
సాక్షి, గజ్వేల్/ హైదరాబాద్: రాజ్యాంగం మార్చాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదు కాపీని నర్సారెడ్డితో కలిసి సీఐ వీరప్రసాద్‌కు రేవంత్‌రెడ్డి అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలు అంతర్జాతీయ తీవ్రవాదులకంటే ప్రమాదకరమని, ఈ వ్యా ఖ్యలు దళితులను కించ పరిచేవిధంగా ఉన్నా యని మండిపడ్డారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి ఉదాత్తమైన రాజ్యాంగాన్ని అందించారని, ఇదే రాజ్యాంగం చలవతో తెలంగాణ ఆవిర్భవించడమే కాకుండా కేసీఆర్ కు సీఎం పదవి, వారి కుటుంబీకులకు పదవు లు, సంపద చేకూరిందన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసు నమోదు వరకు పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్ దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పేవరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, నాయిని యాదగిరి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగానూ కాంగ్రెస్ ఫిర్యాదులు రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ టీపీసీసీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఇప్పటికే 48 గంటల నిరసన దీక్ష చేసిన చేపట్టిన ఆ పార్టీ, కేసీఆర్‌పై ఠాణాల్లో ఫిర్యాదులు చేయాలని ప్రకటించింది. వరం గల్ హన్మకొండలో డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో డీసీసీ అధ్య క్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగర అధ్యక్షుడు మహ్మద్ జావేద్, కామేపల్లిలో జెడ్పీటీసీ బానోతు వెంకట ప్రవీణ్‌కుమార్ నాయక్, కొత్తగూడెంలో టీపీసీసీ సభ్యుడు ఎడవెల్లి కృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల అధ్యక్షులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు నేతలు ఫిర్యాదులు చేశారు. -
భారత్ బంద్: ఆ అదృష్టం ఎవరికి రాదు.. కానీ..
సాక్షి, సిద్దిపేట: రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని నేడు రైతులు భారత్ బంద్‌కు పెలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రైతులు దేశవ్యాప్తంగా నిరసన, ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతారావ్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు రైతులకు మద్దతు తెలుపుతూ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కండువాలు మోసి పార్టీకి సేవ చేసన నాయకులను కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన రాములమ్మను స్టార్ క్యాంపైనర్‌గా బాధ్యతలు ఇచ్చామన్నారు. ఆ అదృష్టం ఎవరికి రాదని, కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్‌లు ఉన్నారని, పార్టీ వదిలిపెట్టినప్పుడు మీకు తెలిసిందా? అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకునేంతవరకు కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్దమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు వలన కార్పొరేట్ వ్యవస్థలకు లాభమే కానీ రైతుకు మాత్రం ఉరిశిక్ష వేసినట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. -
మాది గజ్వేల్.. మీ ఊరెక్కడ?
తూప్రాన్: గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతాప్‌రెడ్డిది బూరుగుపల్లి, తనది వర్గల్ అని, కేసీఆర్ ఊరు ఎక్కడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం తూప్రాన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డితో నర్సారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రాంత నాయకులపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ నాలుగున్నరేళ్లలో గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి శూన్యమని నర్సారెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఉమ్మన్నగారి భాస్కర్‌రెడ్డి, నాయిని యాదగిరి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడగొడతాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తామని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. గజ్వేల్ టీఆర్ఎస్ నేత, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్ శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి రాహుల్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి ఆర్సీ కుంతియా, రాహుల్ కార్యాలయం కార్యదర్శి కొప్పుల రాజు, గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. గత ఎన్నికల్లో తమ మధ్య పోటాపోటీగా జరిగిన పోరులో కేసీఆర్ స్వల్ప మెజారిటీతో గెలుపొందారని, అయితే ఇప్పుడు తామంతా ఒకటవడంతో కేసీఆర్‌ను ఓడించి గజ్వేల్‌లో కాంగ్రెస్‌ను గెలిపించి బహుమతిగా ఇస్తామని రాహుల్‌కు హామీ ఇచ్చినట్లు నర్సారెడ్డి, ఒంటేరు తెలిపారు. ఆత్మగౌరవం ఉన్నవారు టీఆర్ఎస్లో ఉండరు: నర్సారెడ్డి ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని గత ఎన్నికల అనంతరం కేసీఆర్ కోరితే తాను టీఆర్ఎస్లో చేరాను. రాజకీయ నాయకులు సేవ చేయాలనుకుంటే ప్రజల్లో ఉండాలనుకుంటారు. అయితే కేసీఆర్‌లో ఆ గుణం లేదు. టీఆర్ఎస్లో ఎవరికీ గౌరవం, విలువ ఇవ్వరు. కేసీఆర్ నిరంకుశ ధోరణితో ప్రజలకు దూరంగా ఉంటున్నారు. నేను గజ్వేల్ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. అందుకే తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నా. నాకు జరిగిన ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఎన్నడూ కేసీఆర్ నన్ను పరామర్శించలేదు. అయితే పీసీసీ చీఫ్ ఉత్తమ్ మాత్రం పాత పరిచయంతో నన్ను పరామర్శించారు. కాంగ్రెస్‌లో నేతలకు గౌరవం ఇస్తారు. తాను ఏ స్థానం నుంచి టికెట్ ఆశించట్లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తా’అని నర్సారెడ్డి అన్నారు. 30 సీట్లకు టీఆర్ఎస్ పరిమితం: రాములు నాయక్ ‘టీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వచ్చే అవకాశమే లేదు. ఆ పార్టీ 25–30 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది. బంగారు తెలంగాణ కాస్త కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ తెలంగాణగా మారింది. కాంగ్రెస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం. కాంగ్రెస్‌లో చేరినందుకు సంతోషంగా ఉంది. గతంలో గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం ఇందిరా గాంధీ ఇచ్చిన రిజర్వేషన్లను తిరిగి అమలు చేయాలని రాహుల్ గాంధీని కోరా. రాహుల్‌ను ప్రధానిగా చూస్తాం’అని రాములు నాయక్ అన్నారు. 20 వేల మెజారిటీలో ఉన్నాం: ఒంటేరు ‘గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీడీపీ తరఫున పోటీ చేసిన నాకు 68 వేల ఓట్లు, నర్సారెడ్డికి 34 వేలు, కేసీఆర్‌కు 86 వేల ఓట్లు వచ్చాయి. నాకు, నర్సారెడ్డికి వచ్చిన ఓట్లు కలిపితే ఇప్పుడు మేం 20 వేల మెజారిటీలో ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను కచ్చితంగా ఓడిస్తాం. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాం. గత నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ చేసిందేమీ లేదు. మిషన్ కాకతీయ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కమీషన్లు దొచుకోవడం తప్ప తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారు’అని ఒంటేరు ప్రతాప్‌రెడ్డి వివరించారు. -
కాంగ్రెస్‌లో చేరికపై ట్విస్టు ఇచ్చిన డీఎస్..!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కథనాలు వచ్చాయి. ఢిల్లీకి వెళ్లిన డీఎస్.. శనివారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే టీ నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో కలిసి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలపై డీఎస్ దిమ్మతిరిగే ట్విస్టు ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు. అనేక మంది నాయకులను సహజంగానే తాను కలుస్తుంటానని, ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని కలిశానని డీఎస్ వివరణ ఇచ్చారు. అయితే, వ్యూహాత్మకంగానే డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంపీగా అనర్హత వేటును తప్పించుకోవడానికే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా డీఎస్ చేరలేదని భావిస్తున్నారు. రాహుల్‌తో భేటీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోవడానికి ఎంపీ పదవే కారణమని తెలుస్తోంది. డీఎస్ టీఆర్ఎస్ నుంచి ఆయన సస్పెండైన నాటి నుంచే కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో శనివారం ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 2014 సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్యంగా డీఎస్ టీఆర్ఎస్లో చేరారు. డీఎస్ స్థాయికి తగ్గట్టు సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. పదవి ఇచ్చినా తనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి డీఎస్‌లో చాలాకాలంగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ స్థానంతోపాటు ఆ జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన కుమారుడు అరవింద్ బీజేపీలో చేరటం, టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడంతో జిల్లా నాయకత్వం అంతా డీఎస్‌ను పార్టీ నుంచి తొలగించాలని అధినేతకు సిఫార్సు చేసింది. ఆ మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆనాటి నుంచి ఆయన కేసీఆర్‌పై మరింత ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ గూటికి నర్సారెడ్డి, రాములు నాయక్..! ఇక, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టి.నర్సారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ రాములు నాయక్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నా నర్సారెడ్డి.. ఇదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నేతల వద్ద పలుమార్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆయన ఇటీవల భేటీ అయ్యారు. అయితే మంత్రి హరీశ్‌రావు స్వయంగా నర్సారెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. కానీ గురువారం రాత్రి ఉత్తమ్‌తో మరోమారు సమావేశమైన ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయి శుక్రవారం ఉదయమే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాపరెడ్డికి టికెట్ ఇప్పటికే ఖాయమైనందున నర్సారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. ఐతే విజయశాంతి.. లేదా స్థానికుడికే నర్సారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించనున్నారన్న వార్తల నేపథ్యంలో మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలు అలెర్టయ్యారు. సీనియర్ నేతలు సుప్రభాత్రావు, బట్టి జగపతి, చంద్రపాల్ తదితరులు శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను కలిశారు. ఇస్తే విజయశాంతికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో స్థానికులకే టికెట్ కేటాయించాలని కోరారు. కూటమిలోని మిగతా పక్షాలకు గానీ, స్థానికేతరులకు కానీ ఇవ్వరాదని విన్నవించారు. ఇదే విషయమై వీరంతా విజయశాంతిని సైతం కలసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కృష్ణయ్య, తుల ఉమ కూడా? ఎల్బీనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య, కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వేములవాడ నుంచి టికెటు హామీ ఇస్తే ఉమ చేరే అవకాశముందని సమాచారం. -
నేడు కాంగ్రెస్‌లోకి డీఎస్, నర్సారెడ్డి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీఆర్ఎస్ నుంచి ఆయన సస్పెండైన నాటి నుంచే కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో శనివారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. 2014 సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్యంగా డీఎస్ టీఆర్ఎస్లో చేరారు. డీఎస్ స్థాయికి తగ్గట్టు సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. పదవి ఇచ్చినా తనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి డీఎస్‌లో చాలాకాలంగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ స్థానంతో పాటు ఆ జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన కుమారుడు అరవింద్ బీజేపీలో చేరటం, టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడంతో జిల్లా నాయకత్వం అంతా డీఎస్‌ను పార్టీ నుంచి తొలగించాలని అధినేతకు సిఫార్సు చేసింది. ఆ మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆనాటి నుంచి ఆయన కేసీఆర్‌పై మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఢిల్లీలో సంబంధాలున్న నేతలను కలసి తిరిగి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పెద్దలు ఆయనతో పలుమార్లు భేటీ నిర్వహించారు. ఇటీవల రాహుల్ కామారెడ్డి పర్యటన సందర్భంగానే డీఎస్ చేరిక ఉంటుందని భావించినా, ఆయన ఢిల్లీలోనే చేరేందుకు సుముఖత చూపారు. పలు భేటీల తర్వాత నర్సారెడ్డి.. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టి.నర్సారెడ్డి సైతం డీఎ స్తో పాటు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నా ఆయన.. ఇదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నేతల వద్ద పలుమార్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆయన ఇటీవల భేటీ అయ్యారు. అయితే మంత్రి హరీశ్‌రావు స్వయంగా నర్సారెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. కానీ గురువారం రాత్రి ఉత్తమ్‌తో మరోమారు సమావేశమైన ఆయన కాంగ్రె స్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయి శుక్రవారం ఉదయమే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాపరెడ్డికి టికెట్ ఇప్పటికే ఖాయమైనందున నర్సారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ రాములు నాయక్ సైతం రాహుల్ సమక్షంలో కాం గ్రెస్‌లో చేరే అవకాశముంది. ఆయన శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఐతే విజయశాంతి.. లేదా స్థానికుడికే నర్సారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించనున్నారన్న వార్తల నేపథ్యంలో మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలు అలెర్టయ్యారు. సీనియర్ నేతలు సుప్రభాత్రావు, బట్టి జగపతి, చంద్రపాల్ తదితరులు శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను కలిశారు. ఇస్తే విజయశాంతికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో స్థానికులకే టికెట్ కేటాయించాలని కోరారు. కూటమిలోని మిగతా పక్షాలకు గానీ, స్థానికేతరులకు కానీ ఇవ్వరాదని విన్నవించారు. ఇదే విషయమై వీరంతా విజయశాంతిని సైతం కలసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చకనే..: నర్సారెడ్డి కేసీఆర్ వ్యవహార శైలి నచ్చకనే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు నర్సారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతఎన్నికల్లో కేసీఆర్ చేతిలో ఓడినా ప్రజాసేవ చేయాలన్న తపనతో టీఆర్ఎస్లో చేరానన్నారు. ఆయన వద్ద తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేకపోయిందన్నారు. ఆయన తీరు నచ్చకే రహదారులు అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ఈలోపే పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజాసేవ కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు. గజ్వేల్ నుంచి కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. కృష్ణయ్య, తుల ఉమ కూడా? ఎల్బీనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య, కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వేములవాడ నుంచి టికెటు హామీ ఇస్తే ఉమ చేరే అవకాశముందని సమాచారం. -
కాంగ్రెస్‌లోకి నర్సారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ను వీడాలనే యోచనలో ఉన్న రాష్ట్ర రోడ్ల అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి మరో అడుగు ముందుకేశారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో భేటీ అయ్యారు. ఈ భేటీలో నర్సారెడ్డి కాంగ్రెస్‌లోకి చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. నర్సారెడ్డి త్వరలోనే రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఎన్నికైతే.. ఎన్ని కోట్లో..
నియోజకవర్గం : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (కాంగ్రెస్) సునీతా లక్ష్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి(కొడుకు) స్థిరాస్తులు రూ. 1.43 కోట్లు రూ. 1.80 లక్షలు చరాస్తులు రూ. 43.28 లక్షలు రూ. 1.50 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 1.86 కోట్లు రూ. 3.3 లక్షలు అప్పులు రూ. 1.55 లక్షలు - వాహనాలు: సునీతా రెడ్డి: స్కార్పియో (రూ.3 లక్షలు) నియోజకవర్గం : గజ్వేల్ ఎమ్మెల్యే టీ నర్సారెడ్డి (కాంగ్రెస్) టీ నర్సారెడ్డి మధు శ్రీ స్థిరాస్తులు రూ. 2.40 కోట్లు రూ. 2.43 కోట్లు చరాస్తులు రూ. 24.70 లక్షలు రూ. 39.37 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 2.64 కోట్లు రూ. 2.82 కోట్లు అప్పులు రూ. 5.07 లక్షలు రూ. 2.94 కోట్లు వాహనాలు: నర్సారెడ్డి : డస్టర్ కారు ( రూ.13 లక్షలు) భార్య : ఇన్నోవా (రూ.14.50 లక్షలు) నియోజకవర్గం : దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి చెరుకు ముత్యం రెడ్డి విజయలక్ష్మి (భార్య) స్థిరాస్తులు రూ. 1.23 కోట్లు రూ. 35 లక్షలు చరాస్తులు రూ. 23.45 లక్షలు రూ. 22.78 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 1.47 కోట్లు రూ. 57.78 లక్షలు అప్పులు రూ. 5 లక్షలు రూ. 11 లక్షలు వాహనాలు : ముత్యం రెడ్డి : మహేంద్ర క్వాంటో (రూ.9 లక్షలు), టాటా ఏస్ (రూ.4 లక్షలు), ట్రాక్టర్ (రూ.5.50 లక్షలు). భార్య: టాటా ఏస్ (రూ.4.50 లక్షలు). టీఆర్ఎస్ : సోలిపేట రామలింగం రెడ్డి ఎస్ రామలింగారెడ్డి భార్య స్థిరాస్తులు రూ. 7.2 లక్షలు రూ. 2.45 లక్షలు చరాస్తులు రూ. 18 లక్షలు రూ. 20 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 25.2 లక్షలు రూ. 22.45 లక్షలు అప్పులు రూ. 4.2 లక్షలు రూ. 2 లక్షలు వాహనాలు: రామలింగారెడ్డి : ఇన్నోవా (రూ. 6 లక్షలు), పల్సర్ (రూ. 40 వేలు) నియోజకవర్గం : అందోల్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ (కాంగ్రెస్) దామోదర పద్మిని(భార్య) స్థిరాస్తులు రూ. 4.30 కోట్లు రూ. 6 లక్షలు చరాస్తులు రూ. 22.75 లక్షలు రూ. 9.79 కోట్లు మొత్తం ఆస్తులు రూ. 4.53 కోట్లు రూ. 9.85 కోట్లు అప్పులు - - వాహనాలు: దామోదర : నిల్ పద్మిని : హుండాన్ (రూ.3.22 లక్షలు), ఫోక్స్‌వాగన్ (రూ.11.08 లక్షలు) మాజీ మంత్రి బాబూ మోహన్ (టీఆర్ఎస్) బాబు మోహన్ ఇందిర విజయలక్ష్మి స్థిరాస్తులు రూ. 80 లక్షలు రూ. 45 లక్షలు చరాస్తులు రూ. 6.81 లక్షలు రూ. 8.40 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 86.81 లక్షలు రూ. 53.41 లక్షలు అప్పులు - - నియోజకవర్గం: మెదక్ విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్(భర్త) స్థిరాస్తులు రూ. 27 కోట్లు రూ. 2.87 కోట్లు చరాస్తులు రూ. 70.61 లక్షలు - మొత్తం ఆస్తులు రూ. 27.70 కోట్లు రూ. 2.87 కోట్లు అప్పులు - - వాహనాలు : విజయశాంతి - టయోటా (రూ.5.89 లక్షలు) నియోజకవర్గం: సిద్దిపేట టీ హరీష్‌రావు శ్రీనిత (భార్య) స్థిరాస్తులు రూ. 45 లక్షలు చరాస్తులు రూ. 90.80 లక్షలు రూ. 1.60 కోట్లు మొత్తం ఆస్తులు రూ. 1.35 కోట్లు రూ. 1.60 కోట్లు అప్పులు - రూ. 1. 21 కోట్లు వాహనాలు : హరీష్ రావు ఇన్నోవా (రూ.16 లక్షలు) నియోజకవర్గం: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (కాంగ్రెస్) జగ్గారెడ్డి నిర్మలా రెడ్డి(భార్య స్థిరాస్తులు రూ. 44.59 కోట్లు - చరాస్తులు రూ. 54.38 లక్షలు రూ.19.15 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 45.13 కోట్లు రూ. 19.15 లక్షలు అప్పులు - - వాహనాలు: జగ్గారెడ్డి : బీఎండబ్ల్యూ కారు( రూ.28 లక్షలు), టయోటా క్వాలీస్ (రూ.3 లక్షలు) -
జగదేవ్‌పూర్‌పై సర్వత్రా ఉత్కంఠ
గజ్వేల్, న్యూస్‌లైన్: జగదేవ్‌పూర్ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉండటంతో ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్, టీడీపీలు సైతం మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఆదివారం ఈ మండలంలో పోలింగ్ జరుగుతుండడంతో పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డాయి. ఈ మండలంలో 13 స్థానాలున్నాయి. ఎంపీపీ స్థానం ఎస్సీ (మహిళ)కు రిజర్వు అయింది. తీగుల్ నర్సాపూర్ ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకే రిజర్వు కావడంతో ఇక్కడి నుంచి మాసపాక శకుంతల(కాంగ్రెస్), తుడుం సువర్ణ(టీడీపీ), గడ్డం వినోద(టీఆర్ఎస్)లు పోటీ చేస్తూ ఎంపీపీ పదవిపై కన్నేశారు. తాము కూడా ఎంపీపీ బరిలో ఉన్నట్టు మునిగడప ఎంపీటీసీ స్థానం పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి మరాటి బాలమణి, వర్ధరాజ్‌పూర్ జనరల్ స్థానం నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్‌కు చెందిన తుమ్మ ధనలక్ష్మి ప్రకటించారు. ఇదిలావుంటే జెడ్పీటీసీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి మండలంలోని నర్సన్నపేటకు చెందిన ఎంబరి రాంచంద్రం, టీఆర్ఎస్ నుంచి తీగుల్‌కు చెందిన రంగ వెంకట్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి చేబర్తికి చెందిన రాందాస్గౌడ్లు ప్రధానంగా పోటీలో ఉన్నారు. జెడ్పీటీసీతోపాటు మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకునేందుకు ఈ మూడు పార్టీలు శ్రమిస్తున్నాయి. సెంటిమెంటే ఆయుధంగా టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లింది. గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఖరారు కావడంతో ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తమ పార్టీ అధినేత ఫామ్‌హౌస్ ఇక్కడే ఉండటంతో ఆయన ఈ మండలంపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశముంటుందనే విషయాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీలు మాత్రం స్థానిక నాయకత్వాన్నే బలపరచాలని ఓటర్లను కోరాయి. ఈ మేరకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నర్సారెడ్డి తీవ్రంగా శ్రమించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే తక్కువ స్థానాలొస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ను గెలిపిస్తే దొరల పాలన వస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్‌రెడ్డి ఓటర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం పోలింగ్ జరగనున్న తరుణంలో ఈ మండలంపై అన్ని వర్గాల్లోనూ సహజంగానే ఆసక్తి నెలకొన్నది. -
కేసీఆర్‌పై పోటీకి సై
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసినా రెడీ అని అన్నారు. ఎవరు ఏమిటనేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనే తేలిపోతుందన్నారు. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కంటే అధిక స్థానాలు గెలిచి తీరుతామన్నారు. అలా రాని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని నర్సారెడ్డి శపథం చేశారు. మరోవైపు కేసీఆర్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బ్యాటు పట్టుకుని బరిలోకి దిగాక ఎటువంటి బంతినైనా బౌండరీ దాటిస్తానన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వలసవాదుల పాలన మాకొద్దని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్.. ఇప్పుడు అదే వలస వాదాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకి స్థానికులు దొరకలేదా? కేసీఆర్ పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడ వచ్చి స్థానికేతరునిగా ఎలా పోటీ చేస్తారని అన్నారు. స్థానిక వాదాన్ని ఒక అంశంగా తీసుకుని ఎన్నికలకు వెళ్తానని అన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాకు లీకుల మీద లీకులు ఇస్తున్నారని, ఇటువంటి లీకుల రాజకీయాలు మానేసి బరిలో నిలబడి కలబడాలని ఆయన టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు తెలుసని, టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే తాను తెలంగాణ కోసం కొట్లాడనని అన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోనే టీఆర్ఎస్ బలం బయట పడుతుందన్నారు. కేసీఆర్‌ను తాను ఇప్పటి వరకు కలవలేదని, అప్పుడెప్పుడో నెల రోజుల కింద ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి కలిశానని అన్నారు. -
లాటరీలో గెలిచిన ఎమ్మెల్సీ నర్సారెడ్డి
-
లాటరీలో గెలిచిన ఎమ్మెల్సీ నర్సారెడ్డి
న్యూఢిల్లీ : టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డికి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కేసులో ఆయన ఎన్నిక సక్రమమేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టులోనే న్యాయమూర్తులు లాటరీ తీయటంతో నర్సారెడ్డి గెలుపొందగా, వెంకటరామిరెడ్డి ఓడిపోయారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన నర్సారెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 2009లో గెలుపొందినట్టు ప్రకటించారు. అయితే ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో మూడు ఓట్లు వివాదాస్పదంగా మారాయని, మూడు ఓట్లు కూడా వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా పడ్డవేనని కేసును విచారించిన న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పును ఎమ్మెల్సీ నర్సారెడ్డి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓట్ల లెక్కింపులో ముందుగా వివాదాస్పదంగా మారిన మూడు ఓట్లను లెక్కించి, మిగిలిన ఓట్లను తర్వాత లెక్కించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ సమక్షంలో ఓట్లను లెక్కించగా వెంకట్రామిరెడ్డికి తొమ్మిది ఓట్ల మెజారిటీ వచ్చింది. కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం టిడిపి అభ్యర్థి నర్సారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్టు తీర్పు నిచ్చింది. అయితే దానిపై కూడా నర్సారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో లాటరీ ద్వారా ఎంపిక చేసింది.